రక్షిత్
‘‘లండన్ బాబులు’ సినిమా తర్వాత ఒక వైవిధ్యమైన సినిమా చేయాలనుకున్నాను. రెగ్యులర్ ప్రేమకథలు కాకుండా కొత్త నేపథ్యం ఉన్న కథలకోసం చూస్తున్న సమయంలో తమ్మారెడ్డి భరద్వాజగారి ద్వారా ‘పలాస 1978’ కథ నా దగ్గరకు వచ్చింది. తమ్మారెడ్డిగారికి, మా నాన్నగారికి కథ నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది’’ అని రక్షిత్ అన్నారు. కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్ మాట్లాడుతూ – ‘‘కరుణ కుమార్‌గారు కొన్ని వాస్తవ సంఘటనలతో ఈ కథ రాసుకున్నారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాసని ప్రాక్టీస్ చేశా.
40 రోజులు పలాసలో సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేశాం. షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కవ సమయం పట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మా సినిమా గురించి మాట్లాడుకునే దాకా వచ్చామంటే కారణం కరుణ కుమార్. మా సినిమా ప్రివ్యూ చూసినవాళ్లు నా నటన గురించి మాట్లాడుతుంటే సంతోషంగా అనిపించింది. ఇందులో నాలుగు వేరియేష¯Œ్సలో కనపడాలి అన్నప్పడు ఛాలెంజ్‌గా తీసుకున్నాను. పాత్ర కోసం బరువు తగ్గడం, పెరగడం వంటివి చేశాను. ‘అసురన్’ తరహా సినిమా ‘పలాస 1978’. ఈ సినిమా చూసి డైరెక్టర్ సుకుమార్‌గారు అభినందించడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఒక్క ఫోన్ కాల్ నాలో నమ్మకం పెంచింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment