దేవరతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేవర సినిమాపై రివ్యూ ఇచ్చారు.
దమ్మున్న హీరో
ఆయన తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. 'సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాల్సిందే! సంగీతం మరీ అంత గొప్పగా లేదు. డిఫరెంట్ టాక్ వచ్చినా కూడా సినిమా విజయవంతంగా ఆడాలంటే అక్కడ దమ్మున్న హీరో ఉండాలి. అలాంటివారిలో మా చిన్న రామయ్య (జూనియర్ ఎన్టీఆర్) ఒకడు. సముద్రపు దొంగ మంచివాడిగా ఎలా మారాడన్నదే కథ.
కథ చిన్నదే..
ఇంత చిన్న పాయింట్‌పై ఆధారపడి మూడుగంటల నిడివితో సినిమా తీయడమనేది జోక్ కాదు. ఎక్కువ సన్నివేశాలు సముద్రానికి సంబంధించినవే ఉన్నాయి. ఈ విషయంలో కొరటాల శివ 'స్క్రీన్‌ప్లే మాస్టర్' అనిపించుకున్నాడు. ఈ కథ తారక్‌కు సెట్ కాదేమోననుకున్నా.. కానీ డైరెక్టర్.. ఎన్టీఆర్‌కు తగ్గట్లుగా మూవీ తీసి వసూళ్లు రాబట్టాడు.
అలా చేసుంటేనా..!
ఇదే కథ హాలీవుడ్‌లో తీస్తే సూపర్ అంటారు. కథ గొప్పగా లేకపోయినా కథనం బాగుంటే సినిమాలు ఆడతాయనడానికి దేవర ప్రత్యక్ష ఉదాహరణ. ట్విస్టులు బాగున్నాయి. జాన్వీ కపూర్‌తో ఎన్టీఆర్‌కు రొమాంటిక్ సీన్లు, వినోదాత్మక సన్నివేశాలు పెట్టుంటే రూ.1000 కోట్లు ఈజీగా దాటేసేది. తారక్ నటన సహజంగా ఉంది' అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment