
మొబైల్ యూజర్లు వాటి పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ఫోన్(Smart Phone) ఫీచర్లలో మార్పులు వస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నారు. జీఎస్టీ(GST) తగ్గిన నేపథ్యంలో చాలామంది స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది రిటైలర్లు ప్రకటించిన ధరలమేరకు(జీఎస్టీ మార్పుల వల్ల రిటైలర్లను అనుసరించి ధరల్లోనూ మార్పులు ఉంటాయని గమనించాలి) రూ.15,000 లోపు 5జీ మొబైళ్ల(Mobiles) వివరాలు కింద తెలుసుకుందాం.
మోడల్ | బ్రాండ్ | కీలక స్పెసిఫికేషన్లు | ధర |
---|---|---|---|
iQOO Z10x | iQOO | 6.72 అంగుళాల ఎల్‌సీడీ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ+2 ఎంపీ కెమెరా, 6500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ | రూ.13,499 |
పోకో ఎం7 ప్రో 5జీ | పోకో | 6.67 అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ+2ఎంపీ కెమెరా, 5110 ఎంఏహెచ్ బ్యాటరీ | రూ.12,984 |
రియల్ మీ 13+ 5జీ | రియల్ మి | 6.72 ఎల్‌సీడీ 120హెర్ట్జ్ డిస్‌ప్లే, 50ఎంపీ+2ఎంపీ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ | రూ.13,499 |
వివో టీ4ఎక్స్ 5జీ | వివో | 6.72 ఎల్‌సీడీ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎమ్ పి+2 ఎంపీ కెమెరా, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ | రూ.13,999 |
ఒప్పో కె13ఎక్స్ 5జీ | OPPO | 6.67 ఎల్‌సీడీ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ+2 ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ | రూ.11,030 |
మోటరోలా జీ86 పవర్ 5జీ | మోటరోలా | 6.7 పీ-ఓలెడ్ 120హెర్ట్జ్ డిస్‌ప్లే, 50ఎంపీ+8ఎంపీ కెమెరా, 6720ఎంఏహెచ్ బ్యాటరీ | రూ.15,999 |
పోకో ఎం7 ప్లస్ 5జీ | పోకో | 6.9 అంగుళాల ఎల్‌సీడీ 144 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ | రూ.13,499 |
రెడ్ మీ నోట్ 14 ఎస్ ఈ 5జీ | రెడ్మీ | 6.67 అమోలెడ్ 120హెర్ట్జ్ డిస్‌ప్లే, 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ కెమెరా, 5110ఎంఏహెచ్ బ్యాటరీ | రూ.13,999 |
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్17 5జీ | శామ్ సంగ్ | 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 ఎంపీ+5ఎంపీ+2ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ | రూ.13,999 |
లావా ప్లే ఆల్ట్రా 5G | లావా | 6.67 అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 64 ఎంపీ+5ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ | రూ.14,999 |
నోట్: పైన తెలిపిన ఫోన్లతో పాటు విడుదలై ప్రజాదరణ పొందిన మరిన్ని మెరుగైన ఉత్పత్తులు మార్కెట్‌లో ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు