జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ సినిమా. ప్రస్తుతం ఆచార్య సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కొరటాల శివ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమా ఈనెల 29న రిలీజ్ కానుంది. ఆచార్య తర్వాత చిన్న విరామం తీసుకొని ఎన్టీఆర్‌తో సినిమా స్టార్ట్ చేస్తానని స్వయంగా కొరటాల వెల్లడించారు.
స్క్రిప్ట్ చాలా వరకు పూర్తయింది. ఎన్టీఆర్‌ను చాలా పవర్ ఫుల్ రోల్‌లో చూడబోతున్నారు అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆలియా భట్ నటిస్తుందా అన్న ప్రశ్నకు.. స్క్రిప్ట్‌ని కేవలం ఎన్టీఆర్‌కే వివరించానని,ఇంకా హీరోయిన్ విషయం ఫైనలైజ్ కాలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుకి ఆలియా నో చెప్పిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. త్వరలోనే ఈ సినిమాలోని హీరోయిన్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment