రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచె మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
‘నేను గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పలాస నాకు చాలా స్పెషల్. ఈ సినిమాలో ఒక మైండ్ గేమ్ ఆడే ఒక నెగిటీవ్ రోల్ లో నటించాను. నా పాత్రలో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, మేకప్ లేకుండా ఈ సినిమాలో నేచురల్ గా నటించాను. ఈ పాత్ర కోసం జుట్టు పెంచాను. ఆ లుక్ విలన్‌గా బాగా సెట్ అయ్యింది. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో కమల్ హాసన్ గారి పాత్రకు దగ్గరగా ఈ సినిమాలో ఓ రోల్ చేశాను. నా పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక నటుడిగా , ఒక సంగీత దర్శకుడిగా నాకు ఈ సినిమా చాలా స్పెషల్.
సినిమా చాలా సహజంగా ఉంటుంది, పాత్రలు కూడా ఎక్కడా బోరింగ్ లేకుండా ఉంటాయి, స్క్రీన్ ప్లే ఫ్రెష్ గా ఉంటుంది, దీంతో కొన్ని సందర్భాల్లో రీ రికార్డింగ్ అవసరం రాలేదు. మొదట సంగీత దర్శకుడిగా అవకాశమిచ్చారు. తరవాత ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుందని దర్శకుడు చెప్పాడు, పాత్ర నచ్చి ఈ సినిమాలో నటించాను. మ్యూజిక్ దర్శకుడి గా నటుడి గా పలాస 1978 నా కెరీర్‌లో బెస్ట్ గా నిలుస్తుంది.
ఉత్తరాంధ్ర జానపద సాహిత్యంతో కూడిన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా రిలీజ్ తరువాత ఆడియన్స్ సాంగ్స్ కు బాగా కనెక్ట్ అవుతారు. నాకు మొదటినుండి ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం, ఒక చిన్న పల్లెటూరి ప్రాంతం నుండి వచ్చిన నాకు ఫోక్ సాంగ్స్ పాడడం అలవాటు, అలా సింగర్ అయ్యాను. నేను మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సినిమాల్లో ఫోక్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. నా మ్యూజిక్ టీమ్ పలాస సినిమాలో నా పాత్ర చూసి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు’అని రఘు కుంచె పేర్కొన్నారు. తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించారు.
చదవండి:
‘అమృతరామమ్’ ఎప్పుడంటే?
హాయ్.. నేను విజయ్ దేవరకొండ!
Comments
Please login to add a commentAdd a comment