
విజయ్
పాట కోసం ఫ్లైట్ ఎక్కి ఫారిన్ వెళ్లారు హీరో విజయ్. అక్కడి బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ప్రేయసితో డ్యూయెట్ పాడుకుంటారట. ఈ సాంగ్ ‘సర్కార్’ చిత్రం కోసమే. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. రీసెంట్‌గా చెన్నై షెడ్యూల్‌లో కోర్ట్ సీన్స్‌ను తెరకెక్కించిన ‘సర్కార్’ టీమ్ ఇప్పుడు సాంగ్ షూట్ కోసం లాస్ వేగాస్ వెళ్లారని కోలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా పాల్గొంటారు. ఈ నెల 11వరకు ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ‘కత్తి, తుపాకి’ చిత్రాల తర్వాత విజయ్–మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment