దేవర రికార్డ్‌ | Jr NTR and Saif Ali Khan and Janhvi Kapoor Devara Part 1 to screen with Godzilla Minus One Salem Lot at Beyond Fest 2024 | Sakshi
Sakshi News home page

దేవర రికార్డ్‌

Published Sat, Sep 14 2024 3:36 AM | Last Updated on Sat, Sep 14 2024 3:36 AM

 Jr NTR and Saif Ali Khan and Janhvi Kapoor Devara Part 1 to screen with Godzilla Minus One Salem Lot at Beyond Fest 2024

బియాండ్‌ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రం

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర:పార్ట్‌ 1’ అరుదైన ఘనతని సొంతం చేసుకుంది. లాస్‌ ఏంజెల్స్‌లోని ఈజిప్షియన్‌ థియేటర్‌లో ప్రీమియర్‌ కానున్న తొలి భారతీయ సినిమాగా అరుదైన ఘనత సాధించింది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. రెండు భాగాలుగా రానున్న ‘దేవర:పార్ట్‌ 1’ ఈ నెల 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం గ్రాండ్‌ ప్రీమియర్‌ షోను ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటలకు హాలీవుడ్‌లో ప్రదర్శించనున్నారు. ‘‘హాలీవుడ్‌లో బియాండ్‌ ఫెస్ట్‌ అనేది ఘనమైన చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మకమైన సినిమా వేదిక. లాస్‌ ఏంజెల్స్‌లోని ఐకానిక్‌ ఈజిప్షియన్‌ థియేటర్‌లో ప్రీమియర్‌ కానున్న తొలి ఇండియన్‌ సినిమాగా ‘దేవర:పార్ట్‌ 1’ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌కు హాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement