beyond
-
తెర వెనక 'ఆర్ఆర్ఆర్' ఇన్నాళ్లకు.. అటు తారక్ ఇటు చరణ్! (ఫొటోలు)
-
దేవర రికార్డ్
ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర:పార్ట్ 1’ అరుదైన ఘనతని సొంతం చేసుకుంది. లాస్ ఏంజెల్స్‌లోని ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ కానున్న తొలి భారతీయ సినిమాగా అరుదైన ఘనత సాధించింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. రెండు భాగాలుగా రానున్న ‘దేవర:పార్ట్ 1’ ఈ నెల 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.ఈ చిత్రం గ్రాండ్ ప్రీమియర్ షోను ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటలకు హాలీవుడ్లో ప్రదర్శించనున్నారు. ‘‘హాలీవుడ్లో బియాండ్ ఫెస్ట్ అనేది ఘనమైన చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మకమైన సినిమా వేదిక. లాస్ ఏంజెల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ కానున్న తొలి ఇండియన్ సినిమాగా ‘దేవర:పార్ట్ 1’ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. -
కొత్త బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ ‘బియాండ్’.. ధర?
బ్లాక్‌బెర్రీ బ్రాండ్ స్టార్ట్ఫోన్లను విక్రయించే కల్ట్ ఇపుడు తన సొంత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. 4జీ వీఒఎల్టీఈ ఆధారిత కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ‘బియాండ్’ పేరుతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. తక్కువ ధర సెగ్మెంట్లో దీన్ని రూ. 6,999 లకే అందుబాటులోకి తెచ్చింది. ఈ రీటైలర్ అమెజాన్‌లో ప్రత్యేకంగా ఇది లభ్యం కానుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్న ఈ ఫోన్‌ను ఆగష్టు 18 నుంచి అమెజాన్ సైట్ లో యూజర్లు కొనుగోలు చేయవచ్చని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కంపెనీ ప్రకటించింది. విస్తోసో (Vistoso) ఫీచర్‌తో (టి- షర్ట్స్ , మగ్స్మీద వారి ఇష్టమైన చిత్రాలు ప్రింట్ తీసుకునేలా) కస్టమర్లకు ఆకట్టుకోనుంది. 3 స్లాట్లకు మద్దతు ఇస్తుంది.. రెండు స్లిమ్ స్లాట్ లు, మరో ఎస్డీ స్లాట్లను పొందుపర్చింది. లాంచింగ్ సందర్భంగా ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ హరిప్ సింగ్ మాట్లాడుతూ లక్షలాది మండి అభిలాషకనుగుణంగా గొప్ప కెమెరా నాణ్యత, హై పెర్ఫామెన్స్ లాంటి లక్షణౠలను కల్ట్ బియాండ్ కలిగి ఉందని చెప్పారు. మంచి ఫీచర్లు, అదనపు ప్రయోజనాలతో చాలా ఆకర్షణీయమైన ధర లో లాంచ్ చేసినట్టు చెప్పారు. కల్ట్ బియాండ్ ఫీచర్లు 5.2 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ అదనంగా మరో 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీ వీవోఎల్టీఈ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ నుంచి వస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కల్ట్. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ , నేపాల్‌లో బ్లాక్‌బెర్రీ-బ్రాండ్ పరికరాలు రూపకల్పన, తయారీ, మార్కెటింతోపాటు ప్రత్యేకమైన హక్కులను కలిగి ఉంది. ఇటీవల కల్ట్ ఇటీవల భారతదేశంలో రూ. 39,990 ధరలో బ్లాక్‌బెర్రీ కీ వన్ స్మార్ట్‌ఫోన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఆరోగ్యానికి మించిన ఆస్తిలేదు
కొండపి, న్యూస్‌లైన్ :ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని కలెక్టర్ విజయకుమార్ అన్నారు. మండలంలోని చినవెంకన్నపాలెంలో చాగంటి శ్రీహరి జ్ఞాపకార్థం ఆయన తల్లి కోటమ్మ ఉచితంగా నిర్మించి ఇచ్చిన భవనంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. సెంటు భూమిని సైతం వదులుకోలేని ఈ రోజుల్లో తన సొంత స్థలంలో భవనం నిర్మించి ఆరోగ్య ఉపకేంద్రం కోసం ప్రభుత్వానికి ఇచ్చిన కోటమ్మ నిండు మనసు అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. 16 ఏళ్ల క్రితం కలెక్టర్‌గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట కోసం హెల్త్ సబ్‌సెంటర్ మంజూరుకు కృషి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. వందశాతం కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. గర్భిణుల వివరాలు సేకరించి ముందే వారి ఇళ్లకు వెళ్లి ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నూతన భవనం ప్రారంభానికి సంబంధించిన శిలాఫలకాన్ని కోటమ్మతో కలిసి సీనియర్ ఐఏఎస్ అధికారి డి.శ్రీనివాసులు ఆవిష్కరించి మాట్లాడారు. 16 ఏళ్లనాటి కల నేటికి నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతంతో ఉన్న తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. తాను 1997-98లో కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో చాలా గ్రామాలను సందర్శించానని, గోగినేనిపాలెంలో పర్యటించి ఓ రోడ్డు మంజూరు చేశానని గుర్తుకు తెచ్చారు. ఆరోగ్య ఉపకేంద్రం అపకేంద్రంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. డీఎంహెచ్ఓ రామతులశమ్మ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో రోజుమార్చి రోజు డాక్టర్ వచ్చి ఓపీలు చూస్తారని చెప్పారు. అదే విధంగా ప్రతి మంగళవారం పంటి డాక్టర్ వచ్చి రోగులకు పరీక్షలు నిర్వహిస్తారని, వారానికి ఒకసారి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వారు ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. భవన దాత చాగంటి కోటమ్మను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కొండపి ఏఎంసి చైర్మన్ బెల్లం సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ పోటు ఉషారాణి, ఎస్పీహెచ్ఓ శ్రీనివాసరావు, డాక్టర్ రాజ్‌విమల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోకూరి కోటయ్య, గొట్టిపాటి మురళీ, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.