![Chiranjeevi with Koratala Siva film to begin in November - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/1/Chiru-%283%29.jpg.webp?itok=WYrFTb4F)
చిరంజీవి
‘సైరా’ పూర్తయింది. దాంతో ప్రస్తుతం ఫోకస్ మొత్తం కొరటాల శివ దర్శకత్వంలో చేసే సినిమా మీద పెడుతున్నారు చిరంజీవి. ఈ సినిమాలో ఆయన లుక్ కొత్తగా ఉంటుందని సమాచారం. గమనిస్తే కొరటాల శివ సినిమాల్లో (మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను) హీరోలు చాలా స్టయిలిష్‌గా ఉంటారు. తాజా సినిమాలో చిరుని కొరటాల బ్రాండ్ న్యూ లుక్‌లో చూపిస్తారని ఊహించవచ్చు.
ఆల్రెడీ ఈ పాత్ర కోసం బరువు తగ్గి ఫిట్‌గా మారిపోయారు చిరు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్యూమ్స్ షాపింగ్‌లో బిజీబిజీగా ఉన్నారని తెలిసింది. ముంబైకి చెందిన ఓ ప్రముఖ డిజైనర్‌తో కాస్ట్యూమ్స్ గురించి చర్చించారట. మ్యాటీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లు ఈ సినిమాను నిర్మించనున్నాయి. సోషల్ ఇష్యూ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందట. రెండు షేడ్స్‌లో చిరు పాత్ర ఉంటుందట. హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment