బడ్జెట్, ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ తాజాగా భారతదేశంలో తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఆవిష్కరించింది. 32 అంగుళాల, 43-అంగుళాల వేరియంట్‌లతో ఎక్స్ 1 స్మార్ట్ టివి సిరీస్‌తో ఆండ్రాయిడ్ టివి మార్కెట్లోకి ప్రవేశించింది. కెన్యా మరియు ఇతర దేశాలలో ఇదివరకే ఈ స్మార్ట్ టీవీలను ప్రారంభించారు. ఈ రెండు టీవీలు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ పొందాయి. కాబట్టి వీటిని చూడటంలో ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాదు.(చదవండి: బెస్ట్ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఇవే!)
ఇన్ఫినిక్స్ ఎక్స్ 1 టీవీ ఫీచర్స్, ధర:
ఇన్ఫినిక్స్ ఎక్స్ 1 స్మార్ట్ టివిని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లాంచ్ చేశారు. స్మార్ట్ టీవీలను 32-అంగుళాలు, 43-అంగుళాలతో వేరియంట్‌లలో వీటిని విడుదల చేశారు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ .11,999 కాగా, 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ .19,999. 32 అంగుళాల మోడల్‌లో హెచ్‌డీ డిస్ ప్లేను, 43 అంగుళాల మోడల్‌లో ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లేను అందించారు. ఇది అంచులు లేని డిస్ప్లే ని తీసుకొచ్చారు. ఇందులో బెస్ట్ సౌండ్ కోసం అంతర్నిర్మిత బాక్స్ స్పీకర్లు తీసుకొచ్చారు. 43 అంగుళాల స్మార్ట్ టీవీ 24వాట్ స్పీకర్‌ను ఉపయోగిస్తుండగా, 32 అంగుళాల టీవీ 20వాట్ స్పీకర్‌ను ఉపయోగిస్తుంది. ఎక్స్1 సిరీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు 1జీబీ ర్యామ్ , 8జీబీ రోమ్ వంటి శక్తివంతమైన మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌పై నడుస్తాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ మొదలైన వీడియో యాప్స్ లకు మెరుగైన కనెక్టివిటీ కోసం ఇది అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ తీసుకొచ్చారు. ఎపిక్ 2.0 పిక్చర్ ఇంజిన్, 60 హెర్ట్జ్ డిస్ ప్లే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్‌బీ పోర్టు, బ్లూటూత్ 5.0, వైఫై, ఐఆర్ రిమోట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు 32 అంగుళాల వేరియంట్లో ఉన్నాయి. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టు, బ్లూటూత్ 5.0, వైఫై, బ్లూటూత్ రిమోట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు 43 అంగుళాల వేరియంట్లో అందించారు.
Comments
Please login to add a commentAdd a comment