Kirik Party
-
నేషనల్ అవార్డ్ సినిమా నిర్మాతకు వడ్డీ వ్యాపారుల వేధింపులు
కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనను వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ నిర్మాత పుష్కర్ మల్లికార్జునయ్య సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నడ పరిశ్రమలో ఆయన సుమారు 20కి పైగా చిత్రాలు నిర్మించారు. హీరో రక్షిత్ శెట్టితో 'అతడే శ్రీమన్నారాయణ' చిత్రానికి పుష్కర్ మల్లికార్జునయ్య నిర్మాతగా ఉన్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన రష్మిక మందన్న,రక్షిత్ శెట్టి నటించిన 'కిరిక్ పార్టీ' చిత్రానికి కూడా ఆయన పెట్టుబడిపెట్టారు. 2021లో మలయాళం భాషలో ఆయన నిర్మించిన 'థింకలజచ్చా నిశ్చయం' (Thinkalazhcha Nishchayam) అనే చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. మలయాళంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 68వ జాతీయ చలనచిత్ర అవార్డును దక్కించుకుంది. 'సోనీ లివ్' ఓటీటీ వేదకగా ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించిన ఆయనకు చిత్రపరిశ్రమలో నష్టాలు మిగలడంతో వడ్డీ వ్యాపారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.రూ. 5 కోట్ల అప్పు కోసం రూ. 11.5 కోట్లు ఇచ్చినా కూడా..వడ్డీ వ్యాపారుల నుంచి తనకు తీవ్రమైన వేధింపులు ఉన్నాయని పుష్కర్ మల్లికార్జునయ్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సీసీబీ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కొన్ని సినిమాలు ఆశించిన మేర విజయం సాధించకపోవడం, కోవిడ్ సమయంలో నష్టాలు అనుభవించిన పుష్కర్ మల్లికార్జునయ్య 2019 నుంచి 2023 వరకు బంధువు ఆదర్శ్ డీ.బీ. అనే వ్యక్తి నుంచి దశలవారీగా రూ.5 కోట్ల రుణం తీసుకున్నాడు. ప్రతినెల 5 శాతం వడ్డీ డబ్బు నగదు రూపంలో ఇచ్చాడు. రూ.5 కోట్లు అసలు, వడ్డీ సమేతంగా ఇప్పటి వరకు మొత్తం రూ.11.50 కోట్లు చెల్లించాడు. అయితే చెల్లించిన డబ్బు కేవలం వడ్డీ, చక్రవడ్డీకి సరిపోతుంది, ఇంకా రూ.13 కోట్లు ఇవ్వాలని ఆదర్శ్ డిమాండ్ చేశాడు. అంతేగాక ఆదర్శ్, హర్ష, శివు, హర్ష మరికొంత మంది అనుచరులతో కలిసి తన ఇళ్లు, కార్యాలయానికి వచ్చి అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని పుష్కర్ ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం సీసీబీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కిశోర్‌కుమార్‌కు నిర్మాత పుష్కర్ ఫిర్యాదు చేశారు. -
ఆయన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశా: రష్మిక
ఆ చిత్రాలు ఎప్పటికీ తన మనసులో నిలిచిపోతాయని అంటోంది నటి రష్మిక మందన్న. ఈ కర్ణాటక బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా కథానాయకిగా వెలిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈమె నట జర్నీ కేవలం మాత్రమే. కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరజ్పేటలో పుట్టిన ఈ అమ్మడు చదువు పూర్తయిన తరువాత ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత 2016లో మాతృభాషలో కిరిక్ పార్టీ అనే చిత్రం ద్వారా కథానాయకిగా తెరంగేట్రం చేసింది. ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఇప్పుడు అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్న దక్షిణాది హీరోయిన్గా రాణిస్తోంది. కాగా తన తొలి చిత్రం అనుభవాల గురించి రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ కన్నడ చిత్రం కిరిక్ పార్టీ చిత్రంలో నటించడానికి ఆ చిత్ర దర్శకుడు తనకు ఫోన్ చేశారని చెప్పింది. అయితే తనను ఆటపట్టించడానికి ఎవరో మాట్లాడుతున్నట్లు భావించిన తాను సినిమాలో నటించడానికి తనకు ఆసక్తి లేదని, ఫోన్ పెట్టమని చెప్పానంది. అంతేకాకుండా ఆ నంబర్‌ను తాను బ్లాక్ చేసినట్లు చెప్పింది. అయితే నిర్మాత స్నేహితుడి ద్వారా ఆ దర్శకుడు తనతో మాట్లాడే ప్రయత్నం చేశారని చెప్పింది. చివరగా తాను చదువుకున్న ఉపాధ్యాయురాలు ద్వారా తనను కలుసుకున్నారని పేర్కొంది. అప్పుడు తాను ఆయనతో తనకు నటించడం రాదని చెప్పానని అయినప్పటికీ తనతో కొన్ని సంభాషణలను మాట్లాడించి రికార్డ్ చేసి ఆ తరువాత కిరిక్ పార్టీ చిత్రంలో కథానాయకిగా ఎంపిక చేశారని చెప్పింది. తాను కన్నడంలో కథానాయకిగా పరిచయమైన కిరిక్ పార్టీ, తమిళంలో ఎంట్రీ ఇచ్చిన సుల్తాన్, తెలుగులో పరిచయమైన సోలో, హిందీలో పరిచయమైన మిషన్ మజ్ను చిత్రాలు ఎప్పటికీ తన మనసులో నిలిచిపోతాయని రష్మిక మందన్న పేర్కొంది. -
రష్మికకు రిషబ్ శెట్టి గట్టి కౌంటర్, ట్వీట్ వైరల్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, కాంతార హీరో రిషబ్ శెట్టి మధ్య కొద్ది రోజులుగా కొల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఇద్దరు ఒకరిపై ఒకరు పరోక్షంగా కౌంటర్ వేసుకున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి మన్పర్థలు లేవని, సత్సంబంధాలే ఉన్నాయని రష్మిక ఇటివల చెప్పింది. కానీ, తాజాగా రిషబ్ శెట్టి రష్మికకు ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. కాగా రష్మిక కన్నడ మూవీ కిరిక్ పార్టీ మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతోనే రష్మిక హీరోయిన్గా పరిచయమైంది. తాజాగా శుక్రవారంతో (డిసెంబర్ 30) ఈ సినిమా విడుదలైన ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి ట్వీట్ చేస్తూ.. ‘మా సినిమా విడుదలై ఆరేళ్లు అయినప్పటికీ.. మా కోసం మీరు చేసిన సందడి, థియేటర్లో మీరు వేసిన విజిల్స్ అన్ని మా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. మమ్మల్ని మరోసారి ఆ రోజుల్లోకి తీసుకువెళ్లున్నాయి. ఈ సెలబ్రేషన్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు. అలాగే తన ట్వీట్‌కి హీరో రక్షిత్ శెట్టి, నిర్మాణ సంస్థ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ లోక్‌నాథ్‌ను ట్యాగ్ చేశాడు. అయితే ఇందులో హీరోయిన్గా లీడ్ రోల్ పోషించిన రష్మిక పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాదు ఆమె పేరు కూడా ట్యాగ్ చేయలేదు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతో ఇది కాస్తా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ నిలిచింది. అయితే ‘గతంలో రష్మిక తనకు ఆఫర్ ఇచ్చిన నిర్మాణ సంస్థ, డైరెక్టర్ పేరు చెప్పకుండ సోకాల్డ్ ప్రొడక్షన్ అని చెప్పి అవమానపరించింది.. ఇప్పుడు రిషబ్ శెట్టి మూవీలో భాగమైన రష్మిక పేరు ప్రస్తావించకుండా ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ' ನೆಡೆದು ಆರು ವರ್ಷಗಳ ನಂತರವೂ ಪಾರ್ಟಿಗೆ ಕಳೆ ತಂದ ನಿಮ್ಮ ಸದ್ದು, ಗದ್ದಲ, ಸಿಳ್ಳೆಗಳು ಇನ್ನೂ ಕಿವಿಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿಸುತ್ತಿವೆ. ಮತ್ತೆ ಹಿಂತಿರುಗಿ ನೋಡುವಂತೆ ಮಾಡುತ್ತವೆ. ಈ ಸಂಭ್ರಮದ ಭಾಗವಾದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. @rakshitshetty @ParamvahStudios @AJANEESHB #KirikParty pic.twitter.com/Rgaq5Lywmq — Rishab Shetty (@shetty_rishab) December 30, 2022 చదవండి: మహేశ్-మహేశ్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ బయటపెట్టిన రచయిత సినీ పరిశ్రమలో విషాదం.. నిద్రలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు -
రష్మిక పరువు తీసేసిన రిషబ్ శెట్టి! మీడియా ముందే షాకింగ్ కామెంట్స్
కాంతార సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో రిషబ్ శెట్టి. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లనలో ఒకరైన రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ హీరోయిన్గా ఛాన్సులు దక్కించుకుంటుంది. కన్నడ మూవీ కిరిక్ పార్టీ అనే సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన రష్మికకు మొదటగా ఛాన్స్ ఇచ్చింది రిషబ్ శెట్టినే అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది రిషబ్ శెట్టినే. కిరిక్ పార్టీ తర్వాతే రష్మికకు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే ఇటీవలె కాంతార మూవీ చూశారా అని అడగ్గా అంత టైం లేదని, సినిమా చూడలేదని రష్మిక చెప్పడంతో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఓ ఇంటర్వ్యూలో కూడా తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా, తన ఫోటో చూసి అవకాశం వచ్చిందని రష్మిక చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి రష్మికకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సమంత, సాయిపల్లవి, రష్మికలలో నెక్ట్స్ ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'కొంతమంది హీరోయిన్స్‌తో అస్సలు పనిచేయాలనుకోవడం లేదు. సమంత, సాయిపల్లవి పనితనం నాకు ఇష్టం. ఇంకా కొత్త హీరోయిన్స్‌తో వర్క్చేయాలనుకుంటున్నా' అంటూ రష్మిక పేరును వదిలేసి ఆమె సిగ్నేచర్ హ్యాండ్స్‌ను చూపిస్తూ కౌంటర్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతుందని ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చినట్లయ్యింది. మొదటి నుంచి రష్మిక కు రిషబ్ శెట్టికి మధ్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు గుప్పుమన్నసంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. The Journey of two "✌️✌️" pic.twitter.com/rbGrdli6K9 — MNV Gowda (@MNVGowda) November 21, 2022 -
మిస్ డీసెంట్
కన్నడ చిత్రం ‘కిర్రిక్ పార్టీ’లో డీసెంట్ గాళ్‌గా రష్మిక మండన్నా నటించారు. ఇప్పుడు ఇదే పాత్రను చేయడానికి బాలీవుడ్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెడీ అవుతున్నారు. ‘కిర్రిక్ పార్టీ’ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిషేక్ జైన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో ఒక కథానాయికగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారు. ‘కిర్రిక్ పార్టీ’ సినిమా తెలుగులో ‘కిరాక్ పార్టీ’ టైటిల్‌తో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీలో ‘డ్రైవ్’ సినిమాతో బిజీగా ఉన్నారు జాక్వెలిన్. -
హిందీ కిర్రాక్ పార్టీ
‘టెంపర్, ప్రస్థానం, అర్జున్ రెడ్డి, విక్రమ్ వేదా’ వంటి దక్షిణాది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి కన్నడ హిట్ ‘కిర్రిక్ పార్టీ’ చేరింది. ఈ హిందీ రీమేక్‌కు అభిషేక్ జైన్ దర్శకత్వం వహిస్తారు. ‘సోను కే టిట్టు కీ స్వీటీ’ ఫేమ్ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారు. అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలుత ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రాను సంప్రదించారట. ఆయన డేట్స్ కుదరక పోవడంతో ఆ చాన్స్ ఆర్యన్‌ను వరించిందని టాక్. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, రష్మిక మండన్నా, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా నటించిన ‘కిర్రిక్ పార్టీ’ చిత్రం తెలుగులో ‘కిర్రాక్ పార్టీ’ పేరుతో రీమేక్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. -
హిట్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ చేసేసుకుంది..!
కన్నడ సూపర్ హిట్ సినిమా కిరిక్ పార్టీలో జంటగా నటించిన రష్మిక మందన, రక్షిత్ శెట్టిలు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. వెండితెర మీద ఆకట్టుకున్న ఈ జోడి నిజ జీవితంలోనూ హిట్ పెయిర్ అనిపించుకునేందుకు రెడీ అవుతోంది. కిరిక్ పార్టీ సినిమా సక్సెస్‌తో ఒక్కసారిగా రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. దాంతో తెలుగు, తమిళ భాషల నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. కిరిక్ పార్టీ రిలీజ్ సమయంలోనే రక్షిత్, రష్మికల మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో రక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెష్ తెలియజేస్తూ తాను రక్షిత్ శెట్టి ప్రేమించుకుంటున్నామనీ,త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించింది రష్మిక. తన కుటుంబంలోకి రక్షిత్‌కు ఆహ్వానం పలికింది. జూలై 3న వీరి ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి డేట్‌ను కూడా ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. -
పార్టీ కపుల్ నిశ్చితార్థం..!
కన్నడ సూపర్ హిట్ సినిమా కిరిక్ పార్టీలో జంటగా నటించిన రష్మిక మందన, రక్షిత్ శెట్టిలు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. వెండితెర మీద ఆకట్టుకున్న ఈ జోడి నిజ జీవితంలోనూ హిట్ పెయిర్ అనిపించుకునేందుకు రెడీ అవుతోంది. కిరిక్ పార్టీ సినిమా సక్సెస్‌తో ఒక్కసారిగా రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. దాంతో తెలుగు, తమిళ భాషల నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. కిరిక్ పార్టీ రిలీజ్ సమయంలోనే రక్షిత్, రష్మికల మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో రక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెష్ తెలియజేస్తూ తాను రక్షిత్ శెట్టి ప్రేమించుకుంటున్నామనీ,త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించింది రష్మిక. తన కుటుంబంలోకి రక్షిత్‌కు ఆహ్వానం పలికింది. జూలై 3న వీరి ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరగనుంది. త్వరలోనే పెళ్లి డేట్‌ను కూడా ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు.