next move
-
మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షీ చౌదరి
హీరోయిన్ మీనాక్షీ చౌదరి మంచి ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్లో దూసు కెళుతున్నారీ బ్యూటీ. ఇప్పటికే మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో ఓ హీరోయిన్ గా, విశ్వక్సేన్ (‘వీఎస్10’) చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ బ్యూటీని తాజాగా మరో అవకాశం వరించిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మోహన్ చెరుకూరి (సీవీఎం), డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రారంభం కానుంది. 1960 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వరుణ్ సరసన నటించే చాన్ ్స మీనాక్షీ చౌదరికి దక్కిందన్నది ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. మరి.. వరుణ్, మీనాక్షీలు ఈ సినిమా కోసం జోడీ కడతారా? వేచి చూడాలి. -
అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా!
హీరో అల్లు అర్జున్ , దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. వీరి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన ఓ స్టోరీ లైన్ అల్లు అర్జున్ కు బాగా నచ్చిందట. దీంతో త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుందట. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ . ఇటు మహేశ్‌బాబు సినిమాతో త్రివిక్రమ్ బిజీ. సో... వీరి కమిట్మెంట్స్ పూర్తయ్యాక అల్లు అర్జున్ , త్రివిక్రమ్ సినిమా సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుందేమో? -
ముగ్గురు హీరోయిన్లతో 'బిచ్చగాడు' హీరో రొమాన్స్
Vijay Antony Next With Cs Amudhan Titled Ratham: విజయ్ ఆంటోని ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నారు. సంగీత దర్శకుడి నుంచి కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు విజయ్ ఆంటోని. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రానికి రత్తం అనే టైటిల్‌ను ఆదివారం ఖరారు చేశారు. ఇందులో నటి మహిమ నంబియార్, నందిత శ్వేత, రమ్యానంబీశన్ కథానాయికలుగా నటించడం విశేషం. హాస్యనటుడు జగన్ కృష్ణ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్‌పడం చిత్రం ఫేమ్ సి ఎస్ అముదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, లలితా ధనుంజయన్, బి.ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్.విక్రమ్ కుమార్ కలిసి నిర్మిస్తున్నారు. దీనికి గోపి అమర్నాథ్ ఛాయా గ్రహణాన్ని, కన్నన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని, సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
రెండో సినిమా షురూ
‘జబర ్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్ ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా తెరకెక్కనున్న రెండో చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘సాఫ్ట్వేర్ సుధీర్’తో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సాంబశివ ఆర్ట్ క్రియేష¯Œ ్స బ్యానర్లో అంజన్ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు కనువిందు చేసే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. సప్తగిరిగారు ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారం¿ý మవుతుంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, ఝాన్సీ, రాజ్‌బాల తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: రాజ్ తోట. -
కాంబినేషన్ రిపీట్?
‘ముకుంద’ సినిమాతో వరుణ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేశారు దర్శ కుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత మరో సినిమా కోసం కలసి పని చేయనున్నారట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ కు దర్శకత్వం వహిస్తున్నారు శ్రీకాంత్ అడ్డాల. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వరుణ్ తేజ్. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. -
రజనీ 169 ఫిక్స్?
ఈ మధ్య కాలంలో రజనీ సినిమాలు చేస్తున్న స్పీడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడం, అది పూర్తయ్యేలోపే నెక్ట్స్ సినిమాకు ముహూర్తం పెట్టడం చేస్తున్నారాయన. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ చేసిన ‘దర్బార్’ సంక్రాంతికి విడుదల కానుంది. ఈలోపు దర్శకుడు శివతో ఓ సినిమా కమిట్ అయ్యారు రజనీ. అది ఆయన కెరీర్లో 168వ సినిమా. ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇక రజనీ 169వ సినిమాను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గౌతమ్ మీనన్ చెప్పిన కథకు రజనీ ఇంప్రెస్ అయ్యారట. వేల్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై గణేశ్ ఈ సినిమాను నిర్మిస్తారట. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లేలోగా వీౖలైనన్ని సినిమాలు చేస్తాను అని ఓ సందర్భంలో చెప్పారు రజనీ. అందుకే ఈ స్పీడ్ అయ్యుండాలి. -
లుక్‌పై ఫోకస్
‘సైరా’ పూర్తయింది. దాంతో ప్రస్తుతం ఫోకస్ మొత్తం కొరటాల శివ దర్శకత్వంలో చేసే సినిమా మీద పెడుతున్నారు చిరంజీవి. ఈ సినిమాలో ఆయన లుక్ కొత్తగా ఉంటుందని సమాచారం. గమనిస్తే కొరటాల శివ సినిమాల్లో (మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను) హీరోలు చాలా స్టయిలిష్‌గా ఉంటారు. తాజా సినిమాలో చిరుని కొరటాల బ్రాండ్ న్యూ లుక్‌లో చూపిస్తారని ఊహించవచ్చు. ఆల్రెడీ ఈ పాత్ర కోసం బరువు తగ్గి ఫిట్‌గా మారిపోయారు చిరు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్యూమ్స్ షాపింగ్‌లో బిజీబిజీగా ఉన్నారని తెలిసింది. ముంబైకి చెందిన ఓ ప్రముఖ డిజైనర్‌తో కాస్ట్యూమ్స్ గురించి చర్చించారట. మ్యాటీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించనున్నాయి. సోషల్ ఇష్యూ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందట. రెండు షేడ్స్‌లో చిరు పాత్ర ఉంటుందట. హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. -
కాంబినేషన్ కుదిరినట్టేనా?
నాని ‘గ్యాంగ్‌లీడర్’ పూర్తయింది. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ చిత్రం షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాని నెక్ట్స్ సినిమా ఏంటి? అంటే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని తెలిసింది. రాహుల్ రవీంద్రన్ హీరో నుంచి దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తొలి సినిమా ‘చి.ల.సౌ’ చిత్రానికి స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు కూడా సంపాదించారు. ఇటీవలే నాగార్జునతో ‘మన్మథుడు 2’ తెరకెక్కించారు రాహుల్. ప్రస్తుతం రాహుల్ – నాని కాంబినేషన్లో ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
పండగే పండగ
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’ చిత్రీకరణ పూర్తి కావొస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో రజనీ తర్వాతి చిత్రం ఏంటీ? అనే చర్చ మొదలైంది. రజనీకాంత్ తర్వాతి సినిమాకు శివ దర్శకత్వం వహించనున్నారట. ఇంతకుముందు అజిత్‌తో ‘వేదాలం, వీరమ్, వివేగమ్, విశ్వాసం’ వంటి మాస్ సినిమాలు తీశారు శివ. రజనీకాంత్‌కు కూడా ఆయన ఓ మాస్ స్టోరీని చెప్పారని, వీరి కాంబినేషన్లో సినిమా ఆల్మోస్ట్ ఒకే అయిపోయిందని చెన్నై టాక్. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు కోడంబాక్కమ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రచారమే నిజమైతే.. రజనీ అభిమానులకు వచ్చే ఏడాది డబుల్ ధమాకాయే. సంక్రాంతికి ఒక సినిమా, దీపావళికి ఒక సినిమా అంటే అభిమానులకు పండగే కదా. -
వాట్ నెక్ట్స్?
మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత మహేశ్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు? అనే ప్రశ్నకు ‘గీతగోవిందం’ ఫేమ్ దర్శకుడు పరశురామ్ పేరు వినిపిస్తోంది. గతంలో కూడా ఈ దర్శకుడు మహేశ్‌బాబుకి కథ వినిపించారనే వార్తలు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవల మహేశ్‌ని కలిసి పూర్తి కథని చెప్పారట పరశురామ్. ఈ కథ మహేశ్‌కి నచ్చిందట. అన్నీ కుదిరితే గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ మరో సినిమాకు అంగీకరించారు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌వంగా కూడా ఓ కథ చెప్పారట. మరి మహేశ్ తర్వాతి సినిమా ఏంటి? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. ‘సరిలేరు నీకెవ్వరు’ కశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్ ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. -
ట్యూన్ కుదిరిందా?
ఇన్ని రోజులు కథపై వర్క్ చేసిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, ఇప్పుడు సంగీతదర్శకుడు గోపీ సుందర్‌తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఇదంతా ఆయన నెక్ట్స్ చిత్రం గురించే. అఖిల్ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జీఏ2 పిక్చర్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ట్యూన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు టీమ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా కియారా అద్వానీ, రష్మికా మండన్నాపేర్లు తెరపైకి వచ్చాయి. హీరోయిన్ ఎవరు? అనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
చలో ఉజ్బెకిస్తాన్
సామాన్లు సర్దుకుని ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు హీరోయిన్ త్రిష. ఏదైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారనుకుంటే మాత్రం పొరపాటే. ‘రాంగి’ సినిమా కోసం త్రిష ఫ్లైట్ ఎక్కనున్నారు. శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘రాంగి’. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు డైలాగ్స్ రాయడం విశేషం. ఇటీవల చెన్నైలో మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఉజ్బెకిస్తాన్‌లో ప్లాన్ చేశారు టీమ్. అక్కడ త్రిషపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో త్రిష పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఇక త్రిష నటించిన ‘పరమపదమ్ విలయాట్టు’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే హీరోయిన్ సిమ్రాన్‌తో కలిసి త్రిష ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమంత్ దర్శకుడు. -
సరిలేరు నీకెవ్వరు!
‘మహర్షి’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ప్రజెంట్ ఫారిన్లో ఫ్యామిలీతో కలిసి హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్‌బాబు. అయితే మహేశ్ నెక్ట్స్ సినిమా వర్క్స్ మాత్రం మంచి జోరుగా సాగుతున్నాయి. ‘ఎఫ్ 2’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ సినిమా షూటింగ్ కోసం కర్నూల్లో లొకేషన్స్‌ని వెతుకుతున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ జూన్‌లో స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయిక అని తెలిసింది. అలాగే ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను టీమ్ పరిశీలిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మహేశ్ కెరీర్లో వన్నాఫ్ ది హిట్స్‌గా నిలిచిన ‘ఒక్కడు’ సినిమాలోని కొన్ని సీన్లు కర్నూల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. ‘మహర్షి’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్ మే 1న జరగనుంది. -
చై సై?
‘మజిలీ’ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నారు నాగచైతన్య. ప్రస్తుతం తన మేనమామ వెంకటేశ్‌తో కలసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫుల్‌స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య చేయబోయే సినిమా ఏంటంటే.. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఆల్రెడీ అజయ్, చైతూ మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా నడిచాయట. అజయ్ చెప్పిన స్టోరీ లైన్‌కు ఇంప్రెస్ అయిన చైతూ ‘వెంకీ మామ’ సినిమా తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేయనున్నారట. ఈ చిత్రానికి చై సై అన్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించనున్నారట. -
సుకుమార్‌తో సినిమా లేదు
... అని మహేశ్‌బాబు తన ట్వీటర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ నెక్ట్స్ సినిమా ఏంటి? అంటే.. మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్న మహేశ్ ఆ నెక్ట్స్ సుకుమార్ సినిమాలో హీరోగా నటిస్తారనే ఊహాగానాలు నెలకొన్నాయి. మహేశ్ కోసం సుకుమార్ కథ రెడీ చేస్తున్నారని, టూకీగా స్టోరీ లైన్ చెప్పారని కూడా ఫిల్మ్‌నగర్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నారని సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆ తర్వాత మహేశ్ తన ట్వీటర్ ద్వారా సుకుమార్‌తో సినిమా తన లేదని తెలిపారు. ‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సుకుమార్‌తో నా సినిమా లేదు. తన కొత్త సినిమాకి నా శుభాకాంక్షలు. ఒక మంచి ఫిల్మ్ మేకర్ అంటే నాకెప్పుడూ గౌరవం ఉంటుంది. ‘1 నేనొక్కడినే (సుకుమార్ డైరెక్షన్లో మహేశ్‌బాబు చేసిన సినిమా) ఎప్పటికీ ఒక ‘కల్ట్ క్లాసిక్’గా నిలిచిపోతుంది. ఆ సినిమాకి పని చేసిన ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశాను’’ అన్నారు మహేశ్‌బాబు. -
నెక్ట్స్ ఏంటి?
డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థికి, ఒక సినిమా పూర్తి చేసిన హీరోకు తరచుగా వినిపించే ప్రశ్న నెక్ట్స్ ఏంటి? ‘మిస్టర్ మజ్ను’ సినిమా తర్వాత అఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటి? అని ఇండస్ట్రీలో టాపిక్. అఖిల్ ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని సమాచారం. ‘మలుపు’ దర్శకుడు సత్య ప్రభాస్‌తో ఓ స్పోర్ట్స్ సినిమా ఉందని ఒక వార్త. ‘బొమ్మరిల్లు’ భాస్కర్, ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ కూడా అఖిల్‌కు కథ వినిపించారని సమాచారం. మరి ఈ ముగ్గురిలో తన నాలుగో ప్రాజెక్ట్‌ను ఈ అక్కినేని హీరో ఏ దర్శకుడితో చేస్తాడో వేచి చూడాలి. నెక్ట్స్ ఏంటి? అన్న ప్రశ్నకు ఈ నెలాఖరు లోపు సమాధానం రానుందట. దర్శకుడు ఎవరైనా బేనర్ మాత్రం గీతా ఆర్ట్స్ అని సమాచారం. -
కూచిపూడివారి వీధిలో...
మంచి కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకులు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తెరకెక్కించిన ‘కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద’ చిత్రాలు మంచి ప్రేక్షాకాదరణ పొందాయి. ఇప్పుడు మరో మంచి చిత్రాన్ని ఆడియన్స్‌కు అందించేందుకు రెడీ అవుతున్నారాయన. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ చిత్రానికి ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలిసింది. హీరోహీరోయిన్ల పేర్లు కూడా దాదాపు ఖరారు అయ్యాయట. త్వరలో అధికారిక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఇక షురూ!
వచ్చే నెలలో ఉత్తరాఖండ్ వెళ్లేందుకు అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారట సూపర్‌స్టార్ రజనీకాంత్. ఎందుకంటే ఆయన నెక్ట్స్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అక్కడే స్టార్ట్ కానుందని కోలీవుడ్ సమాచారమ్. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ఉత్తరాఖండ్‌లో షురూ చేయనున్నారట. అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాలో సిమ్రాన్ ఓ కథానాయికగా నటించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే విజయ్‌సేతుపతితో పాటు బాబీ సింహా, సనాత్, యోగిబాబు కీలక పాత్రలు చేయనున్నారని చెన్నై టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘కాలా’ చిత్రం జూన్ 7న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
నామా.. చూపు ఎటువైపు
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఆయన మదిలో ఏముంది? రాజకీయంగా అడుగులు ఎటువైపు వేయనున్నారు.. టీడీపీలోనే కొనసాగుతారా.. మరో పార్టీలోకి వెళతారా.. ఏ పార్టీ అక్కున చేర్చుకుంటుంది.. ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న రాజకీయ పక్షాలకు చేరువవుతారా.. ఇవన్నీ ప్రచారాలేనని కొట్టిపారేస్తారా.. ఇటువంటి అంశాలన్నీ జిల్లాలో రాజకీయ వేడిని రేపుతున్నాయి. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశంపై కొద్ది నెలలుగా అనేక ఊహాగానాలు షికార్లు చేస్తున్నా.. ఆయన రాజకీయ పయనంపై స్పష్టత కొరవడింది. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా టీడీపీలోనే కొనసాగుతున్నా.. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుని మరోసారి ఎంపీ బరిలో దిగుతారన్న ప్రచారం కొద్ది నెలలుగా హోరెత్తుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలుపొందడంతో అప్పటి నుంచి టీడీపీలో రాష్ట్ర రాజకీయాలకు పరిమితమవుతూ జిల్లా రాజకీయాలపై అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి గూడుకట్టుకుంది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు జిల్లా ప్రజల నాడిని పరిగణనలోకి తీసుకుని తనకు అనుకూలంగా రాజకీయాలను మలచుకునే విధంగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని అనేక నెలల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌లో చేరడమా..! లేదా కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ నుంచి పోటీ చేయడమా.. అన్న అంశంపై ఆయన ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాను తీసుకునే నిర్ణయానికి టీడీపీ శ్రేణులతోపాటు తటస్థుల మద్దతు కోసం నామా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తనకు సాన్నిహిత్యం ఉన్న పలు పార్టీల నేతలు, తటస్థులతో తరచూ టచ్‌లో ఉంటూ రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్ణయం ఎలా ఉంటుందో..? వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పలు రాజకీయ పక్షాలు కూటమిగా ఏర్పడి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్రస్థాయిలో యోచిస్తున్నట్లు ప్రచారం జరగడం.. దీనికి టీడీపీ నుంచి సైతం అనుకూలమైన సంకేతాలు ఉన్నాయని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్న నేపథ్యంలో నామా నాగేశ్వరరావు నిర్ణయం ఎలా ఉంటుందన్న అంశం ఎవరికీ ఒక పట్టాన అంతుపట్టడం లేదు. రాష్ట్రస్థాయిలో అనేక రాజకీయ పక్షాలు కాంగ్రెస్‌తో కలిసి నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ సైతం కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రిని కొనసాగించే అవకాశం ఉందని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నామా కాంగ్రెస్‌లో చేరి.. ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించే అవకాశం ఉన్నా జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక నేతగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని, అదే కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఖరారైతే 2009లో టీడీపీ గెలుపొందిన ఖమ్మం సీటునే మళ్లీ టీడీపీ కోరుకునే అవకాశం ఉందని, అప్పుడు నామా కాంగ్రెస్‌తోపాటు టీడీపీని బలపరిచే రాజకీయ పక్షాల కూటమితో ఎన్నికల బరిలో దిగి విజయం సాధించడం ద్వారా జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని.. ఒకవేళ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినా మిత్రపక్ష ఎంపీగా ఆయనకు మంత్రి పదవి అవకాశం ఉంటుందన్న ముందుచూపుతో ఆచితూచి అడుగులు వేస్తున్నారని, అందుకే ఎన్నికల పొత్తు.. పలు రాజకీయ పక్షాల వైఖరిపై వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు టీడీపీలోని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎదురు ప్రశ్నలే.. కాంగ్రెస్‌లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన అంశాలను సైతం నామా తన సన్నిహితులతో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అంశం పార్టీ శ్రేణుల్లో.. అలాగే అభిమానుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2004 ఎన్నికల్లో ఖమ్మం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నామా.. ఆ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై ఓడిపోయారు. జిల్లా టీడీపీలో నామా, తుమ్మల వర్గాలు కొనసాగగా.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మం అభ్యర్థిగా పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో ఓటమి చెందడం.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరడం, తొలుత మంత్రిగా.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొద్ది కాలానికే పాలేరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ద్వారా జిల్లా రాజకీయాలపై తుమ్మల మళ్లీ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇక అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న నామా తెలంగాణలో టీడీపీకి వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలను పరిశీలిస్తూ.. రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ఒక పట్టాన నిర్ణయానికి రాలేకపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో..? ఎవరికి స్నేహ హస్తం అందిస్తుందో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఎన్నికల పొత్తు వరకు రాజకీయ నిర్ణయం తీసుకోకుండా వేచి చూడటం రాజకీయంగా సరైంది కాదని నామా అనుచరులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా తాను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాననే అంశంపై సన్నిహితులకు సైతం స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో ఆయన మనసులో ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా..? వాటి గురించి అన్వేషణ చేస్తున్నారా..? అన్న అనుమానం టీడీపీ వర్గాల్లోనూ.. ఆయన అనుచర గణంలోనూ వ్యక్తమవుతోంది. అయితే జిల్లా రాజకీయాలపై అవగాహన ఉన్న నామా తన రాజకీయ భవితవ్యంపై ఎవరు ప్రశ్నించినా.. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఎదురు ప్రశ్న వేసి రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆయా రాజకీయ పక్షాల బలాబలాలు, ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిపై దృష్టి సారించారని తెలుస్తోంది. -
తలైవా@165
పక్కా... పొలిటికల్ ఎంట్రీకి ముందే రజనీ ఓ సినిమా చేయడం పక్కా అన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. ‘కాలా’, ‘2.0’ చిత్రాల తర్వాత రజనీ నెక్ట్స్ చిత్రం ఏంటీ? అని వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఆయన నెక్ట్స్ చిత్రం ఫిక్సైంది. రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కళానిధి మారన్ సమర్పణలో ఓ సినిమా రూపొందనుంది. ఇది రజనీకాంత్ కెరీర్లో 165వ సినిమా అట. తలైవా (నాయకుడు)ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కార్తీక్ సుబ్బరాజుకు దక్కడం ఊహించని విషయమని అంటున్నారు కోలీవుడ్వాసులు. ‘‘నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. తలైవాతో సినిమా చేయాలనే నా కల నిజమైంది. తలైవాకి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజు. ‘పిజ్జా, జిగర్‌దండా, బెంచ్ టాకీస్, ఇరైవి, ‘మెర్క్యురీ’ వంటి చిత్రాలను తెరకెక్కించారు కార్తీక్ సుబ్బరాజు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్క్యురీ’ ఏప్రిల్ 13 రిలీజ్ కానుంది. ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘కాలా’ చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.0’ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. దీపావళికే విజయ్, సూర్య, అజిత్ సినిమాలతో పాటు బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ సినిమాలు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. సో.. దీపావళికి గట్టి పోటీ అన్నమాట. -
సాయిపల్లవి ఔట్, అతిథి రావ్ ఇన్
చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం చేయబోతున్న తదుపరి సినిమాలో హీరోయిన్ గా అతిథి రావ్ హిరానీకి బంపర్ ఆఫర్ దక్కింది. కార్తీ హీరోగా రొమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మొదట సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. సాయి పల్లవి మరో సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరక ఈ ప్రాజెక్టు నుంచి దూరమైనట్టు సమాచారం. దీంతో ఈ అవకాశం అతిథికి దక్కింది. కార్తీక్ ఈ చిత్రంలో పైలట్ గా నటించనున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుంది. ఏఆర్ రహమాన్ సంగీతం సమకూర్చుతున్నాడు.