ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ విడుదల విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తారక్ సింగిల్‌గా నటించిన చిత్రాల్లో దేవరనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.
దేవర ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. నవంబర్ 8న తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తెలిపింది. అయితే, హిందీ వర్షన్ మాత్రం నవంబర్ 22న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది.
కథేంటంటే..
ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు.
దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment