Raghu Kunche
-
‘నువ్వే కావాలి అమ్మ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సింగర్ రఘు కుంచె ఇంట్లో తీవ్ర విషాదం
సాక్షి, తూర్పుగోదావరి (మధురపూడి): తెలుగు సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె తండ్రి లక్ష్మీనారాయణరావు (90) మంగళవారం మరణించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన కుంచె లక్ష్మీనారాయణరావు 1933లో జన్మించారు. ఆయనకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మీనారాయణరావు అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో నిర్వహిస్తారు. జీవనోపాధి కోసం వ్యవసాయం చేసిన లక్ష్మీనారాయణరావు స్థానిక సాగునీటి సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హోమియో వైద్యుడిగా సేవలందించారు. చదవండి: (Tamannaah: రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే హీరోలకే వణుకు) -
ఒకవైపు యాక్టింగ్..మరోవైపు మ్యూజిక్.. ‘మల్టీ టాలెంటెడ్’గా రఘు కుంచె
రఘు కుంచె ఈ పేరు గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకరింగ్ నుంచి, వెండితెరపై మ్యూజిక్ డైరెక్షన్ దాకా రఘు కుంచె తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకవైపు సినిమాల సంగీతం అందిస్తూనే.. మరోవైపు నటనలోనూ రాణిస్తున్నాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తూ.. ‘మల్టీ టాలెంటెడ్’అని గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘పలాస 1978’ మూవీలో రఘు కుంచె చూపించిన విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. రఘు కుంచె పాత్రకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. విలన్ రోల్ మాత్రం ప్లే చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత రఘు కుంచె మరోసారి తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించారు. తాజాగా విడుదలైన ‘రుద్రవీణ’లో యానాం రౌడీ ‘లాలప్ప’ పాత్రని పోషించి, మెప్పించాడు. ఇలా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సంగీత దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. అలాగే హీరోగా ఒక చిత్రం కూడా చేయబోతున్నాడని వినికిడి. మొత్తానికి ఒకవైపు నటన మరోవైపు సంగీతంతో రఘు కుంచె కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. -
తండ్రీకొడుకుల ఎమోషనల్ కథే ‘మా నాన్న నక్సలైట్’
‘‘నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తండ్రీకొడుకుల ఎమోషనల్ కథే ‘మా నాన్న నక్సలైట్’ చిత్రం. ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది. చదలవాడ శ్రీనివాసరావుగారు కథ విని మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో మమ్మల్ని ప్రోత్సహించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్యానర్లో సినిమా చేయడాన్ని హ్యాపీగా ఫీలవుతున్నాను’’ అన్నారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్‌పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘మా నాన్న నక్సలైట్’ చిత్రం బాగా వచ్చింది. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న మంచి సెంటిమెంట్ సినిమా ఇది. సోసైటీకి ఉపయోగపడుతుంది. నా బ్యానర్లో వస్తోన్న మరో అద్భుతమైన చిత్రం ఇది. సునీల్కుమార్గారితో మరిన్ని సినిమాలు చేస్తా’’ అన్నారు. -
Maa Nanna Naxalite : ‘ఒసేయ్ రాములమ్మ’ గుర్తొచ్చింది
గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్’. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్‌పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘మాతృదేవోభవ’ చిత్రం చూసి ఎంత భావోద్వేగానికి లోనయ్యానో ‘మా నాన్న నక్సలైట్’ చూశాక అంతే అనుభూతికి లోనయ్యాను’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే దాసరి నారాయణరావుగారు తీసిన ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రం గుర్తుకు వచ్చింది’’ అన్నారు దర్శకుడు రేలంగి నరసింహారావు. ‘‘నా తండ్రికి ఇచ్చే సెల్యూట్, నా కొడుకుకి ఇచ్చే గిఫ్ట్ ఈ సినిమా’’ అన్నారు సునీల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, నటుడు కాశీ విశ్వనాథ్, నిర్మాత ప్రసన్న కుమార్, లిరిక్ రైటర్ రవీంద్ర బాబు, నటుడు కృష్ణ, నటి రేఖా నిరోషా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి , కెమెరా: ఎస్వి శివరామ్. -
'ఐ యామ్ ఏ సెలబ్రిటీ' అంటున్న రఘుకుంచె
Raghukunche Celebrity Song: గాయకుడిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా , నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఒక వైపు సంగీత దర్శకుడిగా మరో వైపు నటుడిగా తన అనుభవాలను "ఐ యామ్ ఏ సెలబ్రిటీ" ( I'm A Celebrity) పేరుతో, తనే లిరిక్స్ అందించి , మ్యూజిక్ కంపోజ్ చేసి , తనే పాడిన ,ఒక వినోదాత్మకమైన పాటను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్‌లో హల్చల్ చేస్తుంది. ఐ యామ్ ఏ సెలబ్రిటీపాట విడుదల అయిన సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ.. "ప్రతి మనిషికి సమాజంలో మంచి గుర్తింపు కావాలి అని ఉంటుంది కానీ ,ఆ గుర్తింపు కొందరికే వస్తుంది. కృషి పట్టుదలతో కొందరు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, అందరిని మెప్పిస్తారు , అందుకే సమాజంలో వాళ్ళని ప్రత్యేకంగా గౌరవిస్తారు, ఒక సెలబ్రిటీ హోదా ఇస్తారు. సినిమా రంగం అయిన, పొలిటికల్ రంగం విద్యారంగం అయినా , ప్రజలని మెప్పించగలిగితే చాలు వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఇచ్చేస్తారు. కానీ ఈ సెలబ్రిటీ హోదాని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. విశృంఖలంగా పెరిగిపోయిన సోషల్ మీడియా ప్రభావం వల్ల, ఒక సెలబ్రిటీ స్థాయిలో ఏమి చేసినా క్షణాల్లో అది వైరల్‌గా మారుతుంది . నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ జీవితం కత్తి మీద సాములాగా అయిపోయింది. వాళ్ళు ఏమి చేసినా సోషల్ మీడియా లో అదొక పెద్ద వార్త అవుతుంది , మీమ్ అవుతుంది ,యూట్యూబ్ లో థంబ్ నైల్ అవుతుంది. వీటన్నిటి ఆధారంగానే దీన్ని ఒక వినోదభరితమైన పాటగా మలిచాను. ఐ యామ్ ఏ సెలబ్రిటీ పాట మీకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. మరియు , ఈ పాట కేవలం వినోదం కోసం చేసిన పాట మాత్రమే తప్పా ఎవరినో కించపరచడానికో, లేక తక్కువ చేయడానికో చేసింది కాదు . ఎవరి మనసులనైనా కష్టపెడితే , క్షమించమని ముందుగానే కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. -
‘గూడుపుఠాణి ’ మూవీ రివ్యూ
టైటిల్: గూడుపుఠాణి నటీనటులు: సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచే తదితరులు నిర్మాణ సంస్థ: ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ దర్శకత్వం: కెయమ్ కుమార్ సంగీతం: ప్రతాప్ విద్య విడుదల తేది: డిసెంబర్ 25, 2021 తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హాస్య నటులు హీరోలుగా మారి సినిమాలు చేశారు. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్‌ని అందుకున్నారు. అలాంటి కమెడియన్స్‌లో సప్తగిరి ఒకరు. ఇప్పటికే సప్తగిరి ఎల్ ఎల్ బి, సప్తగిరి ఎక్సప్రెస్ లాంటి చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ యంగ్ కమెడియన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గూడుపుఠాణి ’.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో పాటు మూవీపై అంచనాలను పెంచింది. ఓ మోస్తారు అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సప్తగిరి తొలి చూపులోనే నేహా సొలంకి ప్రేమలో పడతాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఓ పూరాతన అమ్మవారి దేవాలయంలో తమ వివాహాన్ని ఘనంగా జరుపుకోవాలనుకుంటారు. అదే సమయంలో దేవాలయాల్లో వరుసగా అమ్మవారి నగలు దొంగిలించబడతాయి. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో సప్తగిరి పెళ్లి చేసకునే గుడిలో కూడా దొంగలు పడతారు. అసలు ఆ దొంగలు ఎవరు? ఆ గుడిలో ఏం జరిగింది? చివరకు సప్తగిరి, సొలంకిల పెళ్లి జరిగిందా? లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఎప్పటి మాదిరే సప్తగిరి మరోసారి తనదైన నటనతో అలరించాడు. తనదైన కామెడీతో నవ్విస్తూనే.. కొన్ని కీలక సన్నివేశాల్లో భయపెడతాడు. హీరోయిన్ నేహా సోలంకి అందం, అభినయంతో ఆకట్టుకుంది. విలన్‌గా రఘు కుంచె నటన సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? తెలిసిన కథనే అద్భుతమైన కథనంతో మంచి ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కుమార్. సప్తగిరి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. కామెడీతో పాటు మంచి కథ, కథనం, అద్భుతమైన డైలాగులు, అందమైన లొకేషన్స్‌తో పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని ప్రేక్షకులకి అందించారు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ మాత్రం కాస్త బోరింగ్ అనిపిస్తాయి. అమ్మవారి నగలు దొంగిలించిది ఎవరనే విషయాన్ని చివరి వరకు చెప్పకుండా ప్రేక్షకులను క్యూరియాసిటీ కలిగించడంతో దర్శకుడు సఫలం అయ్యాడు. ఇక సాకేతిక విషయాలకొస్తే.. ప్రతాప్ విద్య సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. మున్నా (ఫణి ప్రదీప్) మాటలు, పవన్ చెన్నా సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఈ కథ వినగానే అలా అనిపించింది: పి. సునీల్‌కుమార్ రెడ్డి
రిషి, శిల్పా నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హనీ ట్రాప్’. పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వీవీ వామనరావు నిర్మించారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలను సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె విడుదల చేశారు. పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వామనరావుగారు ‘హనీ ట్రాప్’ కథ చెప్పగానే సినిమాకి కావాల్సిన వాణిజ్య అంశాలున్నాయనిపించింది. ఆయన రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు. ఎందరో జీవితాలను దగ్గరగా చూసి, అందులోంచి కథలు రాస్తుంటారు. ఆయన రాసిన నాటకాలకు నంది ఆవార్డులు వచ్చాయి. సీరియల్స్ జనాదరణ పొందాయి. అలాంటి వ్యక్తి అందించిన కథతో సినిమా తీయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ నేను రాసిన స్క్రీన్ ప్లే బాగుందని దర్శకులు ప్రోత్సహించారు. ‘హనీ ట్రాప్’ ప్రివ్యూ చూసినవాళ్లంతా చాలా బాగుందన్నారు’’ అన్నారు వీవీ వామనరావు. రచయిత యెక్కలి రవీంద్ర బాబు, నటుడు శివ కార్తీక్, శ్రీలక్ష్మీ ఫిలింస్ బాపిరాజు పాల్గొన్నారు. -
ఘనంగా సింగర్ రఘు కుంచె కూతురు వివాహం
-
సమాధానం ఏంటి?
అదా శర్మ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘క్వశ్చన్ మార్క్ (?)’. విప్రా దర్శకత్వంలో గౌరు ఘనా సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అందరి సహకారంతో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. మా టైటిల్ ‘క్వశ్చన్ మార్క్ (?)’కి విశేష స్పందన లభించింది’’ అన్నారు. ‘‘మా నిర్మాతగారు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు విప్రా. ‘‘చక్కని హారర్ సినిమా ఇది. ‘క్వశ్చన్ మార్క్ (?)’ టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ప్రశ్నకు సమాధానం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు అదా శర్మ. ఈ చిత్రానికి కెమెరా: వంశీ ప్రకాష్, సంగీత దర్శకుడు: రఘు కుంచె. -
‘మా కోసం గడపదాటి వచ్చావయ్యా!’
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరాటంలో భాగంగా అలుపెరగకుండా శ్రమిస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ద్య సిబ్బందికి యావత్ ప్రపంచం సలామ్ చేస్తోంది. ఇప్పటికే వారి సేవలను కొనియాడుతూ అనేక మంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా నియంత్రణకు పోలీసులు చేస్తున్న నిస్వార్థ సేవకు సెల్యూట్ చేస్తూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రఘు కుంచె తాజాగా ఓ పాటను రూపొందించారు. ‘సలాం నీకు పోలీసన్నా.. రెండు చేతులెత్తి నీకు మొక్కాలన్నా’అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. బండి సత్యం సాహిత్యం అందించగా రఘు కుంచె స్వయంగా ట్యూన్ కట్టి ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నేను హైదరాబాద్ లో ఉంటాను. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో.. ఎవరి భయాలు వారికున్నట్టే నాకూ ఉన్నాయి. ఇంట్లో ఉంటూ నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. కానీ అవసరాలకోసం బయటికొచ్చినప్పుడు, మనకోసం లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్న పోలీసులను చూస్తే వారి మీద గౌరవం రెట్టింపు అవుతోంది. టీవీల్లో వాళ్ల్లు చేస్తున్న కృషి గురించి, వాళ్ళు తీసుకుంటున్న రిస్క్ గురించి, ప్రజల కోసం వాళ్ళు పడుతున్న తపన చూస్తే చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తోంది. అందుకే వారి కోసం.. ఈ పాట’అంటూ రఘు కుంచె పేర్కొన్నాడు. ఇప్పటికే పోలీసుల సేవలను కొనియాడుతూ మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు, సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండలు పలు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. చదవండి: మీ నిస్వార్థ సేవకు సెల్యూట్ లాక్డౌన్: భారీ ర్యాలీ అని భ్రమపడేరు! దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు -
దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు సినీ కళాకారులు సైతం నడుం బిగుస్తున్నారు. కరోనా వైరస్ పట్ల పాటల రూపంలో ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సంగీతదర్శకులు, గాయకులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పాటల రూపంలో ప్రజలకు వివరిస్తున్నారు. కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, కోటి వంటి సంగీత దర్శకులు అందించిన పాటలు ప్రజలను మేల్కొలిపే విధంగా ఉన్నాయని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె మహమ్మారి కరోనాపై ఓ పాట ఆలపించాడు. సిరాశ్రీ సాహిత్యాన్ని అందించాడు. ‘చెప్పినమాట వినకుంటే ఓరినాయనా’అంటూ సాగే ఈ పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కొన్ని లిరిక్స్ ప్రభుత్వ సూచనలను పాటించని వారికి నేరుగా గుచ్చుకునే విధంగా ఉన్నాయి. ‘ప్రభుత్వాల మాట వినరా ఓరినాయనా.. వెర్రిపప్పలాగా తిరగకురా ఓరినాయనా’ , ‘దండంబెట్టి చెబుతున్నా ఓరినాయనా.. దండంతో గోడెక్కకు ఓరినాయనా’అనే లిరిక్స్ ఆలోచించే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా డాక్టర్లు చేస్తున్న కృషి, పోలీసుల రక్షణ వంటి విషయాలను పోటలో పొందుపర్చాడు రఘు కుంచె. సాధారణ భాషలో సెటైరికల్‌గా సాగిన ఈపాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేలా చౌరస్తా బ్యాండ్ పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. -
‘పలాస 1978’ మూవీ రివ్యూ
టైటిల్: పలాస 1978 జానర్: రివేంజ్ డ్రామా నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, లక్ష్మణ్, తదితరులు సంగీతం: రఘు కుంచె దర్శకత్వం: కరుణకుమార్ నిర్మాత: ధ్యాన్ అట్లూరి నిడివి: 144 నిమిషాలు 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణకుమార్ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘు కుంచె కీలక పాత్ర పోషిస్తూ సంగీతమందించాడు. ఇప్పటికే విడుదలై చిత్ర ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ 1978లో పలాసలో ఏం జరిగింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? తొలి చిత్రంతో దర్శకుడు విజయం సాధించాడా? అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుందా? అనేది మన రివ్యూలో చూద్దాం. కథ: అగ్రవర్ణాల నీరు, ఆహారం, గడప మైల పడకుండా.. సమాజానికి దూరంగా.. వారి అవసరాలకు దగ్గరగా పలాస పొలిమేరలో ఉండే అంబుసొలి అనే కాలనీ ప్రజల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇదే కాలనీలో రంగారావు(తిరువీర్), మోహన్ రావు (రక్షిత్)లు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. తండ్రి పద్యాల సుందర్ రావు (సమ్మెట గాంధీ) చిన్నప్పట్నుంచి నేర్పించిన పద్యాలు, జానపద గీతాలతో అనేక గ్రామాల్లో ప్రోగ్రామ్స్ చేస్తూనే.. ఆ ఊర్లోని పెద్ద షావుకారు లింగమూర్తి (జనార్దన్), చిన్న షావుకారు గురుమూర్తి (రఘు కుంచె)ల జీడిపప్పు బట్టీల్లో పనిచేస్తుండేవారు. అయితే లింగమూర్తి, గురుమూర్తిలు ఇద్దరు అన్నదమ్ములైన వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తన చిన్నతనం నుంచి మోహన్ రావుకు మరదలు లక్షి(నక్షత్ర) అంటే ఎంతో ఇష్టం. లక్ష్మికి కూడా బావ మోహన్ రావు అంటే ఎనలేని ప్రేమ. అయితే తన చిన్నతనం నుంచి కుల వివక్ష కారణంగా రగిలిపోయే మోహన్ రావు తరుచూ షావుకార్లతో గొడవకు దిగేవాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా గురుమూర్తి దగ్గరే పనిచేస్తూ అతడికి నమ్మిన బంటుగా మారిపోయాడు. అయితే సవ్యంగా సాగుతున్న సమయంలో ఎన్నికల కారణంగా రంగారావు, మోహన్‌రావుల జీవితాలు తలకిందులవుతాయి. గొడవలు, హత్యలతో పలాసలో భయానక వాతావరణం అలుముకుంటుంది. ఓ వైపు పోలీసులు మరోవైపు గురుమూర్తి.. మోహన్, రంగాలను అంతం చేయాలని పథకాలు రచిస్తుంటారు. ఈ పరిస్థితుల నుంచి రంగా, మోహన్‌లు బయటపడ్డారా? గొడవలు, హత్యలకు ఆ ఇద్దరన్నదమ్ములు ఎందుకు పాల్పడతారు? కథ సుఖాంతమైందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: దాదాపు అంతా కొత్త తారాగణమే. పెద్దగా పరిచయంలేని పేర్లు. ఈ చిత్రంలో రంగారావు, మోహన్ రావు పాత్రలు ప్రధానమైనవి. ఈ రెండు పాత్రలకు తిరువీర్, రక్షిత్‌లు న్యాయం చేశారు. ముఖ్యంగా రక్షిత్ అన్ని వేరియేషన్స్ ఉన్న పాత్ర లభించింది. బాధ, కోపం, ప్రేమ ఇలా అన్ని భావాలను చాలా చక్కగా పలికించాడు. యాక్షన్ సీన్స్‌లలో కూడా దుమ్ముదులిపాడు. అయితే నటుడిగా ఇంకాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉందని కొన్ని సీన్లను చూస్తే అనిపిస్తుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌కు ఎక్కువ ప్రాధాన్యత లేదు. అయితే ఉన్న కొన్ని సీన్లలోనైనా నక్షత్ర ఆకట్టుకుంది. నేచురల్‌గా, అందంగా కనిపిస్తుంది. నెగటీవ్ రోల్లో కనిపించిన రఘు కుంచె పలు సీన్లలో రావు రమేశ్‌ను తలపిస్తాడు. తన అనుభవంతో గురుమూర్తి ప్రాతలో ఒదిగిపోయాడు. లక్ష్మణ్, తిరువీర్లు తమ పాత్రలకు ప్రాణం పోశారు. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: కుల వివక్ష.. అప్పటికీ, ఇప్పటికీ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఇలాంటి అతి సున్నితమైన అంశాన్నే కథాంశంగా తీసుకుని సినిమాను తెరకెక్కించిన దర్శకుడి ప్రయత్నానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కథలు కత్తి మీద సాము వంటిది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన బొక్క బోర్లా పడటం ఖాయం. దీంతో తొలి సినిమాతోనే దర్శకుడు కరుణకుమార్ చాలా ధైర్యం చేశాడనే చెప్పాలి. అయితే తాను అనుకున్న కథ, కథాంశాన్ని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేయడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. సినిమా ప్రారంభమైన వెంటనే అసలు కథ ఏంటో అర్థమవుతుంది. అక్కడి నుంచి రొటీన్‌గా సాగిపోతూ ఉంటుంది. ఎందుకుంటే ఇలాంటి కథలు విన్నాం, చదివాం. ఇదివరకే ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే ఏదైన డిఫరెంట్ పాయింట్ చెబుతాడనే ఆసక్తి.. ఏమైనా కొత్తదనం చూపిస్తాడని ఆశపడ్డ సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ఒకే పంథాలో సినిమా సాగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే లవ్ సీన్స్ అతికించినట్టు ఉంటాయి. కులవివక్షను కూడా అంత బలంగా తెరపై చూపించలేదు. ఒకవేళ ఎక్కువగా చూపించి ఉంటే ప్రేక్షకుడు కథలో లీనమయ్యేవాడు. ఎమోషన్స్ సీన్లు కూడా ఎక్కడా టచ్ కావు. ఇక సినిమా మొత్తం ఉత్తరాంధ్ర స్లాంగ్‌లోనే మాటలు ఉంటాయి. అయితే ఉత్తరాంధ్ర స్లాంగే సినిమాకు బలం, బలహీనత. ఎందుకంటే కొన్ని చోట్ల ఆ మాటలు ఆకట్టుకోగా.. మరికొన్ని చోట్ల సరిగా అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. ఇక అన్ని వర్గాల ప్రేక్షకునే విధంగా తీర్చిదిద్దడంలో ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండేది. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలు బాగున్నా సినిమాకు అంతగా ప్లస్ కావు. రఘు కుంచె అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఆకట్టుకోగా మరికొన్ని చోట్ల రణగొనధ్వనులను తలపిస్తాయి. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రేక్షకుడిని 1978 ప్రాంతంలోకి తీసుకెళ్లడానికి సినిమాటోగ్రఫీ, ఆర్ట్ విభాగం చాలానే కష్టపడ్డట్లు సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇలాంటి చిత్రాలు ఎక్కువగా మనం కోలీవుడ్‌లో చూస్తుంటాం.. మరి అప్డేట్ అయిన తెలుగు ప్రేక్షకులు పలాస ‘1978’ ను ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. ప్లస్ పాయింట్స్: డైరెక్టర్ ఎంచుకున్న కథ నటీనటులు మైనస్ పాయింట్స్: స్లోనెరేషన్ కమిర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్. -
పలాస నాకు చాలా ప్రత్యేకం
‘‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాలో కమల్‌హాసన్‌గారి పాత్రకు దగ్గరగా ఉండే పాత్రని ‘పలాస 1978’ చిత్రంలో చేశా. కచ్చితంగా వైవిధ్యంగా ఉంటుంది. ఒక నటుడిగా, సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇందులో సంగీతం కోసం సహజమైన వాయిద్యాలు వాడాం’’ అన్నారు రఘు కుంచె. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించడంతో పాటు సంగీతం అందించిన రఘు కుంచె మాట్లాడుతూ– ‘‘నేను గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ‘పలాస’ నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో మైండ్ గేమ్ ఆడే విలన్ పాత్రలో మేకప్ లేకుండా సహజంగా నటించాను. ఈ చిత్రం చాలా సహజంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఫ్రెష్‌గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రీ రికార్డింగ్ అవసరం లేకుండా పోయింది. సంగీత దర్శకుడిగా, నటుడిగా ‘పలాస 1978’ నా కెరీర్లో బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాతో ఐదుగురు కొత్త గాయకుల్ని పరిచయం చేస్తున్నాం. జానపద కళ ఉన్న సినిమా కావడంతో ఫ్రెష్‌నెస్ కోసం కొత్తవారిని తీసుకున్నాం. ఉత్తరాంధ్ర జానపద సాహిత్యంతో కూడిన పాటలకు మంచి స్పందన వచ్చింది. నాకు మొదటి నుండి ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం. ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నాకు ఫోక్ సాంగ్స్ పాడటం అలవాటు.. అలా గాయకుణ్ణి అయ్యాను. నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసిన సినిమాల్లో ఫోక్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ‘పలాస’ ప్రివ్యూ చూసిన తర్వాత కొందరు దర్శక–నిర్మాతలు ఫోన్ చేసి, మంచి పాత్రలున్నాయి చేయమని అడిగారు. ఆ వివరాలు త్వరలోనే చెబుతా’’ అన్నారు. -
‘ఇంద్రుడు చంద్రుడు’లో కమల్ మాదిరి..
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచె మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘నేను గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పలాస నాకు చాలా స్పెషల్. ఈ సినిమాలో ఒక మైండ్ గేమ్ ఆడే ఒక నెగిటీవ్ రోల్ లో నటించాను. నా పాత్రలో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, మేకప్ లేకుండా ఈ సినిమాలో నేచురల్ గా నటించాను. ఈ పాత్ర కోసం జుట్టు పెంచాను. ఆ లుక్ విలన్‌గా బాగా సెట్ అయ్యింది. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో కమల్ హాసన్ గారి పాత్రకు దగ్గరగా ఈ సినిమాలో ఓ రోల్ చేశాను. నా పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక నటుడిగా , ఒక సంగీత దర్శకుడిగా నాకు ఈ సినిమా చాలా స్పెషల్. సినిమా చాలా సహజంగా ఉంటుంది, పాత్రలు కూడా ఎక్కడా బోరింగ్ లేకుండా ఉంటాయి, స్క్రీన్ ప్లే ఫ్రెష్ గా ఉంటుంది, దీంతో కొన్ని సందర్భాల్లో రీ రికార్డింగ్ అవసరం రాలేదు. మొదట సంగీత దర్శకుడిగా అవకాశమిచ్చారు. తరవాత ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుందని దర్శకుడు చెప్పాడు, పాత్ర నచ్చి ఈ సినిమాలో నటించాను. మ్యూజిక్ దర్శకుడి గా నటుడి గా పలాస 1978 నా కెరీర్లో బెస్ట్ గా నిలుస్తుంది. ఉత్తరాంధ్ర జానపద సాహిత్యంతో కూడిన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా రిలీజ్ తరువాత ఆడియన్స్ సాంగ్స్ కు బాగా కనెక్ట్ అవుతారు. నాకు మొదటినుండి ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం, ఒక చిన్న పల్లెటూరి ప్రాంతం నుండి వచ్చిన నాకు ఫోక్ సాంగ్స్ పాడడం అలవాటు, అలా సింగర్ అయ్యాను. నేను మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సినిమాల్లో ఫోక్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. నా మ్యూజిక్ టీమ్ పలాస సినిమాలో నా పాత్ర చూసి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు’అని రఘు కుంచె పేర్కొన్నారు. తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించారు. చదవండి: ‘అమృతరామమ్’ ఎప్పుడంటే? హాయ్.. నేను విజయ్ దేవరకొండ! -
ప్రేమికులను కట్టిపడేస్తున్న ‘ఊహకు ఊపిరి పోసి’
రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ జంటగా సురేందర్ కొంటడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమృత రామమ్’. దేర్ ఈజ్ నో లవ్ వితౌట్ పెయిన్’ అనేది ఉప శీర్షిక. టైటిల్‌తోనే ఈ సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఓ రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా ‘ప్రేమంటే ఇంతేనా’సాంగ్ లిరిక్స్ యూత్‌ను ముఖ్యంగా ప్రేమికులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ పాటతో పాటు ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. మూవీ ట్రైలర్లో రోజురోజుకి డ్రగ్‌లా ఎక్కేస్తున్నావురా అనే డైలాగ్లాగానే పాటలు, ట్రైలర్‌తో జనాలకు రోజురోజుకు కిక్ ఎక్కేస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాట ఆస్త్రాన్ని చిత్ర బృందం వదిలింది. ‘ప్రేమంటే ఇంతేనా యెదలోని వ్యధలేనా..’ అంటూ సాగే ఓ ప్రేయసి విరహ గీతం సంగీత శ్రోతలను కట్టిపడేయగా.. తాజాగా ‘ఊహకు ఊపిరి పోసి..’ అంటూ ఓ ప్రేమికుడు తన ప్రేయసిని గుర్తుచేసుకునే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామదుర్గం మధుసూదన్ అందించిన లిరిక్స్ హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. ఇషాక్ ఆలపించిన ఈ పాటను ఎన్.ఎస్. ప్రసు అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో యూత్‌కు ఈ సాంగ్ తెగ నచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఒక గాఢమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీజిత్ గంగాధర్, ఎమిలి మార్టిన్, సారా జోన్స్, శుక్రుతి నారాయణ్, చెరుకూరి జగదీశ్వర్‌రావ్, వంశీ దావులూరి ముఖ్య పాత్రలు పోషించారు. సుకుమార్ చేతుల మీదుగా.. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పలాస ‘1978’. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో సుధామీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. 1978లో జరిగిన యదార్థ కథ ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో చిత్ర బృందం విడుదల చేసింది. వినూత్నంగా ఆవిష్కరించిన ఈ బుక్ చూపరులను ఆకర్షించింది. తాజాగా ఈ సినిమాలోని ‘నీ పక్కన పడ్డది లేదు చూడు పిల్ల నాది నక్కిలిసు గొలుసు’అంటూ సాగే ఉత్తరాంధ్ర జానపద గీతాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు. -
వాల్తేరు రైలు నుంచి వెండితెరకు
కళను వెతుక్కుంటూ ప్రజలు రానప్పుడు ప్రజల్ని వెతుక్కుంటూ కళ వెళుతుంది. తన కళకు వేదిక దక్కని అసిరయ్య రైలు కంపార్ట్‌మెంట్‌నే వేదిక చేసుకున్నాడు. ప్రయాణికుల్నే ప్రేక్షకులుగా మార్చుకున్నాడు. ఇవాళ అతని ప్రయాణం సినిమా పరిశ్రమ వరకు చేరింది. ‘పట్టుసీర కట్టమన్నది మాయత్త కట్టేక వద్దన్నది మరదలు మందారమాల’... ‘నా కాళ్లకు పట్టీలు లేవండో కన్నోరింటికి రానండి’.... ‘బావొచ్చాడో లక్క బావొచ్చాడొ... ఎత్త బావున్నాడో బావ బాగున్నాడు’... ‘ఓరి, ఇటూరికి ఇగురు కూర... పైఊరూకి రొయ్యల కూర’... రైల్లో ఈ పాటలు వినిపించాయంటే మనం వాల్తేరు చుట్టుపక్కల ఉన్నట్టు. కంపార్ట్మెంట్లోకి జముకు కళాకారుడు బోనెల అసిరయ్య ఎక్కినట్టు. ఉత్తరాంధ్రలో జముకు వాయిద్యానికి ప్రత్యేక ఆదరణ ఉంది. అక్కడి గ్రామాల్లో రాములవారి సంబరాలు, ఎల్లమ్మ పేరంటాలు జరిగిన సమయాల్లో జముకులకుండ కళను ప్రదర్శించే కళాకారులు ఉన్నారు. వారిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నవాడు సంతకవిటి మండలంలో వాల్తేరు గ్రామానికి చెందిన అసిరయ్య. ఆ కళను నమ్ముకునే అతను తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. దాని ఆధారంగానే ముగ్గురు ఆడపిల్లలకు వివాహం జరిపించాడు. కుమారుడిని ఎంఏ, బీఈడీ చదివించాడు. అయితే కాలం మారిపోయింది. జముకుల కథ పాటకు గ్రామాల్లో డిమాండ్ తగ్గింది. కల చెదిరింది. దీంతో చేసేదిలేక అసిరయ్య ప్రతిరోజూ ఇంటి వద్ద నుంచి బయలుదేరి దగ్గర్లోని పొందూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని ట్రైన్లో తాను నమ్ముకున్న జముకుల కథను వినిపించడం మొదలుపెట్టాడు. విశాఖపట్నం–అనకాపల్లి మార్గంలో రైలులో పాడుతూ ప్రయాణికులు ఇచ్చే డబ్బులతో జీవిస్తున్నాడు. రోజుకి రూ.300 – రూ. 400 సంపాదించి ఇంటికి చేరుకుంటాడు. అయితే అందరి చేతుల్లో సెల్ఫోన్లు ఉండటం వల్ల చాలామంది ఇతని పాటలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అవి వైరల్ అయ్యాయి. అవి మెల్లగా అతణ్ణి సినిమా పరిశ్రమకు తీసుకెళ్లాయి. రఘు కుంచె చొరవతో రైలు ప్రయాణంతో జీవనం సాగిస్తున్న అసిరయ్య పాట ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె చెవిలో పడింది. ఆయన ఈ కళాకారుడిని గుర్తించడంతోపాటు హైదరాబాద్‌కు రప్పించుకుని ‘పలాస 1978’ సినిమా టైటిల్ సాంగ్‌కు జముకును ఉపయోగించుకున్నారు. అసిరయ్య ఒక పాట కూడా పాడారు. రఘు కుంచె స్వయంగా ఈ విషయాన్ని చెప్పడంతో ప్రస్తుతం అసిరయ్య గురించి సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. అసిరయ్య అందరి దృష్టిలో పడ్డారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయారు. – కథనం: కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ఫొటోలు: వి.వి.దుర్గారావు, సాక్షి, రాజాం. నా పాటే అన్నం పెడుతుంది గతంలో నా వద్ద రెండు మూడు కుటుంబాలు బతికేవి. ఇప్పుడు నా జీవనమే కష్టంగా మారింది. కళను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను. ట్రైన్లలో కళను ప్రదర్శించి జీవనోపాధి పొందుతున్నాను. ఇప్పటికీ నా జీవనాన్ని నా కళే నడుపుతుంది. జానపద పాటలే కాకుండా, భారతం, సుభద్ర కళ్యాణం, శశిరేఖ పరిణయం, సారంగధర కథలు వంటివి చెప్పగలను. – బోనెల అసిరయ్య -
ప్రేక్షకులను అలా మోసం చేయాలి
‘‘చాలా రోజులు కష్టపడి ఓ సినిమాను తెరకెక్కిస్తాం. ముందుగా చెప్పిన విడుదల తేదీకే సినిమాను విడుదల చేయాలని కొందరు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో రాజీ పడుతుంటారు. అది తప్పు అని నా అభిప్రాయం. సమయం ఉన్నప్పుడు రీ–రికార్డింగ్‌కు మరింత సృజనాత్మకతను జోడించి ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు నిర్మించారు. సత్యదేవ్, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ... ► ఓ హత్య నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈషా రెబ్బా పాత్ర చుట్టూ మిగిలిన పాత్రలు తిరుగుతుంటాయి. ఇందులో మూడు పాటలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రమోషనల్ సాంగ్. ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి పని చేశాను. ‘ఢమరుకం’ మినహా ఆయన ఎక్కువగా హాస్యభరిత చిత్రాలు తీశారు. ‘రాగల 24 గంటల్లో’ చిత్రం థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. ► కెమెరా, నేపథ్య సంగీతం ఈ సినిమాకు రెండు కళ్లు లాంటివి. థ్రిల్లర్ చిత్రాల్లో స్క్రీన్ ప్లే కూడా చాలా ముఖ్యం. స్క్రీన్‌ప్లే ఉత్కంఠగా సాగేందుకు మంచివారిని చెడ్డవారిగా, చెడ్డవారిని మంచి వారిగా చూపిస్తూ ప్రేక్షకులను మోసం చేయాలి. కొన్నిసార్లు సౌండ్‌తోనే ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా చేయాలి. ఈ సినిమా కోసం దాదాపు 30 రోజులు ఆర్ఆర్(రీరికార్డింగ్) వర్క్ చేశాం. ► ఇప్పటి వరకు 18 సినిమాలకు సంగీతం అందించాను. దర్శకుడికి నచ్చలేదని ఇప్పటి వరకు రెండో ట్యూన్ చేసింది లేదు. మొదటి ట్యూనే కరెక్టుగా వచ్చేందుకు కష్టపడతా. నా కెరీర్ పట్ల సంతృప్తికరంగానే ఉన్నాను. అనుకున్నంత వేగం లేదు. కానీ, ఏడాదికి రెండుమూడు సినిమాలు చేస్తూ రేస్‌లోనే ఉన్నాను. కొన్ని సార్లు సంగీతం బాగున్నప్పటికీ సినిమా ఆడకపోతే ఆ ప్రభావం సంగీత దర్శకుడిపై పడే అవకాశం ఉంది. ► ఒక సినిమాకు ఒకరు ఆర్ఆర్ మరొకరు మ్యూజిక్ ఇవ్వడం సరికాదన్నది నా భావన. ఆర్ఆర్, మ్యూజిక్కు కలిపి ప్యాకేజ్డ్గా నేను ఓ సినిమాను ఒప్పుకున్నాను. కానీ ఒకరు జోక్యం చేసుకుని ఆర్ఆర్ ఇచ్చి, మూవీ బిజినెస్ విషయంలోనూ సహాయం చేస్తాననడంతో యూనిట్ వారు ఆయనకు అవకాశం ఇచ్చారు. అలా రెండు సినిమాలు దూరమయినప్పుడు చాలా బాధపడ్డాను. ► ప్రస్తుతం ‘పలాస’ సినిమాలో నటిస్తూ, సంగీతం అందిస్తున్నాను. ఈ సినిమా విడుదల తర్వాత నటుడిగా నాకు మంచి అవకాశాలు వస్తే తప్పక చేస్తాను. -
