Rakshit
-
కరోనా నేపథ్యంలో రక్షిత్ కొత్త సినిమా
సింపుల్ స్టార్ రక్షిత్ ఇటీవల నటించిన చిత్రం ‘పలాస 1978’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రక్షిత్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు రెడీ అయిపోయాడు. కరోనా నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘‘డబ్ల్యూహెచ్ఓ’’(వరల్డ్ హజార్డ్ ఆర్డినెన్స్) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. కరోనా సంక్షోభం సమయంలో ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్లో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాను సుధాస్ మీడియా సమర్ఫణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతోంది. (రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్) రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు విశేష స్పందన లభిస్తుంది. ‘‘ఐయామ్ గోనా టెల్ గాడ్ ఎవ్రీథింగ్’’ వంటి వైవిధ్యమైన హాలీవుడ్ షార్ట్ ఫిలింతో విమర్శకుల ప్రశంసలతో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాకు సంబంధిచిన మిగతా వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. -
ఈ సినిమా సమర్పించడం గర్వంగా ఉంది
‘‘ఇప్పటివర కూ చాలా సినిమాల్లో నా పేరు ఉంది. కానీ వాటన్నింట్లో ‘పలాస’ చాలా ప్రత్యేకమైన సినిమా. నాకు బాగా సంతృప్తి కలిగించిన సినిమా. ‘పలాస’ సినిమాను సమర్పించడం గర్వంగా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ప్రసాద్ పలు విషయాలు పంచుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లా డుతూ – ‘‘కరుణకుమార్ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎక్కడా వంకలు పెట్టలేని విధంగా చెప్పాడు. గతంలో వచ్చిన ‘మా భూమి’ వంటి సినిమాలా అనిపించింది. ఈ కథను ప్రసాద్‌గారి దగ్గరకు తీసుకెళ్లాం. ఆయనకు కూడా నచ్చింది. కరుణ కథ చెప్పినట్టే తెరకెక్కించాడు. ఎక్కడా తప్పులు కనిపించలేదు. వర్గ విబేధాలను కరుణ అద్భుతంగా తెరకెక్కించాడు. వాస్తవ సంఘటనలకు కాస్త కమర్షియల్ అంశాలు జోడించి ఈ సినిమా తెరకెక్కించాడు. అల్లు అరవింద్‌గారు ఈ సినిమా చూసి కరుణకు వాళ్ల బ్యానర్లో సినిమా చేసే అవకాçశం ఇచ్చారు’’ అన్నారు. ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భరద్వాజగారు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేవరకూ మా నీడలా మాతోనే ఉన్నారు. ఆయన మా వెనక ఉండటం వల్ల చాలా సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యాయి. మా ఇద్దరి ఆలోచనా విధానం చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతిసారీ మన సినిమాల్లో గెలిచిన వాళ్ల కథనే చూపిస్తుంటాం. ఇందులో ఓడినవాళ్ల కథను చెప్పాం. అణచివేయబడుతున్నవాళ్ల కథను చెప్పాం’’ అన్నారు. -
‘‘పలాస 1978’ అందరూ మాట్లాడుకునే చిత్రం’
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘డైరెక్టర్ కరుణ కుమార్ పలాస కథ చెప్పినప్పుడు బాగుందని హీరోకు నేను రిఫర్ చేశాను, మా భూమి తరువాత ఆ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది. నిర్మాత ప్రసాద్ ధైర్యంగా ఈ సినిమాను స్టార్ట్ చేశారు, సినిమా షూటింగ్ సమయంలో వచ్చిన అన్ని కష్టాలను అధికమించి పూర్తి చేసాం. ఒక మంచి సినిమాకు నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. (చదవండి : ఆసక్తికరంగా ‘పలాస 1978’ ట్రైలర్) 'పలాస 1978' కు సమర్పకుడిగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను గతంలో 40 సినిమాలు చేశాను, అందులో పలాస సినిమా ప్రేత్యేకం. డైరెక్టర్ పట్టుదలతో, ఫ్యాషన్ తో సినిమా తీశాం. ఈ సినిమాలో ఎక్కడా నాకు పొరపాట్లు కనిపించలేదు. డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్లు తీసాడు. అల్లు అరవింద్, మారుతి, బన్నీ వాసు సినిమాను చూసి మెచ్చుకున్నారు. అరవింద్ తన సంస్థలో కరుణ కుమార్ కు అవకాశం ఇస్తానని చెప్పడం గొప్ప విషయం. సురేష్ బాబు మూవీ చూసి నచ్చి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అందుకు ఆయనకు ప్రేత్యేక ధన్యవాదాలు. అంబేద్కర్, గాంధీ గారి ఆశయాలు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు పాటించడం లేదు కానీ వారి బొమ్మలు పెట్టి పూజిస్తున్నారు, డబ్బు ఉన్నవారు, లేని వారు ఎలా ఉన్నారు ? వంటి విషయాలు ఈ సినిమాలో కరుణ కుమార్ కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగింది. సినిమాలో ఎక్కడా అశ్లీలత ఎక్కడా ఉండదు అన్నారు. నిర్మాత వర ప్రసాద్ అట్లూరి మాట్లాడుతూ సినిమా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని బయటికి వచ్చింది, అన్ని విషయాల్లో తమ్మారెడ్డి భరద్వాజ్ మమ్మల్ని వెనకుండి నడిపించారు. కొత్త ఆర్టిస్ట్స్ లతో సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ఒక గ్రామంలో జరిగిన యదార్ధ కథను ఈ సినిమాలో చూపించాం. జీవితంలో ఓడిపోయిన వారిగురించి చెప్పే కథాంశం ఇది. భాద పడిన వ్యక్తులు, నలిగిపోయిన జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను పలాసలో బలంగా చూపించడం జరిగింది. నిర్మాత గా నాకు పూర్తి సంతృప్తి నిచ్చిన చిత్రం పలాస 1978. పది మంది మాట్లాడుకునే చిత్రం అవుతుందని నమ్ముతున్నాను’ నిర్మాత ప్రసాద్ తెలిపారు. రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. -
పలాస నాకు చాలా ప్రత్యేకం
‘‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాలో కమల్‌హాసన్‌గారి పాత్రకు దగ్గరగా ఉండే పాత్రని ‘పలాస 1978’ చిత్రంలో చేశా. కచ్చితంగా వైవిధ్యంగా ఉంటుంది. ఒక నటుడిగా, సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇందులో సంగీతం కోసం సహజమైన వాయిద్యాలు వాడాం’’ అన్నారు రఘు కుంచె. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించడంతో పాటు సంగీతం అందించిన రఘు కుంచె మాట్లాడుతూ– ‘‘నేను గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ‘పలాస’ నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో మైండ్ గేమ్ ఆడే విలన్ పాత్రలో మేకప్ లేకుండా సహజంగా నటించాను. ఈ చిత్రం చాలా సహజంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఫ్రెష్‌గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రీ రికార్డింగ్ అవసరం లేకుండా పోయింది. సంగీత దర్శకుడిగా, నటుడిగా ‘పలాస 1978’ నా కెరీర్లో బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాతో ఐదుగురు కొత్త గాయకుల్ని పరిచయం చేస్తున్నాం. జానపద కళ ఉన్న సినిమా కావడంతో ఫ్రెష్‌నెస్ కోసం కొత్తవారిని తీసుకున్నాం. ఉత్తరాంధ్ర జానపద సాహిత్యంతో కూడిన పాటలకు మంచి స్పందన వచ్చింది. నాకు మొదటి నుండి ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం. ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నాకు ఫోక్ సాంగ్స్ పాడటం అలవాటు.. అలా గాయకుణ్ణి అయ్యాను. నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసిన సినిమాల్లో ఫోక్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ‘పలాస’ ప్రివ్యూ చూసిన తర్వాత కొందరు దర్శక–నిర్మాతలు ఫోన్ చేసి, మంచి పాత్రలున్నాయి చేయమని అడిగారు. ఆ వివరాలు త్వరలోనే చెబుతా’’ అన్నారు. -
సుకుమార్ అభినందనను మర్చిపోలేను
‘‘లండన్ బాబులు’ సినిమా తర్వాత ఒక వైవిధ్యమైన సినిమా చేయాలనుకున్నాను. రెగ్యులర్ ప్రేమకథలు కాకుండా కొత్త నేపథ్యం ఉన్న కథలకోసం చూస్తున్న సమయంలో తమ్మారెడ్డి భరద్వాజగారి ద్వారా ‘పలాస 1978’ కథ నా దగ్గరకు వచ్చింది. తమ్మారెడ్డిగారికి, మా నాన్నగారికి కథ నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది’’ అని రక్షిత్ అన్నారు. కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్ మాట్లాడుతూ – ‘‘కరుణ కుమార్‌గారు కొన్ని వాస్తవ సంఘటనలతో ఈ కథ రాసుకున్నారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాసని ప్రాక్టీస్ చేశా. 40 రోజులు పలాసలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాం. షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కవ సమయం పట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మా సినిమా గురించి మాట్లాడుకునే దాకా వచ్చామంటే కారణం కరుణ కుమార్. మా సినిమా ప్రివ్యూ చూసినవాళ్లు నా నటన గురించి మాట్లాడుతుంటే సంతోషంగా అనిపించింది. ఇందులో నాలుగు వేరియేష¯Œ్సలో కనపడాలి అన్నప్పడు ఛాలెంజ్‌గా తీసుకున్నాను. పాత్ర కోసం బరువు తగ్గడం, పెరగడం వంటివి చేశాను. ‘అసురన్’ తరహా సినిమా ‘పలాస 1978’. ఈ సినిమా చూసి డైరెక్టర్ సుకుమార్‌గారు అభినందించడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఒక్క ఫోన్ కాల్ నాలో నమ్మకం పెంచింది’’ అన్నారు. -
వాస్తవ సంఘటనల పలాస
‘‘స్వచ్ఛ భారత్‌కి నేను చేసిన ‘చెంబుకు మూడింది’ లఘు చిత్రం జాతీయ స్థాయిలో రెండో బహుమతి తెచ్చుకోవడం నా జీవితంలో కీలక మలుపు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి కేటీఆర్‌గార్లు అప్పుడు నన్ను సన్మానించారు. కేటీఆర్‌గారి ప్రోత్సాహంతో చాలా ప్రభుత్వ యాడ్స్ చేశాను. ‘పలాస ’ నా మొదటి సినిమా అవుతుందనుకోలేదు’’ అన్నారు దర్శకుడు కరుణ కుమార్. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా ఈ నెల 6న విడుదల కానుంది. కాగా ‘పలాస 1978’ ట్రైలర్‌ని రానా ట్విట్టర్లో విడుదల చేసి, ‘ఈ చిత్రం విజువల్స్, నేపథ్యం చాలా కొత్తగా ఉన్నాయి’’ అన్నారు. కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. తమ్మారెడ్డి భరద్వాజగారికి కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం అని, నిర్మాత ప్రసాద్‌గారిని పరిచయం చేశారు. ఇది ఒక వ్యక్తి కథో, కుటుంబం కథో కాదు.. ఇది ఒక సమూహం కథ. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా పలాస కథను తెరకెక్కించాం. ఈ చిత్రంలో ఒక నిజాయతీ కథ కనిపిస్తుంది. సెన్సార్ బోర్డ్‌వారు ఎక్కువ కట్స్ సూచించడంతో రివైజ్ కమిటీకి వెళ్లాం.. వాళ్లు మా చిత్రాన్ని చూసి, ప్రశంసించారు’’ అన్నారు. -
ఆసక్తికరంగా ‘పలాస 1978’ ట్రైలర్
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. 'పలాస 1978' ట్రైలర్‌ని ఆదివారం ట్విట్టర్లో లాంచ్ చేసిన రానా టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ట్రైలర్ మొదలు కావడంతోనే పలాస 1978లో జరిగిన ఓ హత్య గురించి ఉంటుంది. తర్వాత హీరో రక్షిత్ ‘బురదలోకి దిగిపోయాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవే.. ఎప్పుడు ఎవడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉందే’ అంటూ హీరోయిన్ తో చెప్పే డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశారు. తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించారు. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రోత్సాహం అందించడంలో రానా ఎప్పుడూ ముందుంటారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి విభిన్నమైన సినిమాను ప్రమోట్ చేసిన రానా ‘పలాస 1978’ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యారు. విజువల్స్, నేపథ్యం చాలా కొత్తగా ఉన్నయని రానా అన్నారు. -
భిన్నమైన పలాస
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘సెన్సార్ బోర్డ్‌వారు ఎక్కువ కట్స్ సూచించడంతో రివైజ్ కమిటీకి వెళ్లాం. అక్కడ మా చిత్రాన్ని చూసి, ప్రశంసించారు. తెలుగు సినిమాలో ‘పలాస 1978’ చిత్రం భిన్నమైనదని చెప్పగలను. రచయితగా ఉన్న నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, మాకు అండగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజగారికి, మా సినిమాను విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్ సంస్థవారికి ధన్యవాదాలు’’ అన్నారు. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశారు. ‘మీడియా 9 మనోజ్’ ఈ సినిమాకు కో–ప్రొడ్యూసర్. -
పలాస 1978 మంచి చిత్రమని ధైర్యంగా చెప్పగలం
రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా కరుణకుమార్ దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ వచ్చే నెలలో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘కరుణకుమార్ చెప్పింది చెప్పినట్లు తీస్తే తెలుగులో కొత్త రకం సినిమా అవుతుందనిపించింది. చెప్పినదానికంటే బాగా తీశాడు. ఈ సినిమా కోసం అతను దాదాపు 50 రోజులు ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు. ముందు నేను ఫస్ట్ కాపీ చూశాను. ఆ తర్వాత దర్శకుడు మారుతి, నిర్మాత ‘బన్నీ’ వాసు చూశారు. మారుతిగారు అల్లు అరవింద్‌గారిని తీసుకొచ్చారు. ఈ సినిమాకు యూవీ, జీఏ2 పిక్చర్స్ అసోసియేట్ కావడం వల్ల మంచి పబ్లిసిటీ, థియేటర్స్ దొరుకుతాయి. ‘పలాస 1978’ ఒక మంచి చిత్రమని ధైర్యంగా చెప్పగలం’’ అన్నారు. ‘‘నేను, ‘బన్నీ’ వాసు ఈ సినిమా చూసి బాగుందనుకున్నాం. సాధారణంగా ఇలాంటి సినిమాలు తమిళంలో వస్తుంటాయి. ‘పలాస 1978’ చిత్రం తెలుగు ‘అసురన్’లా ఉంటుంది. ఇలాంటి గొప్ప సినిమాలు తక్కువగా వస్తుంటాయి. కరుణకుమార్‌కు సినిమాల పట్ల మంచి ప్యాషన్ ఉంది. యూవీ, జీఏ2లో అడ్వాన్స్ కూడా ఇప్పించాను’’ అన్నారు మారుతి. ‘‘ఈ సినిమా నాకు భావోద్వేగాలతో కూడిన ప్రయాణంలా సాగింది. మాకు అండగా నిలిచిన గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంస్థలకు ధన్యవాదాలు’’ అన్నారు కరుణకుమార్. ‘‘మా నాన్నగారి ప్రోత్సాహంతో ఇంత దూరం రాగలిగాం. ఈ సినిమాను చూసిన దర్శకులు సుకుమార్‌గారు ఫోన్ చేసి అన్ని వేరియేషన్స్ బాగా చేశావని అభినందించారు. గీతా ఆర్ట్స్ 2, యూవీ సంస్థలు విడుదల చేస్తున్నాయంటేæ మా సినిమా మరో స్థాయికి వెళ్లిందనిపిస్తోంది. మారుతిగారు మా ముందుండి నడిపించారు’’ అన్నారు రక్షిత్. -
పలాస కథ
మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వరుసలో ‘పలాస 1978’ చిత్రాన్ని విడుదల చేసేందుకు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ముందుకొచ్చాయి. పలాసలో జరిగిన వాస్తవ సంఘటనలు, కొన్ని నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా జనవరి చివరి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మంచి కథ, కథనాలున్న ఈ సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీలకు బాగా నచ్చడంతో గీతా ఆర్ట్స్, యూవీ ప్రొడక్షన్స్ పతాకాలపై విడుదల చేయనున్నారు. ‘‘మంచి సినిమాలను అందరికీ చేరువయ్యేలా చూడాలని అల్లు అరవింద్‌గారు భావించడంతో ‘పలాస 1978’ ఈ చిత్రాన్ని జీఏటు యూవీ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాం’’ అని బన్నీ వాసు తెలిపారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె. -
ఓ సొగసరి...
రక్షిత్, నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధ మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘ఓ సొగసరి...’ అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ని ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ఈ సందర్భంగా ధ్యాన్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ కూడా తోడైతే ఆ కథలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో మా సినిమా వస్తోంది. 1978లో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయి బేబీ కలిసి ‘ఓ సొగసరి...’ పాటను పాడారు. బాలుగారు 30ఏళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని వినిపిస్తే, బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్‌నెస్‌ను తీసుకువచ్చింది. లక్ష్మీ భూపాల్‌గారు ఈ పాటను చక్కగా రాశారు. కరుణ కుమార్‌కు ఇది తొలి చిత్రమైనా, రచయితగా సాహిత్యలోకంలో ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి’’ అన్నారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ, కెమెరా: అరుల్ విన్సెంట్. -
ఒకే జానర్లో సినిమాలు తీస్తున్నారు
‘‘ముంబైలో మాఫియా ఒకలా, విజయవాడలో మరోలా ఉంటుంది. ప్రతి ఊరిలో ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది. అది ఎలా ఉంటుందన్నది ‘పలాస’లో కొత్తగా ఉంటుంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. రక్షిత్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు మారుతి, తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు ప్రతిదర్శకుడు ఒక్కో జానర్లో సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు అందరూ ఒకే జానర్లో సినిమాలు తీస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ లుక్‌లో కొత్త సబ్జెక్ట్‌తో తీసిన ‘పలాస’ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో లుక్ బాగున్నాయి. తమ్మారెడ్డిగారు ఇలాంటి సినిమాలకు అండగా నిలబడటం çహ్యాపీ’’ అన్నారు. ‘‘తెలుగు కథ వైజాగ్ దాటి ముందుకుపోలేదు. పలాస ప్రాంతం నేపథ్యంలో రాసుకున్న ఈ కథను ప్రసాద్, తమ్మారెడ్డిలకు చెప్పాను. వాళ్లు ముందుకు రావడంతోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నాను. 40 యేళ్లపాటు సాగే కథను 40 రోజుల్లో తీయడం మా టీమ్ సహకారం వల్లే సాధ్యం అయింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘ఇందులో క్రూరమైన పాత్ర చేశాను’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు రఘు కుంచె. ‘‘రెండు నెలల పాటు పలాసలో షూటింగ్ చేశాం. ‘గాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ లాంటి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం’’ అన్నారు రక్షిత్. నక్షత్ర, రచయిత నాగేంద్ర, కెమెరామెన్ విన్సెంట్ అరుల్, వెంకట సిద్ధారెడ్డి మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎ.ఆర్ బెల్లన్న. -
వాస్తవ సంఘటనతో...
‘లండన్ బాబులు’ ఫేమ్ రక్షిత్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నక్షత్ర హీరోయిన్. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ నిర్మించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘చాలా చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన నేను ‘పలాస 1978’ సినిమాతో దర్శకుడవుతున్నా. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకోనున్న తొలి చిత్రం మాదే’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: విన్సెంట్ అరుల్. -
హిట్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ చేసేసుకుంది..!
కన్నడ సూపర్ హిట్ సినిమా కిరిక్ పార్టీలో జంటగా నటించిన రష్మిక మందన, రక్షిత్ శెట్టిలు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. వెండితెర మీద ఆకట్టుకున్న ఈ జోడి నిజ జీవితంలోనూ హిట్ పెయిర్ అనిపించుకునేందుకు రెడీ అవుతోంది. కిరిక్ పార్టీ సినిమా సక్సెస్‌తో ఒక్కసారిగా రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. దాంతో తెలుగు, తమిళ భాషల నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. కిరిక్ పార్టీ రిలీజ్ సమయంలోనే రక్షిత్, రష్మికల మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో రక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెష్ తెలియజేస్తూ తాను రక్షిత్ శెట్టి ప్రేమించుకుంటున్నామనీ,త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించింది రష్మిక. తన కుటుంబంలోకి రక్షిత్‌కు ఆహ్వానం పలికింది. జూలై 3న వీరి ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి డేట్‌ను కూడా ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. -
పార్టీ కపుల్ నిశ్చితార్థం..!
కన్నడ సూపర్ హిట్ సినిమా కిరిక్ పార్టీలో జంటగా నటించిన రష్మిక మందన, రక్షిత్ శెట్టిలు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. వెండితెర మీద ఆకట్టుకున్న ఈ జోడి నిజ జీవితంలోనూ హిట్ పెయిర్ అనిపించుకునేందుకు రెడీ అవుతోంది. కిరిక్ పార్టీ సినిమా సక్సెస్‌తో ఒక్కసారిగా రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. దాంతో తెలుగు, తమిళ భాషల నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. కిరిక్ పార్టీ రిలీజ్ సమయంలోనే రక్షిత్, రష్మికల మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో రక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెష్ తెలియజేస్తూ తాను రక్షిత్ శెట్టి ప్రేమించుకుంటున్నామనీ,త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించింది రష్మిక. తన కుటుంబంలోకి రక్షిత్‌కు ఆహ్వానం పలికింది. జూలై 3న వీరి ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరగనుంది. త్వరలోనే పెళ్లి డేట్‌ను కూడా ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు.