హిట్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ చేసేసుకుంది..! | kirik Party Pair engagement | Sakshi
Sakshi News home page

హిట్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ చేసేసుకుంది..!

Published Tue, Jul 4 2017 2:31 PM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

హిట్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ చేసేసుకుంది..!

హిట్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ చేసేసుకుంది..!

కన్నడ సూపర్ హిట్ సినిమా కిరిక్ పార్టీలో జంటగా నటించిన రష్మిక మందన, రక్షిత్ శెట్టిలు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. వెండితెర మీద ఆకట్టుకున్న ఈ జోడి నిజ జీవితంలోనూ హిట్ పెయిర్ అనిపించుకునేందుకు రెడీ అవుతోంది. కిరిక్ పార్టీ సినిమా సక్సెస్తో ఒక్కసారిగా రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. దాంతో తెలుగు, తమిళ భాషల నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. కిరిక్ పార్టీ రిలీజ్ సమయంలోనే రక్షిత్, రష్మికల మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది.

అదే సమయంలో రక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెష్ తెలియజేస్తూ తాను రక్షిత్ శెట్టి ప్రేమించుకుంటున్నామనీ,త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించింది రష్మిక. తన కుటుంబంలోకి రక్షిత్కు ఆహ్వానం పలికింది. జూలై 3న వీరి ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి డేట్ను కూడా ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement