Smart TV
-
జియో టీవీ ప్లస్: ఒక కనెక్షన్‌తో రెండు టీవీలు
రిలయన్స్ జియో స్మార్ట్ టీవీల కోసం 'జియో టీవీ ప్లస్ యాప్'ను తీసుకువస్తున్నట్లు.. 2 ఇన్ వన్ ఆఫర్ కూడా ప్రకటించింది. దీంతో వినియోగదారు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌తో రెండు టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చు. జియో టీవీ ప్లస్ లాగిన్తోనే 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 13 కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.జియో టీవీ ప్లస్ యాప్‌ను అనేది ఇప్పుడున్న అన్ని స్మార్ట్ టీవీలలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లోని కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి ఎస్టీబీ అవసరం లేదు. దీనికోసం అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు & అదనపు కనెక్షన్లు అవసరం లేదు. ఇప్పటివరకు జియో ఎస్టీబీ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న జియో టీవీ ప్లస్ ఇప్పుడు అన్ని స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంటుంది.స్మార్ట్‌టీవీ ఓఎస్‌లో జియో టీవీ ప్లస్ యాప్ ఫీచర్స్సింగిల్ సైన్ ఇన్ (ఒకే సైన్ ఇన్): ఒక్కసారి మాత్రమే సైన్ ఇన్ చేసి.. మొత్తం జియో టీవీ ప్లస్ కంటెంట్ కేటలాగ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.స్మార్ట్ టీవీ రిమోట్: స్మార్ట్ టీవీ రిమోట్‌ని ఉపయోగించి అన్ని జియో టీవీ ప్లస్ కంటెంట్, ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.స్మార్ట్ ఫిల్టర్: భాష, వర్గం లేదా ఛానెల్ నంబర్ ద్వారా ఛానెల్‌ని సెర్చ్ చేయవచ్చు.కంట్రోల్ ప్లేబ్యాక్ స్పీడ్: కావాల్సిన వేగంతో కంటెంట్‌ని చూడవచ్చు.క్యాచ్ అప్ టీవీ: గతంలో ప్రసారమైన షోలను చూడవచ్చు.పర్సనలైజ్డ్ రికమెండేషన్: వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఛానెల్‌లు, షోలు, సినిమాలను చూడవచ్చు.కిడ్స్ సేఫ్ సెక్షన్: పిల్లల కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ విభాగం.డిజిటల్ టీవీ ఛానెల్స్జనరల్ ఎంటర్టైన్మెంట్: కలర్స్ టీవీ, ఈటీవీ, సోనీ షాబ్, స్టార్ ప్లస్, జీ టీవీన్యూస్: ఆజ్ తక్, ఇండియా టీవీ, టీవీ7 భరతవర్ష్, ఏబీపీ న్యూస్, న్యూస్18స్పోర్ట్స్: సోనీ టెన్, స్పోర్ట్స్18, స్టార్ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్, డీడీ స్పోర్ట్స్మ్యూజిక్: బీ4యూ మ్యూజిక్, 9ఎక్స్ఎమ్, ఎంటీవీ, జూమ్కిడ్స్: పోగో, కార్టూన్ నెట్వర్క్, నిక్ జూనియర్, డిస్కవరీ కిడ్స్బిజినెస్: జీ బిజినెస్, సీఎన్‌బీసీ టీవీ18, ఈటీ నౌ, సీఎన్‌బీసీ ఆవాజ్భక్తి: ఆస్తా, భక్తి టీవీ, పీటీసీ సిమ్రాన్, సంస్కార్డౌన్లోడ్ & లాగిన్ చేసుకోవడం ఎలా?ఆండ్రాయిడ్ టీవీ, యాపిల్ టీవీ లేదా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ యాప్ స్టోర్ల నుంచి జియో టీవీ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.యాప్ డౌన్లోడ్ చేసిన తరువాత జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఓటీపీతో ద్రువీకరించుకోవాలి. -
డిమాండ్ వీటికే! దేశంలో ఎలాంటి టీవీలు కొంటున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: స్మార్ట్ టీవీల దిగుమతులు (షిప్మెంట్) ప్రస్తుత ఏడాది మొత్తం మీద 7 శాతం వరకు తగ్గొచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. 2023 మొదటి ఆరు నెలల కాలంలో స్మార్ట్ టీవీల షిప్మెంట్ 5 శాతం తగ్గినట్టు పేర్కొంది. పండుగల సీజన్ ఉన్నందున ద్వితీయ ఆరు నెలల కాలంలో దిగుమతులు కాస్త మెరుగుపడొచ్చని అంచనా వేసింది. ఓఈఎంలు కొత్త పెట్టుబడుల రూపంలో అదనపు తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నందున దేశీయంగా స్మార్ట్ టీవీల తయారీ పెరుగుతున్నట్టు వివరించింది. భారత మార్కెట్లో కొత్త ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు)లు కూడా ప్రవేశిస్తున్నాయని, ప్రముఖ బ్రాండ్లతో టైఅప్ అయ్యి టీవీల తయారీకి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపింది. పెద్ద టీవీలకు డిమాండ్ స్మార్ట్ టీవీల షిప్మెంట్ తగ్గినప్పటికీ, పెద్ద తెరల టీవీలకు డిమాండ్ బలంగానే ఉందని, బ్రాండెడ్ టీవీలకు ప్రాధాన్యత (ప్రీమియమైజేషన్) పెరుగుతున్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 55 అంగుళాలు, అంతకుమించిన పెద్ద స్మార్ట్ టీవీల షిప్మెంట్ మొదటి ఆరు నెలల్లో 18 శాతం పెరిగినట్టు పేర్కొంది. భారత్‌లో అమ్ముడయ్యే అధిక శాతం స్మార్ట్ టీవీల్లో డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఆడియో సపోర్ట్ ఉంటున్నట్టు తెలిపింది. జనవరి–జూన్ కాలంలో మొత్తం టీవీల్లో స్మార్ట్ టీవీల వాటా 91 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ద్రవ్యోల్బణం ప్రతికూలం.. ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక సమస్యల నేపథ్యంలో ప్రజలు కనీస కొనుగోళ్లకే పరిమితం కావాల్సి వచ్చిందని.. టీవీ దిగుమతులు తగ్గడానికి దీన్ని కారణంగా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. మధ్య శ్రేణి విభాగంలో (రూ.30–50వేల మధ్య) క్యూఎల్ఈడీ టీవీలు మరింత ఆదరణకు నోచుకుంటున్నట్టు తెలిపింది. ‘‘మొదటి ఆరు నెలల్లో క్యూఎల్ఈడీ టీవీల షిప్మెంట్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం పెరిగింది. మొత్తం టీవీల మార్కెట్లో వీటి వాటా ఇక ముందు కూడా పెరుగుతుంది’’అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. మొదటి ఆరు నెలల్లో స్మార్ట్ టీవీల షిప్మెంట్లో షావోమీ 10 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. శామ్సంగ్ రెండో స్థానంలో ఉండగా, వన్‌ప్లస్, ఎల్జీ, టీసీఎల్, ఏసర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏసర్, శాన్సుయ్ వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లుగా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఇవి విడుదల చేసే కొత్త బ్రాండ్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు వివరించింది. -
స్మార్ట్ టీవీ కొనుగోలు దారులకు గూగుల్ హెచ్చరిక.. అలాంటి టీవీలతో
స్మార్ట్‌టీవీ కొనుగోలు దారులకు ప్రముఖ టెక్ దిగ్గజం కీలక సమాచారం అందించింది. మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ప్రతిటీవీ ఆండ్రాయిండ్ టీవీగా ప్రచారం జరుగుతుందని, అయితే, అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఇటీవల కమ్యూనిటీ పోస్ట్‌లో ఆండ్రాయిడ్ ఓఎస్ పేరుతో టీవీలను విక్రయించినట్లు గూగుల్ గుర్తించింది. వాస్తవానికి అవి ఆండ్రాయిడ్ ఓపెన్ స్టోర్స్ ప్రాజెక్ట్‌ను (aosp)ని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ టీవీ వర్సెస్ ఏఓఎస్‌పీ గూగుల్ సమాచారం మేరకు..ఆండ్రాయిడ్ టీవీల్లో గూగుల్ యాప్స్ లైసెన్స్ లేకుండానే ప్లే అవుతాయి. ఆండ్రాయిడ్ టీవీ కొన్న ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకోవచ్చు. కానీ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌తో రూపొందించబడిన టీవీల్లో గూగుల్ యాప్స్‌ను ప్లే చేయలేం. అందుకే ఆయా సంస్థలు ప్లే ప్రొటక్ట్ సర్టిఫికెట్ విషయంలో జాగ్రత్త వహిస్తాయి. టీవీ కొనేముందు తీసుకోవాల్సిన చూడాల్సిందిదే కస్టమర్లు తాము కొనుగోలు చేస్తున్న టెలివిజన్ సురక్షితమా? కాదా? అని నిర్ధారించేందుకు ఆండ్రాయిటీవీ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలని గూగుల్ సిఫార్స్ చేస్తోంది. ఆ వెబ్సైట్లో కొనుగోలుదారులు అధికారిక Android TV, Google TV, Android TV ఉత్పత్తులను చూడొచ్చు. ప్లేస్టోర్‌లోకి వెళ్లి గూగుల్ లైసెన్స్ పొందిందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. టీవీకి ప్లే ప్రొటెక్ట్ సర్టిఫికేట్ లేకపోతే అది గూగుల్ ధృవీకరించలేదని అర్థం. చదవండి👉 నీళ్లను తెగ తాగేస్తున్న చాట్ జీపీటీ! -
శాంసంగ్ 32 అంగుళాల స్మార్ట్‌టీవీ: కేవలం రూ. 5వేలకే
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కావాలనుకుంటున్నారా? అయితే ఈ మండు వేసవిలో మీకో తీపి కబురు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ 32-అంగుళాల టైజెన్ టీవీ భారీ ఆఫర్ అందిస్తోంది. 38 శాతం తగ్గింపుతో రూ. 13,999 తగ్గింపు ధరకే లిస్ట్ చేసింది. దీంతోపటు పలు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ద్వారా 23వేల రూపాయల టీవీని కేవలం రూ. 5,000లోపు సొంతం చేసుకోవచ్చు. (Fact Check: కన్యా సుమంగళ యోజన, అమ్మాయిలకు నెలకు రూ.4500?) 32 అంగుళాల శాంసంగ్ HD రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీ అసలు ధర దాదాపు రూ. 23,000. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ. 14వేలకే కొనుగోలు చేయవచ్చు. ఇది 2020లో లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్లు ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా 10 శాతం వరకు తగ్గింపు. దీనికి అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీల నుండి 500 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. (లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?) ఎక్స్చేంజ్ ఆఫర్ ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ. 5,000లోపు కొనుగోలు చేయాలనుకుంటే, బ్యాంక్ ఆఫర్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ఎంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11వేల ఎక్స్చేంజ్ తగ్గింపు అందుబాటులో ఉంది . శాంసంగ్ HD రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీ ఫీచర్లు 366 x 768 పిక్సెల్‌లతో 80 cm (32-అంగుళాల) LED HD రెడీ స్క్రీన్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 60 Hz డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ ఇంకా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, సోనీ లివ్, ఏరోస్ నౌ, జియో సినిమా, గానా, బిగ్ ఫిక్స్, స్పాటిఫై, సన్ నెక్ట్స్ సహా ఇతర యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.ఇన్‌బిల్ట్ Wi-Fi , 2 Dolby Digital Plus స్పీకర్లు లాంటి ఇందులో ఉన్నాయి. -
Redmi : వావ్.. 32 అంగుళాల టీవీ కేవలం రూ.12 వేలు మాత్రమే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ కొత్త టీవీని విడుదల చేసింది. రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 (Redmi Smart Fire TV 32) పేరుతో భారత్‌లో లాంచ్ చేసింది. కేవలం రూ.11,999కే 32 అంగుళాల వేరియంట్ టీవీలో అమెజాన్ ఫైర్ ఓఎస్‌ని అందిస్తుంది. గతంలో రెడ్మీ పలు టీవీలను విడుదల చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్‌తో వచ్చేవి. భారత్‌లో రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రూ.13,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్, కార్డు ఆఫర్లు పోగా..రూ.11,999కే లభిస్తుంది. ఈ కొత్త స్మార్ట్ టీవీని మార్చి 21నుంచి రెడ్మీ అమ్మకాలు ప్రారంభించనుంది. ఇక ఈ టీవీ అమెజాన్, ఎంఐ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు పైన పేర్కొన్నట్లుగా రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ప్రస్తుతానికి 32 అంగుళాలు,హెచ్డీ (1366x768-పిక్సెల్) రిజల్యూషన్‌తో టెలివిజన్ ఫైర్ ఓఎస్ 7 ఆధారితమైనది. ఇందులో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి అమెజాన్ సొంత యాప్‌ల సపోర్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, యాపిల్ టీవీ, స్మార్ట్ టీవీ యాప్‌లు, స్ట్రీమింగ్ సేవలకు ఫైర్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం డాల్బీ ఆడియోకు సపోర్ట్‌గా 20డబ్ల్యూ స్పీకర్ సిస్టమ్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, Redmi Smart Fire TV 32లో బ్లూటూత్ 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎయిర్ ప్లే, మిరా క్యాస్ట్(Miracast)లకు సపోర్ట్ ఇస్తుంది. రెండు హెచ్డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్బీ పోర్ట్‌లు, ఏవీ ఇన్పుట్ సాకెట్లు, వైర్డు హెడ్‌ఫోన్ లేదా స్పీకర్ కనెక్టివిటీ కోసం 3.5ఎంఎం సాకెట్, వైర్డు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈథర్నెట్ పోర్ట్, యాంటెన్నా సాకెట్ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇది కాకుండా రెడ్మీఫైర్ టీవీలో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ని వినియోగించేందుకు వీలుగా టీవీ రిమోట్లో అలెక్సా బటన్ ఉంది. తద్వారా అమెజాన్ అకౌంట్‌తో కనెక్ట్ చేసిన ఐఓటీ, స్మార్ట్ హోమ్ పరికరాలను ఆపరేట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. రిమోట్లో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, నెట్‌ఫ్లిక్స్ కోసం హాట్‌కీలు కాకుండా ప్లేబ్యాక్కోసం ప్రత్యేక బటన్లు, మ్యూట్ బటన్లు ఉన్నాయి. -
Redmi Fire TV: కొత్త ఓఎస్‌తో, కొత్త కొత్తగా వచ్చేస్తోంది!
సాక్షి,ముంబై:బడ్జెట్ ధరల స్మార్టఫోన్లు, స్మార్ట్ టీవీలతో ఆకట్టుకున్న చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమికి చెందిన రెడ్మీ స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. ఇండియన్ మార్కెట్లో తొలిసారిగా ఫైర్ ఓఎస్‌తో సరికొత్త టీవీని పరిచయం చేసింది. ఈమేరకు షావోమీ ట్విటర్లో షేర్ చేసింది. రెడ్మీ ఫైర్ స్మార్ట్ టీవీ ఈ నెల (మార్చి) 14వ తేదీన లాంచ్ కానుంది. అమెజాన్‌కు చెందిన ఫైర్ ఓఎస్ 7 (Fire OS7)పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. రెడ్మీ ఫైర్ టీవీని లాంచ్ కోసం మైక్రోపేజీని క్రియేట్ చేసింది. అమెజాన్ భాగస్వామ్యంతో ఈ టీవీని షావోమీ రూపొందించింది. అమెజాన్ ద్వారా ఈ టీవీ అందుబాటులోకి రానుంది. రెడ్మీ ఫైర్ టీవీ ఫీచర్లు, అంచనాలు రెడ్మీ ఫైర్ టీవీ బెజిల్లెస్ డిజైన్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, మెటాలిక్ బాడీ డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ టీవీ స్క్రీన్ కాస్టింగ్ కోసం మిరాకాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లే , అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగాఫైర్ ఓఎస్‌తో గ్లోబల్‌గా ఇటీవల షావోమీ ఎఫ్2 సిరీస్‌లో కొన్ని టీవీలను లాంచ్ చేసింది. 4K అల్ట్రా స్క్రీన్ రిజల్యూషన్, 43, 50, 55 అంగుళాల సైజుల్లో మెటల్ యూనీబాడీ డిజైన్‌తో వీటిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక ధర, ఇతర స్పెషికేషన్లపై లాంచింగ్ తరువాత మాత్రమే క్లారిటీ రానుంది. Experience the excitement of curtain raiser performances from the comfort of your home. Stay Tuned!#FireUp pic.twitter.com/mcQv20qN09 — Xiaomi TV India (@XiaomiTVIndia) March 2, 2023 -
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ,టీవీ, ప్యాడ్, బడ్స్: జోరు మామూలుగా లేదుగా!
సాక్షి,ముంబై: ప్రీమియం స్మార్ట్ఫోన్ల సంస్థ వన్‌ప్లస్ మరో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్లో వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ మోడల్స్‌ని తీసుకొచ్చింది. గేమింగ్ ప్రియుల కోసం హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్, అడాప్టర్ ఫ్రేమ్ స్టెబిలైజర్ 4.0 ఫీచర్స్ వీటిలో పొందుపర్చింది. అలాగే 120Hz సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి ఉన్నాయి. వీటితోపాటు పాటు వన్‌ప్లస్ ప్యాడ్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2ఆర్, క్యూ2 ప్రొ 65 టీవీని కూడా లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ రూ.61,999, 16జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999. గెలాటిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్స్లోఈ స్మార్ట్ఫోన్లు లభ్యం. ప్రీ ఆర్డర్‌కు ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 28 న సేల్ ప్రారంభం. అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 50+8+2 ఎంపీ టట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 100 వాట్ చార్జింగ్ సపోర్ట్ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2ఆర్ (హెడ్ ట్రాకింగ్ & వైర్లెస్ ఛార్జింగ్) ధర రూ 11,999 వన్‌ప్లస్ టీవీ క్యూ2 ప్రొ 65 రూ. 99,999 ముందస్తు ఆర్డర్లు: మార్చి 6, విక్రయాలు: మార్చి 10 -
ఆ టీవీలను ఎగబడి కొంటున్న జనం.. సేల్స్‌లో దుమ్మురేపుతోంది!
భారత్‌లో స్మార్ట్ టీవీ అమ్మకాలు జోరందుకుంది. ఓటీటీ పుణ్యమా అని ఈ విభాగం టీవీలను మాత్రం వినియోగదారులు ఎగబడి మరీ కొంటున్నారు. దీంతో ఈ ఏడాడి ఏకంగా రెండంకెల వృద్ధి సాధించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ టీవీ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే 38% పెరిగినట్లు వెల్లడించింది. ఇంట్లో కూర్చుని పెద్ద స్క్రీన్లలో ఓటీటీ (OTT) యాప్‌ల ద్వారా ప్రసారం అవుతున్న కంటెంట్‌ను చూసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. OTT యాప్స్ స్మార్ట్ టీవీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయనే విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ టీవీలకు సేల్స్ పెరుగుతోంది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో మొత్తం టీవీ విభాగంలో 93 శాతం వాటా స్మార్ట్ టీవీలదే కావడం వీటి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇంకా చాలా మంది CRT (కాథోడ్-రే ట్యూబ్) టీవీలను ఉపయోగిస్తున్నారు. వీటితో పోలిస్తే ప్రయోజనాల ఎక్కువగా స్మార్ట్ టీవీలో ఉండడంతో ఇటీవల ప్రజలు వాటికి అప్‌గ్రేడ్ అవుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం స్మార్ట్ టీవీలు బడ్జెట్ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. దాదాపు రూ.20 వేల లోపు ఫీచర్లుతో కూడిని స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎప్పుడూ ప్రీమియం రేంజ్లో ఉండే గూగుల్ టీవీ ఇప్పుడిప్పుడే రూ.25,000 లోపు ధర విభాగంలోకి ప్రవేశించిందని, వచ్చే ఏడాది ఇంకా అది రూ.20 వేల లోపు సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించే అవకాశముందని అని కౌంటర్‌పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అన్షికా జైన్ వెల్లడించారు. చదవండి కాల్చి చంపేస్తారేమో..కచ్చితంగా ప్రమాదం ఉంది: ఎలాన్ మస్క్ -
అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ!
మీరు తక్కువ బడ్జెట్లో ఫీచర్లు ఉన్న స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. కేవలం 7వేల రూపాయలకు ఎల్ఈడీ స్మార్ట్‌టీవీని అందిస్తోంది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. టెక్నాలజీ పెరిగే కొద్దీ వస్తువులలో ఫీచర్లు పెరగడంతో పాటు వాటి ధరలు తగ్గుతున్నాయి. గతంలో ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ 32 ఇంచెస్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 25 వేలు పైనే ఉండేది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అదే స్మార్ట్ టీవీ రూ. 10వేలు లోపే దొరుకుతోంది. తాజాగా అమెజాన్ రూ. 7వేలకు అదిరిపోయే స్మార్ట్ టీవీ తన కస్టమర్లకు అందిస్తోంది. అమెజాన్ అదిరిపోయే ఆఫర్ VW 80 cm (32 అంగుళాలు) HD Ready LED TV VW32A (బ్లాక్) (2021 మోడల్) టీవీపై బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ధర చూస్తే బడ్జెట్లోనే దొరుకుతోంది. ఎలా అంటే కంపెనీ నిర్ణయించిన ఈ టీవీ అసలు ధర రూ.12,999 ఉండగా, అమెజాన్ వెబ్సైట్లో 48% డిస్కౌంట్‌ను లభ్యమవుతోంది. ఈ ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు తక్కువ ధరకే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఇందులో 60 hz రిఫ్రెష్ రేట్, 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఉంది. దీనిపై ఒక సంవత్సరం వారంటీని కూడా పొందుతారు. ఇతర ప్రాడెక్టలతో అనుసంధానం కోసం కనెక్టివిటీ పోర్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో HDMI అలాగే USB, AV పోర్ట్‌లు ఉన్నాయి. చదవండి: ఎలాన్ మస్క్‌కు అమెజాన్ బంపరాఫర్! -
15 వేలకే యాపిల్ 4కే టీవీ, అదిరిపోయే ఐప్యాడ్, ఐప్యాడ్ ప్రో
సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ న్యూ జనరేషన్ యాపిల్ 4కే టీవీని లాంచ్ చేసింది. ఈ టీవీ ప్రారంభ ధర రూ 14,900గా ఉంచింది. దీంతోపాటు 5జీ సరికొత్త ఐప్యాడ్, ఐప్యాడ్‌ప్రో (ఎం2చిప్సెట్) విడుదల చేసింది. ముఖ్యంగా ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో అదిరిపోయే లుక్‌లో ఈ ప్యాడ్‌ను తీసుకొచ్చింది. యాపిల్ 4కే టీవీ డాల్బీ విజన్‌తో పాటు HDR 10+కి మద్దతుతో సిరి రిమోట్, USB Type-C పోర్ట్‌ను ఇందులో జోడించింది. రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ చేసింది. వేగవంతమైన నెట్వర్కింగ్ , స్ట్రీమింగ్ కోసం వైఫై ఈథర్నెట్ సపోర్ట్‌తో 64 జీబీ స్టోరేజ్. రెండోది యాప్‌లు, గేమింగ్ కోసం 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర 16,900. ఇంట్లోనే అతిపెద్ద స్క్రీన్‌పై తమకు ఇష్టమైన వినోదాన్ని ఆస్వాదించే లక్క్ష్యంతో గతంలో కంటే మరింత శక్తివంతంగా దీన్ని లాంచ్ చేసినట్టు వైస్ ప్రెసిడెంట్ బాబ్ బోర్చర్స్ అన్నారు. ఈటీవీలు ఆపిల్ ఇండియా వెబ్సైట్లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా, షిప్పింగ్ నవంబర్ 4 నుండి ప్రారంభం. ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో ఐప్యాడ్ ఫుల్ ఆల్ స్క్రీన్ తో సిల్వర్, బ్లూ, ఎల్లో, పింక్ నాలుగు కొత్త రంగుల్లో కొత్త 10వ తరం ఐప్యాడ్ అందుబాటులో ఉండనుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐప్యాడ్ 2022 వైఫై 64 జీబీ మోడల్ ధర రూ. 44,900 గాను, వైఫై 256 జీబీ వేరియంట్ ధర రూ. 59,900గా ఉంది. అలాగే వైఫై + సెల్యులార్ 64 జీబీ మోడల్ ధర రూ. 59,900 గాను, వైఫై + సెల్యులార్ 256 జీబీ ధర రూ. 74,900 గా ఉంది. ఐప్యాడ్ స్పెసిఫికేషన్స్ 10.9 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ ప్లే ఏ14 బయోనిక్ చిప్ సెట్ ఐప్యాడ్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ రియర్ కెమెరా 4కే వీడియో సపోర్ట్ ఈ ఐప్యాడ్ కి సంబందించిన ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. యాపిల్ వెబ్సైట్ ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 26నుంచి డెలివరీ ప్రారంభమవుతుంది. -
గజియాబాద్ పేలుడు ఘటన.. టీవీలు పేలడానికి ప్రధాన కారణాలు ఏవో తెలుసా!
ఇటీవల ఎలక్ట్రిక్ బైకులు, స్మార్ట్ఫోన్లు పేలిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదాల కారణంగా కొందరు తీవ్రంగా గాయపడగా, ఇంకొందరి ప్రాణాలు కూడా పోయాయి. తాజాగా గజియాబాద్‌లో టీవీ పేలి ఓ టీనేజర్ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఎలక్ట్రిక్ పరికరాల వాడడంపై కాకుండా సురక్షితం ఎలా వాడాలో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా టీవీలు పేలడం అరుదుగా జరిగే ఘటనలే అయినప్పటికీ ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని గజియాబాద్ సంఘటన చెప్తోంది. ఈ నేపథ్యంలో వీటి పేలుడుకి ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. గజియాబాద్ ఘటనలో టీవి పేలుడు ధాటికి దెబ్బతిన్న ఇంటి గోడ ఎల్ఈడీ టీవీలు పేలడానికి గల కారణాలు ఇవే! ఎల్ఈడీ టీవీలు పేలడానికి రకరకాల కారణాలున్నాయి. టీవీలో ఉండే కెపాసిటర్లు వల్ల పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే కెపాసిటర్ అంటే విద్యుత్ శక్తిని నిల్వ చేసుకుని.. బ్యాటరీలా పని చేస్తుంది. టీవీ ఆపరేట్ చేయడానికి, అవసరమైన సమయంలో స్టాండ్‌బై మోడ్‌లో ఉండటానికి అవసరమైన కొద్దిపాటి శక్తిని నిల్వ చేస్తుంది. అయితే క్వాలిటీ కెపాసిటర్ వాడడం వల్ల, లేదా టీవీలోని కెపాసిటర్లు పాతవి కావడం వల్లే పేలుళ్లు సంభవిస్తాయి. అయితే గజియాబాద్ పేలుడు ఇంత తీవ్రస్థాయిలో ఉండడానికి గది వాతావరణం కూడా కారణమై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవర్ హీటింగ్ ఎలక్ట్రికల్ డివైజ్‌లు చాలా వరకు అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు లేదా పేలుడుకు గురవుతాయి. టీవీలను ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు లేదా చాలా పరికరాలను టీవీలకు కనెక్ట్ చేసి వాడుతున్న సమయంలో అవి సులభంగా వేడెక్కుతుంది. ఈ క్రమంలో వేడెక్కిన పరికారాలు వాటి పరిమితి దాటిన వెంటనే పేలుడికి దారితీస్తాయి. అకస్మాత్తుగా వోల్టేజ్లో మార్పు.. భారత్ వంటి దేశాలలో టీవీ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణాలలో ఒకటి విద్యుత్ లేదా వోల్టేజ్లో ఆకస్మిక పెరుగుదల కూడా ఒకటి. దీనినే మరో రకంగా పవర్ సర్జ్ అని కూడా అంటాం. తప్పుడు వైరింగ్ ఉన్న ప్రాంతాల్లో ఇది జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఆకస్మిక విద్యుత్ పెరుగుదల నుంచి డివైజ్ డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఉంచేందుకు కంపెనీలు టీవీలో అనేక పరికారలను ఏర్పాటు చేస్తాయి. తద్వారా ఆది ఆకస్మిక వోల్టేజ్ పెరుగుదలను తట్టుకోగలదు, అయినప్పటికీ, అవి కూడా కొన్నిసార్లు విఫలమయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. అందుకే ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాల సమయంలో టీవీలను ఆఫ్ చేయమని చెబుతుంటారు. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు వార్నింగ్.. ఆ యాప్‌లు ఉంటే మీ ఖాతా ఖాళీ,డిలీట్ చేసేయండి! -
ట్రెండ్ మారింది.. ఆ సెగ్మెంట్ టీవీల సేల్స్ మూడింతలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేగవంతమైన ఇంటర్నెట్, వినోదానికి కావాల్సినంత కంటెంట్, భారీగా తగ్గిన ధరలు, వీక్షణం విషయంలో మారుతున్న ధోరణులు, పైగా కస్టమర్ల ఆదాయాల్లో వృద్ధి.. ఇంకేముంది పెద్ద సైజు టీవీల వైపు మార్కెట్ క్రమంగా మళ్లుతోంది. 40, ఆపైన అంగుళాల సైజున్న టీవీల విపణి అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం వీటి వాటా 40 శాతం ఉంది. 2027 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ రిసర్చ్ వెల్లడించింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య అధికం అవడం కూడా పరిశ్రమకు కలిసి వచ్చే అంశం. గతంలో కొన్ని కంపెనీలు మాత్రమే ఈ విభాగంలో మోడళ్లను విక్రయించాయి. కొన్ని సంస్థలు భారత్‌లో రీ–ఎంట్రీ ఇచ్చాయి. భారీగా తగ్గిన ధరలు.. పెద్ద సైజు టీవీల ధరలు ఎవరూ ఊహించనంతగా గడిచిన అయిదేళ్లలో భారీగా తగ్గాయి. 2017లో 55 అంగుళాల టీవీ ధర సుమారు రూ.1,00,000 ఉండేది. ఇప్పుడు రూ.30 వేల లోపు నుంచే లభిస్తున్నాయి. పాత బ్రాండ్లకుతోడు కొత్త బ్రాండ్ల రాకతో పోటీ తీవ్రమైంది. ధర, ఫీచర్లతో ఇవి తమ వాటాను క్రమంగా పెంచుకుంటున్నాయి. శామ్సంగ్, ఎల్జీ, సోనీ, ప్యానాసోనిక్‌తోపాటు షావొమీ, వ్యూ టెక్నాలజీస్, క్రోమా, వన్ ప్లస్, థామ్సన్, తోషిబా, కొడాక్, థామ్సన్, ఏసర్, టీసీఎల్, లాయిడ్, సాన్సూయి, అమెజాన్ బేసిక్స్, హ్యుండై, హైసెన్స్, కాంప్యాక్, అకాయ్, ఒనిడా వంటి బ్రాండ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రెండింతలైన బ్రాండ్స్.. గత 5–7 ఏళ్లలో 40, ఆపైన అంగుళాల టీవీల విభాగంలో బ్రాండ్ల సంఖ్య రెండింతలైంది. ప్రస్తుతం 70 దాకా బ్రాండ్లు మార్కెట్లో ఉన్నాయని క్రిసిల్ రిసర్చ్ డైరెక్టర్ పూషన్ శర్మ తెలిపారు. ‘43 అంగుళాల సైజులో అధిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. పశ్చిమ దేశాలు 2018 సంవత్సరానికి ముందే పెద్ద సైజుకు మళ్లాయి. తలసరి ఆదాయం 2018లో 10.9 శాతం, 2019లో 9.3 శాతం అధికం అయింది. తలసరి ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక స్థోమత కూడా మెరుగుపడింది. మరోవైపు టీవీల ధరలు తగ్గాయి. ఈ ట్రెండ్ దీర్ఘకాలికంగా కొనసాగుతుందని అంచనా. ఇంటర్నెట్ వ్యాప్తి జోరు మీద ఉంది. ఇది ఓటీటీ వినోద వినియోగం పెరుగుదలకు దారి తీస్తోంది. వీక్షకులు పెద్ద టీవీ స్క్రీన్లలో ఓటీటీని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు’ అని వివరించారు. చదవండి: భారత్ ఆ ట్రెండ్‌ని మార్చింది.. ఆగస్ట్‌లో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు! -
ఇన్ఫినిక్స్ నుంచి తొలి 55 ఇంచెస్ టీవీ.. తక్కువ ధరకే వావ్ అనిపించే ఫీచర్లు!
కొంత కాలంగా బడ్జెట్ టీవీల మార్కెట్లో దూసుకుపోయిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తాజాగా ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ విభాగంలోకి ప్రవేశించింది. టెలివిజన్ మార్కెట్లో తమ మార్కెట్‌ని అన్ని విభాగంలో విస్తరిస్తూ, ఇన్ఫినిక్స్ 50 ఇంచెస్, 55 ఇంచెస్ జీరో సిరీస్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేకంగా ఇన్ఫినిక్స్ జీరో (Infinix Zero 55 Inch QLED 4K) స్మార్ట్ టీవీని అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఇందులో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్‌తో వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీలో అద్భుతమైన క్వాంటమ్ డాట్ టెక్నాలజీని అమర్చారు. జీరో సిరీస్‌లోని ZERO 55-inch QLED 4K TV రూ. 34,990 గా ఉంది. ప్రస్తుతం ఉన్న X3 సిరీస్ క్రింద ప్రారంభించిన ఇతర ఇన్ఫినిక్స్ 50 ఇంచెస్ 4K TV ధర కేవలం రూ. 24,990. ఈ రెండు ఆండ్రాయిడ్ టీవీలు సెప్టెంబర్ 24 నుంచి సేల్స్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మైండ్‌బ్లోయింగ్ ఫీచర్లు ఇవే.. మీకు ఇష్టమైన టీవీ షోలు, స్పోర్ట్స్ మ్యాచ్‌లు, సినిమాల ఫ్రేమ్ రేట్‌ను పెంచేందుకు డాల్బీ విజన్, హెచ్డీఆర్( HDR 10+) సపోర్ట్ , బెజెల్ లెస్ డిజైన్ దీని ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పిక్చర్ క్వాలిటీ మెరుగ్గా ఉండేలా క్వాంటమ్ డాట్ డిస్ప్లేను ఇస్తున్నట్టు ఇన్ఫినిక్స్ పేర్కొంది. మీడియా టెక్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ సీఏ55 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. పీక్ బ్రైట్నెస్ 400 నిట్స్ వరకు ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. వైర్లెస్ కనెక్టివిటీ కోసం డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి. ఈ QLED స్మార్ట్ టీవీకి మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, హెడ్‌ఫోన్ పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై పోర్ట్‌లు ఉన్నాయి. ఇందులో డాల్బీ డిజిటల్ ఆడియోతో కూడిన రెండు పవర్‌పుల్ ఇన్నర్ బిల్ట్ 36వాట్స్ బాక్స్ స్పీకర్లు, 8K నుండి 20K Hz వరకు సౌండ్ క్వాలిటీని పెంచే 2 ట్వీటర్లు ఉన్నాయి. ఈ ప్రీమియం టీవీ సిరీస్ గురించి మాట్లాడుతూ, ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్, మాట్లాడుతూ.. మా ఫ్లాగ్షిప్ క్వాంటం డాట్ టెక్నాలజీతో తయారుచేసిన సరికొత్త 55 ఇంచెస్ QLED 4K TV భవిష్యత్తులో గేమ్-ఛేంజర్ గా మారుతుందన్నారు. చదవండి: బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే! -
ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు!
దేశంలో పండుగల సీజన్ మొదలైంది. దీంతో వినియోగదారుల సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు దిగ్గజ సంస్థలు పోటీ పడుతుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో హెవీ మార్కెట్ కాంపిటీషన్‌ను తట్టుకొని నిలబడేందుకు ఎలక్ట్రానిక్ కంపెనీలు ప్రొడక్ట్‌లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో 17శాతం షేర్‌తో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్న ఒప్పో అదిరిపోయే టీవీ మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరకే బిగ్ స్క్రీన్ టీవీ కొనాలనుకునేవారికి 'ఒప్పో' 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ బాగా ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ టీవీలో ఉన్న ఫీచర్స్, వాటి పనితీరు ఎలా ఉందో చూద్దాం. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ ఒప్పో గతంలో 65 అంగుళాల స్మార్ట్ టీవీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి తాజాగా 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని కొనుగోలు దారులకు పరిచయం చేసింది. OPPO K9x పేరుతో ఉన్న ఈ స్మార్ట్ టీవీని చైనాలో విడుదల చేసింది. దీని ధర 1399 యువాన్ (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.16,500)గా ఉంది. లాంచ్ ఆఫర్ కింద 1299 యువాన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 15,350) అందుబాటులోకి ఉంచింది. త్వరలో భారత్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దేశీయ మార్కెట్లో దాని ధర ఎంత ఉంటుందనేది ఆ సంస్థ వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టీవిని కొనాలంటే తమ అధికారిక వెబ్ సైట్‌ను విజిట్ చేయాల్సి ఉంటుందని ఒప్పో ప్రతినిధులు వెల్లడించారు. అదిరే ఫీచర్లు ► కొత్త ఒప్పో K9x 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ మనల్ని ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ►కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన AI PQ అల్గారిథమ్ ►ఈ స్మార్ట్ టీవీ గరిష్ట బ్రైట్ నెస్ 280 నిట్లు ►ఇందులో 2GB RAM, 16GB ROM ►క్వాడ్-కోర్ MediaTek చిప్సెట్, 20W పవర్ రేటింగ్‌తో రెండు ఇంటిగ్రేటెడ్ స్పీకర్లు ► మూడు HDMI పోర్ట్‌లు, ఒక ఈథర్నెట్ పోర్ట్ ►వైర్లెస్ కనెక్షన్ కోసం డ్యూయల్-బ్యాండ్ Wi-Fiకి మద్దతు ► ఎల్ఈడీ-బ్యాక్లిట్ ప్యానెల్‌తో 50 అంగుళాల స్క్రీన్, పూర్తి 4K రిజల్యూషన్‌తో అదిరిపోయే లుక్. కళ్ళపై ఒత్తిడిని తగ్గించడానికి 10.7 బిలియన్ రంగులుతో పాటు బ్లూ-లైట్ తగ్గించే టెక్నాలజీ, ఫ్లాగ్షిప్ స్మార్ట్ టీవీ తరహాలో బాల్‌పార్క్‌లో డిస్ప్లే-స్థాయి రంగు ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. ఇది ఇమేజ్ నాణ్యతను ఫ్రేమ్-బై-ఫ్రేమ్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. చదవండి: Mahendra Singh Dhoni: కొత్త అవతారమెత్తిన ధోని.. షాక్‌లో నెటిజన్స్! -
రూ. 8 వేలకే 32 అంగుళాల స్మార్ట్‌టీవీ, ఫీచర్లు సూపర్
న్యూఢిల్లీ: 10 వేల రూపాయల లోపు స్మార్ట్ టీవీకోసంఘ ఎదురుచూస్తున్న వారికి చక్కని అవకాశం. ఇన్ఫినిక్స్ ఇండియా (ట్రాన్సియాన్ గ్రూపు) తక్కువ ధరలో ‘వై1 స్మార్ట్ టీవీ’ ఇటీవల లాంచ్ చేసింది. దాదాపు 9 వేల రూపాయలకే 32 అంగుళాల ఈ టీవీని పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలకు అందుబాటులో ఉంది. ఈ టీవీ ధర, ఫీచర్లను ఒకసారి చూద్దాం. 32 అంగుళాల ‘వై1 స్మార్ట్ టీవీ’ని ధర రూ.8,999కు అందిస్తోంది ఇన్ఫినిక్స్. ఈ టీవీలో ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, జీ5, ఎరోస్‌నౌ, ఆజ్‌తక్ తదితర ఓటీటీ యాప్‌లు ముందుగానే ఇన్స్టాల్ చేసి ఉంటాయని సంస్థ తెలిపింది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం తగ్గింపును పొందవచ్చు, అంటే రూ.900. తగ్గింపు లభిస్తుంది. దీంతో కేవలం 8,099 రూపాయలకే వై1 స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోవచ్చు. డాల్బీ ఆడియో సౌండ్ సిస్టమ్‌తో, 20 వాట్ అవుట్‌పుట్ స్పీకర్లతో ఇది వస్తుంది. అలాగే, 512 ఎంబీ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4జీబీ స్టోరేజీతో, మూడు హెచ్డీఎంఐ, రెండు యూఎస్బీ పోర్ట్‌లు, ఒక ఆప్టికల్, ఒకటి లాన్, ఒకటి మిరాకాస్ట్, వైఫై, క్రోమ్‌కాస్ట్‌తో ఉంటుందని ఇన్ఫినిక్స్. తెలిపింది. దేశీ మార్కెట్లో అతి చౌక స్మార్ట్ టీవీగా దీన్ని పేర్కొంది. -
భారత్ మార్కెట్లో జపాన్ టీవీ, ధర ఎంతంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంజ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న జపాన్ కంపెనీ ఐవా తాజాగా భారత మార్కెట్లో మ్యాగ్నిఫిక్ పేరుతో స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. ఫుల్ హెచ్డీ, అల్ట్రా హెచ్డీ, 4కే యూహెచ్డీ టీవీలను 32–65 అంగుళాల సైజులో రూ.29,990 నుంచి రూ.1,39,990 ధరల శ్రేణిలో అందుబాటులోకి తెచ్చింది. బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్ట్, ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్–4 ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపుదిద్దుకున్నాయి. ఇన్‌బిల్ట్ సౌండ్ బార్ 55, 65 అంగుళాల టీవీల ప్రత్యేకత. దేశవ్యాప్తంగా 300 రిటైలర్స్ ద్వారా టీవీలను విక్రయించనున్నట్టు ఐవా ఇండియా ఎండీ అజయ్ మెహతా వెల్లడించారు.‘ఏడాదిలో రిటైలర్ల సంఖ్యను 3,500లకు చేరుస్తాం. వ్యాపార విస్తరణకు రెండేళ్లలో రూ.160 కోట్లు ఖర్చు చేస్తాం. భారత్‌లో టీవీల తయారీకై డిక్సన్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీవీలు, ఆడియో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా రూ.400 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం. 4–5 ఏళ్లలో రూ.8,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నాం. ఇందుకు వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉత్పత్తులను ప్రవేశపెడతాం’ అని వివరించారు. 1951లో ఐవా ప్రారంభమైంది. ఈ సంస్థ భారత్‌లో 2021 ఏప్రిల్‌లో రీ–ఎంట్రీ ఇచ్చింది. -
శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీ, న్యూడిజైన్, ఫీచర్లు చూశారా?
సాక్షి, ముంబై: శాంసంగ్ కొత్త టీవీలను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. 43 అంగుళాల 4కే డిస్ప్లే, బెజిల్లెస్ డిజైన్‌తో శాంసంగ్ శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో టీవీ పేరుతో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. హెచ్డీఆర్ 10+ సపోర్ట్ బెజిల్లెస్ డిజైన్‌తో ప్రీమియమ్ లుక్‌తో ఈ స్మార్ట్ టీవీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గేమింగ్ కోసం ఆటో గేమ్ మోడ్ వంటి హై-ఎండ్ ఫీచర్ కూడా ఇందులో పొందుపర్చింది. ఆడియో కోసం డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్‌తో 20వాట్ల స్పీకర్‌ను, అలాగే స్మార్ట్ అడాప్టివ్ సౌండ్ ఫీచర్‌ను కూడా ఉంచింది, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, బిక్స్బీలకు ఈ క్రిస్టల్ 4కే నియో టీవీ సపోర్ట్ చేస్తుంది. దీంతో చానెల్స్ మార్చడం, కంటెంట్ వెతకడం, వాల్యుమ్, ప్లే బ్యాక్‌ను వాయిస్‌తోనే కంట్రోల్ చేయవచ్చు. ప్రైస్ అండ్ సేల్ ప్రారంభ ఆఫర్లో 43 అంగుళాల క్రిస్టల్ 4కే నియో టీవీ ధర రూ.35,990 వద్ద అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితం. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఏడాది పాటు లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా లభ్యం. శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో టీవీ ఫీచర్లు 3,840x2160 పిక్సెల్స్ రెజల్యూషన్ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ స్క్రీన్ 1.5 ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ డిస్ప్లే HDR10+ కంటెంట్ సపోర్ట్ ప్లే బ్యాక్‌ను వాయిస్ కంట్రోల్ -
శామ్సంగ్ భారీ ప్రణాళిక..ఆ మార్కెట్‌పై గురి..!
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ ఇండియా ఈ ఏడాది లెడ్ టీవీ విభాగంలో 25 శాతం వృద్ధిని ఆశిస్తోంది. తద్వారా మొత్తం టీవీ మార్కెట్లో 36 శాతం వాటాను సొంతం చేసుకోవాలని లక్షిస్తోంది. ఇందుకు తగిన వ్యూహాలతో కొత్త టెక్నాలజీలు, ప్రొడక్టులను విడుదల చేయాలని ప్రణాళికలు వేసింది. మరోవైపు ప్రీమియం టీవీ అమ్మకాలను సైతం భారీగా పెంచుకోవాలని చూస్తోంది. వెరసి ఈ విభాగంలో మార్కెట్ వాటాను గతేడాది సాధించిన 50 శాతం నుంచి 60 శాతానికి చేర్చుకోగలమని అంచనా వేస్తోంది. అల్ట్రా ప్రీమియంలో.. మార్కెట్ వాటాను పెంచుకునే బాటలో తాజాగా అల్ట్రా ప్రీమియం బ్రాండ్ల విభాగంలో శామ్సంగ్ ఇండియా 2022 నియో క్యూలెడ్ 8కే, నియో క్యూలెడ్ టీవీలను దేశీయంగా ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధరలు రూ. 3.24 లక్షలు, రూ. 1.14 లక్షలుగా తెలియజేసింది. గతేడాది మొత్తం టీవీ పరిశ్రమలో 31.7 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోగా.. తాజా మోడళ్ల విడుదల ద్వారా విలువరీత్యా 36 శాతానికి పెంచుకోవాలని చూస్తున్నట్లు శామ్సంగ్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్ బిజినెస్ అమ్మకాలు, మార్కెటింగ్, నిర్వహణ హెడ్ మోహన్ దీప్ సింగ్ తెలియజేశారు. పరిశ్రమ విశ్లేషకుల అంచనాల ప్రకారం దేశీ టీవీ మార్కెట్ 2022కల్లా 4.6 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 35,000 కోట్లు)కు చేరవచ్చు. చదవండి: నిరుత్సాహకర ఫలితాలు..ఏసీసీ లాభం 30 శాతం డౌన్ -
అద్భుతమైన ఫీచర్స్.. కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన వన్ ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ టీవీల విభాగంలో 2020తో పోలిస్తే 2021లో 350 శాతం వృద్ధి సాధించినట్టు టెక్నాలజీ కంపెనీ వన్‌ప్లస్ ప్రకటించింది. ‘2019లో భారత్‌లో టీవీలను పరిచయం చేశాం. 2021 నాల్గవ త్రైమాసికంలో అతిపెద్ద స్మార్ట్ టీవీ బ్రాండ్లలో టాప్–5లో చోటు సంపాదించాం’ అని కంపెనీ ప్రకటించింది. తాజాగా భారత్‌లో 43 వై1ఎస్ ప్రో టీవీని వన్‌ప్లస్ ప్రవేశపెట్టింది. ఆధునీకరించిన 4కే యూహెచ్డీ డిస్ప్లేతో 43 అంగుళాల తెర, చిత్రం స్పష్టత కోసం ఎంఈఎంసీ సాంకేతికత, వేగవంతమైన గేమింగ్ అనుభూతికి ఆటో లో లేటెన్సీ మోడ్, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్, బడ్స్, వాచ్ కనెక్టివిటీ, డాల్బీ ఆడియో వంటి హంగులు ఉన్నాయి. వైఫై, డేటా కనెక్షన్ లేనప్పటికీ వన్‌ప్లస్ కనెక్ట్ 2.0 ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో టీవీని ఆపరేట్ చేయవచ్చు. ధర రూ.29,999 ఉంది. -
కొత్త టీవీ, స్మార్ట్ఫోన్లను కొనాలనుకుంటున్నారా..అయితే మీకో షాకింగ్ వార్త..!
చైనాలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. కరోనా వైరస్ దెబ్బకి చైనాలో మళ్లీ పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. చైనా టెక్ హబ్ షెన్జెన్లో కూడా కోవిడ్ కేసులు వీపరితంగా పెరిగిపోయాయి. ఇప్పుడిదే సామాన్యుల పాలిట భారంగా మారనుంది. చైనా టెక్ హబ్ షెన్జెన్లో లాక్‌డౌన్‌తో విధిస్తే స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సరఫరాలో షెన్జెన్ నంబర్ 1 ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ సరఫరా నగరాల్లో షెన్జెన్ ఒకటి. చైనాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో..అక్కడి ప్రభుత్వం తగిన చర్యలను తీసుకొనేందుకు సిద్దమైంది. కాగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో చైనాలోని షెన్జెన్ నుంచి 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు భారత్‌కు వస్తున్నాయి. ఇలాగే కరోనా కేసులు పెరిగితే లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రీసెర్చ్ డైరెక్టర్ నవ్కేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. షెన్జెన్లో లాక్ డౌన్ మూడు వారాలు దాటితే అప్పుడు మన దేశంలోకి జూన్ త్రైమాసికపు స్మార్ట్‌ఫోన్స్, పర్సనల్ కంప్యూటర్స్ దిగుమతులపై ప్రభావం పడుతుందని తెలిపారు. అలాగే సెప్టెంబర్ త్రైమాసికంలో కూడా ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నారు. లాక్ డౌన్ జరిగితే కష్టమే..! ఇప్పటికే ప్రపంచదేశాలు తీవ్రమైన చిప్ కొరతను ఎదుర్కొన్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ప్రస్తుతం చైనాలో కోవిడ్ విజృంభించడంతో స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు. సుమారు స్మార్ట్‌ఫోన్స్ ధరలు 5 నుంచి 7 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేశారు. ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో ఆయా కంపెనీలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఇప్పుడు కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తే మాత్రం కంపెనీలు కచ్చితంగా ఆ భారాన్ని వినియోగదారులకు మోపే అవకాశం లేకపోలేదు. చదవండి: టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్‌కు సిద్ధమైన యూరప్ కంపెనీ..! -
అమెజాన్ బంపరాఫర్..! టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌పై 55 శాతం మేర తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. కొనుగోలుదారులకోసం అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేల్ లైవ్‌లో ఉంది. ఈ సేల్ మార్చి 14తో ముగియనుంది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ భాగంగా వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, రియల్మీ, ఒప్పో, టెక్నో, వంటి స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌ను హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇక స్మార్ట్‌టీవీలపై ఏకంగా 55 శాతం మేర తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ఇక మొబైల్ యాక్సెసరీస్‌పై 70 శాతం మేర, వైర్లెస్ హెడ్‌ఫోన్స్‌పై 60 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. ఇక ప్రైమ్ మెంబర్స్‌కు ఏకంగా రూ.20 వేల వరకు బెనిఫిట్స్ రానున్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్: స్మార్ట్‌ఫోన్స్‌పై బెస్ట్ ఆఫర్స్ ► OnePlus 9R(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌పై 15 శాతం తగ్గింపుతో రూ.33,999కు రానుంది. OnePlus 9 Pro(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌పై 12 శాతం తగ్గింపుతో రూ. 56,999 కోనుగోలుచేయవచ్చును. ► OnePlus 9(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌పై 14 శాతం తగ్గింపుతో రూ.42,999. అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి తగ్గింపు లేనప్పటికీ, స్మార్ట్‌ఫోన్స్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 16,550 రానుంది. దీంతో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 26,449కే కోనుగోలు చేయవచ్చును. ► Realme Narzo 50A (4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ రూ. 1500 తగ్గింపుతో రూ.11,499కు రానుంది. ► Samsung Galaxy M52 5G 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్‌పై రూ. 10 వేల తగ్గింపుతో 24,999కు రానుంది. ► Redmi 9A Sport స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1500 తగ్గింపుతో రూ. 6,999కు రానుంది. Redmi Note 11 స్మార్ట్‌ఫోన్‌పై 25శాతం తగ్గింపుతో రూ. 13,499కు రానుంది. ► Tecno Spark 8 Pro స్మార్ట్‌ఫోన్‌పై రూ.3500 తగ్గింపుతో రూ. 9999కు రానుంది. Tecno Camon 17 స్మార్ట్‌ఫోన్‌పై రూ . 2,000 తగ్గింపుతో రూ. 13,999కు అందుబాటులో ఉంది . అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్: టీవీ మోడళ్లపై బెస్ట్ ఆఫర్స్ ► OnePlus (32-అంగుళాల) Y-సిరీస్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీను రూ.15,999.కి కొనుగోలు చేయవచ్చు. ► Redmi TV (32-అంగుళాల నుంచి 55-అంగుళాల) స్మార్ట్‌టీవీలు తగ్గింపు ధరలలో రానున్నాయి. ► Samsung 43-అంగుళాల క్రిస్టల్ 4K సిరీస్ అల్ట్రా HD స్మార్ట్ LED TV రూ. 36,990 లభించనుంది. చదవండి: అమెజాన్ బంపరాఫర్..! ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! -
వారేవ్వా:రూ.10వేలకే!! రూ.30వేల ఖరీదైన 40 అంగుళాల ఎల్ఈడీ టీవీ!
మీరు టీవీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకిదే సువార్ణావకాశం. 40అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ కేవలం రూ.10,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ అసలు ధర రూ.30వేలు ఉండగా ఎక్ఛేంజ్ ఆఫర్లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. 40అంగుళాల ఎంఐ4ఏ హారిజోన్ ఎడిషన్ ఎంఐ4ఏ హారిజోన్ ఎడిషన్ 40అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.29,999కే అందుబాటులో ఉంది. అయితే ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎంఐ టీవీ ధరపై 23శాతం డిస్కౌంట్ తో రూ.22,999కే అందిస్తుంది. ఇక అదనంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌పై 10 శాతం డిస్కౌంట్ తో టీవీ ధర రూ.21,499కి చేరుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీరు కోరుకున్న టీవీపై డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు 40అంగుళాల టీవీపై ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.11వేల వరకు పొంద వచ్చు. దీంతో టీవీ ధర రూ.10,499లకే అందుబాటులోకి వస్తుంది. -
టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..! ఏకంగా రూ. 10 వేలకు పైగా..
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. కొనుగోలుదారులకోసం అమెజాన్ మొబైల్ అండ్ టీవీ సేవింగ్ డేస్ సేల్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేల్ లైవ్‌లో ఉంది. ఈ సేల్ ఫిబ్రవరి 15తో ముగియనుంది. వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, రియల్మీ, ఒప్పో, టెక్నో, వంటి స్మార్ట్‌ఫోన్స్‌పై 10 శాతం తగ్గింపుతో పాటు పలు బ్యాంకు కార్డులపై కూడా తగ్గింపును అందిస్తోంది అమెజాన్. ఇక స్మార్ట్‌టీవీలపై ఏకంగా 40 శాతం మేర తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ఇక మొబైల్ యాక్సెసరీస్‌పై కూడా డిస్కౌంట్ రేట్లకే అందిస్తోంది. మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డేస్‌లో అమెజాన్ అందిస్తోన్న కొన్ని ఆఫర్స్ ఇవే..! ► Redmi Note 11T 5G ధర రూ. 19,999 కాగా అసలు ధర రూ. 22,999 ► Mi 11X స్మార్ట్‌ఫోన్ రూ. 25,999 తగ్గింపుతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 6,000 డిస్కౌంట్‌తో పాటుగా అదనంగా మొబైల్ ఎక్సేఛేంజ్పై రూ. 3,000 తగ్గింపు. ► Samsung Galaxy M52 5G స్మార్ట్‌ఫోన్ రూ. 22,999కు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ.34,999. ► Samsung Galaxy M32 5G స్మార్ట్‌ఫోన్ రూ. 20,999కు అందుబాటులో ఉండనుంది. దీని లిస్టెడ్ ధర రూ. 23,999. ► Iqoo Z5 ధర రూ. 21,990 తగ్గింది. దీని లిస్టెట్ ధర రూ. 29,990. Iqoo 7 ధర రూ. 27,990. ► Realme Narzo 50A ధర ప్రస్తుతం రూ. 10,349 తగ్గింది, దీని అసలు ధర రూ. 12,999. ► ఇక Oppo, Realme, Tecno ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను ఫెడరల్ బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చును. ► 32-అంగుళాల Redmi TV ప్రస్తుతం రూ. 14,998, ఈ స్మార్ట్‌టీవీపై ఏకంగా రూ. 10,001 తగ్గింపు. ► 50-అంగుళాల Redmi TV ఆఫర్ ప్రైజ్ రూ. 34,998. దీని అసలు ధర రూ.44,999. ► 32-అంగుళాల Mi Horizon ఫుల్- HD TV ధర రూ. 16,499కు రానుంది. ► 43-అంగుళాల Samsung క్రిస్టల్ 4K ప్రో UHD TV అసలు ధర రూ. 52,900 కాగా ప్రస్తుతం రూ. 36,990 కు అందుబాటులో ఉండనుంది. ► OnePlus స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ. 16,499 తక్కువ ధరకే రానుంది. ► 50-అంగుళాల AmazonBasics 4K TV పై 40 శాతం వరకు తగ్గింపుతో రూ. 23,001కు అందుబాటులో ఉండనుంది. చదవండి: అమెజాన్ బంపరాఫర్..! ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! -
Flipkart TV Days Sale: కొత్త టీవి కొనేవారికి గుడ్‌న్యూస్.. రూ.7499కే స్మార్ట్ టీవీ..!
ప్రముఖ ఈ-కామర్స ఫ్లిప్‌కార్ట్ మరో సరికొత్త సేల్‌తో ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్‌లో భాగంగా వివిధ ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ టీవీలపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ టీవీ డేస్ సేల్ నేటి(ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 10, 2022వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో వివిధ బ్రాండ్ల టీవీల మీద 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీనితో పాటుగా యూజర్ నో కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ► శామ్ సంగ్ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఈ సేల్‌లో రూ.16,999కి అందుబాటులో ఉంది. ఈ టీవీపై 25% తగ్గింపు లభిస్తుంది. దీని మీద నెలకు ₹1,899తో ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ టీవీతో కస్టమర్లు 20వాట్ స్పీకర్‌ను కూడా పొందుతారు. ► వన్ ప్లస్ వై సిరీస్ 80 సెం.మీ(32 అంగుళాల) హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈ సేల్‌లో రూ.16,499కి అందుబాటులో ఉంది. ఈ టీవీ వినియోగదారులకు 17% తగ్గింపుతో లభిస్తుంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీలో కస్టమర్లు 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను పొందుతారు. ► ఇది కాకుండా ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్‌లో 24 అంగుళాల కొడాక్ హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ కేవలం రూ.7,999కే లభిస్తోంది. ఇది కాకుండా, మీరు అడ్సున్ 24 అంగుళాల మోడల్ టీవీని రూ.7,290కు కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో మార్క్యూ 24 అంగుళాల మోడల్ రూ.7,999కు లభిస్తోంది. ► రియల్ మీ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై 11 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో అది వినియోగదారులకు రూ.15,999కి అందుబాటులో ఉంటుంది. ఈ టీవీలో 24వాట్ స్పీకర్ అవుట్‌పుట్ , 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. (చదవండి: ఇక పెట్టుబడికి సిద్దం కాండి.. దేశంలో డిజిటల్ కరెన్సీ లాంచ్ అప్పుడే..!) -
శాంసంగ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ సేవలు పూర్తిగా బంద్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ మొబైల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లలో, స్మార్ట్‌టీవీల్లో టైజెన్ (Tizen) యాప్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టైజెన్ యాప్ స్టోర్‌ను 2021 డిసెంబర్ 31నే పూర్తిగా మూసివేసినట్లు శాంసంగ్ తెలిపింది. ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్‌కు..! పాత యూజర్లతో పాటుగా, కొత్త యూజర్లు కూడా టైజెన్ యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని శాంసంగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. GSMArena ప్రకారం..టైజెన్ యాప్ సేవల రిజిస్ట్రేషన్ శాంసంగ్ పూర్తిగా మూసివేసింది. ఈ యాప్ స్టోర్ కేవలం పాత కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అందులో కూడా పాత యూజర్లు గతంలో డౌన్లోడ్ చేసిన యాప్స్‌ను మాత్రమే పొందగలరని శాంసంగ్ వెల్లడించింది. శాంసంగ్ జెడ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్‌కు మారాలని శాంసంగ్ సూచించింది. స్మార్ట్‌టీవీల్లో, వాచ్‌ల్లో..! శాంసంగ్ టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఆండ్రాయిడ్‌కు గతంలోనే మారింది. ఆండ్రాయిడ్‌కు ముందుగా స్మార్ట్‌వాచ్, స్మార్ట్ఫోన్లలో టైజెన్ ఒఎస్‌ను శాంసంగ్ వాడింది. కాగా ఇటీవల కాలంలో కొత్త స్మార్ట్‌టీవీలను టైజెన్ ఒఎస్తో శాంసంగ్ ఆవిష్కరించింది. ఆయా స్మార్ట్‌టీవీల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తోంది. అసలు ఏంటి టైజెన్..! టైజెన్ స్టోర్ అనేది శాంసంగ్ స్మార్ట్ఫోన్లలో ముందే ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ స్టోర్. ఇది టైజెన్ ప్లాట్‌ఫారమ్ ఆధారిత అప్లికేషన్లను సపోర్ట్ చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ప్లే స్టోర్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్టోర్‌లో యూజర్లు అప్లికేషన్లను బ్రౌజ్ చేయడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ ఆయా స్మార్ట్‌టీవీలో కూడా ఉంది. ఈ యాప్ అన్ని ప్రముఖ ఆడియో , వీడియో స్ట్రీమింగ్ సేవలను అందిస్తోంది. ఇది శాంసంగ్ హెల్త్, స్మార్ట్ థింగ్స్, శాంసంగ్ టీవీ ప్లస్ తోపాటుగా అనేక ఇతర గేమింగ్ ఫీచర్లను కూడా అనుసంధానిస్తుంది. చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న ఇయర్‌ఫోన్స్, సోలార్‌పవర్‌తో ఛార్జ్..! -
త్వరపడండి..! మొబైల్, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డే సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ జనవరి 7న ప్రారంభమవ్వగా...జనవరి 10 తో ముగియనుంది. సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్, టీవీ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్‌టీవీలపై 48 శాతం వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపుతో గరిష్టంగా రూ. 1,000 వరకు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అదనంగా ఆర్నెల్ల స్క్రీన్ రిప్లేస్మెంట్, మూడు నెలల నోకాస్ట్ ఈఎంఐతో పాటుగా రూ. 20 వేల వరకు క్యాష్ బెనిషిట్స్ను పొందవచ్చును. ఈ సేల్ ముగిసిన వెంటనే అమెజాన్ ప్రీమియం ఫోన్ పార్టీ ఈవెంట్ జనవరి 12 మొదలుపెట్టనుంది. ఈ సమయంలో కస్టమర్లు తక్కువ ధరకే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.5వేల వరకు కూపన్ డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..! మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డే సేల్‌లో అమెజాన్ అందిస్తోన్న పలు ఆఫర్స్..! ► Mi 11X స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 23,499కు లభించనుంది. Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ. 19,999కు రానుంది. వీటిపై క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ► Redmi 9A స్మార్ట్‌ఫోన్ 7,199 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. దీనిపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా రానుంది. ► Samsung Galaxy S20 FE 5G స్మార్ట్‌ఫోన్‌ను 46 శాతం తగ్గింపుతో రూ. 39,990కి కొనుగోలు చేయవచ్చు. ► OnePlus 9R స్మార్ట్‌ఫోన్ రూ. 33,999, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ 36,999 మరియు వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ. 54,999 కు రానుంది. ► iQOO Z5ని రూ.21,990కి మరియు iQOO 7 స్మార్ట్‌ఫోన్‌ను రూ.27,990కి కొనుగోలు చేయవచ్చు. ► Realme Narzo 50A, Samsung Galaxy M52 5G, OnePlus Nord 2 5G స్మార్ట్ఫోన్లపై రూ. 5,000 వరకు డిస్కౌంట్ కూపన్స్‌ను అమెజాన్ అందిస్తోంది. ► AmazonBasics 50-అంగుళాల 4K TV 40 శాతం డిస్కౌంట్‌తో రూ. 32,999కు రానుంది. ► Sony 50-inch 4K UHD Google స్మార్ట్‌టీవీ 30 శాతం డిస్కౌంట్‌తో రూ. 77, 990కు లభించనుంది. ► iFFalcon 43-inch 4K UHD స్మార్ట్‌టీవీ ఏకంగా 48 శాతం తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ► Redmi TV 32 అంగుళాల HD Smart TVని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. ► Mi 40inch Horizon FHD TVని రూ.6000 తగ్గింపుతో రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు. చదవండి: బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.! -
Daiwa Smart TV: మార్కెట్లో మరో స్మార్ట్ టీవీ.. అదిరిపోయే ఫీచర్లు..
ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోవడంతో స్మార్ట్‌టీవీ మార్కెట్ జోరుమీదుంది. తాజాగా ఈ మార్కెట్లో వాటా దక్కించుకునేందుకు దావా కంపెనీ రంగంలోకి దిగింది. మార్కెట్లో అప్ టూ డేట్ ఫీచర్లతో తక్కువ ధరలో రెండు స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తెచ్చింది. - 43 ఇంచుల ఆల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ ధర రూ.34,999లు ఉండగా 55 ఇంచుల ఆల్ట్రా హెచ్డీ స్మార్ట్‌టీవీ ధర రూ. 49,999లుగా ఉంది. ఈ రెండు టీవీలు వెబ్ ఓస్ ఆధారంగా పని చేస్తాయి. ఈ టీవీలలో క్వాడ్‌కోర్ ప్రాసెసర్లను ఉపయోగించారు. 1.5 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజీని కలిగి ఉన్నాయి. - నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ప్రైమ్వీడియో, హాట్‌స్టార్ వంటి పాపులర్ ఓటీటీ యాప్స్ ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. థింక్‌క్యూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని ఇందులో అమర్చడం వల్ల వాయిస్ కమాండ్ కంట్రోల్, మ్యాజిక్ రిమోట్, అలెక్సా వంటి ఫీచర్లు కలిగి ఉంది. మొత్తంగా హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. దైవా కంపెనీకి దేశవ్యాప్తంగా 800లకు పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. -
జియో నుంచి స్మార్ట్‌టీవీలు, టాబ్లెట్స్..! లాంచ్ ఎప్పుడంటే..!
Jio Tablet & Jio TV Launch In 2022: పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు భారత మార్కెట్లలో స్మార్ట్‌టీవీలను కూడా లాంచ్ చేస్తోన్న విషయం తెలిసిందే. రెడ్మీ, రియల్మీ, నోకియా, మోటరోలా వంటి ప్రత్యర్థులకు పోటీగా స్మార్ట్‌టీవీలను, టాబ్లెట్స్‌ను విడుదల చేసే పనిలో రిలయన్స్ జియో ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలకే..! టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టెలికాం రంగంలోనే కాకుండా భారతీయులకు మరింత దగ్గరయ్యేందుకుగాను జియోఫోన్, జియో ఫోన్ నెక్స్ట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. వీటితో పాటుగా స్మార్ట్‌టీవీలను, టాబ్లెట్స్‌ను జియో లాంచ్ చేయనుంది. సరసమైన ధరలతో తన ఉపకరణాల పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు జియో ప్రణాళికలను రచిస్తోంది. దేశవ్యాప్తంగా స్మార్ట్‌టీవీ, టాబ్లెట్ మార్కెట్లలో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకొని తక్కువ ధరలకే అమ్మకాలను జరిపే ఆలోచనలో జియో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే..జియో స్మార్ట్‌టీవీలు తక్కువ ధరలకే వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణుల భావిస్తున్నారు. ఏజీఎం సమావేశంలో లాంచ్..! 91మొబైల్స్ నివేదిక ప్రకారం... స్మార్ట్‌టీవీ, టాబ్లెట్లను వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో తన తదుపరి వార్షిక సాధారణ సమావేశంలో రాబోయే ఉత్పత్తులపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏజీఎం సమావేశంలోనే పలు కొత్త ఉత్పత్తులను రిలయన్స్ జియో లాంచ్ చేస్తూ వస్తోంది. ప్రీలోడెడ్ యాప్స్..ప్రగతి ఓఏస్తో.. జియో స్మార్ట్‌టీవీలో ప్రీలోడెడ్ ఓటీటీ యాప్స్ వంటి స్మార్ట్ఫీచర్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా స్మార్ట్‌టీవీలు ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై ఏలాంటి స్పష్టత లేదు. మరోవైపు, జియో టాబ్లెట్‌లో ప్రగతిఓఎస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాబ్లెట్‌లో ఎంట్రీ-లెవల్ క్వాలకమ్ ప్రాసెసర్‌ని ఉపయోగించనున్నారు. చదవండి: జియో యూజర్లకు భారీ షాక్..! భారీగా పెరిగిన టారిఫ్ ధరలు..! -
భారత్‌లోకి ఒప్పో స్మార్ట్‌టీవీలు..! లాంచ్ ఎప్పుడంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లలోకి స్మార్ట్‌టీవీలను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒప్పో చైనా మార్కెట్లలో స్మార్ట్‌టీవీలను రిలీజ్ చేసింది. భారత మార్కెట్లలోకి ఒప్పో కే9 సిరీస్ స్మార్ట్‌టీవీలు వచ్చే ఆర్థిక సంవత్సరం క్యూ1లో రిలీజ్ చేయనుంది. ఈ స్మార్ట్‌టీవీలు మీడియాటెక్ ప్రాసెసర్‌తో రానున్నాయి. 65, 55, 43 అంగుళాల స్మార్ట్‌టీవీలను ఒప్పో రిలీజ్ చేయనుంది. చదవండి: తప్పిన తిప్పలు.. ఆన్లైన్లో అందుబాటులోకి జియోఫోన్ నెక్ట్స్! రేట్ల అంచనా..! ఒప్పో కే9 65 ఇంచ్ స్మార్ట్‌టీవీ ధర రూ. 45,600 ఒప్పో కే9 55 ఇంచ్ స్మార్ట్‌టీవీ ధర రూ. 32,000 ఒప్పో కే9 43 ఇంచ్ స్మార్ట్‌టీవీ ధర రూ. 22,800 చదవండి: విదేశాలకు దేశీయ 6జీ టెక్నాలజీ ఎగుమతి! -
తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్‌తో కార్బన్ స్మార్ట్‌టీవీలు లాంచ్..!
Karbonn Launches Made In India Smart LED TVs In India: ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం కార్భన్ మొబైల్స్ స్మార్ట్‌టీవీ ఉత్పత్తుల తయారీలోకి అడుగుపెట్టింది. అందులో భాగంగా భారత మార్కెట్లలోకి మూడు స్మార్ట్‌టీవీ మోడళ్లను కార్భన్ లాంచ్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా చొరవతో కంపెనీ స్మార్ట్‌టీవీలను తయారుచేసింది. కంపెనీ తన ఆఫ్‌లైన్ పరిధిని విస్తరించడానికి రిలయన్స్ డిజిటల్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ స్మార్ట్‌టీవీలను రిలయన్స్ డిజిటల్లో కొనుగోలు చేయవచ్చును. చదవండి: గూగుల్‌పే మాదిరిగా...వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్..! కార్బన్ స్మార్ట్‌టీవీ భాగంగా 32, 39, 24 అంగుళాల ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు క్వాలిటీ డిజైన్, ఇన్-బిల్ట్ యాప్ స్టోర్‌తో రానున్నాయి. స్మార్ట్‌ఫోన్‌తో ఈ టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చును. స్మార్ట్‌టీవీ పోర్ట్‌ఫోలియోలో భాగంగా రాబోయే 2 సంవత్సరాలలో 15 మోడళ్లకు విస్తరించాలని కార్బన్ లక్ష్యంగా పెట్టుకుంది. కార్బన్ స్మార్ట్‌టీవీల ధరలు రూ. 7990 నుంచి ప్రారంభమవ్వనున్నాయి. కార్బన్ స్మార్ట్‌టీవీ ఫీచర్స్..! బెజెల్లేస్ డిజైన్ హెచ్డీ డిస్ప్లే క్వాడ్‌కోర్ ఏ53 1.5GHz ప్రాసెసర్ మాలి-G31 (డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్) ఆండ్రాయిడ్ 9 సపోర్ట్ 1జీబీ ర్యామ్+8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ యూఎస్బీ సపోర్ట్ వీజీఏ, హెచ్డీఎమ్ఐ సపోర్ట్ మూవీ బాక్స్, స్మార్ట్‌టీవీ రిమోట్ ఇన్ బిల్ట్ యాప్స్ స్టోర్ 20వాట్ స్పీకర్స్ వైఫై, ఈథర్నెట్ సపోర్ట్ చదవండి: మిలిటరీ-గ్రేడ్ రేంజ్లో నోకియా స్మార్ట్‌ఫోన్..! కొనుగోలుపై ఇయర్‌బడ్స్ ఉచితం..! -
5 రోజుల్లో షావోమీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తెలిస్తే షాకే..!
దసరా, దీపావళి పండుగ సీజన్లు రావడంతో పలు ఈ-కామర్స్ సంస్థలు, ఇతర ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఉత్పత్తుల సంస్థలు ఫెస్టివల్ సీజన్లను ప్రకటించాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ-కామర్స్ సంస్థల బాటలోనే ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ కూడా నడుస్తోంది. షావోమీ కొనుగోలు దారులకు ‘దీపావళి సేల్ విత్ ఎమ్ఐ’ సేల్ ను ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌తో పాటుగా షావోమీ సేల్‌పై భారతీయులు ఎగబడి స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారు. 5 రోజుల్లో అక్షరాల 20 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించామని షావోమీ బుధవారం రోజున ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..! ప్రీమియం సెగ్మెంట్లో భాగంగా షావోమీ 11 లైట్ ఎన్ఈ5జీ, మిడియమ్ సెగ్మెంట్లో ఎమ్ 11ఎక్స్, రెడ్మీ నోట్ 10ఎస్, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ భారతీయులు భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో 10 శాతం మేర అమ్మకాలు జరిగాయని షావోమీ పేర్కొంది. ఇక స్మార్ట్‌టీవీ అమ్మకాల్లో కూడా షావోమీ రికార్డు నమోదు చేసింది. మూడురోజల్లో సుమారు లక్షకు పైగా స్మార్ట్‌టీవీలను షావోమీ విక్రయించింది. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్! -
స్మార్ట్‌ఫోన్స్, టీవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించిన వన్‌ప్లస్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కొనుగోలుదారులకు దీపావళి సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్స్, టీవీల కొనుగోలుపై భారీ డీల్స్‌ను, ఆఫర్లను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. వన్‌ప్లస్ తన అధికారిక వెబ్సైట్లో దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ 9 ప్రో , వన్‌ప్లస్ 9 ఆర్తో సహా , వన్‌ప్లస్ 9 శ్రేణిపై భారీ తగ్గింపును అందిస్తోంది. అదనంగా, వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌పై కూడా డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రకటించింది. తొమ్మిది నెలల వరకు నోకాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యాన్నికూడా వన్‌ప్లస్ అందించనుంది. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! వన్‌ప్లస్ 9ఆర్, వన్‌ప్లస్ 9 స్మార్ట్ఫోన్లపై రూ. 3000 తగ్గింపును ప్రకటించింది. దీంతో వన్‌ప్లస్ 9ఆర్ ధర రూ. 36,999, కాగా వన్‌ప్లస్ 9 రూ. 46,999 అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 9 ప్రోపై 4వేల తగ్గింపుతో రూ. 60,999 లభించనుంది. అమెజాన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో సుమారు 7 వేల తగ్గింపు ధరను అందిస్తోంది. అక్టోబర్ 4 నుంచి వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్సైట్లో ఎస్బీఐ కార్డులపై కూడా 7 వేల తగ్గింపు వర్తించనుంది. వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీ వై, యూ సిరీస్ శ్రేణి టీవీలపై 15 శాతం తగ్గింపును ప్రకటించింది. వన్‌ప్లస్ వై సిరీస్ 32-అంగుళాల టీవీ కొనుగోలుదారులకు రూ. 15,999కు లభించనుంది. అంతేకాకుండా అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై తక్షణ తగ్గింపు రూ. 2000 ను అందించనుంది. వన్‌ప్లస్ యూ సిరీస్ 50-అంగుళాల స్మార్ట్‌టీవీ రూ. 43,999 లభిస్తోంది. ఐసీఐసీఐ కార్డులపై అదనంగా రూ. 3 వేల తక్షణ తగ్గింపు రానుంది. చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్ బ్రాండ్ టీవీలు..! -
అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్ టీవీలు..!
పలు చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే భారత మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్నాయి. భారత్‌లో మరింత విస్తరించేందుకుగాను ఇక్కడే ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పలు అమెరికన్ కంపెనీలు పావులు కదుపుతున్నాయి. తాజాగా అమెరికన్ ప్రముఖ టీవీ తయారీ సంస్థ వెస్టింగ్ హౌజ్ భారత మార్కెట్లలోకి ‘మేడ్ ఇన్ ఇండియా’ టీవీలను లాంచ్ చేసింది. భారత్‌లో వెస్టింగ్‌హౌజ్ టీవీలను ఎస్పీపీఎల్ తయారుచేయనుంది. వెస్టింగ్‌హౌజ్ భారత్‌కు చెందిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్పీపీఎల్)తో ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం..వెస్టింగ్‌హౌస్ తయారీ, బ్రాండింగ్, డిజైనింగ్, ప్యాకేజింగ్, ఎస్పీపీఎల్ నిర్వహించనుంది. వెస్టింగ్‌హౌజ్ ఉత్పత్తులు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. కొత్తగా ప్రారంభించిన 'డబ్ల్యూ- సిరీస్' ధరలు రూ. 7,999 నుంచి మొదలవుతాయి . ఈ సిరీస్‌లో 24-అంగుళాల నాన్-స్మార్ట్ ఎల్ఈడీ టీవీ, 4 స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మోడళ్లు ఉన్నాయి. 32-అంగుళాల హెచ్డీ రెడీ, 40-అంగుళాల ఫుల్హెచ్డీ, 43-అంగుళాల ఫుల్హెచ్డీ, 55-అంగుళాల యూహెచ్డీ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ కార్డుల కొనుగోలుపై 10శాతం తక్షణ తగ్గింపును ప్రకటించింది. 24-అంగుళాల నాన్-స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర రూ. 7999. 32-అంగుళాల హెచ్డీ రెడీ స్మార్ట్ టీవీ ధర రూ. 12,999. 40-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 18,999. 43 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీ ధర రూ. 20, 999. 32,40,43 అంగుళాల మోడల్స్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనున్నాయి. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కల్గి ఉన్నాయి. 55-అంగుళాల మోడల్ ధర రూ.32,999. 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నేల్ స్టోరేజ్‌ను కల్గి ఉంది. అన్ని స్మార్ట్ టీవీ మోడళ్లలో 5.0 బ్లూటూత్, 2 యూఎస్బీ పోర్ట్‌లు, 3హెచ్డీఎమ్ఐ పోర్ట్‌లు. ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, జీ 5, సోనీ ఎల్ఐవి, గూగుల్ ప్లే స్టోర్ వంటి 500,000 ప్లస్ టీవీ షోలతో సహా గేమ్‌లకు మద్దతు ఇచ్చే అంతర్నిర్మిత క్రోమ్‌కాస్ట్ అండ్ ఎయిర్ప్లేను పొందుతారు. చదవండి: కంగుతిన్న మైక్రోసాఫ్ట్..! భారీగా షాకిచ్చిన యూజర్లు..! -
నోకియా నుంచి నయా ల్యాప్‌టాప్, స్మార్ట్‌టీవీలు లాంచ్..! ధర ఎంతంటే...?
Nokia Launched New Laptop, Smart TV's: నోకియా భారత మార్కెట్లో విక్రయాలను మరింత పెంచేందుకుగాను సరికొత్త వ్యూహాలతో ముందుకువస్తోంది. కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు తాజాగా నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్, కొత్త నోకియా స్మార్ట్ టీవీ సిరీస్ మోడళ్లను కంపెనీ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో భారత మార్కెట్లోకి మంగళవారం రోజున లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అక్టోబర్ 3 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 11 జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. కాగా నోకియా స్మార్ట్ టీవీ మోడల్స్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతో పనిచేస్తాయి. 50-ఇంచ్, 55-ఇంచ్ డిస్ప్లే పరిమాణాలలో నోకియా స్మార్ట్‌టీవీలను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు ఫుల్ హెచ్డీ, అల్ట్రా హెచ్డీ, క్యూఎల్ఈడీ వేరింయట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ధర ఏంతంటే...? నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్ ధర రూ. 56, 990. నోకియా 50ఇంచ్ అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్‌టీవీ ధర రూ. 44,999., కాగా అల్ట్రా హెచ్డీ 4కే క్యూఎల్ఈడీ ధర రూ. 49, 999గా నోకియా నిర్ణయించింది. నోకియా 55ఇంచ్ అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్‌టీవీ ధర రూ. 49,999., కాగా అల్ట్రా హెచ్డీ 4కే క్యూఎల్ఈడీ ధర రూ. 54, 999గా నోకియా నిర్ణయించింది. ఈ స్మార్ట్ టీవీ సెట్లు జేబీఎల్ స్పీకర్స్‌తో పనిచేస్తాయి. 2జీబీ ర్యామ్+ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌టీవీలు లభిస్తాయి. నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 స్పెసిఫికేషన్లు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ బరువు 1.4 కిలోలు 11 జెన్ ఇంటెల్ కోర్ i5 CPU డాల్బీ అట్మోస్ సపోర్ట్ 14-అంగుళాల ఫుల్-హెచ్డి ఐపిఎస్ డిస్ప్లే 16జీబీ ర్యామ్ + 512జీబీ NVMe ఎస్ఎస్డీ యూఎస్బీ టైప్-సి పోర్ట్, హెచ్డీఎమ్ఐ పోర్ట్ -
తక్కువ ధరల్లో స్మార్ట్‌టీవీ లాంచ్ చేసిన రెడ్మీ...!
భారత మార్కెట్లలోకి రెడ్మీ సరికొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు 32 అంగుళాల, 43 అంగుళాల సైజుల్లో ఉన్నాయి. రెడ్మీ లాంచ్ చేసిన స్మార్ట్‌టీవీలు ఆండ్రాయిడ్11 ఆపరేటింగ్ సిస్టమ్ కల్గి ఉంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 20 వాటా స్పీకర్స్, డాల్బీ ఆడియోను ఈ స్మార్ట్‌టీవీలు కలిగి ఉన్నాయి. 32-అంగుళాల వేరియంట్ ధర రూ .15,999 కాగా, 43-అంగుళాల వేరియంట్ ధర రూ .25,999గా రెడ్మీ నిర్ణయించింది. స్మార్ట్‌టీవీల అమ్మకాల తేదీని రెడ్మీ ఇంకా ప్రకటించలేదు. దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్‌టీవీలను రెడ్మీ విక్రయించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌టీవీలు ఎమ్ఐ. కామ్, అమెజాన్ సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. సేల్‌లో భాగంగా రెడ్మీ స్మార్ట్‌టీవీలపై అదనపు తగ్గింపుతో ప్రత్యేక ధరలకు అందించనుంది. రెడ్మీ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు 43ఇంచ్ స్మార్ట్‌టీవీ, 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ హెచ్డీ డిస్ప్లే హెచ్డీఎమ్ఐ సపోర్ట్ యూఎస్బీ ఈథర్నెట్ సపోర్ట్ డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఆటో లో లేటెన్సీ మోడ్ -
అలెక్సాతో పనిచేసే టీవీ, ఫీచర్లు ఇలా ఉన్నాయ్!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సొంతంగా అమెజాన్ బ్రాండెడ్ టీవీని మార్కెట్లోకి విడుదల చేయనుంది. బ్రాండ్ ఫైర్ టీవీ (మల్టీపుల్ మోడల్) తరహాలో 55 నుంచి 75 అంగుళాల నిడివితో ఉన్న టీవీని అక్టోబర్‌లో అందుబాటులో తెచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఫీచర్స్ బిజినెస్ ఇన్ సైడర్ ప్రకారం.. వర్చువల్ అసిస్టెంట్ డివైజ్ 'అలెక్సా' కమాండ్ కంట్రోల్‌తో పనిచేసేలా రెండేళ్ల నుంచి టీవీపై వర్క్ చేస్తుంది. ఇందుకోసం చైనా ఎలక్ట్రానిక్ కంపెనీ టీసీఎల్ టెక్నాలజీ సంస్థతో చేతులు కలిపింది. ఇక అమెజాన్ - టీసీఎల్ భాగస్వామ్యంలో బిల్డ్ అవుతున్న ఈ టీవీలో అడాప్టివ్ వాల్యూమ్ ఫీచర్‌ను యాడ్ చేస్తుంది. డిష్వాషర్ ధ్వని, వ్యక్తుల మధ్య సంభాషణలు, ఎక్కడైనా ప్లే అవుతున్న మ్యూజిక్ గుర్తించి అలెక్సా స్పందించనుంది.వీటితో పాటు భారత్‌లో అమెజాన్ బేసిక్ బ్రాండెడ్ టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అమెజాన్ ఫైర్ టీవీ సాఫ్ట్వేర్ ఆధారితమైన తోషిబా, ఇన్సిగ్నియా టీవీలను విక్రయించనుంది. ఇందుకోసం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ బెస్ట్బైతో ఒప్పందం కుదుర్చుకుంది. సొంత సాఫ్ట్ వేర్ లేదు అమెజాన్ సంస్థ ఇప్పటి వరకు 'వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్' అందించే సాఫ్ట్వేర్, ఇతర ఎక్విప్మెంట్లతో తయారు చేసిన టీవీలను అమెజాన్ మార్కెట్లో విడుదల చేస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా అమెజాన్ సంస్థ సొంతంగా తయారు చేసిన సాఫ్ట్వేర్ ఆధారిత టీవీలను విడుదల చేయాలని భావిస్తుంది.ఇందులో భాగంగా తొలిసారి అమెజాన్ బ్రాండెడ్ టీవీ బిల్డ్ చేస్తుంది. వచ్చే నెలలో అమెరికా, ఆ తరువాత భారత్‌లో విడుదల చేయనుంది. -
ఇండిపెండెన్స్‌డే ఆఫర్లు... తగ్గిన రెడ్మీ ఫోన్ల ధరలు
స్వాతంత్ర దినోత్సవ కానుకగా షావోమీ తన మొబైల్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. రీసెంట్గా మార్కెట్లో రిలీజైన మోడల్స్‌తో పాటు రన్నింగ్‌లో ఉన్న మొబైల్స్‌పై ఈ తగ్గింపును వర్తింప చేస్తోంది. ఈ మేరకు షావోమి తన ట్విట్టర్ పేజీ ద్వారా అధికారిక ప్రకటన జారీ చేసింది. ఎంఐ ఎక్స్ 11 5 జీ Xiaomi's Mi 11X 5G మొబైల్ ప్రస్తుతం మార్కెట్ ధర రూ.27,999లు ఉండగా ప్రత్యేక ఆఫర్ కింద రెండు వేలు తగ్గించారు. ఎంఐ 10టీ ప్రో 5జీ Xiaomi Mi 10T Pro ధర రూ. 39,999 ఉండగా ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద రూ. 36,999కి లభిస్తోంది. ఎంఐ 10ఐ Mi 10i మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో ఎంఐ 10ఐ మొబైల్‌ని లాంచ్ చేసినప్పుడు ధర రూ.21,999 ఉండగా ఇప్పుడు రూ. 20,999కి తగ్గించింది. రెడ్మీ 9 Redmi 9 మొబైల్ ఫోన్ ధర రూ. 8,999 ఉండగా రూ. 1500 తగ్గింపు ప్రకటించింది. స్టార్ట్ టీవీపై కూడా స్వాతంత్ర దినోత్సవ తగ్గింపు ఆఫర్లను ఆగస్టు 5 నుంచి 9 వరకు షావోమీ అమలు చేస్తోంది. మొబైల్ ఫోన్లతో పాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి షావోమీ స్మార్ట్‌టీవీ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 7,500ల వరకు క్యాష్‌బ్యాక్ అమలు చేస్తోంది. దీంతో పాటు 20,000 ఎంఏహెచ్ పవర్బ్యాంక్పై రూ.500 తగ్గింపు అందిస్తోంది. Avail exciting offers on #MiSmartphones during the #BigSavingDays 📲 Up to ₹6,000 off on Exchange🤑 📲 Up to ₹2,500 Instant Discount and more Last day today! Shop now on @flipkart and save BIG! 😇 pic.twitter.com/ppREeLdcAD — Mi India (@XiaomiIndia) August 9, 2021 -
మీ పాత టీవీని స్మార్ట్‌టీవీగా ఇలా మార్చేయండి....!
ప్రస్తుత కాలంలో టీవీలు లేని ఇళ్లు ఉన్నాయంటే చాలా అరుదు. పెరుగుతున్న సాంకేతికతో పాటుగా టీవీల పరిణామ క్రమంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. పిక్చర్‌ట్యూబ్ టీవీల నుంచి స్మార్ట్‌టీవీల వరకు టీవీల పరిణామ క్రమం ఎదిగింది. ప్రస్తుతం స్మార్ట్‌టీవీల రాకతో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలో వచ్చే వీడియోలను నేరుగా టీవీల్లో పెద్ద స్క్రీన్‌పై చూడవచ్చును. ఈ ఫీచర్ కేవలం స్మార్ట్ టీవీలకు మాత్రమే వర్తిస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫాం వీడియోలను కేవలం స్మార్ట్ టీవీల్లో చూడగల్గుతాం అనుకుంటే మీరు పొరపడినట్లే..! మీ ఇంట్లోని పాత ఎల్ఈడీ లేదా ఎల్సీడీ టీవీలను కొన్ని ప్రత్యేకమైన గాడ్జెట్లను ఉపయోగించి స్మార్ట్‌టీవీగా తయారుచేయవచ్చును. ప్రస్తుతం మీ ఇంట్లోని టీవీలకు హెచ్డీఎమ్ఐ పోర్ట్ ఉన్నట్లయితే స్మార్ట్ టీవీలుగా ఇట్టే మార్చేయచ్చు. దాంతో పాటుగా ఇంట్లో వై-ఫై కనెక్టివీటి కూడా అవసరం. మీ పాత టీవీని స్మార్ట్ టీవీగా మార్చేందుకు మార్కెట్లో పలు రకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. 1. అమెజాన్ ఫైర్ స్టిక్ అమెజాన్ ఫైర్ స్టిక్‌తో మీ పాత టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చవచ్చును. అలెక్సానుపయోగించి వాయిస్ కంట్రోల్ ద్వారా ఓటీటీ యాప్‌లను ఇట్టే పొందవచ్చును. ఫైర్ స్టిక్‌ను హెచ్డీఎమ్ఐ పోర్ట్‌లో ఉంచి వైఫైకు కనెక్ట్ చేయాలి. దీని ధర రూ. 3,999. 2. టాటా స్కై బింజీ+ టాటా స్కై బింజీ సెటప్ బాక్స్‌తో పాత టీవీను స్మార్ట్ టీవీలుగా మార్చవచ్చును. టాటా స్కై బింజీ+ తో వినియోగదారులు తమ ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్లో ప్లే చేసే వీడియోలను టీవీలో చూడవచ్చును. టాటా స్కై బింజీ+లో క్రోమ్‌కాస్ట్ ఫీచరును ఏర్పాటు చేశారు. హెచ్డీఎమ్ఐ పోర్ట్‌తో స్మార్ట్ టీవీగా చేయవచ్చును. దీని ధర రూ. 3,999. 3. షావోమీ ఎమ్ఐ బాక్స్ 4కే షావోమీ ఎమ్ఐ బాక్స్ 4కే బాక్స్‌తో మీ పాత టీవీని స్మార్ట్‌టీవీగా మార్చవచ్చు. అంతేకాకుండా ఈ గాడ్జెట్‌తో గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చును. డాల్బీ అట్మోస్‌ను సపోర్ట్ చేస్తుంది. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఎమ్ఐ బాక్స్ 4కే ను నియంత్రించవచ్చు. ఈ పరికరం హెచ్డీఎమ్ఐ, యూఎస్బీ 2.0, బ్లూటూత్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 3,499. 4.యాక్ట్ స్ట్రీమ్ టీవీ 4 కే బాక్స్ యాక్ట్ ఫైబర్‌నెట్‌కు చెందిన యాక్ట్ స్ట్రీమ్ టీవీ 4కే బాక్స్‌తో ఏ రకమైన ఎల్ఈడీ టీవీలను స్మార్ట్ టీవీగా చేయవచ్చును. ఈ గాడ్జెట్‌లో సుమారు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తోంది. దీని ధర రూ. 4,499. 5. ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కల్గి ఉంది. గూగుల్ అసిస్టెంట్ ఉండడటంతో వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయవచ్చును దీని ధర రూ. 3,999. -
ఈ మైక్రో ఎల్ఈడి టీవీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
శామ్సంగ్ తన మైక్రో ఎల్ఈడీ టీవీని 'ది వాల్' పేరుతో రెండవ వెర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గత సంవత్సరం విడుదల చేసిన దానికంటే ప్రకాశవంతంగా ఉంది. ది వాల్ కొత్త వెర్షన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే దీని ధర ఎంత అనేది తెలిస్తే ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతారు. గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన మొదటి-జెన్ వెర్షన్ 110 అంగుళాల వెర్షన్ ధరనే $156000 (సుమారు ₹1,16,10,612)గా ఉంది. 2021 మైక్రో ఎల్ఈడీ టీవీ 'ది వాల్' ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికి దీని ధర మొదటి-జెన్ వెర్షన్ కంటే (రూ.కోటి కంటే) ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ది వాల్ మైక్రో ఎల్ఈడీ టీవీ అనేది 1,000 అంగుళాల డిస్ ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 16కె రిజల్యూషన్ కలిగి ఉంది. ఈ కొత్త వెర్షన్లో అందించిన ఎల్ఈడీ ప్యాన్సల్స్ హై కాంట్రాస్ట్, మెరుగైన కలర్ యూనిఫార్మిటీని ఇస్తాయని శామ్సంగ్ తెలిపింది. ఇందులో కొత్త తరం ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీని డిస్ ప్లే వెడల్పు చిన్నదిగా ఉంటుంది. శామ్సంగ్ పేర్కొన్న ప్రకారం.. ఇది వాల్, రిటైల్ స్థలాలు, ఐటీ కార్యాలయ భవనాలలో, షాపింగ్ మాల్స్ లో వినియోగించడానికి ఎక్కువగా అనువుగా ఉంటుంది. ఇందులో హై-ఎండ్ హోమ్ థియేటర్ సెటప్ ఉంది. -
48 ఎంపీ కెమెరాతో కొత్త టీవీ లాంచ్ చేసిన ఎంఐ
షియోమీ చైనాలో ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్, ఎంఐ టీవీ ఈఎస్ 2022 స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. రెండు టీవీలు విభిన్న ఫీచర్లతో వచ్చాయి. ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ మీడియాటెక్ MT9950 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3డీ ఎల్ యుటీ ఫిల్మ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ కలర్ కరెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. దీని ముందు భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 48 మెగాపీక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. మరోవైపు, ఎంఐ టీవీ ఈఎస్ 2022 మీడియాటెక్ ఎమ్ టి9638 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. రెండు టీవీలు బెటర్ కాంట్రాస్ట్, పిక్చర్ క్వాలిటీ కొరకు మల్టీ జోన్ బ్యాక్ లైట్ సిస్టమ్ ని కలిగి ఉన్నాయి. ఈ కొత్త ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ 55 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 5,999(సుమారు రూ.68,900), 65 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 7,999(సుమారు రూ.91,900), ఇక 75 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 9,999 (సుమారు రూ.1,14,800)గా ఉంది. మరోవైపు, ఎంఐ టీవీ ఈఎస్ 2022 55 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 3,399(సుమారు రూ.39,000), 65 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 4,399(సుమారు రూ.50,500), 75 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 5,999 (సుమారు రూ.68,900)గా ఉంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు అధికారికంగా జూలై 9న మార్కెట్లోకి రానున్నాయి. ఎంఐ.కామ్ లో ఇప్పటికే ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. చదవండి: Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం -
మార్కెట్లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్!
వెబ్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ కొత్త టీవీని లాంచ్ చేసింది. సోనీ బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్ ఈడీ సిరీస్ కింద ఈ స్మార్ట్ టీవీని విడుదల చేస్తున్నట్లు సోనీ ప్రతినిధులు తెలిపారు. దీని ధర రూ.2.99లక్షలుగా నిర్ణయించారు. ఫీచర్స్ విషయానికొస్తే ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ టీవీ ఇంచెంస్ : 65 అంగుళాలు ఓఎల్ఇడి ప్యానెల్ ఎక్స్ ఆర్ కాగ్నిటీవ్ ప్రాసెసర్. ఎక్స్ఆర్ సౌండ్ పొజిషనింగ్ ద్వారా ఎకౌస్టిక్ సర్ఫేస్ ఆడియోని 3డి సరౌండ్ అప్‌స్కేలింగ్‌తో జాగ్రత్త తీసుకుంటుంది. కొత్త బ్రేవియా టీవీ డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌లకు సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడేందుకు వీలుగా బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80జె డిజైన్ చేసినట్లు, అందులో గేమ్ మోడ్, హెచ్డిఎంఐ 2.1 సపోర్ట్, 4 కె 120 ఎఫ్పిఎస్, విఆర్ఆర్, ఎల్ఎల్ఎం ఉన్నాయి. గేమ్‌ను ఆస్వాధించి, ధ్వనిని ఆప్టిమైజ్ చేసే యాంబియంట్ ఆప్టిమైజేషన్, లైట్ సెన్సార్,ఎకౌస్టిక్ ఆటో-కాలిబ్రేషన్ ఇందులో ఇమిడి ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ , గూగుల్ టీవీ, వాయిస్ సెర్చ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలెక్సా స్మార్ట్ పరికరాలు, ఆపిల్ ఎయిర్‌ప్లే 2, హోమ్కిట్లతో కూడా పనిచేస్తుంది. గేమ్స్ ఆడుకోవచ్చా? నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన బ్రేవియా ఎక్స్ఆర్ ఏ80 జేఓఎల్ఈడి లో ఉపయోగించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కలర్, కాంట్రాస్ట్, తదితర ఫీచర్లు హుమన్ బ్రెయిన్ తరహాలో విశ్లేషిస్తుంది. ఈ ఏఐ వల్ల టీవీలో వచ్చే దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ సందర్భంగా సోనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. త్వరలో 77 అంగుళాల వేరియంట్‌తో సహా ఈ సిరీస్‌లో కొత్త మోడళ్లను త్వరలో ప్రవేశపెడతామని తెలిపారు. చదవండి: Realme: ఎన్నో ఫీచర్లు, ధర ఇంత తక్కువా?! -
Realme: ఎన్నో ఫీచర్లు, ధర ఇంత తక్కువా?!
సాక్షి,వెబ్ డెస్క్: కరోనా కారణంగా స్తబ్ధుగా ఉన్న స్మార్ట్ మార్కెట్ జోరందుకుంది. దేశంలో అన్‌లాక్‌తో ఆయా సంస్థలు స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు సందడి చేస్తుండగా మరికొద్దిరోజుల్లో రియల్ మీకి రియల్-మి నార్జ్30 5జీ, నార్జో30 4జీ స్టార్ట్ఫోన్లతోపాటు, బడ్స్ క్యూ2, 32 అంగుళాల స్మార్ట్ టీవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిసారి రియల్ మీ మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంది. కానీ తాజాగా రియల్ మీ నార్జో30 సిరీస్ లోని నార్జో30 ప్రో, నార్జో30 ఎ అనే రెండు మోడళ్లు స్మార్ట్ ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని రియల్-మి ఇండియా, యూరప్ సీఈఓ మాధవ్ శేథ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ నార్జో 30ప్రో, నార్జో30 ఏ స్మార్ట్ ఫోన్లు మలేషియాలో రేసింగ్ బ్లూ, రేసింగ్ బ్లాక్ కలర్స్ లో విడుదలయ్యాయి. రియల్ మీ నార్జో30 5జిస్పెసిఫికేషన్లు స్పెసిఫికేషన్ల వారీగా రియల్మే నార్జో30 5జి, నార్జో30 4జి చిప్సెట్, ఇతర చిన్న స్పెసిఫికేషన్లు మినహాయిస్తే మిగిలిన ఫీచర్స్ అన్నీ ఒకేలా ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రియల్మీ నార్జో30 5జి ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ధర: 799 మలేషియన్ రింగెట్లుగా(సుమారు రూ.14,100) నిర్ణయించారు. భారత్ లో సైతం కాస్ట్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చనే అంచనా. నార్జో30 4జి స్పెసిఫికేషన్లు నార్జో30 4జి లో మీడియాటెక్ హెలియో జి 95 చిప్సెట్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్ నెస్ ను అందిస్తాయి. 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ క్వాలీటీ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫోన్ పై భాగంలో ఎడమ వైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఫోన్ ఆండ్రాయిడ్ 11కు చెందిన రియల్మీ యుఐ 2.0తో పనిచేస్తుంది. రియల్ మీ నార్జో30 5జి స్పెసిఫికేషన్లు రియల్ మీ నార్జో30 5జిలో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ చిన్న కెమెరాలు, బ్లాక్ అండ్ వైట్ 2 మెగాపిక్సెల్ ఉన్నాయి. మీరు ఫోన్లో నైట్స్కేప్ మోడ్, ఏఐని ఆపరేట్ చేయవచ్చు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అదే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న 4జి వేరియంట్లో 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ను వినియోగించుకోవచ్చు. రియల్ మీ బడ్స్ క్యూ2 స్మార్ట్ టీవీ ఫీచర్స్ రియల్ మీ అధికారిక వెబ్ సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం... రియల్ మీ బడ్స్ క్యూ2.. రియల్ మీ బడ్స్2 నియో లాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే బడ్స్ క్యూ 2 యాక్టీవ్ సౌండ్స్‌ను కంట్రోల్ చేస్తే బడ్స్2 బయట నుంచి వచ్చే సౌండ్ ను కంట్రోల్ చేయగలదు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ పూర్తి హెచ్డి రిజల్యూషన్, ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతోంది. ప్రస్తుతానికి దీని ధర మాత్రం అందుబాటులో లేదు. -
షియోమీ నుంచి మరో సరికొత్త ఒఎల్‌ఈడీ టీవి
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మొబైల్స్ తో పాటు, స్మార్ట్ టీవిల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే రెండు టీవిలను విడుదల చేసిన సంస్థ వచ్చే నెలలో మరో కొత్త ఒఎల్‌ఈడీ డిస్ప్లేతో టీవిని మార్కెట్లోకి తీసుకొనిరావాలని యోచిస్తుంది. చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ వీబోలో మి టీవీ లాంచ్‌ను టీజ్ చేయడం ప్రారంభించింది. కొత్తగా తీసుకొనిరాబోయే ఈ మోడల్ టీవి గురించి ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ ఒక టిప్‌స్టర్ అందించిన వివరాల ప్రకారం.. సంస్థ తర్వాత తరం ఒఎల్‌ఈడీ టీవి కావచ్చునని తెలుస్తుంది. షియోమీ గత ఏడాది జూలైలో ఎంఐ టివి లక్స్ సిరీస్‌ను ఒఎల్‌ఈడీ డిస్ప్లేతో పరిచయం చేసింది. సాదారణంగా షియోమీ దాని ఎంఐ టీవి శ్రేణిలో ఎల్ఇడి ప్యానెల్స్‌ను ఉపయోగిస్తుంది. వీబోలోని ఎంఐ టీవీ జనరల్ మేనేజర్ రెండు వేర్వేరు టీవీ సెట్ల చిత్రాలను పంచుకున్నారు. గత ఏడాది సంస్థ తెచ్చిన ఎంఐ టివి లక్స్ 65 అంగుళాల 4కె ఒఎల్‌ఈడీ టీవి ధర సిఎన్ వై 12.999 (సుమారు రూ.1,48,800)గా ఉంది. కంపెనీ తన కొత్త ఒఎల్‌ఈడీ ఎంఐ టీవిని గత ఏడాది ఆఫర్ చేసిన దానికంటే తక్కువ ధరకు తీసుకొస్తుందా అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. దీని ఎప్పుడు విడుదల చేయనున్నారు అనే దాని గురించి కంపెనీ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. చదవండి: ఎయిర్టెల్ 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా? -
Samsung స్మార్ట్‌టీవీ: అద్భుత ఫీచర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణకొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌టీవీని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. శాంసంగ్ ది ఫ్రేమ్ టీవీ 2021 పేరుతో ఈ స్మార్ట్‌టీవీని విడుదల చేసింది. మునుపటి మోడల్ స్మార్ట్‌టీవీల కంటే ఇది 46శాతం సన్నగా ఉంటుంది. 43 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు వేర్వేరు సైజుల్లో ఈ టీవీ లభించనుంది. విభిన్న కలర్ బెజెల్స్‌ను ఎంచుకునే అవకాశంతోపాటు, టీవీని ఏర్పాటు చేసిన ప్లేస్‌లో పరిసరాలకు సరిపోయేలా టీవీ అంచుల డిజైన్లను మార్చుకోవడం ఈ స్మార్ట్‌టీవీ ప్రత్యేకత. ఫ్రేమ్ టీవీ 2021 ఫీచర్లు, ధర క్యూఎల్ఈడీ డిస్ప్లే,100శాతం కలర్ వాల్యూమ్‌ను అందిస్తుంది. శాంసంగ్ క్వాంటమ్ డాట్ టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తున్న కొత్త టీవీ మోడళ్లలో యూహెచ్డీ క్వాలిటీలో 1,200 ఫొటోలను స్టోర్ చేసుకోవడానికి వీలుగా స్టోరేజ్ సామర్థ్యాన్ని 500 ఎంబీ నుంచి 6జీబీ వరకు పెంచింది. ఈ టీవీ ప్రారంభ ధర రూ.61,990గా ఉండనుంది. జూన్ 12 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ల నుంచి దీన్ని కొనుగోలు చేయొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.3వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. జూన్ 12 నుంచి 21 మధ్య కొనుగోలు చేసిన కస్లమర్టకు కాంప్లిమెంటరీగా 9990 రూపాయల విలువైన బెజెల్‌ను అందిస్తుంది. చదవండి : Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ! -
బడ్జెట్ ధరలో అదిరిపోయిన వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ
కొద్దీ నెలలు క్రితం వరకు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తమ సత్తా చాటిన చైనా మొబైల్ కంపెనీలు. ఇక తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. కేవలం మొబైల్ మార్కెట్ వరకు మాత్రమే పరిమితం కాకుండా స్మార్ట్ టీవీ మార్కెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే వన్‌ప్లస్ ఇండియా తన టీవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీలను విడుదల చేస్తుంది. తాజాగా వన్‌ప్లస్ భారతదేశంలో వన్‌ప్లస్ 40 వై 1 స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఇది 40 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంది. దీని ధర రూ.21,999. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. వన్‌ప్లస్ వై-సిరీస్‌లో ఇప్పటికే 32-అంగుళాల, 43-అంగుళాల టీవీలను విడుదల చేసింది. అలాగే, వన్‌ప్లస్ యు-సిరీస్‌లో 55 అంగుళాల టీవీ కూడా ఉంది. వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 మే 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లో తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి టివిని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు 10 శాతం ఆఫ్ పొందవచ్చు. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 ఆండ్రాయిడ్ టీవీ. అంటే యూజర్లు గూగుల్ అసిస్టెంట్‌తో పాటు గూగుల్ ప్లే స్టోర్‌కు చెందిన అనేక యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 ఫీచర్స్: వన్‌ప్లస్ టీవీ 40 వై 1 ఆక్సిజన్‌ప్లే యుఐ ఆధారంగా పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్‌స్టార్, సోనీ లివ్, హంగమా, ఈరోస్ నౌ వంటి ప్రైమ్ వీడియోలకు అనుమతి ఉంటుంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వన్‌ప్లస్ టీవీని యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ వీడియోలను సులభంగా అన్వేషించడానికి ట్రాక్‌ప్యాడ్‌తో ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌గా ఉపయోగించవచ్చు. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 1920x1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో డాల్బీ ఆడియో సపోర్ట్, 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే వై-ఫై 2.4GHz 802.11 b / g / n, బ్లూటూత్ 5.0, 1 ఈథర్నెట్ పోర్ట్, 1 RF కనెక్షన్ ఇన్పుట్, 2 HDMI ఇన్పుట్, 1 AV ఇన్పుట్, 1 డిజిటల్ ఆడియో అవుట్‌పుట్, 2 యూఎస్ బీ పోర్టులు ఉన్నాయి. చదవండి: 5జీతో భారీగా కొత్త నియామకాలు -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌సేల్: భారీ ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి డిస్కౌంట్ ఆఫర్ల అమ్మకాలను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ పేరుతో టీవీలు, ఏసీలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గింపే ధరలకే విక్రయించనుంది. మే 2 న మే 7 వరకు ముగియనున్న ఈ సేల్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం వరకు భారీ ఆఫర్లు అందించనుంది. ఇంకా టీవీల 75 శాతం డిస్కౌంట్ అందించనుంది. అలాగే ఆపిల్ శాంసంగ్, గూగుల్ సంస్థల ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కూడా తగ్గింపు ధరల్లో అందించనుంది. అంతేనా ఏసీలు, స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, కంప్యూటర్ ఉపకరణాల ధరలపై తగ్గింపును ప్రకటించింది. దీనికి అదనంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ఈఎంఐ ట్రాన్సక్షన్లపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లు లభ్యం. (సుజుకి హయాబుసా క్రేజ్: ఆ వేరియంట్ ఔట్ ఆఫ్ స్టాక్!) ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు : ప్రధానంగా ఐఫోన్ 11 ఫోన్ ను ఈ సేల్ లో రూ. 7 వేల తగ్గింపును ప్రకటించింది. తాజా తగ్గింపుతో రూ. 44,999కే లభ్యం. లాంచింగ్ ధర రూ. 51,999. ఆసుస్ ఆర్ఓజి ఫోన్ 3 ధర 46,999 నుంచి ప్రారంభం ఐక్యూ 3 29,990 8 జీబీ +128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,990 ఎంఐ 10 టీ సిరీస్‌ను ప్రారంభ ధ 27,999 రూపాయలు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62 ఫోన్ రూ. 17, 999 కే లభించనుంది. గెలాక్సీ ఎఫ్ 41 6 జీబీర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,499 6 జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499 శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 రూ. 9,999 గూగుల్ పిక్సెల్ 4 ఏ ఫోన్ రూ. 26, 999 కే కొనుగోలు చేయవచ్చు. వీటితో కంప్యూటర్ ఉపకరణాలు రూ. 99 నుంచి లభించనున్నాయి. స్మార్ట్‌వాచ్‌లు, హెడ్ఫోన్లు (70 శాతం వరకు), బ్లూటూత్ స్పీకర్లు (70 శాతం వరకు), ల్యాప్‌టాప్‌లు (40 శాతం వరకు) పవర్ బ్యాంకులపై డిస్కౌంట్ అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 75 శాతం తగ్గింపుతో స్మార్ట్ టీవీలు కూడా లభిస్తాయి. వన్‌ప్లస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 14,999లకే కొనుగోలు చేయవచ్చు. -
లాంచ్ కు సిద్ధంగా 75 అంగుళాల షియోమీ స్మార్ట్ టీవీ
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన హవా కొనసాగిస్తున్న షియోమీ. ఇప్పుడు స్మార్ట్‌టీవీ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తుంది. క్రమ క్రమంగా భారత టెలివిజన్ మార్కెట్‌ను కూడా సొంతం చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 పేరుతో అతిపెద్ద స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. షియోమీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్మార్ట్ టీవీల్లో కెల్లా ఇదే అతిపెద్ద స్మార్ట్ టీవీ కావడం విశేషం. అంతేకాక, షియోమీకి చెందిన అత్యంత ఖరీదైన టెలివిజన్ కూడా ఇదేనని తెలిపింది. దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్లు 2020 డిసెంబర్లో ఇదే సిరీస్‌లో విడుదలైన 55 అంగుళాల వేరియంట్‌తో సమానంగా ఉంటాయని పేర్కొంది. కాగా, ఈ కొత్త స్మార్ట్‌టీవీ ఏప్రిల్ 23న జరిగే ఆన్లైన్ కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదే కార్యక్రమంలో ఎంఐ 11ఎక్స్ సిరీస్ స్మార్ట్ఫోన్లను కూడా లాంఛ్ చేయనుంది. ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 అంగుళాల అతి పెద్ద స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ టీవీలో సినిమా చూసేటప్పుడు థియేటర్లో చూస్తున్న అనుభూతిని ఇస్తుంది. ఈ టీవీ ధరను మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఇదే ఫీచర్లతో ఇతర కంపెనీల నుంచి విడుదలైన 75 అంగుళాల టీవీలు రూ.1,50,000 ధరల శ్రేణిలో లభిస్తుండగా.. దీని ధర లక్ష రూపాయలలోపే ఉండే అవకాశం ఉంది. చదవండి: ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు! -
ఎలక్ట్రానిక్ వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్
కొత్త మొబైల్, ఎలక్ట్రానిక్, దుస్తువులు కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ పేరుతో ఫ్లీప్కార్ట్ మరో కొత్త సేల్ ని తీసుకొనివచ్చింది. ఈ సేల్ మార్చి 24 నుంచి మార్చి 26 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల మాత్రం నేటి నుంచి సేల్ లో పాల్గొనవచ్చు. మూడు రోజుల పాటు జరిగే సేల్ లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన ఆఫర్స్ అందిస్తుంది. ఎస్బిఐ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే వారికీ 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ మాత్రం మొబైల్ ప్రియుల కోసం అమెజాన్ "ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్"ను తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(మార్చి 22) నుంచి మార్చి 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో రియల్ మీ, పోకో, ఆపిల్ కు సంబందించిన ఉత్పత్తుల ఉన్నాయి. చదవండి: కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త! -
గేమింగ్ టీవీ లాంచ్ చేసిన ఎల్జీ
ఎల్జీ మనదేశంలో సరికొత్త టీవీని లాంచ్ చేసింది. దీన్ని ప్రత్యేకంగా గేమర్ల కోసం రూపొందించారు. గేమింగ్ కోసం ఆటో లో-లాటెన్సీ మోడ్‌తో తీసుకొచ్చిన ఎల్జీ ఓఎల్ఈడీ 48సీఎక్స్ టీవీ ధర రూ.1,99,990గా ఉంది. ఈ ఓఎల్ఈడీ టీవీలో వేగవంతమైన గేమ్ ప్లేతో పాటు అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. స్మార్ట్ టీవీలో ఏఎమ్ డీ ఫ్రీసింక్, ఎన్విడియా జి-సింక్ సపోర్ట్ ఉంది. ఈ 48 అంగుళాల టీవీ ఆల్ఫా 9 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆడియో కోసం ఎఐ ఎకౌస్టిక్ ట్యూనింగ్‌తో పాటు 'హెచ్‌డిఆర్ 10 ప్రో' సపోర్ట్‌ను అందిస్తుంది. ఎల్జీ పేర్కొన్నట్లు 4కే రిజల్యూషన్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఇందులో 48 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఇందులో ఎక్కువ ఫ్రేం రేట్, వీఆర్ఆర్ (వేరియబుల్ రిఫ్రెష్ రేట్), ఈఆర్క్, హెచ్డీఎంఐ 2.1 స్పెసిఫికేషన్లు ఉన్నాయి. పీఎస్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ కన్సోల్స్ కూడా ఉన్నాయి. అలాగే వీఆర్ఆర్ ఫీచర్ ద్వారా మీరు కనెక్ట్ చేసిన గేమింగ్ కన్సోల్కు తగినట్లు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మారుతుంది. ఇందులో సెల్ప్ లిట్ పిక్సెల్స్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా సినిమాలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు మంచి కలర్‌ను టీవీ అందిస్తుంది. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ఎల్జీ ఇండియా వెబ్ సైట్లోకి వెళ్లి తమ ప్రాంతంలో ఇది అందుబాటులో ఉందో లేదో చూసుకోవచ్చు. చదవండి: గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే! ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ -
రెడ్ మీ లవర్స్‌కు శుభవార్త..!
గత రెండేళ్ల నుంచి షియోమీ భారతదేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్‌ను రోజు రోజుకి ఆక్రమించుకుంటూ పోతుంది. ఇప్పటికే ఈ సంస్థ భారతదేశంలో అనేక స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. చివరగా 2020 డిసెంబర్ లో ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీని విడుదల చేసింది. ఇప్పుడు 2021లో రెడ్ మీ బ్రాండ్ పేరుతో మరొకొన్ని టెలివిజన్లను మార్కెట్లోకి తీసుకోని రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చైనాలో రెడ్ మీ పేరుతో షియోమీ స్మార్ట్ టీవీలను విక్రయిస్తోంది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఇదే విధంగా చేయాలని చూస్తోంది. ఈ సమాచారాన్ని టిప్‌స్టెర్ ముకుల్ శర్మ షేర్ చేశారు. రెడ్ మీ టీవీలు తక్కువ ధరతో మార్చిలో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే భారత్ లో విడుదల చేయబోయే మోడళ్లపై ఎటువంటి స్పష్టత లేదు. చైనాలో 2020లో విడుదల చేసిన 50-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల పరిమాణాల్లో గల రెడ్ మీ ఎక్స్50 సిరీస్ టీవీలను ఇండియాలో తీసుకొనిరావడానికి రెడ్ మీ చూస్తున్నట్లు సమాచారం. (ఇక వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి) రెడ్ మీ ఎక్స్50 సిరీస్ ఫీచర్స్: రెడ్ మీ స్మార్ట్ టీవీ స్క్రీన్ టు బాడీ రేషియో 97 శాతంగా ఉంది. ప్రస్తుతం ఎంఐ టీవీ 4మోడళ్లలో ఉన్న ప్లాస్టిక్ ఫ్రేమ్‌కు బదులుగా ఇవి మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి. 50, 55, 65 అంగుళాల టీవీలో 4కే అల్ట్రా హెచ్ డీ స్క్రీన్లను వీటిలో అందించారు. 60 హెర్ట్జ్ మోషన్ ఎస్టిమేషన్, ఎంఈఎంసీ వంటి ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం. వీటిలో 8 యూనిట్ సౌండ్ సిస్టం కూడా అందుబాటులో ఉంది. డాల్బీ ఆడియో, డీటీఎస్ హెచ్ డీ టెక్నాలజీలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఫీల్డ్ వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది. వీటిలో క్వాడ్ కోర్ ప్రాసెసర్ ను అందించారు. 32 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. వీటిలో డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఇన్ ఫ్రారెడ్, మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, ఒక ఏవీ కనెక్టర్, ఒక డీటీఎంబీ కనెక్టర్, రెండు యూఎస్ బీ పోర్టులు, ఒక ఎథర్ నెట్ పోర్టు, ఒక ఎస్/పీడీఐఎఫ్ కనెక్టర్ లను ఇందులో అందించారు.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్!) రెడ్ మీ ఎక్స్50 సిరీస్ ధర: చైనాలో ఎక్స్50 బేస్ మోడల్ టివి ధర సిఎన్‌వై1999(సుమారు రూ.21,000) ఉండగా ఎక్స్55 టివి ధర సిఎన్‌వై 2,299(సుమారు రూ.24,400)గా ఉంది. ఇక టాప్-ఆఫ్-ది-లైన్ రెడ్మి స్మార్ట్ టివి ఎక్స్65 ఖరీదు సిఎన్‌వై 3,299(సుమారు రూ.35,000)కు అందుబాటులో ఉంది. -
పెరిగిన షియోమీ స్మార్ట్ టీవీ ధరలు
న్యూఢిల్లీ: షియోమీ తన స్మార్ట్ టీవీల ధరలను పెంచేసింది. సుమారు టీవీల ధరలు 3వేల వరకు పెరిగాయి. షియోమీ యొక్క ఎంఐ టీవీ 4ఏ, ఎంఐ టీవీ 4ఎక్స్, ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు షియోమీ యొక్క ఎంఐ.కామ్ వెబ్సైట్ లో కూడా కనిపిస్తున్నాయి. స్మార్ట్ టీవీల మీద పెరిగిన ధరలు ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల్లో కూడా వర్తిస్తుంది అని పేర్కొంది. గత నెలలో షియోమీ తమ స్మార్ట్ టీవీల ధరలను విడిభాగాల ధరలు పెరిగిన కారణంగా పెంచనున్నట్లు ప్రకటించింది.(చదవండి: శామ్సంగ్: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ) ఎంఐ టీవీ 4ఏ ప్రో 32-అంగుళాల ధర రూ.13,999 నుంచి రూ.14,999కి, ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ 32అంగుళాల మోడల్ ధర రూ.14,999 నుంచి రూ.15,499కి పెరిగింది. అదేవిధంగా ఎంఐ టీవీ 4ఎ 43 అంగుళాల ధర రూ.22,499 నుంచి రూ.24,999కి పెరిగింది. ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ 43 అంగుళాల వేరియంట్ ధర రూ.23,499 నుంచి రూ.25,999కి పెంచింది. షియోమీ ఎంఐ టీవీ 4ఎక్స్ 43అంగుళాల ధర రూ.25,999 నుంచి రూ.28,999కి పెంచింది. మరోవైపు ఎంఐ టీవీ 4ఎక్స్ 50 అంగుళాల ధర రూ.31,999 నుంచి రూ.34,999కి, ఎంఐ టీవీ 4ఎక్స్ 55 అంగుళాల టీవీ ధర రూ.36,999 నుంచి రూ.39,999కి పెంచింది. గడిచిన రెండేళ్లలో షియోమీ 50 లక్షల టీవీలను విక్రయించినట్లు గత నెలలో పేర్కొంది. దీంతోపాటు షియోమీ ఎంఐ క్యూఎల్ఈడీ టీవీని కూడా గత నెలలో లాంచ్ చేసింది. ఇందులో డాల్బీ విజన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. -
శామ్సంగ్: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ
శామ్సంగ్ ఇండియా మరో కొత్త సేల్ ను "బిగ్ టీవీ డేస్ సేల్" పేరుతో ముందుకు తీసుకొచ్చింది. ఈ సేల్ లో కేవలం స్మార్ట్ టీవీలు మాత్రమే లభించనున్నాయి. కానీ ఈ సేల్ లో మీరు కొన్న ప్రతి స్మార్ట్ టీవీతో పాటు మొబైల్ ఫోన్స్, సౌండ్బార్లు ఉచితంగా లభించనున్నాయి. 55 అంగుళాల టీవీ నుంచి ప్రీమియం టీవీల వరకు అన్ని స్మార్ట్ టీవీలపైన ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్ 2021 జనవరి 1 నుంచి 31 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శామ్సంగ్ రిటైలర్ స్టోర్లలో ఈ సేల్ నడుస్తుంది. అలాగే వినియోగదారులు 20 శాతం క్యాష్‌బ్యాక్ కూడా సేల్‌లో పొందవచ్చు. రూ.1,990 ఈఎంఐకే స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు.(చదవండి: శామ్సంగ్ నుంచి సరికొత్త బడ్జెట్ మొబైల్) 65-అంగుళాల క్యూఎల్ఇడి టివి, 75 అంగుళాల క్రిస్టల్ 4కే యుహెచ్‌డి టివిలను కొనుగోలు చేసే వినియోగదారులకు శామ్సంగ్ గెలాక్సీ ఎ 51 ఉచితంగా లభిస్తుంది. 55 అంగుళాల క్యూఎల్ఇడి టీవీ, 65 అంగుళాల క్రిస్టల్ 4కె యుహెచ్‌డి టివిలను ఎంచుకునే కొనుగోలుదారులకు శామ్సంగ్ గెలాక్సీ ఎ31 స్మార్ట్‌ఫోన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే 75-అంగుళాల, 82-అంగుళాల, 85-అంగుళాల క్యూఎల్ఇడి టీవీలను కొనుగోలు చేసే వ్యక్తులు సౌండ్‌బార్ HW-Q800T లేదా HW-Q900T ఉచితంగా పొందుతారు. శామ్సంగ్ క్యూఎల్ఇడి టివిలకు 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ, ఒక ఏడాది కాంప్రహెన్సీవ్ వారెంటీ, ప్యానెల్‌పై ఒక ఏడాది అడిషనల్ వారెంటీ లభిస్తుంది. -
క్యూఎల్ఇడి 4కే టీవీ లాంచ్ చేసిన షియోమీ
న్యూఢిల్లీ: 55 అంగుళాల క్యూఎల్ఇడి అల్ట్రా-హెచ్డి స్క్రీన్‌తో గల స్మార్ట్ టీవీని షియోమీ భారతదేశంలో విడుదల చేసింది. ఎంఐ క్యూఎల్ఇడి 4కే మోడల్ టీవీని భారత్ లో మొదటిసారిగా పరిచయం చేసింది. ఈ స్మార్ట్ టీవీ 3840x2160 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం 55-అంగుళాల సైజు ఆప్షన్లో లభిస్తుంది. ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీ డిసెంబర్ 21న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్, విజయ్ సేల్స్ సహా ఇతర రిటైల్ దుకాణాల ద్వారా ఫస్ట్ సేల్ కి రానుంది. దీని ధర వచ్చేసి రూ.54,999.(చదవండి: ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు) ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీ ఫీచర్స్: ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీ 55 అంగుళాల అల్ట్రా-హెచ్డి(3840x2160) పిక్సెల్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది హెచ్ఎల్జి, హెచ్‌డిఆర్ 10, హెచ్‌డిఆర్ 10ప్లస్, డాల్బీ విజన్‌తో సహా వివిధ హెచ్‌డిఆర్ ఫార్మాట్లకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ టీవీ లాంఛర్తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ ఎమ్‌టి 9611 క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంది. ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీలో 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 6 స్పీకర్స్ 30వాట్ సౌండ్ ఔట్పుట్ ఇస్తాయి. 3 హెచ్డీఎంఐ, రెండు యూఎస్బీ పోర్టులు ఉన్నాయి. ఇందులో క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్‌గా వస్తుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 4కే రిజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీ బ్లూటూత్ 5, హెచ్డీఎంఐ ఈఏఆర్ సీ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో రిమోట్ లో కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, గూగుల్ అసిస్టెంట్ కోసం వేర్వేరు బటన్స్ ఉన్నాయి. -
12వేలలో ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ టీవీ
బడ్జెట్, ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ల తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ తాజాగా భారతదేశంలో తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఆవిష్కరించింది. 32 అంగుళాల, 43-అంగుళాల వేరియంట్లతో ఎక్స్ 1 స్మార్ట్ టివి సిరీస్‌తో ఆండ్రాయిడ్ టివి మార్కెట్లోకి ప్రవేశించింది. కెన్యా మరియు ఇతర దేశాలలో ఇదివరకే ఈ స్మార్ట్ టీవీలను ప్రారంభించారు. ఈ రెండు టీవీలు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ పొందాయి. కాబట్టి వీటిని చూడటంలో ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాదు.(చదవండి: బెస్ట్ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఇవే!) ఇన్ఫినిక్స్ ఎక్స్ 1 టీవీ ఫీచర్స్, ధర: ఇన్ఫినిక్స్ ఎక్స్ 1 స్మార్ట్ టివిని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లాంచ్ చేశారు. స్మార్ట్ టీవీలను 32-అంగుళాలు, 43-అంగుళాలతో వేరియంట్లలో వీటిని విడుదల చేశారు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ .11,999 కాగా, 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ .19,999. 32 అంగుళాల మోడల్లో హెచ్డీ డిస్ ప్లేను, 43 అంగుళాల మోడల్లో ఫుల్ హెచ్డీ డిస్ ప్లేను అందించారు. ఇది అంచులు లేని డిస్ప్లే ని తీసుకొచ్చారు. ఇందులో బెస్ట్ సౌండ్ కోసం అంతర్నిర్మిత బాక్స్ స్పీకర్లు తీసుకొచ్చారు. 43 అంగుళాల స్మార్ట్ టీవీ 24వాట్ స్పీకర్‌ను ఉపయోగిస్తుండగా, 32 అంగుళాల టీవీ 20వాట్ స్పీకర్‌ను ఉపయోగిస్తుంది. ఎక్స్1 సిరీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు 1జీబీ ర్యామ్ , 8జీబీ రోమ్ వంటి శక్తివంతమైన మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌పై నడుస్తాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ మొదలైన వీడియో యాప్స్ లకు మెరుగైన కనెక్టివిటీ కోసం ఇది అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ తీసుకొచ్చారు. ఎపిక్ 2.0 పిక్చర్ ఇంజిన్, 60 హెర్ట్జ్ డిస్ ప్లే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రెండు హెచ్డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్బీ పోర్టు, బ్లూటూత్ 5.0, వైఫై, ఐఆర్ రిమోట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు 32 అంగుళాల వేరియంట్లో ఉన్నాయి. మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టు, బ్లూటూత్ 5.0, వైఫై, బ్లూటూత్ రిమోట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు 43 అంగుళాల వేరియంట్లో అందించారు. -
కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన చై..సామ్
-
కొత్త టెక్నాలజీతో సూపర్ టీవీ
సాక్షి, ముంబై: స్మార్ట్ ఫోన్ తయారీదారు రియల్మీ త్వరలో ఒక కొత్త టీవీని ప్రారంభించనుంది. అద్భుతమైన టెక్నాలజీతో 55 అంగుళాల 4కే టీవీని అక్టోబర్‌లో విడుదల చేయనుంది. దీనిపై కంపెనీ సీఈఓ మాధవ్ శేథ్ ట్విటర్ ద్వారా సంకేతాలందించారు. రానున్న లాంచింగ్ పై ఆసక్తికరమైన కొత్త అప్ డేట్ అంటూ కొత్త టీవీ ఆవిష్కరణను చెప్పకనే చెప్పారు. రియల్మీ టీవీతో నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ సూపర్ టీవీ గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడికానప్పటికీ కంపెనీ తన బ్లాగులో పంచుకున్న వివరాల ప్రకారం ప్రపంచంలో తొలి "ఎస్ఎల్ఈడీ 4కే స్మార్ట్ టీవీ” తీసుకొస్తోంది. కంపెనీ తన 55 అంగుళాల స్మార్ట్ టీవీని తీసుకొస్తోంది. టీవీ సూపర్ అల్ట్రా-వైడ్ కలర్, కంటికి హాని కలగకుండా లో బ్లూలైట్‌తో ఎస్ఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్‌ను జోడించింది. స్టీరియో సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్‌ను అందించడానికి డాల్బీ ఆడియో, ఎస్ పీడీ టెక్నాలజీ (స్పెక్ట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్) ఫీచర్లు న్నాయి. (రియల్మీ నార్జో 20 సిరీస్ ఫోన్లు : ఫీచర్లు ఇవే) కాగా రియల్మీ మొట్టమొదటి స్మార్ట్ టీవీలను ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసింది. రియల్మీ టీవీ 32 అంగుళాల వెర్షన్ ధర రూ .12,999 43 అంగుళాల వేరియంట్ ధర 21,999 రూపాయలు వద్ద ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్సైట్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. Really excited to #LeapToNextGen! I have some interesting updates about our upcoming launch for you all & I am sure it will make your lives much cooler with the most stunning visuals ever. Stay tuned for the next #AskMadhav episode. pic.twitter.com/m7RPky3PSZ — Madhav Faster7 (@MadhavSheth1) September 25, 2020 -
యప్‌టీవీ స్మార్ట్ టీవీ ఆఫర్ విజేతలు వీరే..
హైదరాబాద్ : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం యప్‌టీవీ ఇటీవల ప్రవేశపెట్టిన స్మార్ట్ టీవీ (55 ఇంచెస్) ఆఫర్ విజేతలను ప్రకటించింది. తమ వార్షిక ప్యాకేజ్‌లను కొనుగోలు చేసిన వారిలో లక్కీ కస్టమర్లను ఎంపిక చేసి జూన్ తొలివారం విజేతలను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని భారతీయులకు 12కి పైగా భాషల్లో భారత టీవీ ఛానెల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. గత పదేళ్లుగా ఈ సేవలను అందిస్తున్న యప్‌టీవీ దక్షిణాసియాలోనే అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఒకటిగా నిలిచింది. యప్ టీవీపై వీక్షకులు ప్రస్తుతం హిందీ, తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ సహా ఇతర భారతీయ భాషల్లో వినోదాన్ని కేవలం కొద్ది డాలర్లు వెచ్చించి ఆస్వాదించవచ్చని సంస్థ పేర్కొంది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడంతో రెండు నెలల పాటు తమిళ, మళయాళం వంటి కొన్ని భాషల్లో తాజా కంటెంట్ కొరవడిన క్రమంలో ప్రస్తుతంతాజా కంటెంట్ అందుబాటులోకి రాగా, తెలుగు, బెంగాలీ, హిందీ చానెల్స్ త్వరలోనే అన్ని షోలు, కార్యక్రమాలకు సంబంధించిన తాజా కంటెంట్‌తో ముందుకు రానున్నాయి. ఇక స్మార్ట్ టీవీ ఆఫర్లో విజేతల వివరాలు చూస్తే..అమెరికా నుంచి పట్టాభిరాజు ముండ్రు (పెన్సిల్వేనియా), శ్రావ్య గొట్టిపాటి (కాలిఫోర్నియా), ఎల్ సుబ్రమణియన్ (వర్జీనియా), రమేష్ టిమకొందు (కనెక్టికట్), ఆర్ముగం పళనిస్వామి (మిచిగాన్), బ్రిటన్ నుంచి హనుమంతరావు విడదల (లాంక్షైర్), యూరప్ ప్రాంతం నుంచి కిషోర్ రావూరి (స్విట్జర్లాండ్), సమంతా కర్బందా (సింగపూర్), ఆస్ట్రేలియా నుంచి సునీల్ కుమార్ నూతి (న్యూ సౌత్‌వేల్స్) ఎంపికై స్మార్ట్ టీవీలను గెలుచుకున్నారని యప్‌టీవీ వెల్లడించింది. చదవండి : ట్రిపుల్‌ప్లే సేవలు: బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ జోడీ.. -
నోకియా మరో అద్భుతమైన స్మార్ట్‌టీవీ
సాక్షి, ముంబై : నోకియా సరికొత్త స్మార్ట్‌టీవీని నిన్న (గురువారం) భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇన్ బిల్ట్ క్రోమ్‌కాస్ట్‌తో 43 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా జూన్ 8, మధ్యాహ్నం 12 గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం ఒక బ్లాక్ కలర్ ఆప్షన్లో లభ్యం. భారతీయ మార్కెట్లో కంపెనీ ప్రారంభించిన రెండవ స్మార్ట్‌టీవీ ఇది. దీని ధర రూ .31,999 గా ఉంచింది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆధారితం. వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్డీఎంఐ, యూఎస్బీ, ఈథర్నెట్, 24 వాట్ల బాట్ ఫైరింగ్ స్పీకర్స్ (జేబీఎల్), డాల్బీ ఆడియో, డీటీఎస్ ట్రూ సరౌండ్ సౌండ్ ప్రధాన ఆకర్షణగా వున్నాయి. ఏఐ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ ఫీచర్, స్మార్ట్ టీవీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్‌కు సపోర్టు కూడా ఉంది. (జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో మెగా డీల్) ఆఫర్ల విషయానికొస్తే, సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ.1,500, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ ఆరు నెలలు ఉచితంగా అందిస్తుంది. (ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ) నోకియా 43 అంగుళాల స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు 43 ఇంచుల 4కె అల్ట్రా హెచ్డీ డిస్ప్లే 3840 × 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్ డాల్బీ విజన్, ఎంఈఎంసీ టెక్నాలజీ, ఇంటెలిజెంట్ డిమ్మింగ్ 1 గిగాహెడ్జ్ ప్యూరెక్స్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఎ53 ప్రాసెసర్ 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ చదవండి : అమెజాన్ డీల్ : ఎయిర్టెల్ క్లారిటీ -
అద్భుతమైన నోకియా టీవీ ఆవిష్కరణ
సాక్షి, ముంబై:ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా తన మొట్ట మొదటి స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ప్రస్తుత ట్రెండ్‌కనుగుణంగా అద్భుతమైన ఫీచర్లు, అంతకుమించిన ఆడియో క్వాలిటీతో తన స్మార్ట్ టీవీను అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా తన ప్రత్యర్థి కంపెనీలు వన్ ప్లస్, షావోమి,మోటొరోలా వంటి సంస్థలకు దడ పుట్టిస్తోంది. నోకియా టీవీ ఫీచర్లు 55 అంగుళాల అల్ట్రా హెచ్ డీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 9 సీఏ53 క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2.25 జీబీ ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యం 16 జీబీ వైఫై యాక్సెస్ 3 హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులు ఆకట్టుకునే డిజైన్, స్టయిలిష్ లుక్, స్పష్టమైన పిక్చర్ క్వాలిటీ, అద్భుతమైన ఆడియో వీటి ప్రత్యేకం. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, ఇతర గూగుల్ సూట్ యాప్స్‌ను కూడా ఈ నోకియా టీవీ సపోర్ట్ చేస్తుంది. వీటిని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీవీ అనుభవాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు తొలిసారిగా జేబీఎల్ తో జత కలిసినట్టు నోకియా ఇప్పటికే ప్రకటించింది. తద్వారా ఈ టీవీలో డాల్బీ ఆడియోతో పాటు, డీటీఎస్ ట్రూసరౌండ్ ఫీచర్ ద్వారా 5.1 చానెల్ సౌండ్ అనుభూతినిస్తుందని కంపెనీ తెలిపింది. ధర 55 అంగుళాల 4కే యూహెచ్డీ స్మార్ట్ టీవీ ధర రూ.41,999 ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిసెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి లభ్యం కానుంది. అన్ని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.2 వేల వరకు తగ్గింపు. ఈ టీవీతో పాటు కంప్లీట్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా కొనుగోలు చేస్తే రెండు సంవత్సరాలు అదనపు వారంటీ అందించనున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా స్మార్ట్ టీవీలు..!
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ నోకియా.. భారత కన్సూమర్ డ్యూరబుల్స్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి త్వరలోనే స్మార్ట్ టీవీలను ఇక్కడి మార్కెట్లో విడుదలచేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరినట్లు వెల్లడించింది. భారత వినియోగదారులకు తగిన విధంగా నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీల తయారీ, పంపిణీని ఫ్లిప్‌కార్ట్ సులభతరం చేయనుందని ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే.. నూతన టీవీల స్పెసిఫికేషన్స్, ధర, ప్రారంభ తేదీల వంటి వివరాలను మాత్రం నోకియా వెల్లడించలేదు. మరోవైపు మోటరోలా సెప్టెంబర్‌లోనే తన స్మార్ట్ టీవీలను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. వీటి ప్రారంభ ధర రూ. 13,999 వద్ద నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇక శాంసంగ్, మైక్రోమాక్స్, ఇంటెక్స్, షావోమి, మోటరోలా, వన్‌ప్లస్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌లో తమ స్మార్ట్‌టీవీలను ఇప్పటికే అందుబాటులో ఉంచాయి. -
వన్ ప్లస్ టీవీలు వచ్చేశాయ్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ భారత స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి ప్రవేశించింది. క్వాంటమ్ డాట్ ఎల్ఈడీ టెక్నాలజీ (4కే క్యూఎల్ఈడీ డిస్ప్లే)లో రెండు వేరియంట్లలో టీవీని ఇక్కడి మార్కెట్లోకి విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ. 69,900 – రూ. 99,900 కాగా, ఈనెల 28 నుంచి అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. హెచ్ఆర్డీ 10ప్లస్ సపోర్ట్, 50వాట్స్ ఎనిమిది–స్పీకర్ల సెటప్, సినిమాటిక్ సౌండ్ కోసం డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ‘7టీ స్మార్ట్‌ఫోన్’ విడుదల పండుగల సీజన్ నేపథ్యంలో అధునాతన స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘7టీ’ పేరిట విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 కాగా, మునుపటి వెర్షన్ 7కి కొనసాగింపుగా దీన్ని విడుదలచేసింది. సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పూణే, కోల్‌కతా, బెంగళూరు, ముంబై పాప్–అప్లలో వినియోగదారులకు లభ్యం కానున్నట్లు ప్రకటించింది. -
మార్కెట్లోకి మోటొరొలా స్మార్ట్ టీవీ
న్యూఢిల్లీ: మోటొరొలా కంపెనీ భారత్‌లో తొలిసారిగా స్మార్ట్ టీవీని అందుబాటులోకి తెచి్చంది. అంతే కాకుండా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మొటొరొలా ఆండ్రాయిడ్ 9.0 స్మార్ట్ టీవీ ఏడు వేరియంట్లలో లభిస్తుందని, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో ఈ నెల 29 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని మోటొరొలా మొబిలిటీ ఇండియా తెలిపింది. హెచ్డీ రెడీ, ఫుల్ హెచ్డీ, ఆల్ట్రా హెచ్డీ(4కే).. ఇలా ఏడు వేరియంట్లలో, 32 నుంచి 65 అంగుళాల సైజుల్లో లభించే ఈ స్మార్ట్ టీవీల ధరలు రూ.13,999 నుంచి ఆరంభమవుతాయని మొటొరొలా మొబిలిటీ ఇండియా హెడ్ ప్రశాంత్ మణి చెప్పారు. ఈ స్మార్ట్ టీవీతో పాటు మోటొ ఈసిక్స్‌ఎస్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని, ధర రూ.7,999 అని కంపెనీ పేర్కొ న్నారు. ఈ ఫోన్లో మీడియా టెక్ హెలియో పీ22 ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగా పిక్సెల్ ప్లస్ 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 512 జీబీ అడిషనల్ స్టోరేజ్, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలిపారు. -
అతిచవక ధరలో రెడ్మి టీవీ
బీజింగ్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్మి అద్భుత ఫీచర్లతో స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 70 అంగుళాల భారీ స్క్రీన్‌తో మొట్టమొదటి రెడ్మి టీవీని నేడు (గురువారం, ఆగస్టు 29) బీజింగ్‌లో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ ఆధారిత ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్ఫేస్ను నడుపుతుంది. అద్భుత ఫీచర్లతో అతి తక్కువ ధరలోనే దీన్ని లాంచ్ చేసింది. 4కే టీవీ ఫీచర్ల విషయానికి వస్తే...అల్ట్రా థిన్ బెజెల్స్, క్వాడ్ కోర్ సాక్, హెచ్‌డిఆర్ సపోర్ట్, 2జీబీ ర్యామ్,16 జీబీ స్టోరేజ్, డాల్బీ, డీటీఎస్ ఆడియో, 4.2 బ్లూటూత్, వాయిస్ రిమోట్ తదితర ఫీచర్లు జోడించింది. వీటితోపాటు రెడ్మి నోట్ 8 సిరీస్‌లో భాగంగా రెడ్మి నోట్ 8, 8ప్రొ స్మార్ట్ఫోన్లు, రెడ్మి బుక్14ను కూడా ఈ రోజే లాంచ్ చేసింది. చైనా మార్కెట్లో ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇండియా సహా, గ్లోబల్ మార్కెట్లలో వీటి లభ్యతపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. సుమారు ధర రూ. 38,000 -
వన్‌ప్లస్ టీవీలూ వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తెస్తోంది. సెప్టెంబర్‌లో వీటిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. చైనా కన్నా ముందుగా భారత మార్కెట్లోనే స్మార్ట్ టీవీలను ప్రవేశపెడుతుండటం గమనార్హం. ‘వన్‌ప్లస్ టీవీలను సెప్టెంబర్‌లో ఆవిష్కరించబోతున్నాం. వీటిని ముందుగా భారత్‌లోనే అందుబాటులోకి తెస్తున్నాం’ అని వన్‌ప్లస్ ఫోరంలో సంస్థ సీఈవో పీట్ లౌ వెల్లడించారు. అయితే, టీవీ ధర, ఇతరత్రా ఫీచర్స్ మొదలైన వాటి గురించి మాత్రం ప్రస్తావించలేదు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమీ కూడా గతేడాది నుంచే భారత్‌లో టీవీలను కూడా విక్రయించడం మొదలుపెట్టింది. ఇక శాంసంగ్, ఎల్జీ, మైక్రోమ్యాక్స్ వంటి ఇతరత్రా ఫోన్స్ తయారీ సంస్థలకు కూడా సొంతంగా టీవీ బ్రాండ్స్ ఉన్నాయి. ప్రస్తుతం వాటి బాటలోనే వన్‌ప్లస్ సంస్థ సైతం స్మార్ట్‌టీవీల విభాగంలోకి అడుగుపెడుతోంది. గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై కృషి చేస్తున్నామని, క్రమంగా ఒక్కో మార్కెట్లో ఈ టీవీలను ప్రవేశపెడతామని పీట్ వివరించారు. భారత్‌లో వివిధ కంటెంట్ ప్రొవైడర్స్‌తో సత్సంబంధాలు ఉండటంతో యూజర్లకు మరింత మెరుగైన కంటెంట్‌ను అందించగలమన్నారు. ఉత్తర అమెరికా, యూరప్, చైనా తదితర మార్కెట్లలో కూడా వన్‌ప్లస్ టీవీని ఆవిష్కరించేందుకు స్థానిక, ప్రాంతీయ కంటెంట్ ప్రొవైడర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నా మని పీట్ చెప్పారు. ‘ప్రతీ చిన్న విషయంపైనా దృష్టి పెడతాం. భవిష్యత్ స్మార్ట్ టీవీలకు ప్రమాణాలు నిర్దేశించేలా మా ఉత్పత్తి ఉండాలన్నది మా లక్ష్యం’ అని ఆయన చెప్పారు. 2019 జూన్ క్వార్టర్ లో భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో (రూ.30,000 పైగా ధర ఉండే ఫోన్స్) వన్‌ప్లస్ 43 శాతం వాటాతో అగ్రస్థానంలో నిల్చింది. -
అద్భుత ఫీచర్లతో తొలి రెడ్మి స్మార్ట్‌టీవీ
బీజింగ్ : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి అనుబంధ సంస్థ రెడ్మి ఇకపై స్మార్ట్‌టీవీలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు షావోమి వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సీఈవో లీ జున్ ధృవీకరించారని చైనా న్యూస్‌పోర్టల్ సోమవారం తెలిపింది. 70 అంగుళాల భారీ స్క్రీన్‌తో మొట్టమొదటి రెడ్మి టీవీని ఆగస్టు 29న చైనాలో ప్రారంభించనుంది. రెడ్మి టీవీ (మోడల్ నంబర్ ఎల్70ఎం 5) ఇటీవల చైనాలో తన 3 సి సర్టిఫికేషన్ ఆమోదించింది. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ ఆధారిత ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్ఫేస్ను నడుపుతుంది. ఫీచర్లువిషయానికి వస్తే 4కే టీవీలో హెచ్‌డిఆర్ సపోర్ట్, డాల్బీ , డిటిఎస్ ఆడియో, బ్లూటూత్ వాయిస్ రిమోట్ తదితర ఫీచర్లు జోడించింది. ఈ స్మార్ట్‌టీవీ లాంచింగ్‌తోపాటు, 8వ జనరేషన్‌కు చెందిన రెడ్మి నోట్ 8, రెడ్మి 8, రెడ్మి 8 ఎ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. -
సోనీ ఆండ్రాయిడ్ టీవీ...ధర వింటే
సోనీ సంస్థ అద్భుతమైన మరో ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఎక్స్9500జీ సిరీస్‌లో మరో బిగ్ టీవీని తీసుకొచ్చింది. 75 అంగుళాల స్క్రీన్‌తో సోనీ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ టీవీని ‘‘కేడీ75 ఎక్స్9500జీ’’ పేరుతో భారత మార్కెట్లో అవిష్కరించింది. దీని ధరను రూ. 4,49,990 గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సోనీ సెంటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ స్టోర్ల ద్వారా ఈ సూపర్ టీవీలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మామూలు ఎల్ఈడీ టీవీల కంటే ఆరు రెట్లు ఎక్కువ క్వాలిటీ పిక్చర్ అందిస్తుందని కంపెనీ చెప్పింది. ఆండ్రాయిడ్ 8.0 సపోర్టుతో లభిస్తున్న 75 అంగుళాల స్ర్కీన్, బెజెల్ లెస్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణ. ఇంకా 3840x2160 పీక్సెల్స్ రిజల్యూషన్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, ఎక్స్1 అల్టిమేట్ పిక్చర్ ప్రాసెసర్, ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్ బ్యాక్‌లైట్, అల్ట్రా వైడ్ వ్యూయింగ్ యాంగిల్, నెట్‌ఫ్లిక్స్ కాలిబ్రేటెడ్ మోడ్, 16 జీబీ స్టోరేజ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
55" సూపర్ స్మార్ట్ టీవీ తక్కువ ధరలో
ఇప్పటికే భారతీయ టీవీ మార్కెట్లో చవక ధరల్లో స్మార్ట్‌టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన కంపెనీ జేవీసీ చవక ధరలో మరో సరికొత్త టీవీని లాంచ్ చేసింది. 55 అంగుళాల అల్ర్టా హెచ్డీ ఇంటిలిజెంట్ స్మార్ట్టీవీనీ సోమవారం విడుదల చేసింది. 55ఎన్ 7105 సీ 4కె ఎల్ఈడీ టీవీని తీసుకొచ్చింది. దీని ధరను రూ. 38,999గా నిర్ణయించింది. 3840x2160 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ , ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్, 50వాట్స్ సౌండ్ అవుట్ పుట్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, అమోలాజిక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్క్వాడ్-కోర్ ప్రాసెసర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే సాధారణ రిమోట్‌తోపాటు క్వార్టీ కీబోర్డుతో రూపొందించిన మరో స్మార్ట్రిమోట్ను అందిస్తోంది. హాట్‌స్టార్, యూ ట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి దాదాపు 500 యాప్‌లను ప్రీ లోడెడ్‌గా అందిస్తున్నామని జేవీసీ డైరెక్టర్ శరణ్ మయాని తెలిపారు. ఒక సంవత్సరం వారంటీతో ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌టీవీ లభ్యం కానుంది. కాగా ఓఈఎం వియరా పేరుతో భారత టీవీ మార్కెట్లోకి ప్రవేశించిన జేవీసీ ఇటీవల సరసమైన ధరల్లో (ప్రారంభ ధర రూ.16,999 ) ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. -
బడ్జెట్ ధరలో షావోమి ఎంఐ స్మార్ట్‌టీవీ
సాక్షి, న్యూఢిల్లీ : చైనా దిగ్గజ కంపెనీ షావోమి నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు మరో స్మార్ట్‌టీవీని కూడా లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత 32 అంగుళాల స్మార్ట్ టీవీని గురువారం ఆవిష్కరించింది. ఎంఐ ఎల్ఈడీ 4ఏ ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. దీని ధరను రూ.12,999గా నిర్ణయించింది. మార్చి 7వ తేదీనినుంచి మై హోం, ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుందని షావోమి వెల్లడించింది. ఎంఐ ఎల్ఈడీ 4ఏ ప్రో ఫీచర్లు 32 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్ 1జీబీ ర్యామ్, 8ఈ ఎంఎంసీ స్టోరేజ్ లేటెస్ట్ అమ్లోజిక్ 64బిట్ ప్రాసెసర్ విత్ 7వ జనరేషన్ ఇమేజింగ్ ఇంజీన్ గూగుల్ అసిస్టెంట్, బ్లూ టూత్, ఎంఐ రిమోట్ Here’s the all-new #MiLEDTV4APRO32 for you. At just ₹12,999. Goes on sale on https://t.co/cwYEXeds6Y, @flipkart and Mi Home on 7th March at 12 noon. pic.twitter.com/uEDWq0A7Uf — Redmi India (@RedmiIndia) February 28, 2019 -
రూ.5వేలకే 32 అంగుళాల స్మార్ట్ టీవీ
స్మార్ట్ఫోన్లతోపాటు, ప్రస్తుతం స్మార్ట్‌టీవీల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా వివిధ దిగ్గజ కంపెనీలు, అద్భుత ఫీచర్లతో సరసమైన స్మార్ట్‌టీవీలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ కోవలోకి దేశీయ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. అతితక్కువ ధరకే స్మార్ట్ టీవీలను అందించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీకి చెందిన సామీ ఇనఫర్మేటిక్స్ అనే సంస్థ కేవలం రూ.5 వేలకే 32అంగుళాల ఆండ్రాయిడ్ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీని తీసుకొచ్చింది. ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సామీ టీవీని ఆవిష్కరించింది. దీని ధర రూ.4999గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎల్ఈడీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీల్లో ఉన్నఅన్ని ఫీచర్లను అందిస్తోంది. 512జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్,1366×786 హెచ్డీ పిక్సెల్స్ రిజల్యూషన్, 10వాట్స్ స్పీకర్స్, (ఎస్ఆర్ఎస్ డాల్బీ డిజిటల్, 5 బ్యాండ్) ఇన్‌బిల్ట్ వైఫై కనెక్టివీటీ, స్క్రీన్ మిర్రరింగ్‌తోపాటు ఫేస్బుక్, యూ ట్యూబ్ లాంటి యాప్స్‌ను కూడా అందిస్తోంది. మార్కెట్లో ఇదే అతి చౌకైన ఎల్ఈడీ టీవీగా సామీ ఇన్ఫర్మేటిక్స్ డైరెక్టర్ అవినాష్ మెహతా ప్రకటించారు. ఇతర వర్గాలతో పాటు తక్కువ ఆదాయ కుటుంబాల వారిని లక్ష్యంగా పెట్టుకుని సామీ టీవీని లాంచ్ చేసినట్టు చెప్పారు. -
దిగ్గజాలకు దిగులే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు త్వరలో
ముంబై: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనదైన శైలితో దూసుకెళ్తున్న చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ టీవీ రంగంలో కూడా అడుగుపెట్టనుంది. గత సెప్టెంబర్ 14నే తమ కంపెనీ నుంచి స్మార్ట్‌టీవీ రానుందని వన్‌ప్లస్ సీఈవో పీటే లౌ తెలిపారు. దాని తర్వాత టీవీ గురించి ఎటువంటి ప్రకటనా రాలేదు. తాజాగా లౌ మాట్లాడుతూ టీవీని 2019 మధ్యలో మార్కెట్లో రిలీజ్ చేస్తామని తెలిపారు. వచ్చే సంవత్సరం క్రికెట్ ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని మే నెలలోనే రిలీజ్ చేయాలనుకున్నామన్నారు. కానీ స్థాయికి తగ్గ ప్రొడక్ట్‌ను తయారు చేయాలని నిశ్చయించున్నాం కాబట్టి కచ్చితమైన తేదీని నిర్ణయించలేదని తెలిపారు. వన్‌ప్లస్ మొబైల్స్‌లాగే, టీవీ సేల్స్ కూడా అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుందని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ అన్నారు. వన్‌ప్లస్ మొబైల్‌తో అనుసంధానం చేసేలా టీవీని తయారుచేస్తున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ సర్వీస్ ద్వారా సినిమాలు, షోలు చూసే సౌలభ్యం కల్పించనున్నారు. వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీ రాక షావోమీకి గట్టి ఎదురుదెబ్బ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
స్మార్ట్ టీవీలదే హవా
న్యూఢిల్లీ: స్మార్ట్ హంగులతో ఉన్న టెలివిజన్లకు వినియోగదారుల ఆదరణ పెరుగుతోంది. అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా జరిగిన టీవీల అమ్మకాల్లో 55 శాతం వాటా స్మార్ట్ టీవీలదే. పెద్ద పట్టణాల్లో అయితే స్మార్ట్ టీవీల విక్రయాలు 65 శాతం. క్రితం ఏడాది ఇదే మాసంలో స్మార్ట్ టీవీల అమ్మకాలు 45 శాతంగానే ఉండడం గమనార్హం. ఇంటర్నెట్తో అనుసంధానమనేది స్మార్ట్ టీవీకి అదనపు ఆకర్షణగా మారింది. బ్రాడ్ బ్యాండ్ అందుబాటు ధరల్లోకి రావడం స్మార్ట్ టీవీలకు మహర్ధశ పట్టించిందని అనుకోవచ్చు. యాప్స్‌కు అవకాశం, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ సర్వీసులు స్మార్ట్ టీవీని కొనేలా చేస్తున్నాయి. దీనికి తోడు ఇతర టీవీలకు, స్మార్ట్ టీవీల మధ్య ధరల పరంగా వ్యత్యాసం తగ్గిపోవడం ప్రధాన కారణాలని ఈ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. యువత ఓటు స్మార్ట్‌కే జీఎఫ్కే సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం చూస్తే... ఈ ఏడాది జనవరిలో మొత్తం టీవీల అమ్మకాల్లో స్మార్ట్ టీవీల వాటా 45 శాతంగా ఉంటే, సెప్టెంబర్ నాటికి 50 శాతానికి చేరింది. అక్టోబర్ నెలకు సంబంధించి జీఎఫ్కే గణాంకాలు అందుబాటులో లేవు. కానీ, దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో స్మార్ట్ టీవీల అమ్మకాలు 55 శాతానికి, పెద్ద పట్టణాల్లో 65 శాతానికి చేరాయని, పండుగలకు తోడు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి భారీగా ఆఫర్లివ్వటం ఇందుకు కారణమని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ టీవీల విభాగం హెడ్ రిషిటాండన్ తెలిపారు. పట్టణాల్లో యువ వినియోగదారులు స్మార్ట్ టీవీల వృద్ధికి ప్రధాన చోదకులుగా మారినట్టు సోనీ ఇండియా విక్రయాల అధిపతి సతీష్ పద్మనాభన్ చెప్పారు. తాము నాన్ స్మార్ట్ టీవీల మోడళ్లను తగ్గించేశామని, ప్రారంభ స్థాయిలో 24, 32, 40 అంగుళాల్లో ఒకే మోడల్‌ను అందిస్తున్నామని చెప్పారు. సంప్రదాయ టీవీలు, స్మార్ట్ టీవీల మధ్య ఏడాది క్రితం వ్యత్యాసం రూ.7,000– 8,000 మధ్య ఉంటే, అదిపుడు రూ.2,000– 3,000కు తగ్గిపోయినట్టు వ్యూ టెలివిజన్ సీఈవో దేవిత సరాఫ్ తెలిపారు. దీంతో యువత స్మార్ట్ టీవీలకు మళ్లినట్టు చెప్పారు. ఇక తమ స్టోర్లలో అమ్ముడైన టీవీల్లో 90% స్మార్ట్ టీవీలేనని క్రోమా రిటైల్ దుకాణాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అవిజిత్ మిత్రా తెలిపారు. వినియోగదారులు పెద్ద తెరల టీవీలను ఇష్టపడుతున్నారని, సులభంగా ఫైనాన్స్ లభిస్తుండడంతో వీటిలో అధిక శాతం స్మార్ట్ టీవీలే ఉంటున్నాయని చెప్పారు. సంప్రదాయ టీవీలతో పోలిస్తే స్మార్ట్ టీవీల అమ్మకాలు గత ఏడాదిలో రెట్టింపైనట్టు ముంబైకి చెందిన రిటైల్ చెయిన్ కొహినూర్ డైరెక్టర్ విషాల్ మేవాని సైతం పేర్కొనడం స్మార్ట్ ట్రెండ్‌ను తెలియజేస్తోంది. ధరల పరంగా పోటీనిచ్చే టీసీఎల్, షావోమీ బ్రాండ్ల రాకతో స్మార్ట్ టీవీలు కొనేవారి సంఖ్య పెరిగినట్టు చెప్పారు. మన దేశ టీవీల మార్కెట్ పరిమాణం రూ.22,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఏటా 6–7 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుంటే, స్మార్ట్ టీవీల అమ్మకాల్లో ఈ వృద్ధి ఏటా 20–21% స్థాయిలో ఉండడం గమనార్హం. -
షావోమి మరో స్మార్ట్‌టీవీ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇంటా బయటా దూసుకుపోతున్ చైనా కంపెనీ షావోమి ఇటీవల టీవీ మార్కెట్‌పై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో సరసమైన ధరల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ ఎంఐ స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది. ఎంఐ టీవీ4 సిరీస్‌లో తాజాగా 65 ఇంచుల 4కె అల్ట్రా హెచ్డీ , ఏఐ ఆధారిత ఎంఐ టీవీ4ను చైనా మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ ప్లస్ డీటీఎస్, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ప్రధాన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సుమారు రూ.63,300 దీని ధరను నిర్ణయించింది. అయితే బారత మార్కెట్లో ఈ టీవీని ఎపుడు లాంచ్ చేసేదీ స్పష్టత లేదు. -
అద్భుత ఫీచర్లుతో ఆండ్రాయిడ్ టీవీ
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సరికొత్త టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. భారత మార్కెట్లో 40 ఇంచుల ఒక నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. మైక్రోమాక్స్ సబ్‌బ్రాండ్ యు టెలివెంచర్స్ యు యుఫోరియా పేరిట బుధవారం ఈ స్మార్ట్ టీవీని అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ద్వారా ప్రత్యేకంగా విక్రయించనుంది. దీని ధర రూ. 18,999. అలాగే ఎక్సేంజ్ ఆఫర్లో (పాత టీవీ మార్చుకుంటే) రూ. 7,200 డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. యు యుఫోరియా స్మార్ట్ టీవీ ఫీచర్లు 40-అంగుళాల ఫుల్ హెచ్డీ(1920x1080 పిక్సల్స్) డిస్ప్లే 5000: 1 కాంట్రాస్ట్ రేషియో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్ కో ప్రోసెసర్ కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్ వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కంట్రోల్ ఫీచర్ మూడు హెచ్‌డీఎం పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, ఒక వీజీఏ పోర్ట్ 24 వాట్స్ ఆడియో అవుట్‌పుట్ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న మీడియా ఫైల్స్‌ను నేరుగా టీవీలో ప్లే చేసుకోవచ్చు. యూజర్లు తమకు కావల్సిన అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కంట్రోల్ అనే ఆప్షన్‌తో స్మార్ట్‌ఫోన్‌తోనే టీవీని ఆపరేట్ చేయవచ్చు. -
తెలుగు రాష్ట్రాల్లోకి ‘హోమ్’ టీవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎల్ఈడీ టీవీల విపణిలోకి ఇటీవల ప్రవేశించిన కొత్త బ్రాండ్ ‘హోమ్’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. కంపెనీ 12 రకాల మోడళ్లను రూ.10,990–64,990 ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. 365 రోజులపాటు రీప్లేస్మెంట్ వారంటీ ఉంది. 4కే హెచ్డీ స్మార్ట్ టీవీలు రూ.29,990 నుంచి, 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీల శ్రేణి రూ.34,990 నుంచి అందుబాటులో ఉంది. మొబైల్స్ రిటైల్ దుకాణాల్లో ఈ టీవీలు లభిస్తాయి. హ్యాండ్సెట్స్ పంపిణీ, విక్రయం, ఏవియేషన్ తదితర వ్యాపారాల్లో ఉన్న గుజరాత్‌కు చెందిన రూ.2,500 కోట్ల పూజారా గ్రూప్ హోమ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తోంది. శామ్సంగ్ ప్యానెళ్లను దిగుమతి చేసుకుని నోయిడాలోని ప్లాంటులో టీవీల అసెంబ్లింగ్ చేపడుతున్నామని హోమ్ ఇండియా ఎండీ రాహిల్ పూజారా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. మొబైల్ కంటే చవకగా టీవీలు అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో యూనిట్.. భాగ్యనగరిలో అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో హోమ్ పంపిణీదారు సీవోఎస్‌ఆర్ వెంచర్స్ సీఈవో రమేశ్ బాబు చెప్పారు. ఏడాదిలో ఇది కార్యరూపంలోకి వస్తుందన్నారు. నోయిడా ప్లాంటు సామర్థ్యం నెలకు 50,000 యూనిట్లు. మరో 50,000 యూనిట్ల సామర్థ్యాన్ని దీనికి జోడిస్తున్నారు. విస్తరణకు రూ.25 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కంపెనీ డైరెక్టర్ అహ్మద్ జియా తెలిపారు. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీలోకి సైతం హోమ్ ప్రవేశిస్తోంది. -
100 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ, ధర వింటే షాక్
ప్రపంచంలోనే తొలి 100 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీ భారత మార్కెట్లోకి వచ్చింది. పాపులర్ లగ్జరీ టెలివిజన్ బ్రాండ్ ఈ సరికొత్త స్మార్ట్ టీవీని వీయూ 100 పేరుతో మన మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ.20 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే తమ అత్యంత ఖరీదైన స్మార్ట్ టీవీగా కంపెనీ తెలిపింది. ఈ కొత్త టీవీ 100 అంగుళాల ప్యానల్, 224 ఐఫోన్ల సైజుతో సమానమని కంపెనీ అభివర్ణించింది. వీయూ సుపీరియర్ ప్యానల్ టెక్నాలజీతో ఇది రూపొందింది. 4కే ఆల్ట్రా హెచ్డీఆర్ డిస్ప్లేను ఇది కలిగి ఉంది. దీంతో ప్రీమియం వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను టెలివిజన్ వీక్షకులు పొందవచ్చు. 2.5 బిలియన్ కలర్స్‌ను ఇది రీప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టీవీ ద్వారా ఏ+ గ్రేడ్ ప్యానల్‌ను కంపెనీ అందిస్తోంది. 5 డోల్బే-సర్టిఫైడ్ స్పీకర్స్‌తో ఈ పెద్ద టీవీని వీయూ తీసుకొచ్చింది. ఇది ప్రతి స్వరం కూడా స్పష్టంగా వినిపించేలా.. 2000 వాట్ స్పీకర్స్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో స్మార్ట్ ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న ఈ టీవీ, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను, 2.5జీబీ ర్యామ్‌తో రూపొందింది. గూగుల్ ప్లే స్టోర్ ఇంటిగ్రేషన్, క్రోమోకాస్ట్ సపోర్ట్ ఈ డివైజ్‌లో ఉన్నాయి. వీయూ 100ను మొబైల్స్‌కు, ల్యాప్‌టాప్స్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్లతో లైటింగ్‌ను, ఎయిర్ కండీషనింగ్‌ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. మూడు హెచ్డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్బీ పోర్ట్‌లు, హెచ్డీఎంఐ ఏఆర్సీ/సీఈబీ, బ్లూటూత్, వైఫై, ఏవీ ఇన్పుట్, ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఇది కలిగి ఉంది. యూట్యూబ్, హాట్‌స్టార్, హంగామా వంటి ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్స్‌తో ఇది వచ్చింది. దీని బరువు 104కేజీలు. వీయూ స్టోర్‌కి వెళ్లి, దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఏడాది వారెంటీతో ఇది లభ్యమవుతుంది. వీయూ అధికారిక స్టోర్లలో దీన్ని ప్రస్తుతం కంపెనీ అందిస్తుంది. పార్టనర్ల స్టోర్ల వద్ద కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. -
సగానికి తగ్గిన టీవీల ధరలు
సాక్షి, బిజినెస్ విభాగం : స్మార్ట్.. స్మార్ట్.. అంతా స్మార్ట్ మయం. స్మార్ట్ టీవీల విక్రయాలు జోరుమీదున్నాయి. మరో రకంగా చెప్పాలంటే స్మార్ట్ టీవీ మార్కెట్లో చౌక ధరల యుద్ధం ప్రారంభమైంది. షావోమి, థామ్సన్, టీసీఎల్ వంటి గ్లోబల్ కంపెనీలు మన స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. తక్కువ ధర, అధిక ఫీచర్లతో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇక్కడ మనం దేశీ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్‌ను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. 2– 3 ఏళ్లు వెనక్కు వెళ్తే అందుబాటు ధరల్లోని స్మార్ట్ఫోన్లు మార్కెట్ స్థితిగతులను ఎలా మార్చేశాయనే విషయం మనకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ స్మార్ట్ టీవీ విభాగంలోనూ పునరావృతం కానుంది. ఇప్పుడు సగం ధరకే! టాప్ టీవీ బ్రాండ్లు అంటే శాంసంగ్, ఎల్జీ, సోనీ ఇవే. ఇప్పుడు వీటి 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.23,000ల నుంచి ప్రారంభమౌతోంది. ఒకప్పుడు వీటి ధర రూ.30,000కు పైగా ఉండేది. అయితే షావోమి, థామ్సన్, టీసీఎల్ వంటి కంపెనీలు రూ.13,500 నుంచే 32 అంగుళాల స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. మార్కెట్లోని శాంసంగ్, ఎల్జీ, సోనీ ప్రొడక్టుల ధరతో పోలిస్తే ఇది సగానికిపైగా తక్కువ కావడం గమనార్హం. ధరలో ఈ స్థాయి వ్యత్యాసం ఉండటంతో కొత్త కంపెనీలు మార్కెట్ వాటా లాగేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక 40 అంగుళాల స్మార్ట్ టీవీల విషయానికొస్తే ఇప్పుడు ధర దాదాపుగా రూ.20,000కు తగ్గింది. ఇదివరకు వీటి ధర దాదాపు రూ.50,000లుగా ఉండేది. 32, 40 అంగుళాల టీవీలు ప్రజలకు చేరువ అవడంలో ఫైనాన్స్ సదుపాయం పాత్ర మరువలేనిదని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. కంటెంట్ కీలకమే.. స్మార్ట్ టీవీ కొనుగోలులో కంటెంట్ కూడా కీలకమైనదే. ఈ విషయాన్ని గుర్తించిన కొత్త సంస్థలు కస్టమర్లకు కంటెంట్ అందించడానికి హాట్‌స్టార్, వూట్, సోనీ లైవ్, హంగామా వంటి వీడియో ఆన్ డిమాండ్ ఆపరేటర్లతో వివిధ రకాల ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. ఇక్కడ శాంసంగ్, ఎల్జీ, సోనీ వంటి కంపెనీలకూ వాటి స్మార్ట్‌టీవీ మోడళ్లకు సంబంధించి పలు కంటెంట్ సంస్థలతో ఒప్పందాలున్నాయి. అయితే కొత్త కంపెనీలు కాస్త దూకుడుగా వెళ్తున్నాయి. దేశీ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయ కంపెనీ షావోమి మరింత కంటెంట్ కోసం దిగ్గజ సంస్థలతోనూ చర్చలు జరుపుతోంది. తాము కంటెంట్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలతో మాట్లాడుతున్నామని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్/ షావోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ చెప్పారు. 40 శాతం వార్షిక వృద్ధి టీవీ మార్కెట్ రూ.50,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తే... అందులో స్మార్ట్‌టీవీ విభాగం వాటా సగానికన్నా తక్కువగా 40%గా దాదాపు రూ.20,000 కోట్లు ఉండొచ్చు. అయినప్పటికీ గత రెండేళ్లలో స్మార్ట్ టీవీ మార్కెట్లో ఏడాదికి 40 శాతం చొప్పున వార్షిక వృద్ధి రేటు నమోదయింది. ఇప్పుడు ధరల తగ్గుదల నేపథ్యంలో మార్కెట్లో గణనీయమైన వృద్ధి నమోదు కావొచ్చని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కొత్త కంపెనీలు టీవీల విక్రయానికి ఆన్లైన్ ప్లాట్‌పామ్స్‌పై అధికంగా ఆధారపడుతున్నాయి. మొత్తం టీవీ మార్కెట్లో పరిమాణపరంగా చూస్తే ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ అమ్మకాలు 14% వాటా ఆక్రమించాయి. వచ్చే రెండేళ్లలో ఈ వాటా 20%కి పైగా చేరొచ్చని అంచనాలున్నాయి. పోటీ రసవత్తరం భారత్‌లోని స్మార్ట్ టీవీ విభాగంలో తమ ఐఫాల్క న్ బ్రాండ్ స్మార్ట్ టీవీల వల్ల పోటీ మరింత పెరుగుతుందని టీసీఎల్ ఓవర్సీస్ బిజినెస్ జనరల్ మేనేజర్ హ్యారీ వు ధీమా వ్యక్తంచేశారు. ‘షావోమి టీవీ బ్రాండ్ ఎంఐకు సాఫ్ట్వేర్ నిపుణులున్నారు. అలాగే ఈ–కామర్స్ దన్నూ ఉంది. అయితే దీనికి మా మాదిరి హార్డ్‌వేర్ బ్యాకప్ లేదు. అదీకాక మా సాఫ్ట్వేర్ నిపుణులు టెన్సెంట్ నుంచి వచ్చారు’’ అని హ్యారీ వివరించారు. టెన్సెంట్ అనేది చైనాలోని అతిపెద్ద సాఫ్ట్వేర్, కంటెంట్ కంపెనీ. కంటెంట్ కోసం యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఈరోస్‌నౌ, రిలయన్స్ జియో వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామన్నారు. గూగుల్‌తో భాగస్వామ్యం వల్ల యూజర్లు వాయిస్ సెర్చ్ వంటి సదుపాయాన్ని పొందొచ్చని, జియోతో జతకలవడం వల్ల ప్రొడక్టులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించడం వీలవుతుందని తెలిపారు. టీసీఎల్ టీవీలను దేశీయంగానే తయారు చేసేందుకు స్థానిక సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, దీంతో టీవీలను మరింత చౌక ధరలకు అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. భారత్‌లో ప్రొడక్టుల తయారీ, మార్కెటింగ్ సేవల కోసం సూపర్ ప్లాస్ట్రోనిక్స్తో చేతులు కలిపామని టెక్నికలర్లకు చెందిన థామన్స్ బ్రాండ్ మార్కెటింగ్ కార్యకలాపాలు చూసుకునే సెబాస్టియన్ క్రోంబెజ్ తెలిపారు. ఇప్పుడు తాము కూడా స్మార్ట్‌టీవీ మార్కెట్‌పై, ప్రత్యేకించి భారత్‌పై దృష్టి కేంద్రీకరించామని వివరించారు. -
రెడ్మి నోట్ 5 ప్రొ, ఎంఐ టీవీ 4 ధరలు పెరిగాయ్!
షావోమి తన పాపులర్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ, 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ధరలను పెంచేసింది. ఈ రెండింటిపై 5000 రూపాయల వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. రెడ్మి నోట్ 5 ప్రొ ధరను వెయ్యి రూపాయలు, 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ను రూ.5000 ధరలు పెంచినట్టు షావోమి తెలిపింది. పెంచిన ధరలు వెనువెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. రెడ్మి నోట్ 5 ప్రొకు, ఎంఐ టీవీ 4కు దేశీయ మార్కెట్లో భారీ ఎత్తున్న డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటికి వస్తున్న డిమాండ్‌ను షావోమి చేరుకోలేకపోతోంది. దీంతో కంపెనీ ఇక్కడే వీటిని రూపొందించాలని కూడా నిర్ణయించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, రెడ్మి నోట్ 5 ప్రొ విషయంలో పీసీబీఏలను భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఈ దిగుమతి చేసుకుంటున్న పీసీబీఏలపై పన్ను మార్పులు, రూపాయి విలువ పడిపోవడం వంటికి తమ ఖర్చులను పెంచుతున్నాయని కంపెనీ తెలిపింది. దీంతో ఎంఐ ఎల్ఈడీ టీవీ ధరను రూ.5000 మేర పెంచి, రూ.44,999గా నిర్ణయించింది. 2018 మే 1 నుంచి అన్ని ఎంఐ హోమ్ స్టోర్లు, ఎంఐ.కామ్‌లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. రూ.13,999గా ఉన్న రెడ్మి నోట్ 5 ప్రొ ధర కూడా రూ. 14,999కు పెరిగింది. కంపెనీ ఇటీవల చేపట్టిన రెడ్మి నోట్ 5 ప్రొ ఫోన్‌కు చేపట్టిన ప్రీ-ఆర్డర్లకు భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ ఇటీవలే భారత్‌లో మూడు స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్లను ప్రారంభించినట్టు పేర్కొంది. -
టీసీఎల్ నుంచి ఐఫాల్కన్ స్మార్ట్ టీవీలు
చైనాకు చెందిన టీసీఎల్ మల్టీమీడియా తాజాగా భారత మార్కెట్లోకి ఐఫాల్కన్ బ్రాండ్ కింద స్మార్ట్ టీవీలు ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆఖరు నాటికి 2 లక్షల టీవీలు విక్రయించాలని నిర్దేశించుకుంది. అమ్మకాల కోసం ప్రధానంగా ఆన్లైన్ వ్యూహాన్నే అనుసరించనున్నట్లు ఫాల్కన్ టెక్నాలజీ గ్లోబల్ సీఈవో టోనీ గో తెలిపారు. ఇందులో భాగంగా ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా విక్రయ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం టీవీలను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నామని, అమ్మకాలను బట్టి ఏడాది తర్వాత స్థానికంగా కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయని టోనీ వివరించారు. ప్రస్తుతం షావోమి, వ్యు, థామ్సన్ తదితర సంస్థలు చౌకగా స్మార్ట్ టీవీలను విక్రయిస్తున్నాయి. -
షావోమి నుంచి మరో స్మార్ట్ టీవీ
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న షావోమి, ప్రస్తుతం టీవీ మార్కెట్లోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే తేలికైన, సన్నని టీవీని లాంచ్ చేసిన షావోమి, మరో స్మార్ట్‌టీవీని తీసుకొచ్చింది. ఎంఐ టీవీ 4ఎస్ పేరుతో ఈ స్మార్ట్‌టీవీని తన సొంత మార్కెట్ చైనాలో లాంచ్ చేసింది. హెచ్డీఆర్ డిస్ప్లే, ప్యాచ్‌వాల్, డాల్బీ ఆడియో, ఇతర ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. ఎంఐ టీవీ 4ఎస్ స్పెషిఫికేషన్లు... 55 అంగుళాల 4కే డిస్ప్లే 64 బిట్ క్వాడ్ కోర్ అమ్లోజికల్ కార్టెక్స్-ఏ53 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ రెండు 8డబ్ల్యూ స్పీకర్లు విత్ డాల్బీ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఆండ్రాయిడ్ ఆధారిత ప్యాచ్‌వాల్ యూఐ ధర 2,999 సీఎన్‌వై (సుమారు రూ.31,100) అయితే ఈ టీవీని షావోమి భారత్ వంటి ఇతర మార్కెట్లలో లాంచ్ చేస్తుందో లేదో క్లారిటీ లేదు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎంఐ టీవీ 4, ఎంఐ టీవీ 4ఏలు విక్రయానికి ఉన్నాయి. -
షావోమికి షాక్: కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ బ్రాండ్లకు షాకిచ్చేలా వీయూ టెక్నాలజీస్ టీవీ మార్కెట్లోకి దూసుకువచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీలను లాంచ్ చేసినట్టు మంగళవారం ప్రకటించింది. ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ ఆధారంగా తమ 4కేటీవీలు పని చేస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 43, 49, 55 ఇంచెస్ వేరియంట్లలో ఈ 4కే స్మార్ట్ టీవీలను అందిస్తున్నామని వీయూ టెక్నాలజీసీ సీఈవో , ఫౌండర్ దేవితా సరాఫ్ తెలిపారు. గత ఏడాదిగా అనేక విజయవంతమైన పరీక్షల తర్వాత ఈ హైఎండ్ టెక్నాలజీతో కూడిన, హై క్వాలిటీ పిక్చర్, సౌండ్ కలగలసిన విప్లవాత్మక ప్రొడక్ట్‌ను లాంచ్ చేశామని సంస్థ సీఈవో వెల్లడించారు. 43 అంగుళాల టీవీ ధర రూ.. 36,999గాను, 49 అంగుళాల వేరియంట్ టీవీ ధర రూ. 46,999, 55 అంగుళాల వేరియంట్ టీవీ ధర రూ. 55,999గా నిర్ణయించినట్టు చెప్పారు.ఈ స్మార్ట్‌టీవీలు ఫ్లిప్‌కార్ట్, వియూ స్టోర్లలో మార్చి 16వ తేదీనుంచి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. క్వాడ్-కోర్ ప్రాసెసర్ , 2.5 జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, డాల్బీ డిజిటల్ ఆడియో సపోర్ట్ ఈ టీవీల ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. దీంతో ఇటీవల టీవీ మార్కెట్లోకి దూసుకువచ్చిన చైనా మొబైల్ మేకర్ షావోమికి గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా. అలాగే ఇప్పటికే టీవీ సెగ్మెంట్లో ప్రత్యర్థులకు ప్రధాన పోటీ ఇస్తున్న కొరియన్ సంస్థ శాంసంగ్‌కు వీయూ మరో ప్రత్యర్థి అవుతుందని అంచనా.