Palasa 1978 Movie
-
'పలాస'కు అరుదైన గౌరవం.. ఆ ఫెస్టివల్‌కు ఎంపిక
Karuna Kumar Palasa 1978 Movie Selected For PK Rose Film Festival: 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణ కుమార్ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘు కుంచె కీలక పాత్ర పోషిస్తూ సంగీతమందించాడు. మార్చి 6, 2020న విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షాదరణ పొందింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈనెల 9,10,11 తేదిలలో చెన్నైలో నిర్వహించే పికె. రోజ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కాబోయే సినిమాల్లో 'పలాస 1978' కూడా ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 'ఎస్సీ, ఎస్టీల జీవనాన్ని, వారి జీవిత గాథలను కథా చిత్రాలుగా మలిచే డైరెక్టర్ పా రంజిత్. ఆయన 2018లో వానమ్ ఆర్ట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. కరోనా తర్వాత మళ్లీ ఈ వేడుక జరగనుంది. ఏప్రిల్ నెలను 'దళిత్ మంత్'గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ పుట్టినరోజు పురస్కరించుకొని చేస్తున్న ఈ ఫెస్టివల్లో సాహిత్యం, సినిమా రెండు కూడా ప్రధాన భూమికలు పోషిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ పాలిటిక్స్‌ను ఇతివృత్తంగా తెరకెక్కించిన సినిమాలను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. దేశం గర్వించే దర్శకుల సినిమాల పక్కన 'పలాస 1978' చిత్రానికి చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఫెస్టివల్లో భాగమైనందుకు నాకు గర్వంగా కూడా ఉంది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని 'పలాస'తో నాకు అనుభవంలోకి వచ్చింది. దానితో పాటు ఇటువంటి వేదికలపై 'పలాస 1978 ' సినిమా ప్రదర్శించడం దర్శకుడుగా మరిచిపోలేని అనుభవం కాబోతుంది.' అని కరుణ కుమార్ తెలిపారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు.. -
సందేశాత్మక చిత్రం.. బాగా నచ్చింది: బన్నీ
సామాజికంగా వెనుకబడిన కులాలకు చెందిన వారిని రాజకీయంగా ఏవిధంగా దోచుకుంటున్నారో కళ్లకుకట్టినట్లు తెరపై చూపించిన సినిమా పలాస 1978. ఈ ఏడాది ప్రతమార్థంలో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శ్రీకాళం జిల్లాల్లోని పలాసనలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. నాటి సమాజంలో కుల, వర్ణ వివక్ష నాటు ఏ విధంగా ఉందో ఈ చిత్రం ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేసి కొంతమేర విజయం సాధించాడు. ముఖ్యంగా సంగీత దర్శకుడు రఘు కుంచె సమకూర్చిన పాటలు చిత్రానికి హైలట్‌గా నిలిచాయి. నాది నక్కిలీసు గొలుసు అనే పాట సోషల్ మీడియాలో ఏవిధంగా ట్రెండ్ అయ్యింది ప్రతిఒక్కరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఇటీవల వీక్షించిన స్టైలిస్‌స్టార్ అల్లు అర్జున్ చిత్ర దర్శకుడికి ప్రత్యేక అభినందనలు తెలిపాడు. తనకు వ్యక్తిగతంగా పలాస మూవీ ఎంతో నచ్చిందని, చిత్ర యూనిట్‌ను ప్రశంసించాడు. ‘పలాసా 1978 మూవీ బృందానికి అభినందనలు. ఈ చిత్రాన్ని చూసిన మరుసటి రోజు ఉదయం దర్శకుడిని కలిశాను. గొప్ప అంతర్లీన సందేశంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా చిత్రం చాలా నచ్చింది. చాలా మంచి సందేశం ఉంది’ అంటూ పలాస దర్శకుడితో దిగిన ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. -
చిన్న స్క్రీన్ పెద్ద ఊరట
లాక్ డౌన్ కారణంగా కొత్తగా రిలీజ్ కావాల్సిన సినిమాల కంటెంట్ అంతా స్టూడియోల్లోనే ఉండిపోయింది. కొంచెం ఆలస్యం అయినా రేపటి రోజుని చూస్తాయి, విడుదలవుతాయనే గ్యారంటీ ఉంది. కానీ ఇబ్బంది అంతా ఆల్రెడీ రిలీజ్ అయిన కొన్ని సినిమాలకే. ప్రభుత్వం పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించిన వారం ముందే థియేటర్స్‌ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆల్రెడీ థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతున్న చిత్రాలకు చిక్కొచ్చి పడింది. థియేట్రికల్ రన్ పూర్తి కాకుండా మధ్యలోనే సినిమా ప్రదర్శన ఆగిపోతే నష్టం ఖాయం. అయితే అలాంటి సినిమాలకు ‘డిజిటల్ ప్లాట్ ఫామ్’ ఓ ఊరట అని చెప్పొచ్చు. ఇంటి పట్టున కూర్చుని కాలక్షేపం కోసం ఈ ప్లాట్ ఫామ్ లో వస్తున్న సినిమాలను వీక్షిస్తున్నారు. దాంతో కొన్ని చిత్రాలను నేరుగా డిజిటల్ లో విడుదల చేస్తున్నారు. టీవీ, ల్యాప్ టాప్, ఫోన్.. చిన్ని తెర అయినప్పటికీ పెద్ద ఊరటగా నిలుస్తున్నాయి. ఓ పిట్ట కథ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. నిత్యా శెట్టి, విశ్వంత్ ముఖ్య పాత్రల్లో నటించారు. చెందు ముద్దు దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6న విడుదలయింది. థియేటర్లో ఆడటానికి స్కోప్ ఉన్నా లాక్ డౌన్‌తో ఆగింది. అందుకే సినిమా విడుదలయిన పదో రోజునే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. పలాస 1978 వర్గ బేధాల గురించి శ్రీకాకుళం నేపథ్యంలో తయారయిన రూరల్ డ్రామా ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 6న ఈ సినిమా విడుదలయింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రైమ్‌లో ఉంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, కోమలి, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రల్లో బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6నే విడుదలయింది. ఈ సినిమాని కూడా ప్రస్తుతం ప్రైమ్‌లో చూడవచ్చు. మధ ‘మధ’ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకముందే ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటింది. సుమారు 26 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు, అభినందనలు గెలుచుకుంది. త్రిష్ణ ముఖర్జీ ముఖ్య పాత్రలో శ్రీ విద్య బసవ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 13న విడుదలయింది. అన్ని అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడి ఉండేది. అయితే మార్చి 15 నుంచి థియేటర్స్ క్లోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 8 నుంచి ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. డబ్బింగ్ సినిమాలు డబ్బింగ్ సినిమాలదీ అదే కథ. శివకార్తికేయన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. తెలుగులో ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్‌తో అనువదించారు. మార్చి 20న ఈ సినిమా థియేటర్స్‌లోకి రావాలి. కానీ లాక్ డౌన్ కావడంతో సినిమాను డైరెక్ట్‌గా అమెజాన్‌లో రిలీజ్ చేశారు. విక్రాంత్, అతుల్య, మిస్కిన్ నటించిన ‘షూట్ ఎట్ సైట్ ఉత్తర్వు’ అనే అనువాద చిత్రాన్ని కూడా నేరుగా ప్రైమ్‌లోనే రిలీజ్ చేశారు. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడికి చూపిస్తేనే అది తయారు చేసిన వాళ్లకు ఆనందం. కానీ అనుకోకుండా వచ్చిన ఈ ‘లాక్ డౌన్’ వల్ల థియేటర్లకు రాకుండా సినిమాలు లాక్ అయ్యాయి. అందరూ ఇంట్లోనే ఉండటంతో వినోదాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోనే వెతుక్కుంటున్నారు. తెర ఏదైనా సినిమా తెరకెక్కేది ప్రేక్షకుడికి వినోదం అందించడానికే. ఒక నెల క్రితం వరకూ సినిమా విడుదలయ్యాక డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి రావాలంటే మినిమమ్ 7 నుంచి 8 వారాలు గ్యాప్ ఉంటే బాగుంటుందని నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ అధినేతలు భావించారు. కానీ ఎన్ని రోజుల్లో ఆన్ లైన్లో సినిమా అందుబాటులోకి రావాలనే వాదన పక్కన పెడితే ఈ పరిస్థితుల్లో, ఆ సినిమాలకు ఊరట అనే అనుకోవచ్చు. థియేట్రికల్ రెవెన్యూ పరంగా పలు ఇబ్బందులు ఎదురైనా ప్రేక్షకుడి వరకూ సినిమా వెళ్ళింది అనే ఆనందం అయితే కచ్చితంగా మిగులుతుంది. -
కష్టం వృథా కాలేదు – తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నా నలభైఏళ్ల కెరీర్లో నాకు గుర్తుండిపోయే చిత్రం ‘పలాస’. ఈ సినిమాలో నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. మా కష్టం వృథా కాలేదని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదలైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రక్షిత్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు మంచి రివ్యూస్ రావడం హ్యాపీ. సినిమాలోని ప్రతి సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘దర్శకుడి ఆలోచన, నిర్మాత ప్రయత్నం సినిమాను నిలబెట్టాయి. నటీనటుల పాత్రలతో పాటు నా పాత్రకూ మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు రఘుకుంచె. ‘‘పలాస’లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరోయిన్ నక్షత్ర. -
మీరు కూడా చూడకపోతే మీ ఖర్మ: తమ్మారెడ్డి
‘ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూలు కావాలి అంటారు..అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితుల పాత్రలు సినిమాల్లో ఉండవు. దళిత కథలు సినిమాగా మారవు అంటారు. కానీ పలాసలో వారి పాత్రలను హీరో లను చేసాము. వారి సమస్యలను చర్చించాం. కానీ వారి నుండే స్పందన కరువైంది’ అని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘మీ సినిమాలు మీరు కూడా చూడకపోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే..మరిన్ని సినిమాలు వస్తాయి. ఇది నా ఆవేదన. నా నలభై ఏళ్ల కెరియర్లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు. కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం. అయితే ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే’ అని అన్నారు. (‘పలాస 1978’ మూవీ రివ్యూ) కాగా రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
‘పలాస 1978’ మూవీ రివ్యూ
టైటిల్: పలాస 1978 జానర్: రివేంజ్ డ్రామా నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, లక్ష్మణ్, తదితరులు సంగీతం: రఘు కుంచె దర్శకత్వం: కరుణకుమార్ నిర్మాత: ధ్యాన్ అట్లూరి నిడివి: 144 నిమిషాలు 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణకుమార్ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘు కుంచె కీలక పాత్ర పోషిస్తూ సంగీతమందించాడు. ఇప్పటికే విడుదలై చిత్ర ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ 1978లో పలాసలో ఏం జరిగింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? తొలి చిత్రంతో దర్శకుడు విజయం సాధించాడా? అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుందా? అనేది మన రివ్యూలో చూద్దాం. కథ: అగ్రవర్ణాల నీరు, ఆహారం, గడప మైల పడకుండా.. సమాజానికి దూరంగా.. వారి అవసరాలకు దగ్గరగా పలాస పొలిమేరలో ఉండే అంబుసొలి అనే కాలనీ ప్రజల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇదే కాలనీలో రంగారావు(తిరువీర్), మోహన్ రావు (రక్షిత్)లు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. తండ్రి పద్యాల సుందర్ రావు (సమ్మెట గాంధీ) చిన్నప్పట్నుంచి నేర్పించిన పద్యాలు, జానపద గీతాలతో అనేక గ్రామాల్లో ప్రోగ్రామ్స్ చేస్తూనే.. ఆ ఊర్లోని పెద్ద షావుకారు లింగమూర్తి (జనార్దన్), చిన్న షావుకారు గురుమూర్తి (రఘు కుంచె)ల జీడిపప్పు బట్టీల్లో పనిచేస్తుండేవారు. అయితే లింగమూర్తి, గురుమూర్తిలు ఇద్దరు అన్నదమ్ములైన వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తన చిన్నతనం నుంచి మోహన్ రావుకు మరదలు లక్షి(నక్షత్ర) అంటే ఎంతో ఇష్టం. లక్ష్మికి కూడా బావ మోహన్ రావు అంటే ఎనలేని ప్రేమ. అయితే తన చిన్నతనం నుంచి కుల వివక్ష కారణంగా రగిలిపోయే మోహన్ రావు తరుచూ షావుకార్లతో గొడవకు దిగేవాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా గురుమూర్తి దగ్గరే పనిచేస్తూ అతడికి నమ్మిన బంటుగా మారిపోయాడు. అయితే సవ్యంగా సాగుతున్న సమయంలో ఎన్నికల కారణంగా రంగారావు, మోహన్‌రావుల జీవితాలు తలకిందులవుతాయి. గొడవలు, హత్యలతో పలాసలో భయానక వాతావరణం అలుముకుంటుంది. ఓ వైపు పోలీసులు మరోవైపు గురుమూర్తి.. మోహన్, రంగాలను అంతం చేయాలని పథకాలు రచిస్తుంటారు. ఈ పరిస్థితుల నుంచి రంగా, మోహన్‌లు బయటపడ్డారా? గొడవలు, హత్యలకు ఆ ఇద్దరన్నదమ్ములు ఎందుకు పాల్పడతారు? కథ సుఖాంతమైందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: దాదాపు అంతా కొత్త తారాగణమే. పెద్దగా పరిచయంలేని పేర్లు. ఈ చిత్రంలో రంగారావు, మోహన్ రావు పాత్రలు ప్రధానమైనవి. ఈ రెండు పాత్రలకు తిరువీర్, రక్షిత్‌లు న్యాయం చేశారు. ముఖ్యంగా రక్షిత్ అన్ని వేరియేషన్స్ ఉన్న పాత్ర లభించింది. బాధ, కోపం, ప్రేమ ఇలా అన్ని భావాలను చాలా చక్కగా పలికించాడు. యాక్షన్ సీన్స్‌లలో కూడా దుమ్ముదులిపాడు. అయితే నటుడిగా ఇంకాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉందని కొన్ని సీన్లను చూస్తే అనిపిస్తుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌కు ఎక్కువ ప్రాధాన్యత లేదు. అయితే ఉన్న కొన్ని సీన్లలోనైనా నక్షత్ర ఆకట్టుకుంది. నేచురల్‌గా, అందంగా కనిపిస్తుంది. నెగటీవ్ రోల్లో కనిపించిన రఘు కుంచె పలు సీన్లలో రావు రమేశ్‌ను తలపిస్తాడు. తన అనుభవంతో గురుమూర్తి ప్రాతలో ఒదిగిపోయాడు. లక్ష్మణ్, తిరువీర్లు తమ పాత్రలకు ప్రాణం పోశారు. