శాన్‌ఫ్రాన్సిస్కో: మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తో పాటు ఐవోఎస్ 7 వాడే ఐఫోన్లకు 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల పాత ఓఎస్‌లు ఉన్న మొబైల్ ఫోన్లలో కొత్త అకౌంట్లను తెరవలేరనీ, పాత అకౌంట్లను యాక్సెస్ చేయలేరని వెల్లడించింది. ‘2019, డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఓఎస్ ఉన్న యూజర్లు వాట్సాప్‌ను వాడలేరు. ఈ ఏడాది జూలై 1 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో వాట్సాప్ అందుబాటులో ఉండదు’ అని పేర్కొంది.
ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 8 అంతకన్నా అప్‌డేటెడ్ వెర్షన్లు వాడాలని సూచించింది. వాట్సాప్ ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ల ఫోన్ల కోసం 2.199.177 బీటా వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ద్వారా చాటింగ్ చేస్తూనే పీఐపీ మోడ్‌లో వీడియోలను వీక్షించొచ్చు. అయితే బీటా వెర్షన్‌లో పీఐపీ మోడ్ ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment