Rishab Shetty Counter Reaction To Rashmika Mandanna In Interview - Sakshi
Sakshi News home page

Rishab Shetty - Rashmika Mandanna : ముదిరిన రష్మిక-రిషబ్‌ శెట్టి వివాదం? సైగలతో దిమ్మతిరిగే కౌంటర్‌

Published Wed, Nov 23 2022 11:02 AM | Last Updated on Wed, Nov 23 2022 12:08 PM

Rishab Shetty Counter Reaction To Rashmika Mandanna In Interview - Sakshi

కాంతార సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో రిషబ్‌ శెట్టి. ఒక్క సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్‌ శెట్టి తాజాగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాపై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లనలో ఒకరైన రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా ఛాన్సులు దక్కించుకుంటుంది. కన్నడ మూవీ కిరిక్‌ పార్టీ అనే సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన రష్మికకు మొదటగా ఛాన్స్‌ ఇచ్చింది రిషబ్‌ శెట్టినే అన్న విషయం చాలామందికి తెలియదు.

ఈ సినిమాను డైరెక్ట్‌ చేసింది రిషబ్‌ శెట్టినే. కిరిక్‌ పార్టీ తర్వాతే రష్మికకు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే ఇటీవలె కాంతార మూవీ చూశారా అని అడగ్గా అంత టైం లేదని, సినిమా చూడలేదని రష్మిక చెప్పడంతో ఆమెపై విపరీతంగా ట్రోల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఓ ఇంటర్వ్యూలో కూడా తనకు ఫస్ట్‌ ఛాన్స్‌ ఇచ్చిన రిషబ్‌ శెట్టి పేరు చెప్పకుండా, తన ఫోటో చూసి అవకాశం వచ్చిందని రష్మిక చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్‌ శెట్టి రష్మికకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. సమంత, సాయిపల్లవి, రష్మికలలో నెక్ట్స్‌ ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు రిషబ్‌ శెట్టి మాట్లాడుతూ.. 'కొంతమంది హీరోయిన్స్‌తో అస్సలు పనిచేయాలనుకోవడం లేదు. సమంత, సాయిపల్లవి పనితనం నాకు ఇష్టం.

ఇంకా కొత్త హీరోయిన్స్‌తో వర్క్‌చేయాలనుకుంటున్నా' అంటూ రష్మిక పేరును వదిలేసి ఆమె సిగ్నేచర్ హ్యాండ్స్‌ను చూపిస్తూ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతుందని ఇండైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చినట్లయ్యింది. మొదటి నుంచి రష్మిక కు రిషబ్ శెట్టికి మధ్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు గుప్పుమన్నసంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement