ఏకైక ఇండియన్‌ సినిమాగా 'దేవర' రికార్డ్‌ | Devara Movie Breaks All Records In Overseas | Sakshi
Sakshi News home page

ఏకైక ఇండియన్‌ సినిమాగా 'దేవర' రికార్డ్‌

Published Tue, Sep 10 2024 10:53 AM | Last Updated on Tue, Sep 10 2024 11:53 AM

Devara Movie Breaks All Records In Overseas

సముద్ర తీరంలో కెరటంలా సోషల్‌మీడియాలో 'దేవర' విరుచుకుపడుతుంది. కొద్దిరోజులుగా ఈపేరు ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌ అభిమానులతో పాటు నెటిజన్లను కూడా మెప్పిస్తున్నాయి. జూ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న దేవర ట్రైలర్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఓవర్సీస్ నుంచి దేవరకు మంచి ఆదరణ లభిస్తుంది. అక్కడ ఇప్పటికే  ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. టికెట్స్ అన్నీ కూడా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయి రికార్డ్‌ కొట్టింది.

దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌  27న విడుదల కానుంది. అయితే, ఓవర్సీస్‌లో ఇప్పటికే టికెట్స్‌ సేల్‌ ప్రారంభమైంది. సినిమా రిలీజ్ కావడానికి ముందే  అక్కడ  వన్‌ మిలియన్‌ (పది లక్షలు)  'దేవర' టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ మార్క్‌ను వేగంగా అందుకున్న సినిమాగా 'దేవర' రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా అక్కడ ఈ రికార్డ్‌ అందుకోలేదు. 

దీంతో  మొదటి భారతీయ చిత్రంగా 'దేవర' రికార్డు నెలకొల్పింది. కేవలం తారక్‌ మాత్రమే దానిని నెలకొల్పాడంటూ ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కనీసం ట్రైలర్‌ కూడా విడుదల కాకుండానే ఇలా భారీ రికార్డ్స్‌ కొట్టేస్తే.. సెప్టెంబర్‌ 10న సాయింత్రం ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఇంకెన్ని లెక్కలు మారిపోతాయో అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.

దేవర  ట్రైలర్  సెప్టెంబర్ 10 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. ముంబైలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఎన్టీఆర్‌, కొరటాల శివ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. తెలుగు, తమిళ్‌,కన్నడ,మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement