స్మార్ట్‌ఫోన్స్‌, టీవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించిన వన్‌ప్లస్‌..! | Oneplus Phones TV Models Get Big Discounts In Diwali Sale | Sakshi
Sakshi News home page

Oneplus: స్మార్ట్‌ఫోన్స్‌, టీవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించిన వన్‌ప్లస్‌..!

Published Sat, Oct 2 2021 9:28 PM | Last Updated on Sat, Oct 2 2021 9:29 PM

Oneplus Phones TV Models Get Big Discounts In Diwali Sale - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కొనుగోలుదారులకు దీపావళి సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్స్‌, టీవీల కొనుగోలుపై భారీ డీల్స్‌ను, ఆఫర్లను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. వన్‌ప్లస్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ 9 ప్రో , వన్‌ప్లస్ 9 ఆర్‌తో సహా , వన్‌ప్లస్ 9 శ్రేణిపై భారీ తగ్గింపును అందిస్తోంది. అదనంగా, వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌పై కూడా  డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రకటించింది. తొమ్మిది నెలల వరకు నోకాస్ట్‌ ఈఎమ్‌ఐ సౌకర్యాన్నికూడా వన్‌ప్లస్‌ అందించనుంది.  
చదవండి: ఆనంద్‌ మహీంద్రా, రాకేశ్‌ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..!

వన్‌ప్లస్‌ 9ఆర్‌, వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్లపై రూ. 3000 తగ్గింపును ప్రకటించింది. దీంతో వన్‌ప్లస్‌ 9ఆర్‌ ధర రూ. 36,999, కాగా వన్‌ప్లస్‌ 9 రూ. 46,999 అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ 9 ప్రోపై 4వేల తగ్గింపుతో రూ. 60,999 లభించనుంది. అమెజాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో  సుమారు 7 వేల తగ్గింపు ధరను అందిస్తోంది. అక్టోబర్‌ 4 నుంచి వన్‌ప్లస్‌ ఇండియా  అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్బీఐ  కార్డులపై  కూడా 7 వేల తగ్గింపు వర్తించనుంది.

వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీ వై, యూ సిరీస్‌ శ్రేణి టీవీలపై 15 శాతం తగ్గింపును ప్రకటించింది. వన్‌ప్లస్‌ వై సిరీస్‌  32-అంగుళాల టీవీ కొనుగోలుదారులకు రూ. 15,999కు లభించనుంది.  అంతేకాకుండా అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై తక్షణ తగ్గింపు రూ. 2000 ను అందించనుంది.  వన్‌ప్లస్‌ యూ సిరీస్‌ 50-అంగుళాల  స్మార్ట్‌టీవీ రూ. 43,999 లభిస్తోంది. ఐసీఐసీఐ కార్డులపై అదనంగా రూ. 3 వేల తక్షణ తగ్గింపు రానుంది. 
చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్‌ బ్రాండ్‌ టీవీలు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement