
త్రిష
సామాన్లు సర్దుకుని ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు హీరోయిన్ త్రిష. ఏదైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారనుకుంటే మాత్రం పొరపాటే. ‘రాంగి’ సినిమా కోసం త్రిష ఫ్లైట్ ఎక్కనున్నారు. శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘రాంగి’. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు డైలాగ్స్ రాయడం విశేషం.
ఇటీవల చెన్నైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఉజ్బెకిస్తాన్‌లో ప్లాన్ చేశారు టీమ్. అక్కడ త్రిషపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో త్రిష పవర్‌ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇక త్రిష నటించిన ‘పరమపదమ్ విలయాట్టు’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే హీరోయిన్ సిమ్రాన్‌తో కలిసి త్రిష ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమంత్ దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment