కెమిస్ట్రీ సూపర్బ్...
పోలీస్ చొక్కా అంటేనే అసహ్యించుకునే ఓ రౌడీ, పోలీస్‌గా మారితే ఎలా ఉంటుందనే కథాంశంతో, తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తమిళంలో ఆర్.టి. నేసన్ దర్శక త్వంలో తెరకెక్కిన చిత్రం ‘జిల్లా’. విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్.బి. చౌదరి సమర్పణలో శ్రీఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్ సన్నితి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
నామన శంకర్రావు సహ నిర్మాత. డి. ఇమాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను రాజ్యసభ సభ్యులు -నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘‘విజయ్, కాజల్‌ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తండ్రీకొడుకులుగా మోహన్‌లాల్, విజయ్‌ల నటన ఈ చిత్రానికే హైలైట్’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘చాలా వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ దర్శకుడు ఆర్.టి. నేసన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.బి. చౌదరి తనయుడు రమేశ్‌చౌదరి, నిర్మాత ఎన్వీ ప్రసాద్, దర్శకుడు సముద్ర, సంగీత దర్శకులు రఘు కుంచె, దర్శక -నిర్మాత ‘మధుర’ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.