బ్లాక్‌బెర్రీ బ్రాండ్ స్టార్ట్‌ఫోన్లను విక్రయించే కల్ట్ ఇపుడు తన సొంత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. 4జీ వీఒఎల్‌టీఈ ఆధారిత కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ‘బియాండ్’ పేరుతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. తక్కువ ధర సెగ్మెంట్‌లో దీన్ని రూ. 6,999 లకే అందుబాటులోకి తెచ్చింది. ఈ రీటైలర్ అమెజాన్‌లో ప్రత్యేకంగా ఇది లభ్యం కానుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్న ఈ ఫోన్‌ను ఆగష్టు 18 నుంచి అమెజాన్ సైట్ లో యూజర్లు కొనుగోలు చేయవచ్చని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కంపెనీ ప్రకటించింది.
విస్తోసో (Vistoso) ఫీచర్‌తో (టి- షర్ట్స్ , మగ్స్‌మీద వారి ఇష్టమైన చిత్రాలు ప్రింట్ తీసుకునేలా) కస్టమర్లకు ఆకట్టుకోనుంది. 3 స్లాట్లకు మద్దతు ఇస్తుంది.. రెండు స్లిమ్ స్లాట్ లు, మరో ఎస్‌డీ స్లాట్‌లను పొందుపర్చింది.
లాంచింగ్ సందర్భంగా ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ హరిప్ సింగ్ మాట్లాడుతూ లక్షలాది మండి అభిలాషకనుగుణంగా గొప్ప కెమెరా నాణ్యత, హై పెర్‌ఫామెన్స్ లాంటి లక్షణౠలను కల్ట్ బియాండ్ కలిగి ఉందని చెప్పారు. మంచి ఫీచర్లు, అదనపు ప్రయోజనాలతో చాలా ఆకర్షణీయమైన ధర లో లాంచ్ చేసినట్టు చెప్పారు.
కల్ట్ బియాండ్ ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్,
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
అదనంగా మరో 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీ వీవోఎల్‌టీఈ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
కాగా ఆప్టిమస్ ఇన్ఫ్రాకోమ్ నుంచి వస్తున్న కొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్ కల్ట్. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ , నేపాల్లో బ్లాక్‌బెర్రీ-బ్రాండ్ పరికరాలు రూపకల్పన, తయారీ, మార్కెటింతోపాటు ప్రత్యేకమైన హక్కులను కలిగి ఉంది. ఇటీవల కల్ట్ ఇటీవల భారతదేశంలో రూ. 39,990 ధరలో బ్లాక్‌బెర్రీ కీ వన్ స్మార్ట్‌ఫోన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.