కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి6న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌లకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చిని ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ హీరోలు నాగశౌర్య, శ్రీవిష్ణు, దర్శకుడు మారుతి, పలువురు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, చిత్రయూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.
‘పలాస 1978 నేను చూసాను. ఇలాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు చాలా ధైర్యం వచ్చింది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. కొడుకు హీరో గా ఉన్నా కూడా సినిమా నే ప్రేమించి సినిమాను నిర్మించారు నిర్మాత ప్రసాద్ గారు. అందరికీ ఆల్ ద బెస్ట్’ అని నాగశౌర్య అన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘పలాస గురించి తెలుసుకున్నప్పుడు నా సినిమా అనే ఫీల్ కలుగుతుంది. దర్శకుడు తనదైన మార్క్ ని తెలుగు సినిమా పై ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. రఘు గారు ఇచ్చిన ‘పలాస మీద వచ్చిన పాట’చాలా బాగుంది. ఇది ప్రేక్షకుల్లో బలమైన ముద్రను వేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘పలాస ఫస్ట్ కాపీ చూసిన రోజు దర్శకుడు కుమార్ ఒక అద్భుతం చేసాడని పించింది. మనం ఊహించిన దానికంటే చాలా బాగా తీసాడు. ప్రతి మేకర్‌కి ఇలాంటి సినిమా చేయాలనిపించేలా చేసాడు. అందులో రఘుకుంచె గారి నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. తమిళ సినిమాలు చూసి మనం ఫీల్ అవుతుంటాం.. వెట్రిమారన్ లాంటి వారిని చూసి ప్రేరణ పొందుతుంటాం. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారు అని కరుణ కుమార్ గుర్తు చేసాడ’న్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్, నిర్మాత రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, చిత్ర బృందం పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment