కుర్చీ ఎక్కడం లేదు | Rajinikanth new film Narkali | Sakshi
Sakshi News home page

కుర్చీ ఎక్కడం లేదు

Published Thu, Jan 17 2019 12:31 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Rajinikanth new film Narkali - Sakshi

రజనీకాంత్‌

‘త్వరలోనే రజనీకాంత్‌ ‘కుర్చీ’ ఎక్కబోతున్నారట’ అనే వార్త చెన్నైలో హల్‌చల్‌ చేస్తోంది. ఇది రాజకీయపరమైన చర్చ? నెక్ట్స్‌ సీయం రజనీ అని ఊహించేసుకుంటే పొరబాటే. ఈ చర్చ సినిమాకు సంబంధించినది. మురుగదాస్‌తో రజనీకాంత్‌ చేయబోయే సినిమాకు ‘నార్కాలి’(కుర్చీ) అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారని టాక్‌. రాజకీయపరంగా మాత్రం మంచి బరువైన టైటిల్‌ ఇది. ఊహించుకున్న వాళ్లకు ఊహించుకున్నంత అర్థమున్న టైటిల్‌. అందుకే హీటైన డిస్కషన్స్‌కు దారి తీశాయి.

ఈ వాడివేడి చర్చల మీద మురుగదాస్‌ నీళ్లు చల్లారు.‘‘మా సినిమాకు ‘నార్కాలి’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు. అనవసరంగా పుకార్లు పుట్టించకండి’’ అని క్లారిఫై చేశారు. రజనీను ఫ్యాన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో మా సినిమా అలా ఉంటుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కాదు అని ఓ సందర్భంలో చెప్పారాయన. సన్‌ నెట్‌వర్క్‌ ఈ సినిమాను నిర్మించనుందట. ఇందులో హీరోయిన్‌గా కీర్తీ సురేశ్‌ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ మురుగదాస్‌ ‘సర్కార్‌’లో కీర్తీ సురేశ్‌ నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement