I'm A Celebrity Song From Raghu Kunche Released - Sakshi
Sakshi News home page

I Am A Celebrity : 'ఐ యామ్  ఏ సెలబ్రిటీ' అంటున్న రఘుకుంచె

Published Mon, May 16 2022 6:55 PM | Last Updated on Mon, May 16 2022 8:30 PM

I Am A Celebrity Song From Raghu Kunche Released - Sakshi

Raghukunche Celebrity Song: గాయకుడిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా , నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఒక వైపు సంగీత దర్శకుడిగా మరో వైపు నటుడిగా తన అనుభవాలను "ఐ యామ్  ఏ సెలబ్రిటీ" ( I'm A Celebrity) పేరుతో, తనే  లిరిక్స్  అందించి , మ్యూజిక్ కంపోజ్ చేసి , తనే పాడిన ,ఒక వినోదాత్మకమైన పాటను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్‌లో హల్చల్ చేస్తుంది.

ఐ యామ్ ఏ సెలబ్రిటీపాట విడుదల అయిన సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ..  "ప్రతి మనిషికి సమాజంలో మంచి  గుర్తింపు కావాలి అని ఉంటుంది కానీ ,ఆ గుర్తింపు కొందరికే వస్తుంది. కృషి పట్టుదలతో కొందరు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, అందరిని మెప్పిస్తారు , అందుకే  సమాజంలో వాళ్ళని ప్రత్యేకంగా గౌరవిస్తారు, ఒక సెలబ్రిటీ హోదా ఇస్తారు. సినిమా రంగం అయిన, పొలిటికల్ రంగం విద్యారంగం అయినా , ప్రజలని  మెప్పించగలిగితే  చాలు వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఇచ్చేస్తారు.

కానీ ఈ సెలబ్రిటీ హోదాని  బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. విశృంఖలంగా పెరిగిపోయిన సోషల్ మీడియా ప్రభావం వల్ల, ఒక సెలబ్రిటీ స్థాయిలో ఏమి చేసినా  క్షణాల్లో అది వైరల్‌గా మారుతుంది . నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ జీవితం కత్తి మీద సాములాగా అయిపోయింది. వాళ్ళు ఏమి  చేసినా సోషల్ మీడియా లో అదొక పెద్ద వార్త అవుతుంది , మీమ్ అవుతుంది ,యూట్యూబ్ లో థంబ్ నైల్ అవుతుంది.

 వీటన్నిటి ఆధారంగానే  దీన్ని  ఒక వినోదభరితమైన పాటగా మలిచాను.  ఐ యామ్ ఏ సెలబ్రిటీ పాట మీకు మంచి వినోదాన్ని అందిస్తుందని  ఆశిస్తున్నాను. మరియు , ఈ పాట కేవలం  వినోదం కోసం చేసిన పాట మాత్రమే తప్పా ఎవరినో  కించపరచడానికో, లేక తక్కువ చేయడానికో  చేసింది కాదు . ఎవరి మనసులనైనా కష్టపెడితే , క్షమించమని ముందుగానే కోరుకుంటున్నాను'  అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement