రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ జంటగా సురేందర్ కొంటడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమృత రామమ్’. దేర్ ఈజ్ నో లవ్ వితౌట్ పెయిన్’ అనేది ఉప శీర్షిక. టైటిల్‌తోనే ఈ సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ‘ప్రేమంటే ఇంతేనా’సాంగ్ లిరిక్స్ యూత్‌ను ముఖ్యంగా ప్రేమికులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ పాటతో పాటు ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. మూవీ ట్రైలర్‌లో రోజురోజుకి డ్రగ్‌లా ఎక్కేస్తున్నావురా అనే డైలాగ్‌లాగానే పాటలు, ట్రైలర్‌తో జనాలకు రోజురోజుకు కిక్ ఎక్కేస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాట ఆస్త్రాన్ని చిత్ర బృందం వదిలింది.
‘ప్రేమంటే ఇంతేనా యెదలోని వ్యధలేనా..’ అంటూ సాగే ఓ ప్రేయసి విరహ గీతం సంగీత శ్రోతలను కట్టిపడేయగా.. తాజాగా ‘ఊహకు ఊపిరి పోసి..’ అంటూ ఓ ప్రేమికుడు తన ప్రేయసిని గుర్తుచేసుకునే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రామదుర్గం మధుసూదన్ అందించిన లిరిక్స్ హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. ఇషాక్ ఆలపించిన ఈ పాటను ఎన్.ఎస్. ప్రసు అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో యూత్‌కు ఈ సాంగ్ తెగ నచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఒక గాఢమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీజిత్ గంగాధర్, ఎమిలి మార్టిన్, సారా జోన్స్, శుక్రుతి నారాయణ్, చెరుకూరి జగదీశ్వర్‌రావ్, వంశీ దావులూరి ముఖ్య పాత్రలు పోషించారు.
సుకుమార్ చేతుల మీదుగా..
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పలాస ‘1978’. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో సుధామీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. 1978లో జరిగిన యదార్థ కథ ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో చిత్ర బృందం విడుదల చేసింది. వినూత్నంగా ఆవిష్కరించిన ఈ బుక్ చూపరులను ఆకర్షించింది. తాజాగా ఈ సినిమాలోని ‘నీ పక్కన పడ్డది లేదు చూడు పిల్ల నాది నక్కిలిసు గొలుసు’అంటూ సాగే ఉత్తరాంధ్ర జానపద గీతాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment