
చెన్నై: తమిళ హీరో విజయ్, కీర్తి సురేశ్ జంటగా ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘సర్కార్’ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. తమిళనాడు దిగవంత సీఎం జయలలిత, ఆమె ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న కొన్ని సీన్లను తొలగించాలని తమిళనాడు మంత్రులతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ సీన్లను తొలగించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సినిమాలోని అభ్యంతకరమైన సీన్లను తొలగించేందుకు నిర్మాతలు అంగీకరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి సదరు సీన్లను తొలగించిన సినిమాను ప్రదర్శిస్తామని వెల్లడించారు.