Phones
-
ఫోన్లూ వణుకుతాయ్
ఎండలకు రాళ్లు కూడా పగులుతాయని విన్నాం. కానీ.. చలికి ఫోన్లు సైతం పగిలిపోతాయట. వేసవితో పోలిస్తే శీతాకాలంలో స్మార్ట్ఫోన్లు కిందపడితే స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయని ఎలక్ట్రానిక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపై చలి తీవ్ర ప్రభావాన్నే చూపుతాయని పేర్కొంటున్నారు. చలికాలం వచ్చిందంటే చాలామంది ఆరోగ్య విషయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటారని.. ఇకపై చలికాలంలో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతివిలువైన డేటా కోల్పోయే అవకాశంప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ సమాచారమైనా పేపర్ డాక్యుమెంట్ల రూపంలో భద్రపరుచుకోవడం కంటే.. వాటిని ఫోన్లు లేదా వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో సేవ్ చేసుకుని భద్రపరచుకుంటుంటాం. అయితే ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో ఉండే హార్డ్ డ్రైÐవ్లు కొన్ని సందర్భాల్లో విపరీతమైన చలికి ప్రభావితమై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో హార్డ్ డ్రైవ్‌లలో మాత్రమే నిక్షిప్తమై ఉండే మన విలువైన సమాచారం, డాక్యుమెంట్లను పూర్తిగా తిరిగి చూడడానికి వీలులేని విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేవారు తాము వాడేవి కొత్తవి కదా అని అజాగ్రత్త ఉండొచ్చు. కానీ, కొత్తవి అయినంత మాత్రాన చలికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవడం కేవలం అపోహేనట. కొత్త ఎల్రక్టానిక్ పరికరాలు కూడా విపరీతమైన చలి పరిస్థితుల్లో వాటి పనితీరు తగ్గుముఖం పట్టవచ్చని నిఫుణులు పేర్కొంటున్నారు.చలి విపరీతంగా ఉంటే ఫోను ఆగిపోయే ఛాన్స్» ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల ఎల్సీడీ, ఓఎల్ఈడీ స్కీన్లు నిదానంగా పనిచేయడం వల్ల ఆ సమయంలో వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ఆ పరికరాల స్కీన్లపై కనిపించే బొమ్మలు, అక్షరాల నాణ్యత, స్పష్టత సరిగా ఉండకపోయే అవకాశం ఉంది. » ప్రమాదవశాత్తు స్మార్ట్ ఫోను వంటివి కిందపడితే వేసవి కాలంలో కంటే శీతాకాలంలో వాటి స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయి. » ఎలక్ట్రానిక్ పరికరాలను వేలిముద్రల గుర్తింపు, ముఖ గుర్తింపు ద్వారానే త్వరగా అన్, ఆఫ్ అయ్యేలా పెట్టుకుంటాం. కానీ.. ఎక్కువ చలి సమయంలో సెన్సార్ విధానం సరిగా పనిచేయక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు వంటి ధరించగలిగేవి విపరీతమైన చలిలో కచి్చతమైన రీడింగ్‌లను తెలపలేవు. » కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లో ఉపయోగించే హార్డ్ డ్రైవ్‌లు చలి ప్రభావంతో ఆలస్యంగా ఓపెన్ కావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. » ఎల్రక్టానిక్ వస్తువులలో ఉండే సున్నితమైన, అతి సున్నితమైన సర్క్యూట్లు చలికి తుప్పు పట్టే అవకాశం ఉండటంతో ఆయా వస్తువులు పూర్తిగా పనిచేయకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది. » కెమెరాలు సైతం చలి తగ్గి ఎండ పెరిగే కొద్దీ వాటి అద్దాలపై పొరగా ఏర్పడే పొగమంచు ఫొటోల్లోని బొమ్మ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. » ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు చల్లని ఉష్ణోగ్రతలలో పేలవంగా పనిచేస్తాయని, విపరీతమైన చలిలో బ్యాటరీ తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోవచ్చు లేదా శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. » స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్ బడ్లు వేగంగా బ్యాటరీ నష్టానికి గురికావడంతో అవి పనిచేయడంలో ఎక్కువగా అవాంతరాలు ఏర్పడే వీలుంది. » ఎలక్రానిక్ పరిరకాలకు ఉపయోగించే గాజు, ప్లాస్టిక్ వంటివి చలికి పెళుసుబారి చిన్న ఒత్తిడికే పగుళ్లు లేదా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇలా చేయడం బెటర్» చలికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. ఎల్రక్టానిక్ పరికరాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారు. » శీతాకాలంలో ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లకు సాధారణ కన్నా ఎక్కువసార్లు చార్జింగ్ పెడుతూ ఉండాలి. ఎక్కువ కాలం పాటు గడ్డకట్టే చలికి పరికరాలను బహిర్గతం చేయకుండా ఉంచాలి. తప్పనిసరిగా బయటకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు చలి సోకని కవర్లలో వాటిని ఉంచాలి.» చలికాలంలో స్మార్ట్ ఫోన్లు సహా అన్ని ఎల్రక్టానిక్ వస్తువులను ఆరుబయట చలిలో ఎక్కువ సమయం వినియోగించాల్సి వస్తే.. ఇంటికి చేరుకోగానే వాటిని శుభ్రం చేయడం మంచిదని సూచిస్తున్నారు. » చల్లటి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన ఎల్రక్టానిక్ పరికరాలను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
బెస్ట్ గేమింగ్ ఫోన్స్: ధర రూ.15000 కంటే తక్కువే..
భారతీయ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే వీటి కోసం భారీ మొత్తంలో వెచ్చించాలంటే కొందరు తప్పకుండా వెనుకడుగు వేస్తారు. అయితే ఈ కథనంలో రూ. 15,000లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ ఫోన్లను గురించి వివరంగా తెలుసుకుందాం.సీఎంఎఫ్ ఫోన్ 1: సీఎంఎఫ్ అనేది నథింగ్ సబ్ బ్రాండ్. రూ.14,999 వద్ద లభించే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో 6జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం గేమ్ ఆదుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మోటో జీ64: మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో గేమింగ్ ఫోన్ మోటో జీ64. దీని ధర కూడా రూ.14,999 మాత్రమే. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025తో పాటు 8జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 6000 mAh కలిగిన ఈ ఫోన్.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. తక్కువ ధరలో గేమింగ్ ఫోన్ కోసం ఎదురు చూసేవారికి దీనిని పరిశీలించవచ్చు.పోకో ఎక్స్6 నియో: రూ.12,999 వద్ద లభిస్తున్న.. పోకో ఎక్స్6 నియో ఫోన్ కూడా తక్కువ ధరలో లభించే ఉత్తమ గేమింగ్ ఫోన్. ఇది 8 జీబీ రామ్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ పొందుతుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్.. సుదీర్ఘ గేమింగ్ సెషన్ల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది.రెడ్మీ 13 5జీ: రెడ్మీ 13 5జీ ధర రూ.14,999. ఇది వినియోగదారులకు లేటెస్ట్ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి పెద్ద డిస్ప్లే పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో 6 జీబీ రామ్ పొందుతుంది. అత్యుత్తమ పనితీరును అందించే ఈ ఫోన్ 5030 యాంపియర్ బ్యాటరీతో వస్తుంది.ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్: రూ. 15వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే గేమింగ్ ఫోన్లలో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఒకటి. దీని ధర రూ. 13999. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో 8జీబీ రామ్ పొందుతుంది. శక్తివంతమైన ఈ స్మార్ట్‌ఫోన్.. మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. -
రూ.6000 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ఇక్కడ చూడండి
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన స్మార్ట్ఫోన్ల దగ్గర నుంచి రూ. 6వేలు ధర వద్ద లభించే ఫోన్ల వరకు ఉన్నాయి. ఈ కథనంలో ఆరువేల రూపాయల ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8)మార్కెట్లో అందుబాటులో ఉన్న 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8' ధర కేవలం రూ.6,699 మాత్రమే. బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే. ఇది రూ. 6వేలకు లభిస్తుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, రెండు కెమెరాలు మొదలైనవి ఉంటాయి. ఇది ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్ పొందుతుంది.ఐటెల్ ఆరా 05ఐ (Itel Aura 05i)రూ.6000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఐటెల్ ఆరా 05ఐ ఒకటి. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. దీని ధర రూ. 5749 మాత్రమే. మల్టిపుల్ కెమెరా ఆప్షన్స్ ఇందులో చూడవచ్చు.రెడ్మీ ఏ2 (Redmi A2)రూ.5669 వద్ద లభించే రెడ్మీ ఏ2 కూడా ఆరు వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఇది 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో లభిస్తుంది. -
ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి
వాషింగ్టన్: చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్‌లు వాడే ఫోన్లు, నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ట్రంప్–వాన్స్‌ల ఎన్నికల ప్రచార బృందాన్ని అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, ఆమె రన్నింగ్ మేట్ వాల్జ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా చైనా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారని బీబీసీ పేర్కొంది. అదే నిజమైతే, ఏ మేరకు సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కి ఉంటుందనే విషయం స్పష్టత రాలేదు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు సైబర్ నేరగాళ్లకు లక్ష్యమయ్యారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐలు నిరాకరిస్తున్నాయి. చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు దేశంలోని వాణిజ్య టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి దొంగచాటుగా ప్రవేశించిన విషయమై అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని ఎఫ్‌బీఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఐఎస్ఏ) ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అయితే, నేరగాళ్లు చేసిన ప్రయత్నాలను తాము గుర్తించామని తెలిపాయి. ఆ వెంటనే సంబంధిత సంస్థలను అప్రమత్తం చేయడంతోపాటు ఇతర బాధితులను అలెర్ట్ చేసి, అవసరమైన సహాయ సహకారాలు అందించామని ఆ ప్రకటనలో వివరించాయి. కమర్షియల్ కమ్యూనికేషన్స్ రంగంలో సైబర్ రక్షణలను బలోపేతం చేసేందుకు, దాడులను ఎదుర్కొనేందుకు సంబంధిత విభాగాలను సమన్వయం చేస్తున్నామని ఎఫ్‌బీఐ, సీఐఎస్ఏ తెలిపాయి. అయితే, దీనిని ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేలా సైబర్ దాడికి జరిగిన యత్నంగా కాకుండా, గూఢచర్యంగాభావిస్తున్నామని న్యాయ విభాగం తెలిపింది.ఈ పరిణామంపై ట్రంప్ ప్రచార బృందం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవకుండా చేసే కుట్రగా అభివర్ణించింది. ఈ నెల మొదట్లో కూడా హ్యాకర్లు ట్రంప్, వాన్స్‌లే లక్ష్యంగా సైబర్ దాడికి పాల్పడ్డారని సంబంధిత వెరిజోన్ అనే టెలీ కమ్యూనికేషన్ సంస్థ ఆరోపించింది. సెపె్టంబర్లో ఇరాన్‌కు చెందిన ముగ్గురు హ్యాకర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకునేందుకు ప్రయతి్నంచినట్లు అమెరికా ప్రభుత్వం ఆరోపించడం తెలిసిందే. -
యూజీ నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల వల!
సాక్షి, హైదరాబాద్: ‘యూజీ నీట్ పరీక్ష రద్దు అవుతుంది. కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించనుంది. అందుకే షార్ట్‌టర్మ్ కోర్సు ప్రారంభించాం. మీ అమ్మాయిని వెంటనే చేరి్పస్తే ఫీజు కూడా రాయితీ ఇస్తాం’ రెండ్రోజుల కిందట ఓ ప్రముఖ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థి తండ్రికి వచి్చన ఫోన్‌కాల్ ఇది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి యూజీ నీట్ ప్రవేశాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ పరీక్షలో కొందరు అదనపు మార్కుల ప్రయోజనం, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, టాప్ ర్యాంకులపై రగడ తదితర అంశాలతో దేశవ్యాప్తంగా తీవ్ర అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ పరిస్థితిని కొన్ని కోచింగ్ సెంటర్లు క్యాష్ చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. నీట్ పరీక్ష రద్దు కానుందని, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారానికి ఊపందిస్తూ షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభిస్తున్నాయి. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులను ఈ కోర్సుల్లో చేరాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు, ఎస్ఎంఎస్ల ద్వారా ఫీజు తక్కువంటూ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మే 5న జరిగిన యూజీ నీట్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో రాష్ట్రం నుంచి 1.05 లక్షల మంది పరీక్ష రాసినట్లు అంచనా. రూ.25 వేల నుంచి రూ.30 వేల ఫీజు యూజీ నీట్–2024 ప్రవేశాల ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. కానీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తీవ్ర దుమారం కావడం, ప్రతిపక్షాల నిరసన ఏకంగా పార్లమెంటును స్తంభించే పరిస్థితి నెలకొనడంతో అన్ని వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు తీగలాగితే డొంక కదిలినట్లు కనిపిస్తుండటంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తారా? లేదా కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. మరో వారం రోజుల్లో నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంకా రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మెరుగైన మార్కులు వచ్చినప్పటికీ విద్యార్థులకు లక్షల్లో ర్యాంకులు రావడంతో సీటు వస్తుందా? రాదా? అంచనా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో అప్పటివరకు ఖాళీగా ఉండలేక షార్ట్‌టర్మ్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. షార్ట్‌టర్మ్ కోర్సు కోసం ఒక్కో కోచింగ్ సెంటర్ రూ.25 వేల చొప్పున వసూలు చేస్తుండగా.. కొన్నిమాత్రం రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కోర్సుల్లో చేరి డబ్బులు వృథా చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. -
సందట్లో సైబర్ వల
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ పేరుతో ఫోన్లకు లింక్ పంపిస్తున్నారు. ఎవరైనా ఆతృతతో ఆ లింక్‌ను ఓపెన్ చేస్తే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ఎన్నికల ఫలితాల చర్చల ఆధారంగా ఆయా సోషల్ మీడియా గ్రూపులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. నకిలీ సర్వేలతో కూడిన లింకులను అందులో పోస్ట్ చేస్తున్నారు. ఏ పారీ్టకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే వారు వెంటనే వాటిని తెరుస్తున్నారు. ఇంకేముంది వెంటనే వారి ఫోన్ హ్యాక్ అవుతోంది. ఆపై పర్సనల్ డేటా, బ్యాంక్ అకౌంట్ వివరాలను హ్యాక్ చేసి.. ఆయా వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ముల్ని కాజేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగులకు పాల్పడుతున్న వారు ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. తాము బెట్టింగ్ వేసిన పార్టీ, అభ్యర్థి గెలుపోటముల గురించి పదేపదే తెలుసుకోవడంలో భాగంగా వారు తమకు కనిపించే ప్రతి ఎగ్జిట్ పోల్ లింకును తెరిచి చూస్తున్నారు. అదే వారి కొంప ముంచుతోంది. అయితే.. మోసపోయిన వారు ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోవడం కూడా సైబర్ నేరగాళ్లకు కలిసివస్తోంది. తాము మోసపోయామని చెబితే బెట్టింగ్ వేసిన విషయం కూడా బయటకు వస్తుందనే భయంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. అఅప్రమత్తం చేస్తున్న బాధితులుఇలా మోసపోయిన వారిలో కొందరు మరొకరికి ఇలా జరగకూడదని భావించి.. సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే అలాంటి లింకులను చూసి మోసపోవద్దని, వాటిని ఎవరూ తెరవద్దని పోస్టులు పెడుతూ అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం సోషల్ మీడియాలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ప్రచారం జరిగింది. కాగా.. మంగళవారం ఫలితాలు వెలువడే వరకూ ఇలాంటి ఫేక్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
జియోఫోన్ ప్రైమా సేల్స్ షురూ - ధర రూ.2,599 మాత్రమే!
ముంబై: కై–ఓఎస్ ప్లాట్‌ఫామ్ ఆధారిత 4జీ స్మార్ట్‌ఫోన్ కీప్యాడ్‌తో జియోఫోన్ ప్రైమా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. రిటైల్ స్టోర్స్‌తో పాటు రిలయన్స్ డిజిటల్డాట్ఇన్, జియోమార్ట్ ఎలక్ట్రానిక్స్, అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా విక్రయాలు ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 2,599గా ఉంటుంది. 2.4 అంగుళాల డిస్ప్లే స్క్రీన్, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ, 23 భాషలను సపోర్ట్ చేయడం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఫీచర్ ఫోన్ తరహాలోనే ఉన్నా వీడియో కాలింగ్, ఫొటోల కోసం డిజిటల్ కెమెరాలు, జియోటీవీ, జియోసినిమా వంటి ఎంటర్టైన్మెంట్ సర్వీసులు, జియోపే లాంటి యూపీఐ చెల్లింపుల విధానం మొదలైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి. -
అప్పుడు వాట్సాప్.. ఇప్పుడు మెసేజ్‌లు! బ్లాక్ చేస్తున్న ప్రముఖ బ్యాంకు..
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ (HSBC Holdings Plc).. తమ ఉద్యోగులు ఆఫీస్ మొబైల్ ఫోన్ల నుంచి మెసేజ్‌లు పంపే వీలు లేకుండా కట్టడి చేస్తోంది. అనధికారిక కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించడంపై రెగ్యులేటరీ సంస్థలు ఇటీవల చర్యలు చేపట్టిన నేపథ్యంలో హెచ్ఎస్బీసీ తమ సిబ్బందిని ఆఫీస్ ఫోన్లలో సందేశాలు పంపకుండా బ్లాక్ చేస్తోంది. కంపెనీ ఉద్యోగులకు జారీ చేసిన ఫోన్లలో మెసేజ్ ఫంక్షన్‌ను డిసేబుల్ చేసే ప్రక్రియలో ఉందని విషయం తెలిసిన కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. అంటే బ్యాంకు సిబ్బంది తమ ఆఫీస్ ఫోన్ల నుంచి సందేశాలను పంపలేరు, స్వీకరించలేరు. కాగా హెచ్ఎస్బీసీ ఇప్పటికే సిబ్బంది వర్క్ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించకుండా బ్లాక్ చేసింది. అయితే కీలకమైన బాధ్యతల్లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. వారు తమ వర్క్ ఫోన్ల నుంచి మెసేజ్‌లు పంపించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల వ్యక్తిగత ఫోన్లపై ఎలాంటి ఆంక్షలూ లేవు. రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఆమోదించిన కమ్యూనికేషన్ పద్ధతులను అవలంభిస్తున్నట్లు హెచ్ఎస్బీసీ బ్యాంక్ ప్రతినిధి చెప్పారు. సమాచారాన్ని పంచుకోవడానికి ట్రేడర్లు, డీల్మేకర్లు ఫోన్లు, సిస్టమ్‌లను ఎలా ఉపయోగిస్తున్నారు.. వారి యజమానులు వీటిని ఎలా ట్రాక్ చేస్తున్నారన్న దానిపై నియంత్రణ సంస్థలు పరిశోధిస్తున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. వాల్ స్ట్రీట్‌లోని కొన్ని అతిపెద్ద బ్యాంకులలో మార్కెట్ మానిప్యులేషన్‌కు సంబంధించిన అధిక ప్రొఫైల్ కేసుల తర్వాత ఆర్థిక దుష్ప్రవర్తనను నిరోధించడమే లక్ష్యంగా రెగ్యులేటరీలు ఈ చర్యలు చేపట్టాయి. వందల కోట్ల జరిమానా వాట్సాప్‌తో సహా అనధికారిక మెసేజింగ్ యాప్‌లలో ఉద్యోగుల కమ్యూనికేషన్లను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు గానూ హెచ్ఎస్బీసీ ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ రెగ్యులేటరీ సంస్థకు పెద్ద మొత్తంలో జరిమానా కట్టేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్‌కు 30 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 250 కోట్లు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు మరో 15 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 124 కోట్లు) చెల్లించింది. -
5జీ ఫోన్లపై ఆసక్తికర సర్వే.. ఎంత మంది అప్‌గ్రేడ్ అయ్యారు?
న్యూఢిల్లీ: దేశీయంగా అల్ట్రా హై–స్పీడ్ టెలికం సర్వీసుల వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో 5జీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి నుంచి డిసెంబర్ ఆఖరులోగా 3.1 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు 5జీ ఫోన్లకు అప్‌గ్రేడ్ కానున్నారు. ప్రస్తుతం 5జీ హ్యాండ్సెట్ యూజర్ల సంఖ్య 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వినూత్నమైన, వైవిధ్యమైన 5జీ కనెక్టివిటీ సేవల కోసం కాస్త ఎక్కువ చెల్లించేందుకు కూడా కస్టమర్లు సిద్ధంగానే ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్‌లో దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించారు. టెలికం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ గత కొద్ది నెలలుగా వీటిని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. ఇటీవలి ఊక్లా నివేదిక ప్రకారం 5జీ సేవల ఆవిష్కరణతో భారత్‌లో మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో జపాన్, బ్రిటన్, బ్రెజిల్‌ను కూడా దాటేసి, 72 స్థానాలు ఎగబాకి భారత్ 47వ ర్యాంకుకు చేరుకుంది. 5జీని ప్రవేశపెట్టాక భారత్‌లో స్పీడ్ 3.59 రెట్లు పెరిగింది. సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు.. మనకన్నా ముందు నుంచే 5జీ సేవలను వినియోగిస్తున్న అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాతో పోలిస్తే భారత్‌లో యూజర్లు సగటున వారానికి రెండు గంటలు ఎక్కువ సమయాన్ని 5జీ సర్వీసులపై వెచ్చిస్తున్నారు. 5జీని ముందుగా అందుబాటులోకి తెచ్చిన మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో 5జీపై సంతృప్తి స్థాయి అధికంగా ఉంది. 15 శాతం మంది వినియోగదారులు తమ 5జీ ప్లాన్లకు వీడియో ఆన్ డిమాండ్, గేమింగ్, మ్యూజిక్ వంటి అప్లికేషన్స్‌ను జోడించుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సర్వీసుల కోసం 14 శాతం ప్రీమియం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. నెలాఖరు వచ్చేసరికి 31 శాతం మంది 5జీ యూజర్లే తమ ప్లాన్లలో లభించే డేటాను పూర్తిగా వినియోగిస్తున్నారు. 58 శాతం మంది యూజర్ల ఖాతాల్లో 30 జీబీ పైగా డేటా మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ ధోరణులకు అనుగుణంగా డేటా వ్యూహాలను టెల్కోలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. -
వాళ్ళ లక్ష్యం చాట్ GPT యూజర్స్ భయపెడుతున్న కొత్త మాల్ వేర్స్.!
-
భారీ నష్టాల్లో శ్యాంసంగ్..రికార్డు స్థాయిలో పడిపోయిన సేల్స్
-
ఫోన్ల వాడకంపైనే ప్రశ్నలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వరసగా రెండోరోజు మంగళవారం కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు అంశాలపై సుమారు పది గంటల పాటు అధికారులు ఆమెను ప్రశ్నించారు. ప్రధానంగా పది ఫోన్లు వినియోగించారన్న ఆరోపణలపై కవితను ప్రశ్నించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 11.30 గంటలకు తుగ్లక్ రోడ్‌లోని నివాసం నుంచి భర్త అనిల్ వెంట రాగా బయటకు వచ్చిన కవిత.. మీడియాకు విజయ సంకేతం చూపుతూ ఈడీ కార్యాలయానికి బయలు దేరారు. ఈడీ తన చార్జిషీటులో కవిత 6209999999 నంబరును ఆరు వేర్వేరు ఐఎంఈఐ నంబర్లున్న ఆరు ఫోన్లలో, 8985699999 నంబరును నాలుగు వేర్వేరు ఐఎంఈఐ నంబర్లున్న నాలుగు ఫోన్లలో వినియోగించారని ఆరోపించింది. దీంతో ఆ పది ఫోన్లను కవిత మంగళవారం ఈడీకి అందజేశారు. మనీలాండరింగ్ కేసులో ఆప్ అగ్రశ్రేణి నేతలతో కవిత సంభాషించారని, పాలసీ విధానం ముందుగానే వాట్సాప్‌లో లీకయిందన్న ఆరోపణల నేపథ్యంలో కవిత ఫోన్లు పరిశీలించే నిమిత్తం వాటిని తీసుకురావాలని కోరినట్లు తెలిసింది. కాగా కవిత నుంచి తీసుకున్న ఫోన్లను క్లోనింగ్ నిమిత్తం పంపినట్లు సమాచారం. మూడు వాంగ్మూలాలపై సంతకాలు దర్యాప్తు అధికారి జోగిందర్, ఓ మహిళా అధికారి సహా మరో ముగ్గురు అధికారులు కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. ఏ ఫోనును ఎప్పుడు వినియోగించారు? ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వినియోగించారు? తక్కువ కాలంలో ఎక్కువ ఫోన్లు వినియోగించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అనే కోణంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మొత్తం మూడుసార్లు విచారణ సందర్భంగా మూడు వాంగ్మూలాలు నమోదు చేసిన ఈడీ అధికారులు వాటిపై కవితతో పాటు ఆమె న్యాయవాది సంతకాలు కూడా తీసుకున్నట్టు సమా చారం. ఇలావుండగా ఇంతకుముందే ఒక ఫోన్‌ను ఈడీకి ఇచ్చిన కవిత.. ఈరోజు 10 ఫోన్లు ఇవ్వడంతో మొత్తం 11 ఫోన్లు ఇచ్చినట్టయ్యింది. నేడు విచారణ లేనట్టేనా? విచారణ అనంతరం రాత్రి 9.40 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. పిడికిలి ఎత్తి, విజయ సంకేతం చూపుతూ, చిరునవ్వుతో శ్రేణులకు అభివాదం చేస్తూ నివాసానికి చేరుకున్నారు. తదుపరి విచారణ తేదీని ఈడీ ఇంకా ప్రకటించలేదు. అయితే బుధవారం విచారణకు రమ్మనలేదని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. ఈడీ కార్యాలయానికి భరత్ కవితను విచారిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కవిత విజ్ఞప్తి మేరకే ఈడీ అధికారులు భరత్‌ను పిలిచినట్లు తెలిసింది. అయితే కవిత తరఫున తదుపరి విచారణలో పాల్గొనడానికి సంబంధించిన ప్రక్రియ నిమిత్తం పిలిచారా? లేక కవిత న్యాయవాది సమక్షంలో సమాధానాలు చెబుతానంటే పిలిచారా? అనేది తెలియలేదు. -
ఈడీ అధికారులకు కవిత సంచలన లేఖ..
న్యూఢ్లిలీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడో రోజు విచారణకు ముందు ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్లు ధ్వంసం చేశానని తనపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాను గతంలో వాడిన ఫోన్లను అధికారులకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ? అని ప్రశ్నించారు. 'దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ఫోన్లు ధ్వంసం చేశానని పేర్కొంది. కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా, ఏమీ అడగకుండానే ఏ పరిస్థితుల్లో, ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ? నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీక్ చేయడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం.' అని కవిత లేఖలో ఘాటు విమర్శలు చేశారు. చదవండి: ఈడీ ముందుకు మూడోసారి.. పాత ఫోన్లన్నీ అప్పగించిన కవిత.. -
తెలంగాణాలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు : తరుణ్ చుగ్
-
టార్గెట్ సెల్‌ఫోన్స్ ! ఏటా వేల సంఖ్యలో గల్లంతు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి రోజైన గత నెల 31న మార్కెట్లలో జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆ ఒక్క రోజే రాజధాని వివిధ ప్రాంతాల్లోని జనసమర్థ ప్రాంతాల నుంచి 327 సెల్ఫోన్లను తస్కరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులందాయి. ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులూ పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్ చోరీల బాధితులుగా మారారు. చవితి నుంచి నిమజ్జనం వరకు 134 ఫోన్లు పోయినట్లు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి... ఇంకా అందుతున్నాయి. కేవలం ఈ రెండు సందర్భాలే కాదు గడిచిన కొన్నాళ్లుగా నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న పోలీసులు చోరుల కన్ను సెల్ఫోన్లపై ఉన్నట్లు స్పష్టమవుతోందని చెప్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఈ నేరాలు... రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నా, రద్దీ బస్సులో ప్రయాణిస్తున్నా, మార్కెట్‌కు వెళ్లినా, సభలు/ఉత్సవాలకు హాజరైనా అక్కడ పొంచి ఉంటున్న చోరులు స్పార్ట్ ఫోన్లను స్వాహా చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వాళ్ళు సైతం ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు కొత్త సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం సిటీ పోలీసులకు ‘సెల్‌ఫోనే’ ఓ పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అధికారిక, అనధికారిక సమాచారం ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేల వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల పిక్పాకెటర్లు పర్సులు, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. కొందరైతే ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. నిషా జోరులో, సరదా కోసం రెచ్చిపోతూ.... ఇటీవల కాలంలో ‘జాయ్ సెల్‌ఫోన్ స్నాచర్లు’ పెరిగిపోతున్న పరిస్థితి నగర పోలీసులకు కొత్త సవాళ్ళను విసురుతోంది. ఈ నేరాలు చేసే వారిలో అత్యధికులకు వాస్తవానికి ఆ అవసరం ఉండదు. ఇలాంటి స్నాచర్ల కుటుంబాలు సైతం స్థిరపడినవో, విద్యాధికులతో కూడినవో అయి ఉంటున్నాయి. అయితే మద్యం మత్తులోనో, గంజాయికి బానిసలుగా మారడంతోనో వీరు గతి తప్పుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ‘తాత్కాలిక స్నాచర్లుగా’ మారిపోయి అప్పుడప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలోనూ కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి కేసుల్ని సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి తెస్తున్న పోలీసులు నేరగాళ్ళను కట్టడి చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. పెండింగ్ భయంతోనే అధికం... జేబు దొంగతనాలు, స్నాచింగ్స్, సెల్‌ఫోన్ చోరీలు, వాహనాల దొంగతనాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారం కావని, పెండింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని చాలా వరకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు. కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతో సరిపెడుతున్నారు. దీంతో బాధితులు నష్టపోతున్నారు. (చదవండి: ఉదయగిరిలో బాలిక కిడ్నాప్) -
‘నో ఫోన్’ జోన్లుగా టెన్త్ పరీక్ష కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ‘నో ఫోన్’ జోన్లుగా ప్రకటించింది. దీంతో పాటు టెన్త్ పరీక్షలను సజావుగా పూర్తి చేసేందుకు జాగ్రత్తలు సూచిస్తూ డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. గతంలో జారీ చేసిన సూచనలకు కొనసాగింపుగా.. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సూచనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. కొత్త నిబంధనలివీ.. ► పరీక్షల విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, నాన్ టీచింగ్, ఇతర శాఖల సిబ్బంది (ఏఎన్ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్లు సహా పోలీసు సిబ్బంది) పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదు. ► స్మార్ట్ వాచ్‌లు, డిజిటల్ వాచ్‌లు, కెమెరాలు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్నెస్ ట్రాకర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదు. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాలి. సిబ్బంది లేదా అభ్యర్థుల వద్ద పరీక్ష కేంద్రం ప్రాంగణంలో ఏదైనా ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం గుర్తిస్తే వెంటనే జప్తు చేయాలి. ► మిగిలిన పరీక్షల కోసం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇన్విజిలేటర్ల జంబ్లింగ్‌ను సమీక్ష చేయాలి. వారు పనిచేసే పాఠశాల విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే కేంద్రాలలో ఇన్విజిలేటర్లుగా ఉండకుండా చూసుకోవాలి. ► పరీక్ష కేంద్రంలోని మిగిలిన అన్ని ప్రశ్న పత్రాలను సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డీవో, ఇద్దరు ఇన్విజిలేటర్లు సంతకం చేసిన పేపర్ సీల్‌తో సీలు చేసి రికార్డుల్లో నమోదు చేయాలి. ► పరీక్ష హాల్లో ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేసిన వెంటనే అందులోని అన్ని పేజీలలో రోల్ నంబర్, పరీక్ష కేంద్రం నంబర్‌ను అభ్యర్థులతో రాయించేలా ఇన్విజిలేటర్లందరికీ సూచించాలి. ఇన్విజిలేటర్లు పరీక్ష ప్రారంభానికి ముందు ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలలో రోల్ నంబర్, సెంటర్ నంబర్ తప్పనిసరిగా రాసేలా విద్యార్థులందరి ప్రశ్నపత్రాలను తనిఖీ చేయాలి. ► పరీక్షలలో అక్రమాల నిరోధానికి ఏపీ పబ్లిక్ పరీక్షలను (మాల్ ప్రాక్టీస్ నివారణ) చట్టం 25/1997ను దుష్ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తులందరిపై కఠినంగా అమలు చేయాలి. చట్టంలోని కఠినమైన నిబంధనలపై విస్తృత ప్రచారం చేయాలి. -
వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్ తో ముందుకు వచ్చింది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లపై డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ జనవరి 17నుండి ప్రారంభం కానుండగా..ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందు అంటే జనవరి 16 నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌పై అమెజాన్ డిస్కౌంట్లు అందిస్తుండగా..రెడ్మీ,వన్ ప్లస్, శాంసంగ్, ఐక్యూ, టెక్నోవంటి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. వీటితో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ లపై గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' లో ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. అమెజాన్ త్వరలో ప్రారంభించనున్నగ్రేట్ రిపబ్లిక్ డే సేల్' ఈ బ్రాండ్ ఫోన్లపై డిస్కౌంట్లను అందించనుంది. వీటితో పాటు అదనంగా మరికొన్ని ఫోన్లను డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. ►రెడ్మీ నోట్ 10ఎస్ ధర రూ. 16,999 కంటే తక్కువ ►వన్‌ప్లస్ నార్డ్ 2పై డిస్కౌంట్లతో ►రెడ్ మీ 9ఏ స్పోర్ట్స్ రూ. 8,499 కంటే తక్కువ ►రెడ్మీ 9 యాక్టీవ్ రూ.రూ. 10,999 కంటే తక్కువ ►వన్ ప్లస్ నార్డ్ సీఈ ఫోన్ పై డిస్కౌంట్లతో ►శాంసంగ్ గెలాక్సీ ఎం 32 ధర రూ. 23,999లోపు ►శాంసంగ్ గెలాక్సీ ఎం 12 ధర రూ.12,999 కంటే తక్కువ ►డిస్కౌంట్లో రెడ్ మీ నోట్ 11టీ ►టెక్నో స్పార్క్ 8టీ ధర రూ.12,999లోపు ►శాంసంగ్ గెలాక్సీ ఎం 32 5జీ ధర రూ.10,999 నుంచి రూ. 15,999 మధ్యలో ఉంది ►ఐక్యూ జెడ్ 5 ధర రూ. 29,990 కంటే తక్కువ ►రెడ్మి 10 ప్రైమ్ రూ. 10,999 నుంచి రూ. 13,999 వరకు ఉంది ►వన్ ప్లస్ 9ఆర్ పై డిస్కౌంట్లు ►ఐక్యూ జెడ్ 3 రూ. 22,990 కంటే తక్కువ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొని రానుంది. ఉదాహరణకు..ల్యాప్‌టాప్‌లు, హెడ్సెట్,స్మార్ట్‌వాచ్‌లు 70 శాతం డిస్కౌంట్లో పొందవచ్చు. శాంసంగ్, ఎల్జీ, షావోమీ టీవీలు, ఇతర ఉపకరణాలపై గరిష్టంగా 60 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఆఫర్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో షాపింగ్ చేసే కస్టమర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ సౌకర్యంతో పాటు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్,అమెజాన్ పే, ఐసీఐసీఐ కార్డ్‌లపై నో కాస్ట్ ఈఎంఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులపై ఎక్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్లో రూ.16,000 వరకు తగ్గింపు పొందవచ్చని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్..! -
అమ్మకానికి పెట్టి బుక్కయ్యాడు.. వాడి ప్రతిభకు పోలీసులే అవాక్కు!
తాడేపల్లిరూరల్: అపహరించిన సెల్ఫోన్లు ఓఎల్ఎక్స్ ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కిన వైనం. తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి కరకట్ట వెంబడి కృష్ణానది ఒడ్డున స్నానాలు ఆచరించే విద్యార్థులు వారి సెల్ఫోన్లు భద్రపరచిన బ్యాగ్ పోవడంతో తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకున్నారు. గురువారం తాడేపల్లి సీఐలు శేషగిరిరావు, సాంబశివరావులు వివరాలు వెల్లడించారు. గుంటూరు కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 23 మంది విద్యార్థులు ఈనెల 7వ తేదీన తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి కరకట్ట వెంబడి గంగరాజు గెస్ట్‌హౌస్ సమీపంలో స్నానాలు ఆచరించేందుకు విచ్చేశారు. ఆ సమయంలో 23 మంది విద్యార్థులు తమ వద్ద ఉన్న 24 సెల్ఫోన్లను ఓ బ్యాగ్‌లో భద్రపరచి ఒడ్డున పెట్టారు. వారు స్నానం చేసి బయటకు వచ్చి చూడగా ఫోన్లు కనిపించలేదు. అదేరోజు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేశారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచన మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఓ.ఎల్.ఎక్స్‌లో ఫోన్లు అమ్ముతున్నారని సమాచారం రాగా, ఫోన్లు అమ్ముతున్న విజయనగరం జిల్లా, గూర్ల మండలం, గూడెం గ్రామానికి చెందిన కనకం దామోదరంను సంప్రదించారు. నగదును చెల్లించగా అతను సెల్ఫోన్లు తీసుకుని సీతానగరం పుష్కర ఘాట్‌కు వచ్చాడు. అతని వద్ద 22 సెల్ఫోన్లు ఉన్నాయని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. 22 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సెల్‌ఫోన్ దొంగతనాల కేసులు ఉన్నాయని, విజయనగరం పోలీసులు కోర్టుకు తీసుకు వెళుతుండగా పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన ఎస్ఐలు రమేష్, వినోద్, సిబ్బంది శివకృష్ణ, బాబూరావు, విష్ణు, కళ్యాణ్, ఐటీ ఫోర్స్ సిబ్బందికి అర్బన్ ఎస్పీ అభినందనలు తెలిపారు. చదివింది ఇంటర్.... టెక్నాలజీలో మాత్రం అదుర్స్ విజయనగరం జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన కనకం దామోదరం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఏర్పడడంతో ఇద్దరూ విడిపోయారు. దామోదరం చదువు మానేశాడు. హాస్టల్స్, కాలేజీల వద్ద మకాం వేసి విద్యార్థులతో స్నేహం చేసి వారి వద్ద సెల్ఫోన్లు దొంగిలిస్తాడు. వాటిని ఓ.ఎల్.ఎక్స్‌లో పెట్టి అమ్మి సొమ్ము చేసుకుంటాడు. ల్యాప్‌టాప్ ఉపయోగించి తను దొంగిలించిన సెల్ఫోన్లు దానికి కనెక్ట్ చేసి సెకన్లలో లాక్ తీయడాన్ని పోలీసులు గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు. -
‘అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లనే అత్యాచారాలు’
లక్నో: ఉత్తరప్రదేశ్ యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి అత్యాచారాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని దీని పరిణామాలే అత్యాచారాలకు దారి తీస్తాయన్నారు. ఆలీఘర్‌లో మహిళలకు సంబంధించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా అమ్మాయిలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని ఆమె ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మొదట అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుతారు ఆ తరువాత వారితో పారిపోతారన్నారు. కాగా రాష్ట్రంలో అత్యాచారం కేసులు గణనీయంగా పెరిగాయి అనే ప్రశ్నకు సమాధానంగా కుమారి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ మహిళా కమిషన్ మాత్రం మీనా కుమారి వ్యాఖ్యలను సమర్థించలేదు. కమిషన్ ఉపాధ్యక్షుడు అంజు చౌదరి, కుమారి వ్యాఖ్యలు తప్పని, అమ్మాయిలను ఫోన్లకు దూరంగా ఉంచినంత మాత్రాన అత్యాచారాలకు తగ్గుదలకు ఇవి పరిష్కారం కాదన్నారు. UP महिला आयोग अध्यक्ष का विवादित बयान, 'फोन पर लंबी बात कर लड़कों के साथ भाग जाती हैं लड़कियां, उन्हें ना दें मोबाइल'#MeenaKumari #UPStateWomenCommission#UPSWC pic.twitter.com/CDccF2kqBx — NBT Uttar Pradesh (@UPNBT) June 10, 2021 చదవండి: ‘‘దేవుడి ఆధార్ కార్డ్ తెస్తేనే.. పంట కొంటాం’’ -
వాట్సాప్ కీలక నిర్ణయం
శాన్ఫ్రాన్సిస్కో: మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తో పాటు ఐవోఎస్ 7 వాడే ఐఫోన్లకు 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల పాత ఓఎస్‌లు ఉన్న మొబైల్ ఫోన్లలో కొత్త అకౌంట్లను తెరవలేరనీ, పాత అకౌంట్లను యాక్సెస్ చేయలేరని వెల్లడించింది. ‘2019, డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఓఎస్ ఉన్న యూజర్లు వాట్సాప్‌ను వాడలేరు. ఈ ఏడాది జూలై 1 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో వాట్సాప్ అందుబాటులో ఉండదు’ అని పేర్కొంది. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 8 అంతకన్నా అప్డేటెడ్ వెర్షన్లు వాడాలని సూచించింది. వాట్సాప్ ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ల ఫోన్ల కోసం 2.199.177 బీటా వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ద్వారా చాటింగ్ చేస్తూనే పీఐపీ మోడ్‌లో వీడియోలను వీక్షించొచ్చు. అయితే బీటా వెర్షన్లో పీఐపీ మోడ్ ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. -
హలో మీ.. అభ్యర్థిని మాట్లాడుతున్నా..
సాక్షి, జనగామ: రాజకీయ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. ఓటరు దేవుళ్లకు నమస్కారం... అయ్యా.. నేను మీ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతున్నా.. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ తమ భవితవ్యాన్ని వెతుక్కుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు రెండు నెలల నుంచి ప్రచారం మొదలు పెట్టగా... కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు పదిహేను రోజులుగా ఊరూరా తిరుగుతూ హోరెత్తిస్తున్నారు. గెలుపోటములపై గత వారం రోజులుగా ఎవరికి వారే బేరీజు వేసుకుంటున్నారు. తమ నియోజక వర్గంలోని ఓటర్ల ఫోన్ నెంబర్లను సేకరించి, ఫోన్ల ద్వారా సొంతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. దీని ద్వారా తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, చేయబోయే కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. గతంలో నేరుగా ఓటర్లను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించే నాయకులు.. ప్రస్తుతం ట్రెండు మార్చేశారు. -
మొబైల్స్‌కు రూపాయి సెగ..!
దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం, దిగుమతులపై ఆధారపడిన వస్తు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది. ఒక డాలర్ కొనాలంటే తాజాగా రూ.73.34 చెల్లించాలి. కానీ, ఈ ఏడాది జనవరి 1న డాలర్‌తో రూపాయి మారకం విలువ 63.88. 2018లో ఇంతవరకు 14% నష్టపోయింది. దీంతో దిగుమతి ఆధారిత పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇప్పటికే కాక పుట్టిస్తుండగా, మరోవైపు బంగారం ధర కూడా రేజింగ్‌లో ఉంది. ఇక ఎక్కువ మంది భారతీయులు వినియోగించే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పైనా రూపాయి ప్రభావం తీవ్రంగానే ఉంది. దేశీయ కరెన్సీ వరుసగా క్షీణిస్తూ రావడంతో చైనా కాంపోనెంట్స్‌పై ఆధారపడిన హ్యాండ్సెట్ తయారీదారులను అయోమయంలోకి నెట్టేసింది. స్మార్ట్ఫోన్లలో వాడే విడిభాగాల్లో 90% దిగుమతి చేసుకునేవే కావడం గమనార్హం. దీంతో ఇంటెక్స్ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో తన ప్రస్తుత మోడళ్లను ఉపసంహరించుకుని, వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇక చైనాకు చెందిన ప్రీమియం బ్రాండ్ వన్‌ప్లస్ సహా పలు కంపెనీలు తమ స్మార్ట్ఫోన్ల ధరలను రానున్న రోజుల్లో పెంచాలన్న ఆలోచనతో ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో తమ హ్యాండ్సెట్ల ధరలను పెంచనున్నట్టు వన్‌ప్లస్ స్పష్టం చేసింది. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికి ధరలను సమీక్షించక తప్పదని షావోమీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. కొత్త ఎత్తుగడ... ఈ ఏడాది జూన్ నుంచి స్మార్ట్ ఫోన్ల తయారీ వ్యయం పెరిగిపోయింది. మే నెలలో రూపాయి 68కి పడిపోవడంతో మొబైల్స్ తయారీ సంస్థలకు కరెన్సీ తాలూకూ నొప్పి తెలియడం మొదలైంది. దీంతో అవి లాభసాటి కావనుకున్న కొన్ని మొబైల్స్‌ను ఉపసంహరించుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టాయి. అదే సమయంలో కొత్త మోడళ్లను, తమకు లాభసాటి అయిన ధరలతో మార్కెట్లోకి విడుదల చేసే పనిని చేపట్టాయి. ఫలితమే జూన్ నుంచి 250 స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విడుదల కావడం. గతేడాది ఇదే కాలంలో విడుదలైన మోడళ్ల సంఖ్య 200 వరకే ఉంది. ‘‘ఇతర సంవత్సరాల మాదిరిగా కాకుండా జూన్ నుంచి మొబైల్స్ విడుదల ఊపందుకుంది. వ్యయాలు పెరిగిపోవడంతో కంపెనీలు కొత్త మోడళ్లతో, కొత్త ధరలతో ముందుకు వచ్చాయి’’ అని ఐడీసీ ఇండియా అనలిస్ట్ జైపాల్ సింగ్ తెలిపారు. ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కండేయ కంపెనీ చర్యను సమర్థించుకున్నారు. పాత మోడళ్ల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్డడం కంపెనీ ప్రణాళికలో భాగమన్నారు. ‘‘పెరిగిన ధరల భారం మాపై ఉంది. కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు వ్యయాన్ని కొంత వరకు సర్దుబాటు చేసుకున్నాం. పోటీలో నిలిచేందుకు మొత్తం భారాన్ని కస్టమర్‌కు బదిలీ చేయడం లేదు’’ అని చైనాకు చెందిన హ్యాండ్సెట్ సంస్థ ట్రాన్సియన్ హోల్డింగ్ సీఈవో అరీజిత్ తల్పాత్ర తెలిపారు. అయితే, వన్‌ప్లస్ వంటి ఫ్లాగ్షిప్ మోడళ్లకే పరిమితమయ్యే కంపెనీలకు ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రముఖ కంపెనీలు సైతం... కరెన్సీ పతనం కారణంగా పెరిగిన వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు షావోమీ, వివో, ఒప్పో, శామ్సంగ్ వంటి ప్రధాన కంపెనీలు కూడా నూతన మోడళ్లను ప్రవేశపెట్టడంపై దృష్టి సారించాయి. రూపాయి క్షీణత తమ అన్ని బ్రాండ్లపై భారాన్ని మోపినట్టు షావోమీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. షావోమీ ఇటీవలే ఆరు మోడళ్లను విడుదల చేసింది. కొరియాకు చెందిన శా>మ్‌సంగ్ అయితే 12 మోడళ్లను విడుదల చేయగా, ఒప్పో, వివో కంపెనీలు అర డజను వరకు మోడళ్లను విడుదల చేశాయి. అయితే, స్మార్ట్ఫోన్ల విక్రయాలు దసరా–దీపావళి పండగల సీజన్లో ఎక్కువగా జరుగుతాయి. ఏడాదిలో మొత్తం విక్రయాల్లో 30 శాతం, ఫోన్ల విడుదలలో 60 శాతం ఈ సీజన్లోనే జరుగుతాయి. కానీ, ఇదే సమయంలో రూపాయి క్షీణిస్తుండడం మార్కెట్ వర్గాలను అసంతృప్తికి గురి చేస్తోంది. చైనా నుంచి విడిభాగాల దిగుమతి కోసం బల్క్ ఆర్డర్లను ఇస్తుంటే, అక్కడి కంపెనీలు తీసుకునే పరిస్థితి లేదంటున్నాయి. రూపాయి రానున్న రోజుల్లో మరింత క్షీణిస్తుందన్న అంచనాలే అక్కడి కంపెనీలు ఆర్డర్లు స్వీకరించకపోవడానికి కారణం. -
ఆండ్రాయిడ్ పీ అప్డేట్తో నోకియా ఫోన్లు?
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ఎండీ గ్లోబల్ భాగస్వామ్యంతో మార్కెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన నోకియా స్మార్ట్ఫోన్లు మరో అడుగు ముందుకు వేశాయి. 2018 ఆగస్టునుంచి లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్‌డేటెట్ వెర్షన్‌తో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. రాబోయే అన్ని నోకియా ఫోన్లు ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ‘పి’ తో రాబోతున్నాయని హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ అప్డేట్కు సంబంధించిన ఈ మెయిల్ సంభాషణ లీక్ అయింది. అలాగే నోకియా ప్రతినిధికూడా అనధికారికంగా ఈ అప్డేట్ను దృవీకరించినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు కొత్త ఆపరేటింగ్ సిస్టం గురించి ఎటువంటి సమాచారం లేకపోయినా ఆగస్టుమాసంలో ఆడ్రాయిడ్ పితో రాబోతుందన్న పుకార్లు భారీగా షికారు చేస్తున్నాయి. 2017లో నోకియా స్మార్ట్ ఫోన్లను తిరిగి మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో నోకియా 2, నోకియా 3, నోకియా 5 స్మార్ట్ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేసింది. -
ఫోన్లోనే సెల్ఫీ స్టిక్!
ఫొటో చూసిన వెంటనే విషయం తెలిసిపోతుంది. స్మార్ట్‌ఫోన్ కేసులో ఇమిడిపోయే ఓ కెమెరా.. ఎక్కడ పడితే అక్కడ దాన్ని అతికించుకునే వీలు.. తద్వారా సెల్ఫీలకు ఒక కొత్త అర్థం. ఇదీ ఎవో గోక్యామ్ ప్రత్యేకతలు. వైర్లెస్ కెమెరా ఉండే ఈ సెల్ఫీ స్టిక్‌ను ఐఫోన్లతోపాటు కొన్ని హై ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లతో మాత్రమే పనిచేస్తుంది. సిలికోన్‌తో తయారైన ఎవో గోక్యామ్ కేవలం ఆరు మిల్లీమీటర్ల మందం ఉంటుంది. వైఫై ద్వారా ఫొటోలు తీయవచ్చు. మొత్తం 5 మెగాపిక్సెల్స్ రెజల్యూషన్, 1080పిక్సెల్స్/30 ఫ్రేమ్స్ పర్ సెకన్ వేగంతో వీడియోలు తీయవచ్చు. ఫొటోలు, వీడియోలు మొత్తం మన ఫోన్లోని ఎస్డీ కార్డులో స్టోర్ అవుతాయి. దాదాపు 150 అడుగుల దూరం నుంచి కూడా ఈ కెమెరా పనిచేస్తుంది. ప్రత్యేకమైన యాప్ ద్వారా కెమెరా లెన్స్ ఎటువైపు చూస్తోందో చూసుకోవచ్చు. మార్పులు చేసుకోవచ్చు కూడా. రికార్డు చేసిన ఫొటోలు, వీడియోలను వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియాల్లో షేర్ చేసుకోవచ్చు. అవసరమైతే రెండు మూడు ఎవో గోక్యామ్లను నెట్వర్క్ చేసుకుని వేర్వేరు కోణాల్లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకునే వీలుంది! -
మార్చి 31 తరువాత కూడా!
న్యూఢిల్లీ: ఆధార్ అనుసంధానం తలనొప్పి ప్రస్తుతానికి తొలగింది. వివిధ సేవలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధాన గడువైన మార్చి 31వ తేదీ దగ్గరికొస్తుండటంపై ఆందోళన చెందుతున్నవారు ఊపిరి పీల్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానించుకునే గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. ఆధార్ చట్టబద్ధతను నిర్ధారించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేవరకు, ఈ గడువు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంటే, మార్చి 31 తరువాత కూడా, రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువడే వరకు, ఆధార్ అనుసంధాన ప్రక్రియను పౌరులు, వినియోగదారులు కొనసాగించుకోవచ్చు. అయితే సంఘటిత నిధి నుంచి నిధులందే ఉపాధి హామీ, ఆహార భద్రత తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం ఆధార్ సంఖ్యను మార్చి 31 తరువాత కూడా యథావిధిగా కోరవచ్చని స్పష్టతనిచ్చింది. తత్కాల్ పాస్‌పోర్ట్‌కూ అవసరం లేదు వివిధ సేవలు, సంక్షేమ పథకాలతో ఆధార్ అనుసంధానానికి ఇచ్చిన మార్చి 31 గడువుని పొడిగించేందుకు సిద్ధమని కేంద్రం ఇదివరకే కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ‘ ఆధార్ చట్టబద్ధతపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తి చేసి, తుది తీర్పు వెలువరించే వరకు.. ఆధార్ అనుసంధానానికి సంబంధించి గతంలో ఇచ్చిన మార్చి 31 గడువును నిరవధికంగా పొడిగించాలని ఆదేశిస్తున్నాం’ అని బెంచ్ పేర్కొంది. అలాగే, తత్కాల్ పాస్‌పోర్ట్ పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని కూడా తేల్చి చెప్పింది. మంగళవారం జరిగిన విచారణలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సీనియర్ న్యాయవాదులు పి.చిదంబరం, కేవీ విశ్వనాథన్ పాల్గొన్నారు. ఆధార్ చట్టబద్ధత, దానికి సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన సంగతి తెలిసిందే. సబ్సిడీల పంపిణీలో అవాంతరాలు వద్దు ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగించడం వల్ల ఆ చట్టంలోని సెక్షన్ 7 పరిధిలోకి వచ్చే సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించడంలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆధార్ చట్టంలోని నిబంధన 7 ప్రకారం.. లబ్ధిదారుడి గుర్తింపును ధ్రువీకరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ వివరాలు కోరొచ్చు. ఆధార్ పొందని వారు కూడా ఆ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నామని నిరూపించగలిగితే ప్రభుత్వ ప్రయోజనాలు పొందొచ్చు. అలాంటి వారి గుర్తింపును నిర్ధారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తారు. ఆధార్ చట్టబద్ధతను సవాల్ చేసిన పిటిషనర్లలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తరఫున హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం వాదిస్తూ.. ఆధార్ బిల్లును లోక్‌సభ స్పీకర్ తప్పుగా మనీ బిల్లుగా పేర్కొని, అది రాజ్యసభకు రాకుండా అడ్డుకున్నారని అన్నారు. ఆధార్ తప్పనిసరే: యూఐడీఏఐ బ్యాంకు ఖాతాలు, తత్కాల్ పాస్‌పోర్టులకు ఆధార్ తప్పనిసరియేనని ఆధార్ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. అయితే ఆధార్ ఇంకా పొందని వారు, దానికి దరఖాస్తు చేసుకుని అప్లికేషన్ సంఖ్యతో ఆ సేవలు పొందొచ్చని పేర్కొంది. ‘సంబంధిత చట్టాల ప్రకారం బ్యాంకు ఖాతాలు, తత్కాల్ పాస్‌పోర్టులకు ఆధార్ తప్పనిసరి అని చెబుతున్న నిబంధన కొనసాగుతుంది’ అని యూఐడీఏఐ తెలిపింది.