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: కుల వివక్ష.. అప్పటికీ, ఇప్పటికీ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఇలాంటి అతి సున్నితమైన అంశాన్నే కథాంశంగా తీసుకుని సినిమాను తెరకెక్కించిన దర్శకుడి ప్రయత్నానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కథలు కత్తి మీద సాము వంటిది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన బొక్క బోర్లా పడటం ఖాయం. దీంతో తొలి సినిమాతోనే దర్శకుడు కరుణకుమార్ చాలా ధైర్యం చేశాడనే చెప్పాలి. అయితే తాను అనుకున్న కథ, కథాంశాన్ని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేయడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. సినిమా ప్రారంభమైన వెంటనే అసలు కథ ఏంటో అర్థమవుతుంది. అక్కడి నుంచి రొటీన్‌గా సాగిపోతూ ఉంటుంది. ఎందుకుంటే ఇలాంటి కథలు విన్నాం, చదివాం. ఇదివరకే ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే ఏదైన డిఫరెంట్ పాయింట్ చెబుతాడనే ఆసక్తి.. ఏమైనా కొత్తదనం చూపిస్తాడని ఆశపడ్డ సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ఒకే పంథాలో సినిమా సాగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే లవ్ సీన్స్ అతికించినట్టు ఉంటాయి. కులవివక్షను కూడా అంత బలంగా తెరపై చూపించలేదు. ఒకవేళ ఎక్కువగా చూపించి ఉంటే ప్రేక్షకుడు కథలో లీనమయ్యేవాడు. ఎమోషన్స్ సీన్లు కూడా ఎక్కడా టచ్ కావు. ఇక సినిమా మొత్తం ఉత్తరాంధ్ర స్లాంగ్‌లోనే మాటలు ఉంటాయి. అయితే ఉత్తరాంధ్ర స్లాంగే సినిమాకు బలం, బలహీనత. ఎందుకంటే కొన్ని చోట్ల ఆ మాటలు ఆకట్టుకోగా.. మరికొన్ని చోట్ల సరిగా అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. ఇక అన్ని వర్గాల ప్రేక్షకునే విధంగా తీర్చిదిద్దడంలో ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండేది. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలు బాగున్నా సినిమాకు అంతగా ప్లస్ కావు. రఘు కుంచె అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఆకట్టుకోగా మరికొన్ని చోట్ల రణగొనధ్వనులను తలపిస్తాయి. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రేక్షకుడిని 1978 ప్రాంతంలోకి తీసుకెళ్లడానికి సినిమాటోగ్రఫీ, ఆర్ట్ విభాగం చాలానే కష్టపడ్డట్లు సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇలాంటి చిత్రాలు ఎక్కువగా మనం కోలీవుడ్‌లో చూస్తుంటాం.. మరి అప్డేట్ అయిన తెలుగు ప్రేక్షకులు పలాస ‘1978’ ను ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. ప్లస్ పాయింట్స్: డైరెక్టర్ ఎంచుకున్న కథ నటీనటులు మైనస్ పాయింట్స్: స్లోనెరేషన్ కమిర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్. -
ఈ సినిమా సమర్పించడం గర్వంగా ఉంది
‘‘ఇప్పటివర కూ చాలా సినిమాల్లో నా పేరు ఉంది. కానీ వాటన్నింట్లో ‘పలాస’ చాలా ప్రత్యేకమైన సినిమా. నాకు బాగా సంతృప్తి కలిగించిన సినిమా. ‘పలాస’ సినిమాను సమర్పించడం గర్వంగా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ప్రసాద్ పలు విషయాలు పంచుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లా డుతూ – ‘‘కరుణకుమార్ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎక్కడా వంకలు పెట్టలేని విధంగా చెప్పాడు. గతంలో వచ్చిన ‘మా భూమి’ వంటి సినిమాలా అనిపించింది. ఈ కథను ప్రసాద్‌గారి దగ్గరకు తీసుకెళ్లాం. ఆయనకు కూడా నచ్చింది. కరుణ కథ చెప్పినట్టే తెరకెక్కించాడు. ఎక్కడా తప్పులు కనిపించలేదు. వర్గ విబేధాలను కరుణ అద్భుతంగా తెరకెక్కించాడు. వాస్తవ సంఘటనలకు కాస్త కమర్షియల్ అంశాలు జోడించి ఈ సినిమా తెరకెక్కించాడు. అల్లు అరవింద్‌గారు ఈ సినిమా చూసి కరుణకు వాళ్ల బ్యానర్లో సినిమా చేసే అవకాçశం ఇచ్చారు’’ అన్నారు. ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భరద్వాజగారు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేవరకూ మా నీడలా మాతోనే ఉన్నారు. ఆయన మా వెనక ఉండటం వల్ల చాలా సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యాయి. మా ఇద్దరి ఆలోచనా విధానం చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతిసారీ మన సినిమాల్లో గెలిచిన వాళ్ల కథనే చూపిస్తుంటాం. ఇందులో ఓడినవాళ్ల కథను చెప్పాం. అణచివేయబడుతున్నవాళ్ల కథను చెప్పాం’’ అన్నారు. -
‘‘పలాస 1978’ అందరూ మాట్లాడుకునే చిత్రం’
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘డైరెక్టర్ కరుణ కుమార్ పలాస కథ చెప్పినప్పుడు బాగుందని హీరోకు నేను రిఫర్ చేశాను, మా భూమి తరువాత ఆ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది. నిర్మాత ప్రసాద్ ధైర్యంగా ఈ సినిమాను స్టార్ట్ చేశారు, సినిమా షూటింగ్ సమయంలో వచ్చిన అన్ని కష్టాలను అధికమించి పూర్తి చేసాం. ఒక మంచి సినిమాకు నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. (చదవండి : ఆసక్తికరంగా ‘పలాస 1978’ ట్రైలర్) 'పలాస 1978' కు సమర్పకుడిగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను గతంలో 40 సినిమాలు చేశాను, అందులో పలాస సినిమా ప్రేత్యేకం. డైరెక్టర్ పట్టుదలతో, ఫ్యాషన్ తో సినిమా తీశాం. ఈ సినిమాలో ఎక్కడా నాకు పొరపాట్లు కనిపించలేదు. డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్లు తీసాడు. అల్లు అరవింద్, మారుతి, బన్నీ వాసు సినిమాను చూసి మెచ్చుకున్నారు. అరవింద్ తన సంస్థలో కరుణ కుమార్ కు అవకాశం ఇస్తానని చెప్పడం గొప్ప విషయం. సురేష్ బాబు మూవీ చూసి నచ్చి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అందుకు ఆయనకు ప్రేత్యేక ధన్యవాదాలు. అంబేద్కర్, గాంధీ గారి ఆశయాలు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు పాటించడం లేదు కానీ వారి బొమ్మలు పెట్టి పూజిస్తున్నారు, డబ్బు ఉన్నవారు, లేని వారు ఎలా ఉన్నారు ? వంటి విషయాలు ఈ సినిమాలో కరుణ కుమార్ కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగింది. సినిమాలో ఎక్కడా అశ్లీలత ఎక్కడా ఉండదు అన్నారు. నిర్మాత వర ప్రసాద్ అట్లూరి మాట్లాడుతూ సినిమా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని బయటికి వచ్చింది, అన్ని విషయాల్లో తమ్మారెడ్డి భరద్వాజ్ మమ్మల్ని వెనకుండి నడిపించారు. కొత్త ఆర్టిస్ట్స్ లతో సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ఒక గ్రామంలో జరిగిన యదార్ధ కథను ఈ సినిమాలో చూపించాం. జీవితంలో ఓడిపోయిన వారిగురించి చెప్పే కథాంశం ఇది. భాద పడిన వ్యక్తులు, నలిగిపోయిన జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను పలాసలో బలంగా చూపించడం జరిగింది. నిర్మాత గా నాకు పూర్తి సంతృప్తి నిచ్చిన చిత్రం పలాస 1978. పది మంది మాట్లాడుకునే చిత్రం అవుతుందని నమ్ముతున్నాను’ నిర్మాత ప్రసాద్ తెలిపారు. రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. -
‘పలాస’ డైరెక్టర్‌కు అరవింద్ ఆఫర్
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా విడుదల కాకముందే కరుణ కుమార్ బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. ఈ టాలీవుడ్ కొత్త డైరెక్టర్ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ వంటి భారీ నిర్మాణ సంస్థలో చేయనున్నాడు. దీనికి సంబంధించి గీతా ఆర్ట్స్ అధినేత, నిర్మాత అల్లు అరవింద్ కరుణ కుమార్‌కు అడ్వాన్స్‌గా ఓ చెక్ కూడా ఇచ్చాడు. ‘పలాస 1978’ చిత్ర బృందం ఆహ్వానం మేరకు నిర్మాతలు అల్లు అరవింద్, బన్ని వాస్‌లు మూవీ ప్రివ్యూ షో చూశారు. సినిమా చూసిన అనంతరం దర్శకుడు కరుణ కుమార్‌ను అల్లు అరవింద్ అభినందించారు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా నేచురల్‌గా ఉందని, ప్రతిభ గల డైరెక్టర్ అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా ఆయనతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటిస్తూ మీడియా సమక్షంలోనే అడ్వాన్స్‌గా చెక్‌ను అందించారు. దీంతో కరుణ కుమార్ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయబోతున్నట్లు ఖరారైంది. ఇక తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల కానుంది. రఘు కుంచె ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా సంగీతమందించాడు. చదవండి: పలాస నాకు చాలా ప్రత్యేకం పలాస చూశాక ధైర్యం వచ్చింది -
పలాస నాకు చాలా ప్రత్యేకం
‘‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాలో కమల్‌హాసన్‌గారి పాత్రకు దగ్గరగా ఉండే పాత్రని ‘పలాస 1978’ చిత్రంలో చేశా. కచ్చితంగా వైవిధ్యంగా ఉంటుంది. ఒక నటుడిగా, సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇందులో సంగీతం కోసం సహజమైన వాయిద్యాలు వాడాం’’ అన్నారు రఘు కుంచె. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించడంతో పాటు సంగీతం అందించిన రఘు కుంచె మాట్లాడుతూ– ‘‘నేను గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ‘పలాస’ నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో మైండ్ గేమ్ ఆడే విలన్ పాత్రలో మేకప్ లేకుండా సహజంగా నటించాను. ఈ చిత్రం చాలా సహజంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఫ్రెష్‌గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రీ రికార్డింగ్ అవసరం లేకుండా పోయింది. సంగీత దర్శకుడిగా, నటుడిగా ‘పలాస 1978’ నా కెరీర్లో బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాతో ఐదుగురు కొత్త గాయకుల్ని పరిచయం చేస్తున్నాం. జానపద కళ ఉన్న సినిమా కావడంతో ఫ్రెష్‌నెస్ కోసం కొత్తవారిని తీసుకున్నాం. ఉత్తరాంధ్ర జానపద సాహిత్యంతో కూడిన పాటలకు మంచి స్పందన వచ్చింది. నాకు మొదటి నుండి ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం. ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నాకు ఫోక్ సాంగ్స్ పాడటం అలవాటు.. అలా గాయకుణ్ణి అయ్యాను. నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసిన సినిమాల్లో ఫోక్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ‘పలాస’ ప్రివ్యూ చూసిన తర్వాత కొందరు దర్శక–నిర్మాతలు ఫోన్ చేసి, మంచి పాత్రలున్నాయి చేయమని అడిగారు. ఆ వివరాలు త్వరలోనే చెబుతా’’ అన్నారు. -
‘ఇంద్రుడు చంద్రుడు’లో కమల్ మాదిరి..
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచె మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘నేను గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పలాస నాకు చాలా స్పెషల్. ఈ సినిమాలో ఒక మైండ్ గేమ్ ఆడే ఒక నెగిటీవ్ రోల్ లో నటించాను. నా పాత్రలో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, మేకప్ లేకుండా ఈ సినిమాలో నేచురల్ గా నటించాను. ఈ పాత్ర కోసం జుట్టు పెంచాను. ఆ లుక్ విలన్‌గా బాగా సెట్ అయ్యింది. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో కమల్ హాసన్ గారి పాత్రకు దగ్గరగా ఈ సినిమాలో ఓ రోల్ చేశాను. నా పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక నటుడిగా , ఒక సంగీత దర్శకుడిగా నాకు ఈ సినిమా చాలా స్పెషల్. సినిమా చాలా సహజంగా ఉంటుంది, పాత్రలు కూడా ఎక్కడా బోరింగ్ లేకుండా ఉంటాయి, స్క్రీన్ ప్లే ఫ్రెష్ గా ఉంటుంది, దీంతో కొన్ని సందర్భాల్లో రీ రికార్డింగ్ అవసరం రాలేదు. మొదట సంగీత దర్శకుడిగా అవకాశమిచ్చారు. తరవాత ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుందని దర్శకుడు చెప్పాడు, పాత్ర నచ్చి ఈ సినిమాలో నటించాను. మ్యూజిక్ దర్శకుడి గా నటుడి గా పలాస 1978 నా కెరీర్లో బెస్ట్ గా నిలుస్తుంది. ఉత్తరాంధ్ర జానపద సాహిత్యంతో కూడిన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా రిలీజ్ తరువాత ఆడియన్స్ సాంగ్స్ కు బాగా కనెక్ట్ అవుతారు. నాకు మొదటినుండి ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం, ఒక చిన్న పల్లెటూరి ప్రాంతం నుండి వచ్చిన నాకు ఫోక్ సాంగ్స్ పాడడం అలవాటు, అలా సింగర్ అయ్యాను. నేను మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సినిమాల్లో ఫోక్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. నా మ్యూజిక్ టీమ్ పలాస సినిమాలో నా పాత్ర చూసి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు’అని రఘు కుంచె పేర్కొన్నారు. తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించారు. చదవండి: ‘అమృతరామమ్’ ఎప్పుడంటే? హాయ్.. నేను విజయ్ దేవరకొండ! -
ఆ సినిమా చూశాక ధైర్యం వచ్చింది : నాగశౌర్య
‘‘పలాస 1978’ లాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. అయితే ఈ సినిమా చూశాక చాలా ధైర్యం వచ్చింది’’ అన్నారు హీరో నాగశౌర్య. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా 40 ఏళ్ల సినీ కెరీర్లో ‘పలాస 1978’ మంచి సినిమా అని నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా పోస్టర్‌పై నా పేరు ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అన్నారు. ‘‘తమిళంలో వెట్రిమారన్లాంటి దర్శకుల్ని చూసి స్ఫూర్తి పొందుతుంటాం.. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారని కరుణ్‌కుమార్ గుర్తు చేశాడు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘పలాస’ నా ఫస్ట్ సినిమాగా చేద్దామనుకోలేదు. నాకు చాన్స్ ఇచ్చిన ప్రసాద్‌గారికి, తమ్మారెడ్డి భరద్వాజగారికి రుణపడి ఉంటాను’’ అన్నారు కరుణ్‌కుమార్. నిర్మాతలు రాజ్ కుందుకూరి, ‘మధుర’ శ్రీధర్, సంగీత దర్శకులు రఘు కుంచె, కళ్యాణీ మాలిక్, పాటల రచయిత భాస్కర భట్ల, సిరాశ్రీ తదితరులు మాట్లాడారు. -
పలాస మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
‘పలాస 1978 గొప్ప సినిమా అవుతుంది’
కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి6న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చిని ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ హీరోలు నాగశౌర్య, శ్రీవిష్ణు, దర్శకుడు మారుతి, పలువురు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, చిత్రయూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘పలాస 1978 నేను చూసాను. ఇలాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు చాలా ధైర్యం వచ్చింది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. కొడుకు హీరో గా ఉన్నా కూడా సినిమా నే ప్రేమించి సినిమాను నిర్మించారు నిర్మాత ప్రసాద్ గారు. అందరికీ ఆల్ ద బెస్ట్’ అని నాగశౌర్య అన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘పలాస గురించి తెలుసుకున్నప్పుడు నా సినిమా అనే ఫీల్ కలుగుతుంది. దర్శకుడు తనదైన మార్క్ ని తెలుగు సినిమా పై ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. రఘు గారు ఇచ్చిన ‘పలాస మీద వచ్చిన పాట’చాలా బాగుంది. ఇది ప్రేక్షకుల్లో బలమైన ముద్రను వేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘పలాస ఫస్ట్ కాపీ చూసిన రోజు దర్శకుడు కుమార్ ఒక అద్భుతం చేసాడని పించింది. మనం ఊహించిన దానికంటే చాలా బాగా తీసాడు. ప్రతి మేకర్‌కి ఇలాంటి సినిమా చేయాలనిపించేలా చేసాడు. అందులో రఘుకుంచె గారి నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. తమిళ సినిమాలు చూసి మనం ఫీల్ అవుతుంటాం.. వెట్రిమారన్ లాంటి వారిని చూసి ప్రేరణ పొందుతుంటాం. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారు అని కరుణ కుమార్ గుర్తు చేసాడ’న్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్, నిర్మాత రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, చిత్ర బృందం పాల్గొంది. చదవండి: బంజారా సినిమాను నిషేధించాలి రాధిక నాకు తల్లి కాదు! -
సుకుమార్ అభినందనను మర్చిపోలేను
‘‘లండన్ బాబులు’ సినిమా తర్వాత ఒక వైవిధ్యమైన సినిమా చేయాలనుకున్నాను. రెగ్యులర్ ప్రేమకథలు కాకుండా కొత్త నేపథ్యం ఉన్న కథలకోసం చూస్తున్న సమయంలో తమ్మారెడ్డి భరద్వాజగారి ద్వారా ‘పలాస 1978’ కథ నా దగ్గరకు వచ్చింది. తమ్మారెడ్డిగారికి, మా నాన్నగారికి కథ నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది’’ అని రక్షిత్ అన్నారు. కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్ మాట్లాడుతూ – ‘‘కరుణ కుమార్‌గారు కొన్ని వాస్తవ సంఘటనలతో ఈ కథ రాసుకున్నారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాసని ప్రాక్టీస్ చేశా. 40 రోజులు పలాసలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాం. షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కవ సమయం పట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మా సినిమా గురించి మాట్లాడుకునే దాకా వచ్చామంటే కారణం కరుణ కుమార్. మా సినిమా ప్రివ్యూ చూసినవాళ్లు నా నటన గురించి మాట్లాడుతుంటే సంతోషంగా అనిపించింది. ఇందులో నాలుగు వేరియేష¯Œ్సలో కనపడాలి అన్నప్పడు ఛాలెంజ్‌గా తీసుకున్నాను. పాత్ర కోసం బరువు తగ్గడం, పెరగడం వంటివి చేశాను. ‘అసురన్’ తరహా సినిమా ‘పలాస 1978’. ఈ సినిమా చూసి డైరెక్టర్ సుకుమార్‌గారు అభినందించడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఒక్క ఫోన్ కాల్ నాలో నమ్మకం పెంచింది’’ అన్నారు. -
వాస్తవ సంఘటనల పలాస
‘‘స్వచ్ఛ భారత్‌కి నేను చేసిన ‘చెంబుకు మూడింది’ లఘు చిత్రం జాతీయ స్థాయిలో రెండో బహుమతి తెచ్చుకోవడం నా జీవితంలో కీలక మలుపు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి కేటీఆర్‌గార్లు అప్పుడు నన్ను సన్మానించారు. కేటీఆర్‌గారి ప్రోత్సాహంతో చాలా ప్రభుత్వ యాడ్స్ చేశాను. ‘పలాస ’ నా మొదటి సినిమా అవుతుందనుకోలేదు’’ అన్నారు దర్శకుడు కరుణ కుమార్. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా ఈ నెల 6న విడుదల కానుంది. కాగా ‘పలాస 1978’ ట్రైలర్‌ని రానా ట్విట్టర్లో విడుదల చేసి, ‘ఈ చిత్రం విజువల్స్, నేపథ్యం చాలా కొత్తగా ఉన్నాయి’’ అన్నారు. కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. తమ్మారెడ్డి భరద్వాజగారికి కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం అని, నిర్మాత ప్రసాద్‌గారిని పరిచయం చేశారు. ఇది ఒక వ్యక్తి కథో, కుటుంబం కథో కాదు.. ఇది ఒక సమూహం కథ. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా పలాస కథను తెరకెక్కించాం. ఈ చిత్రంలో ఒక నిజాయతీ కథ కనిపిస్తుంది. సెన్సార్ బోర్డ్‌వారు ఎక్కువ కట్స్ సూచించడంతో రివైజ్ కమిటీకి వెళ్లాం.. వాళ్లు మా చిత్రాన్ని చూసి, ప్రశంసించారు’’ అన్నారు. -
ఆసక్తికరంగా ‘పలాస 1978’ ట్రైలర్
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. 'పలాస 1978' ట్రైలర్‌ని ఆదివారం ట్విట్టర్లో లాంచ్ చేసిన రానా టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ట్రైలర్ మొదలు కావడంతోనే పలాస 1978లో జరిగిన ఓ హత్య గురించి ఉంటుంది. తర్వాత హీరో రక్షిత్ ‘బురదలోకి దిగిపోయాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవే.. ఎప్పుడు ఎవడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉందే’ అంటూ హీరోయిన్ తో చెప్పే డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశారు. తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించారు. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రోత్సాహం అందించడంలో రానా ఎప్పుడూ ముందుంటారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి విభిన్నమైన సినిమాను ప్రమోట్ చేసిన రానా ‘పలాస 1978’ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యారు. విజువల్స్, నేపథ్యం చాలా కొత్తగా ఉన్నయని రానా అన్నారు. -
భిన్నమైన పలాస
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘సెన్సార్ బోర్డ్‌వారు ఎక్కువ కట్స్ సూచించడంతో రివైజ్ కమిటీకి వెళ్లాం. అక్కడ మా చిత్రాన్ని చూసి, ప్రశంసించారు. తెలుగు సినిమాలో ‘పలాస 1978’ చిత్రం భిన్నమైనదని చెప్పగలను. రచయితగా ఉన్న నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, మాకు అండగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజగారికి, మా సినిమాను విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్ సంస్థవారికి ధన్యవాదాలు’’ అన్నారు. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశారు. ‘మీడియా 9 మనోజ్’ ఈ సినిమాకు కో–ప్రొడ్యూసర్.