వాట్‌ నెక్ట్స్‌? | Parasuram to direct Mahesh Babu next movie | Sakshi
Sakshi News home page

వాట్‌ నెక్ట్స్‌?

Published Mon, Jul 22 2019 3:40 AM | Last Updated on Mon, Jul 22 2019 3:40 AM

Parasuram to direct Mahesh Babu next movie - Sakshi

మహేశ్‌బాబు

మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత మహేశ్‌ ఎవరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు? అనే ప్రశ్నకు ‘గీతగోవిందం’ ఫేమ్‌ దర్శకుడు పరశురామ్‌ పేరు వినిపిస్తోంది. గతంలో కూడా ఈ దర్శకుడు మహేశ్‌బాబుకి కథ వినిపించారనే వార్తలు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఇటీవల మహేశ్‌ని కలిసి పూర్తి కథని చెప్పారట పరశురామ్‌. ఈ కథ మహేశ్‌కి నచ్చిందట. అన్నీ కుదిరితే గీతా ఆర్ట్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌ మరో సినిమాకు అంగీకరించారు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌వంగా కూడా ఓ కథ చెప్పారట. మరి మహేశ్‌ తర్వాతి సినిమా ఏంటి? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. ‘సరిలేరు నీకెవ్వరు’ కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్‌ ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement