తనని ప్రేమించే ఫ్యాన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఎనలేని అభిమానం. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులపై కూడా ఆయన ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు. అందుకే తారక్ ప్రతి ఆడియో ఫంక్షన్‌లో అభిమానులు అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, వారి కోసం ఇంటి వద్ద ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ఉంటారని సూచిస్తాడు. ఫ్యాన్స్‌పై ఆయన చూపించే ఇలాంటి ప్రేమనే నేడు 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా చేసింది.
కుప్పంలోని గుడుపల్లి మండలానికి చెందిన నలుగురు యువకులు తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌కు పాదయాత్ర చేశారు. సోడిగానిపల్లి పంచాయతీ పాళెం గ్రామానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు శివ, హరి, లక్ష్మీపతి, కదిరప్ప పాద యాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకుని జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. నవంబర్ 3న వారు తమ ఇంటి నుంచి ప్రయాణించారు. తమ స్వగ్రామం నుంచి హైదరాబాద్‌లోని జూనియర్ ఎన్టీఆర్ నివాసం వరకూ ‘వేసే ప్రతి అడుగు జూనియర్ ఎన్టీఆర్ అన్న కోసం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు.
దాదాపు 650 కిలోమీటర్లు పైగా కాలినడకన హైదరాబాద్ చేరుకుని ఎన్టీఆర్ కలుసుకున్నారు. కుప్పం నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు వారికి సుమారు 13 రోజుల సమయం పట్టింది. తారక్‌పై వారు చూపించిన ప్రేమకు కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శివరాయల్ వారికి సంఘీభావం తెలిపారు.
This is why he’s the PEOPLE’S HERO ❤️❤️
MAN OF MASSES @Tarak9999 met fans who walked all the way from Kuppam. He spent time with them and made their day with his warmth 😍✨ #ManOfMassesNTR #NTR pic.twitter.com/FmR7vok8w8— Vamsi Kaka (@vamsikaka) November 15, 2024
Comments
Please login to add a commentAdd a comment