Alia Bhatt Opts Out Of Jr NTR30 Movie, News Goes Viral - Sakshi
Sakshi News home page

Alia Bhatt: ఆలియా భట్‌ షాకింగ్‌ నిర్ణయం! అదేంటంటే..

Published Fri, Apr 15 2022 10:57 AM | Last Updated on Fri, Apr 15 2022 12:05 PM

Alia Bhatt Opts Out Of Ntr30 Film, News Goes Viral - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా రిలీజ్‌ కాగానే ఈ సినిమా పట్టాలెక్కించడానికి మేకర్స్‌ రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఎన్టీఆర్‌30 ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: 'అందుకే ఇలా పెళ్లి చేసుకున్నాం'.. రివీల్‌ చేసిన ఆలియా

అయితే తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి ఆలియా తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు కూడా చెప్పేసిందట. బాయ్‌ఫ్రెండ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో పెళ్లి కారణంగా వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించేందుకు ఆలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. చదవండి:ఆలియాను ఎత్తుకొని తీసుకెళ్లిన రణ్‌బీర్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement