Murugadass
-
కోవిడ్ బాధితుల కోసం సౌందర్య రజనీకాంత్ రూ. కోటి విరాళం
కరోనా బాధితులకు చేయూతనిచ్చేందుకు కోలీవుడ్ నడుంబిగించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజరోజుకు లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో సమయానికి బాధితులకు వైద్య సదుపాయం, ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. ఇక బాధితులను రక్షించేందుకు ప్రభుత్వాలు, వైద్య సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి అండగా పలువురు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తమవంతు సాయంగా కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివ కుమార్‌లు కలిసి సీఎం స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్ విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ సైతం విరాళం ఇచ్చింది. ఆమె భర్త విశాగన్ వనంగముడి, మామ ఎస్ఎస్ వనంగముడితో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్‌ను అందించింది. తమ ఫార్మా కంపెనీ అపెక్స్ లాబోరేటరీ నుంచి ఈ విరాళం అందించినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆమె భర్త విశాగన్ రాష్ట్రానికి కొత్త సీఎంగా ఎన్నికైన ఎంకే స్టాలిన్‌కు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక హీరో అజిత్ సైతం రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్, హీరో ఉదయనిధి స్టాలిన్లు చేరో 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. -
చలో ఉజ్బెకిస్తాన్
సామాన్లు సర్దుకుని ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు హీరోయిన్ త్రిష. ఏదైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారనుకుంటే మాత్రం పొరపాటే. ‘రాంగి’ సినిమా కోసం త్రిష ఫ్లైట్ ఎక్కనున్నారు. శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘రాంగి’. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు డైలాగ్స్ రాయడం విశేషం. ఇటీవల చెన్నైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఉజ్బెకిస్తాన్‌లో ప్లాన్ చేశారు టీమ్. అక్కడ త్రిషపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో త్రిష పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇక త్రిష నటించిన ‘పరమపదమ్ విలయాట్టు’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే హీరోయిన్ సిమ్రాన్‌తో కలిసి త్రిష ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమంత్ దర్శకుడు. -
మార్వెల్‌కు మాట సాయం
మార్వెల్, డీసీ సంస్థల నుంచి వచ్చే సూపర్ హీరోల చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. మనదేశం కూడా మినహాయింపు కాదు. ఇటీవల అది డబులైంది. ఆ క్రేజ్‌ని డబ్బులు చేసుకోవడానికి మన హీరోలతో డబ్బింగ్ చెప్పించడం చేస్తున్నాయి ఆయా సంస్థలు. లేటెస్ట్గా ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ తమిళ అనువాద చిత్రానికి దర్శకుడు మురుగదాస్‌తో డైలాగ్స్ రాయించారట. ‘‘మార్వెల్ సంస్థ నుంచి వచ్చే సినిమాల స్కేల్, స్టోరీ చెప్పే విధానం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది. సూపర్ హీరోల సినిమాకు మా అబ్బాయి ఆదిత్య చాలా పెద్ద ఫ్యాన్స్. దాంతో నాకు ఇంకా ఎగై్జటింగ్‌గా ఉంది. డైలాగ్స్ కథకు తగ్గట్టుగా ఉండటంతో పాటు తమిళ ఫ్లేవర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను’’ అని దర్శకుడు మురుగదాస్ పేర్కొన్నారు. -
కుర్చీ ఎక్కడం లేదు
‘త్వరలోనే రజనీకాంత్ ‘కుర్చీ’ ఎక్కబోతున్నారట’ అనే వార్త చెన్నైలో హల్చల్ చేస్తోంది. ఇది రాజకీయపరమైన చర్చ? నెక్ట్స్ సీయం రజనీ అని ఊహించేసుకుంటే పొరబాటే. ఈ చర్చ సినిమాకు సంబంధించినది. మురుగదాస్‌తో రజనీకాంత్ చేయబోయే సినిమాకు ‘నార్కాలి’(కుర్చీ) అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. రాజకీయపరంగా మాత్రం మంచి బరువైన టైటిల్ ఇది. ఊహించుకున్న వాళ్లకు ఊహించుకున్నంత అర్థమున్న టైటిల్. అందుకే హీటైన డిస్కషన్స్‌కు దారి తీశాయి. ఈ వాడివేడి చర్చల మీద మురుగదాస్ నీళ్లు చల్లారు.‘‘మా సినిమాకు ‘నార్కాలి’ అనే టైటిల్ ఫిక్స్ చేయలేదు. అనవసరంగా పుకార్లు పుట్టించకండి’’ అని క్లారిఫై చేశారు. రజనీను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో మా సినిమా అలా ఉంటుంది. పొలిటికల్ థ్రిల్లర్ కాదు అని ఓ సందర్భంలో చెప్పారాయన. సన్ నెట్వర్క్ ఈ సినిమాను నిర్మించనుందట. ఇందులో హీరోయిన్గా కీర్తీ సురేశ్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ మురుగదాస్ ‘సర్కార్’లో కీర్తీ సురేశ్ నటించారు. -
హీరో కాల్ కోసం వెయిటింగ్
అజిత్ హీరోగా 2001లో వచ్చిన ‘దీనా’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు మురుగదాస్. ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత అజిత్‌ని ‘తల’ (నాయకుడు) అనే బిరుదుతో ఆయన అభిమానులు పిలుచుకుంటున్నారు. ‘దీనా’ తర్వాత అజిత్– మురుగదాస్ కలిసి పని చేయలేదు. వీరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వస్తుందా? అని ఇద్దరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘అజిత్‌తో ఎప్పుడు సినిమా చేస్తున్నారు?’ అనే ప్రశ్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్‌కి ఎదురైంది. ‘‘ఏడెనిమిదేళ్లుగా ‘మా హీరోతో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు’ అంటూ అజిత్‌సార్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. అజిత్సార్కి సరిపోయే ఓ మాస్ కథని రెడీ చేశా. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లి కథ వినిపిస్తాను. ‘దీనా’ చిత్రానికి సీక్వెల్ చేయడానికి కొన్ని పరిమితులున్నాయి. అయితే, విజయ్ సార్‌తో తీసిన ‘తుపాకి’కి సీక్వెల్ చేయొచ్చు. ఆయనతో ‘తుపాకి 2’ చేయాలనే ఆలోచన మాత్రం ఉంది’’ అన్నారు. -
దీపావళికి సర్కార్
‘తుపాకీ, కత్తి’ సినిమాల తర్వాత విజయ్ – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలు. కళానిధి మారన్ నిర్మించారు. నిర్మాత అశోక్ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘నవాబ్’ లాంటి సూపర్‌హిట్ తర్వాత ‘సర్కార్’ లాంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళంలో విడుదలైన ఫస్ట్ లుక్‌కి, పాటలకు స్పందన అద్భుతంగా ఉంది. అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రీ రిలీజ్ నిర్వహించి, నవంబర్ 6న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. -
పాట కోసం ఫ్లైట్ ఎక్కాడు!
పాట కోసం ఫ్లైట్ ఎక్కి ఫారిన్ వెళ్లారు హీరో విజయ్. అక్కడి బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ప్రేయసితో డ్యూయెట్ పాడుకుంటారట. ఈ సాంగ్ ‘సర్కార్’ చిత్రం కోసమే. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. రీసెంట్గా చెన్నై షెడ్యూల్లో కోర్ట్ సీన్స్‌ను తెరకెక్కించిన ‘సర్కార్’ టీమ్ ఇప్పుడు సాంగ్ షూట్ కోసం లాస్ వేగాస్ వెళ్లారని కోలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా పాల్గొంటారు. ఈ నెల 11వరకు ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ‘కత్తి, తుపాకి’ చిత్రాల తర్వాత విజయ్–మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. -
కాలేజీలో కోర్ట్
ఆదివారం విశ్రాంతి తీసుకోకుండా కాలేజీకి వెళ్లారు తమిళ హీరో విజయ్. కాలేజీకి వెళ్లిన తర్వాత బోన్లో నిలబడ్డారట. కాలేజీకి వెళ్తే బెంచ్‌లు ఉండాలి కానీ కోర్టులో ఉండే బోన్లు అక్కడ ఎందుకు ఉన్నాయి? అని కన్ఫ్యూజ్ కావొద్దు. ‘కత్తి, తుపాకీ’ చిత్రాల తర్వాత హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘సర్కార్’. ఇందులో కథానాయికగా కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం చెన్నైలోని ఓ కాలేజీలో కోర్ట్ సెట్ వేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్ఆర్ఐ పాత్రలో విజయ్ కనిపిస్తారట. ‘సర్కార్’ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నారని, ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలవుతుందని కోలీవుడ్ టాక్. విజయ్–అట్లీ కాంబినేషన్లో ‘తేరీ, మెర్సెల్’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. -
మరో హ్యాట్రిక్‌పై గురి!
నటుడు విజయ్ మరో హ్యాట్రిక్‌పై కన్నేశారని కోలీవుడ్ సమాచారం. ‘తేరీ, మెర్సెల్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దర్శకుడు అట్లీ–హీరో విజయ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ‘సర్కార్’ షూటింగ్‌ను కంప్లీట్ చేసిన తర్వాత విజయ్ ఈ సినిమా షూట్లో జాయిన్ అవుతారని టాక్. ఇక ‘సర్కార్’ విషయానికొస్తే..‘కత్తి, తుపాకి’ వంటి సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత దర్శకుడు మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘సర్కార్’. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఇటు మురుగదాస్, అటు అట్లీ.. ఇలా వరుసగా హ్యాట్రిక్ చిత్రాలపై విజయ్ గురిపెట్టడం కోలీవుడ్‌లో ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారారు. -
తారలను అనుసరించే ప్రమాదం..
తమిళసినిమా: నటుడు విజయ్‌కు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. విజయ్ నటించిన సర్కార్ చిత్ర పోస్టర్ ఆయన్ను సమస్యల్లో పడేస్తోంది. సర్కార్ ఫస్ట్‌లుక్ పోస్టర్లో విజయ్ సిగరెట్ కాలుస్తున్నట్లు ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పీఎంకే నేతలు రాందాస్, అన్భుమణి రాందాస్ తదితరులు విమర్శల దాడి చేశారు. తాజాగా స్థానిక కోడంబాక్కంకు చెందిన ఎస్.శిరిల్ సర్కార్ పోస్టర్ వ్యవహారంపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను తమిళనాడు పొగనిరోధక సంఘంలో సభ్యుడినని తెలిపారు. దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు పొగతాగడానికి బానిసలవుతున్నారన్నారు. వారిలో ఏడాదికి లక్ష మంది వరకూ మృత్యవాత పడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పొగాకు సంబంధించిన సిగరెట్లు వంటి ప్రకటనలను ప్రభుత్వం నిషేధిస్తూ 2011లో ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అదే విధంగా సినిమా, సీరియళ్లలో సిగరెట్లు తాగే సన్ని వేశాలు పొందుపరచరాదని నిబంధనలను విధించిందని గుర్తుచేశారు. ఇటీవల నటుడు విజయ్ నటిస్తున్న సర్కార్ చిత్ర పోస్టర్లలో ఆయన సిగరెట్ తాగుతున్న దృశ్యం చోటుచేసుకుందన్నారు. ఆ పోస్టర్లను తమిళనాడులో అన్ని థియేటర్ల వద్ద ఏర్పాటు చేశారన్నారు. ఇవి పొగ నిషేధ ప్రకటనలకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు 1987లో ప్రవేశ పెట్టిన నిబంధనల ప్రకారం ఈ పోస్టర్లు ధ్రువపత్రాన్ని పొందలేదన్నారు. తారలను అనుసరించే ప్రమాదం.. సినీ తారలను అభిమానులు అమితంగా ఆరాధిస్తారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకునే అభిమానులు విజయ్ లాంటి స్టార్ నటుడు సిగరెట్లు తాగుతున్నట్లు చూపిస్తే వారు దాన్ని అనుసరిస్తారన్నారు. సర్కార్ చిత్ర పోస్టర్ల వ్యవహారంలో ఆ చిత్ర కథానాయకుడు విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్, చిత్ర నిర్మాతలపై తగినచర్యలు తీసుకునేలా రాష్ట్ర ఆరోగ్యశాఖకు, పర్యవేక్షణ సమితికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేన్సర్ బాధితుల సంరక్షణ కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి నటుడు జోసఫ్ విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్, చిత్ర నిర్మాతల నుంచి తలా రూ.10 కోట్లు నష్ట పరిహారాన్ని వసూలు చేయాలన్నారు.ఆ నిధిని స్థానిక రాయపేటలోని ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి వినియోగించాలన్నారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన న్యాయమూర్తులు ఇందిరా బెనర్జి, పీటీ ఆషా పిటిషన్‌పై 2 వారాల్లోగా బదులివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, నటుడు విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగుదాస్, నిర్మాణ సంస్ధలకు నోటీసులు జారీ చేశారు. -
సూపర్ మచ్చీ
మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత, కాజల్, అనుష్క.. వీళ్లలో ఒకరు హీరోయిన్ అని, అనిరు«ద్ సంగీతం అందిస్తాడని ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలన్నింటికీ తెర దించుతూ చిత్రనిర్మాణ సంస్థ సన్ నెట్వర్క్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్ల వివరాలను ప్రకటించింది. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించనున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకుడు. ‘కలి, అంగమలై డైరీస్’ వంటి మలయాళ సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన గిరీశ్ గంగాధరన్ ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు. హై బడ్జెట్ స్టైలిష్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో విజయ్ లుక్కు సంబంధించిన టెస్ట్‌షూట్ ఇటీవల జరిగింది. షూట్లో భాగంగా రోల్స్ రాయిస్ కార్‌ను ఆనుకొని స్టైల్‌గా సిగార్ తాగుతున్న విజయ్ ఫొటోలు, ఓ చిన్న వీడియో లీక్ అయ్యాయి. లుక్ సూపర్ మచ్చీ (సూపర్ మామ) అని విజయ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. -
అక్కడ క్యాన్సిల్.. ఇక్కడ కన్ఫార్మ్
మురుగదాస్–విజయ్ హిట్ కాంబినేషన్ గురించి మనకు తెలిసిందే. ‘తుపాకి’, ‘కత్తి’ వంటి బ్లాక్బాస్టర్ చిత్రాలు అందించిన ఈ కాంబినేషన్ ఈసారి ఇంకా పెద్ద బ్లాక్బాస్టర్ పై కన్నేశారు. అంత పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టాలంటే భారీ వ్యయం, విపరీతమైన హంగులు కావాలి. ఇవన్నీ కావాలంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి. వీళ్ల సినిమాని ‘సన్ నేట్వర్క్’ చైర్మన్ కళానిథి మారన్ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని సన్ గ్రూప్ సంస్థ స్వయంగా వెల్లడించింది. జనవరిలో షూటింగ్ ప్రారంభించి, దీపావళికి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి అలా ఉంచితే.. అక్షయ్‌కుమార్ హీరోగా మురుగదాస్ ఓ హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తారనే వార్త వచ్చింది. ఆ చిత్రం క్యాన్సిల్ అయింది. అంతకు ముందే కన్ఫార్మ్ అయిన విజయ్ సినిమాను పట్టాలెక్కించే పని మీద ఉన్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. -
‘నిజమైన రివ్యూలు ప్రేక్షకులకు తెలుసు’
‘‘మహేశ్‌లాంటి సూపర్‌స్టార్‌తో రెగ్యులర్ ఫార్మాట్ సినిమా తీయాలనుకోలేదు. కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీశాం. డిఫరెంట్ సినిమాలు వచ్చినప్పుడే ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. నిజమైన రివ్యూలు ప్రేక్షకులకు తెలుసు’’ అన్నారు మురుగదాస్. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్వకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘స్పైడర్’ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. ‘‘మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 51 కోట్లు వసూలు చేసింది’’ అని ‘ఠాగూర్’ మధు చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్న మురుగదాస్ చెప్పిన విశేషాలు.. ► రెండు, మూడు సినిమాలు హిట్ అయితే చాలు.. ‘ఈ డైలాగ్ మార్చండి, ఆ ఆర్టిస్టు వద్దు’ అని కొందరు హీరోలు ఆంక్షలు పెడతారు. కానీ, మహేశ్‌లాంటి సూపర్‌స్టార్ అలాంటి కండీషన్స్ పెట్టలేదు. ► కథకు అనుగుణంగానే మహేశ్ క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే హీరో క్యారెక్టర్ బలం తెలుస్తుంది. ఏ హీరో కూడా ఇంకో యాక్టర్‌కి (ఎస్.జె సూర్య)కి అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి ఒప్పుకోరు. అయితే స్క్రిప్ట్‌ని దృష్టిలో పెట్టుకుని మహేశ్ ఇచ్చారు. అందుకే మహేశ్ రియల్ హీరో. బాలీవుడ్ నుంచి కొందరు సినీ విశ్లేషకులు సినిమా బాగుందంటూ ఫోన్ చేశారు. ► హీరో పదిమంది విలన్స్‌ను కొడితే వాళ్లు గాల్లోకి లేచిపడటం, స్కిన్‌షో, రెగ్యులర్ సాంగ్స్‌తో సినిమాను తీయాలనుకోలేదు. అలాంటి సబ్జెక్ట్‌ను మహేశ్‌లాంటి సూపర్‌స్టార్‌తో డీల్ చేయాలనుకోలేదు. హీరోకు, విలన్‌కు స్ట్రాంగ్ వార్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ పాత్రకు పెద్దగా స్పేస్ ఉండకపోవచ్చు. రకుల్ పాత్ర నిడివి తక్కువే అయి నప్పటికీ తనది కీ–రోల్. అద్భుతంగా నటించింది. ► డిఫరెంట్‌గా ట్రై చేద్దామనుకున్నాం. డిఫరెంట్ మూవీస్‌ను ప్రోత్సహించకపోతే ‘దంగల్, పీకే, భజరంగీ భాయిజాన్’ వంటి భిన్నమైన కాన్సెప్ట్ మూవీస్ వచ్చి ఉండేవి కాదు. ► తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. బీ,సీ సెంటర్లవారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ‘శ్రీమంతుడు’కంటే ‘స్పైడర్’కు తమిళనాడులో మంచి స్పందన వస్తోందని రిపోర్ట్స్ వస్తున్నాయి . మంచి ప్రయత్నం: రజనీకాంత్ ‘స్పైడర్’ చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రబృందాన్ని అభినందించారు. ఇదొక మంచి ప్రయత్నం అని కొనియాడారు. ‘‘మంచి మెసేజ్‌తో సినిమా చాలా బాగుంది. మురుగదాస్ ఈ సబ్జెక్ట్‌ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. మహేశ్ అత్యద్భుతంగా నటించాడు. ఒక స్టార్ హీరో అయ్యుండి విలన్‌కు ఇంపార్టెన్స్ ఉన్న కథను ఒప్పుకోవడం మహేశ్ గొప్పతనం’’ అని రజనీకాంత్ అన్నారు. -
ఖుషీ కుమారి
కుమారి ఫుల్ ఖుషీగా ఉన్నారు. కుమారి అంటే ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ హెబ్బా పటేల్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో హాట్ హాట్‌గా నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళ పరిశ్రమ నుంచి కుమారీకి ఓ కబురొచ్చిందట. ఆమె ఆనందానికి కారణం అదే. ఎందుకంత ఆనందం అంటే.. ఏకంగా స్టార్ హీరో విజయ్ సినిమాలో అవకాశం వచ్చిందని ఖబర్. విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందట. అందులో ఒక ఛాన్స్‌ను హెబ్బా పటేల్ దక్కించుకున్నారన్న ఖబర్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.