టీజర్ చూసి థ్రిల్ అయ్యాను
‘‘టీజర్ చాలా బావుంది. థ్రిల్ అయ్యాను. ఖచ్చితంగా ఆడియన్స్ కూడా థ్రిల్ ఫీలవుతారు. టైటిల్ కూడా చాలా బావుంది. రఘు కుంచె మ్యూజిక్, కెమెరామేన్ అంజి వర్క్ బావుంది. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి, నిర్మాత శ్రీనివాస్ కానూరుకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ చివరి వారంలో దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం టీజర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్రబృందం. ‘‘మా చిత్రం టీజర్‌ను విడుదల చేసిన గ్రేట్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్’’ అన్నారు దర్శక, నిర్మాతలు. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత శ్రీనివాస్ కానూరుతో పాటు సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామేన్ ‘గరుడవేగ’ ఫేమ్ అంజి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబా అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఓ సొగసరి...
రక్షిత్, నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధ మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘ఓ సొగసరి...’ అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ని ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ఈ సందర్భంగా ధ్యాన్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ కూడా తోడైతే ఆ కథలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో మా సినిమా వస్తోంది. 1978లో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయి బేబీ కలిసి ‘ఓ సొగసరి...’ పాటను పాడారు. బాలుగారు 30ఏళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని వినిపిస్తే, బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్‌నెస్‌ను తీసుకువచ్చింది. లక్ష్మీ భూపాల్‌గారు ఈ పాటను చక్కగా రాశారు. కరుణ కుమార్‌కు ఇది తొలి చిత్రమైనా, రచయితగా సాహిత్యలోకంలో ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి’’ అన్నారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ, కెమెరా: అరుల్ విన్సెంట్. -
గాయనిగా 'నాయకి'
హైదరాబాద్: హీరోయిన్ త్రిష తన గొంతు సవరించుకోనుంది. తాజాగా ఆమె నటిస్తున్న 'నాయకి' చిత్రంలో ఓ పాట పాడనుంది. ఈ మేరకు ఆ చిత్ర దర్శకుడు గోవి ఆదివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. చిత్రం ప్రారంభమైన వెంటనే టైటిల్స్ పడుతున్నప్పుడు ఆమె పాడిన ఈ గీతం వినపడుతుందని తెలిపారు. ఈ పాటకు త్రిషా గొంతు ఖచ్చితంగా సరిపోతుందని నాయకి సంగీత దర్శకుడు రఘు కుంచె అభిప్రాయపడ్డారని చెప్పారు. దాంతో వెంటనే త్రిషను కలసి వివరించామని చెప్పారు. దాంతో ఆమె వెంటనే అంగీకరించారన్నారు. 1980 నాటి కథాంశంతో హరర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో నాయకి తెరకెక్కిస్తున్నామని తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఆక్టోబర్ నాటికి పూర్త అవుతుందని గోవి చెప్పారు. గోవి దర్శకత్వంలో లవ్ యు బంగారం చిత్రం ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. -
కెమిస్ట్రీ సూపర్బ్...
పోలీస్ చొక్కా అంటేనే అసహ్యించుకునే ఓ రౌడీ, పోలీస్‌గా మారితే ఎలా ఉంటుందనే కథాంశంతో, తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తమిళంలో ఆర్.టి. నేసన్ దర్శక త్వంలో తెరకెక్కిన చిత్రం ‘జిల్లా’. విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్.బి. చౌదరి సమర్పణలో శ్రీఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్ సన్నితి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. నామన శంకర్రావు సహ నిర్మాత. డి. ఇమాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను రాజ్యసభ సభ్యులు -నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘‘విజయ్, కాజల్‌ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తండ్రీకొడుకులుగా మోహన్‌లాల్, విజయ్‌ల నటన ఈ చిత్రానికే హైలైట్’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘చాలా వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ దర్శకుడు ఆర్.టి. నేసన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.బి. చౌదరి తనయుడు రమేశ్చౌదరి, నిర్మాత ఎన్వీ ప్రసాద్, దర్శకుడు సముద్ర, సంగీత దర్శకులు రఘు కుంచె, దర్శక -నిర్మాత ‘మధుర’ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ నెట్వర్క్ అండి బాబూ..