operating system
-
సెల్ఫోన్లో వాయిస్‌తో బైక్ ఆపరేటింగ్
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నంకు చెందిన యువకుడు కొంగొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. దాదాపు 20 నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బాల్యం నుంచి సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న రాసంశెట్టి ప్రణయ్ విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో సీఈసీ బ్రాంచ్‌లో నెల రోజుల కిందటే బీటెక్ పూర్తి చేశాడు. రెండు రోజుల క్రితం సెల్‌ఫోన్‌తో వాయిస్ ద్వారా బైక్ ఆపరేటింగ్ విధానాన్ని కనుగొన్నాడు. మచిలీపట్నం నగరపాలక సంస్థ 9వ డివిజన్ కార్పొరేటర్ రాసంశెట్టి వాణిశ్రీ, చంటి దంపతుల కుమారుడే ఈ ప్రణయ్. సెల్ఫోన్లో వాయిస్ వినిపించటంతో బైక్ సెల్ప్, కిక్, తాళం లేకుండానే ఆన్ అయ్యేలా రెండు రోజుల క్రితం తన బైక్‌కు అమర్చాడు. బ్లూటూత్ వాయిస్ ద్వారా బైక్ సీటు కింద అమర్చిన ఆర్డినోబోర్డ్ పని చేయటం ద్వారా ఇది పనిచేసేలా రూపొందించాడు. అతని బండి పేరు లక్కీ కావటంతో అన్‌లాక్ లక్కీ అంటే మీటరు ఆనయ్యేలా, స్టార్ట్ లక్కీ అంటే స్టార్ట్ అయ్యేలా, స్టాప్ అంటే ఆగేలా దీనిని రూపొందించాడు. 15 నుంచి 20 మీటర్ల దూరం నుంచి బండిని ఆపరేటింగ్ చేసినా ఇది పనిచేస్తోంది. వెయ్యి రూపాయల ఖర్చుతో దీనిని తయారు చేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇచ్చే పలు ఆవిష్కరణలకు ప్రణయ్ ప్రయత్నిస్తూ ఫలితాలను సాధిస్తున్నాడు. నూతన ఆవిష్కరణలు చేస్తున్న ప్రణయ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) అభినందించారు. ఆవిష్కరణలు ఇవే.... ► ప్రణయ్ తాతయ్య కమ్మిలి మాధవరావు వృద్ధాప్యంతో ఉండటంతో టీవీ, ప్యాన్, లైట్ల స్విచ్‌లు వేసేందుకు వెళ్లటం ఇబ్బందిగా ఉండటంతో ఆయన కోర్కె మేరకు వీటిని రిమోట్, ఫోన్ వాయిస్ ద్వారా కంట్రోల్ చేసేలా తయారుచేశాడు. దీనిని మాధవరావు గత ఏడాదిగా వినియోగిస్తున్నారు. ► 2022 ఆగస్టులో ఉత్తరాఖండ్‌లో జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాక్‌థాన్ పోటీల్లో ప్రణయ్ నేతృత్వం వహించిన ప్రాజెక్టు జాతీయస్థాయిలో ప్రథమస్థానాన్ని సాధించి లక్ష రూపాయల బహుమతి అందుకోవటం జరిగింది. బ్లూ వాయిస్ సీఎన్సీ మిషన్ రైటింగ్ అనే ప్రాజెక్టుకు ఈ బహుమతి వచ్చింది. ఈ మిషన్ వల్ల రాయడానికి వీలు లేని దివ్యాంగులు రాతపరీక్షకు హాజరైతే వేరే వ్యక్తులు అవసరం లేకుండా ఈ మిషన్ వాయిస్ ద్వారా పరీక్ష రాస్తుంది. జాతీయస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 150 ప్రదర్శనలు రాగా ప్రణయ్ బృందం ప్రదర్శన జాతీయస్థాయిలో మొదటి బహుమతి గెలుచుకుంది. ► ప్రణయ్ ఇంట్లోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటి సరఫరాకు మోటారు నిర్వహణ చేసేందుకు మూడేళ్ల క్రితమే సెన్సార్ల ద్వారా పని చేసే విధానాన్ని వినియోగిస్తున్నారు. దీని ద్వారా వాటర్ ట్యాంకులో నీరు ఖాళీ అయినప్పుడు మోటార్ ఆనవ్వటం, ట్యాంకు నీటితో నిండగానే మోటారు ఆగిపోవటం జరుగుతోంది. ► ఆటోమేటిక్ బాత్రూమ్ లైట్ విధానంతో బాత్రూమ్లో అడుగుపెట్టగానే లైట్ వెలగటం, బయటకు రాగానే లైట్ ఆగేలా ప్రణయ్ ఏర్పాటు చేశాడు. అలాగే స్ట్రీట్ లైట్లు చీకటి పడగానే వెలగటం, వెలుతురు రాగానే ఆగిపోవటం వంటి విధానాన్ని రూపొందించాడు. దీంతో పాటు వైఫై కార్, వాయిస్ కంట్రోల్ కార్, అబ్స్టాకిల్ అవాయిడింగ్ రోబోట్, లైట్ డిపెన్డెంట్ రిజిష్టర్ తదితర ఆవిష్కరణలను చేశాడు. రైటింగ్ మిషన్ అందించాలనే లక్ష్యం రాయలేని వికలాంగులకు బ్లూ వాయిస్ సీఎన్సీ రైటింగ్ మిషన్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. రానున్న రోజుల్లో పాఠశాలల్లో, కళాశాలలో చదివి రాయలేని వికలాంగులకు ప్రభుత్వ సాయంతో మిషన్‌ను అందించాలని కృషి చేస్తున్నాను. మరిన్ని నూతన ఆవిష్కరణలతో ప్రజలకు ఉపయోగపడేలా పని చేయాలన్నదే నా కోరిక. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దాదాపు 20 నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేశాను. – రాసంశెట్టి ప్రణయ్, మచిలీపట్నం -
భరోస్, డేటా భద్రతకు ఓఎస్! భారత్ విప్లవాత్మక ముందడుగు
ప్రపంచమంతటా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు విలాసాలు కాదు.. నిత్యావసరాలుగా మారిపోయాయి. మన దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. దాదాపు అన్ని రంగాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం తప్పనిసరిగా మారింది. ఇక ఫోన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ధనవంతుల నుంచి సామాన్యుల దాకా అందరి చేతుల్లోనూ దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్లు, ఫోన్లు పని చేయాలంటే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) కచ్చితంగా ఉండాలి. ఇలాంటి ఓఎస్ కోసం మనం ఇన్నాళ్లూ విదేశాలపైనే ఆధారపడుతున్నాం. ఓఎస్‌ను దేశీయంగా మనమే తయారు చేసుకోలేమా? అన్న ప్రశ్నకు సమాధానమే ‘భరోస్’. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే దిశగా ఫోన్లలో ఉపయోగపడే ఓఎస్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాస్ అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్ స్వయంగా పరీక్షించారు. భరోస్ పరీక్ష విజయవంతమైందని ప్రకటించారు. ఈ ఓఎస్ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములైన వారిని అభినందించారు. ఏమిటీ భరోస్? ► విదేశీ ఓఎస్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం, స్థానికంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► ఇందుకోసం భరోస్ పేరిట దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి నిధులు సమకూర్చింది. ► ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఓఎస్‌లతో డిఫాల్ట్ యాప్‌లు, గూగుల్ సర్వీసులు తప్పనిసరిగా వస్తాయి. వాటిలో చాలావరకు మనకు అవసరం లేనివే ఉంటాయి. అవి ఏ మేరకు భద్రమో తెలియదు. ► భరోస్ ఓఎస్ వీటి కంటే కొంత భిన్నమనే చెప్పాలి. ఇదొక ఉచిత, ఓపెన్–సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నో డిఫాల్ట్ యాప్స్(ఎన్డీఏ)తో వస్తుంది. అంటే భరోస్ ఓఎస్‌ను ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్లో ఎలాంటి యాప్‌లు కనిపించవు. ► గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్లతో క్రోమ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, మ్యాప్స్ వంటివి డిఫాల్ట్‌గా వస్తుండడం తెలిసిందే. ► డిఫాల్ట్‌గా వచ్చే యాప్‌లతో మోసాలకు గురవుతుండడం వినియోగదారులకు అనుభవమే. అందుకే భరోస్ ఓఎస్ ఉన్న ఫోన్లలో అవసరమైన యాప్‌లను ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీసెస్(పాస్) నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ‘పాస్’లో బాగా నమ్మకమైన, ప్రభుత్వ అనుమతి ఉన్న, అన్ని రకాల భద్రత, గోప్యత ప్రమాణాలు కలిగిన యాప్‌లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఫోన్లలోని డేటా చోరీకి గురవుతుందన్న ఆందోళన ఉండదు. ► స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ ఓఎస్‌ను ఎలా అందజేస్తారు? ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు? రెగ్యులర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ ఇస్తారా? లేదా? అనేదానిపై ఐఐటీ–మద్రాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరు వాడుతున్నారు? ► కఠినమైన భద్రత, గోప్య త అవసరాలు కలిగిన కొన్ని సంస్థలు ప్రస్తుతం భరోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పరీక్షిస్తున్నాయి. ► రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే ప్రభుత్వ కంపెనీలు ఈ ఓఎస్‌ను వాడుతున్నట్లు సమాచారం. ఎందుకీ ఓఎస్? ► గూగుల్ మొబైల్ ఓఎస్ ఆండ్రాయిడ్‌పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ► ఆండ్రాయిడ్‌తో డిఫాల్ట్‌గా వస్తున్న కొన్ని యాప్‌ల్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు తెలియజేసింది. ► ఈ నేపథ్యంలోనే దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విప్లవాత్మక ముందడుగు ఐఐటీ–మద్రాసు ఆధ్వర్యంలో స్థాపించిన జండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(జండ్‌కాప్స్) అనే లాభాపేక్ష లేని స్టార్టప్ కంపెనీ భరోస్ ఓఎస్‌ను అభివృద్ధి చేసింది. ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’ కింద కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిధులు అందజేసింది. నమ్మకం అనే పునాదిపై భరోస్ మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థను రూపొందించినట్లు ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ చెప్పారు. తమ అవసరాలను తీర్చే యాప్‌లను పొందే స్వేచ్ఛను వినియోగదారులకు కల్పించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వివరించారు. దీనివల్ల సంబంధిత యాప్‌లపై వారికి తగిన నియంత్రణ ఉంటుందన్నారు. ఫోన్లలోని డేటా భద్రతకు భరోసా కల్పించే విషయంలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు అని అభివర్ణించారు. మన దేశంలో ఈ ఓఎస్ వినియోగాన్ని పెంచేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తామని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సొంత ఓఎస్‌పై ప్రభుత్వ భారీ కసరత్తు: ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఖేల్ ఖతం?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ యూజర్లకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుందా? సొంతంగా ఒక దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించి, వినియోగదారులకు మరింత సురక్షితమైన అనుభవాన్ని అందించే ప్రాజెక్ట్‌పై పని చేస్తోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఇండ్ ఓఎస్ పేరుతో తీసుకురానుంది. ప్రభుత్వం, స్టార్టప్‌లు , విద్యాసంస్థల చొరవతో దీన్ని రూపొందిస్తోంది. ఎపుడు, ఎలా లాంచ్ చేస్తుందనే దానిపై స్పష్టతేదు. ఇది యూజర్లకు ఒక కొత్త భారతీయ OS సురక్షితమైన అనుభవాన్ని అందించడమే కాకుండా Google, Appleకి దీటుగా గట్టి పోటీ ఇస్తుందని అంచనా. కాగా ప్రస్తుతం, గూగుల్ ఆండ్రాయిడ్ 97 శాతం వాటాతో టాప్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా, ఐఫోన్కోసం రూపొందించిన ఆపిల్ ఐఓఎస్ వాటా పరిమితంగానే ఉంది. మరోవైపు నోకియా, శాంసంగ్, బ్లాక్‌బెర్రీ నోకియా, మైక్రోసాప్ట్ ,ఫైర్ఫాక్స్ లాంటి దిగ్గజాల ఆపరేటింగ్ సిస్టమ్స్ పెద్దగా ఆదరణకు నోచుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇండ్‌ఓఎస్ ఆవిష్కారంపై భారీ అంచనాలే ఉన్నాయి. -
వాట్సాప్ కీలక నిర్ణయం
శాన్ఫ్రాన్సిస్కో: మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)తో పాటు ఐవోఎస్ 7 వాడే ఐఫోన్లకు 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల పాత ఓఎస్‌లు ఉన్న మొబైల్ ఫోన్లలో కొత్త అకౌంట్లను తెరవలేరనీ, పాత అకౌంట్లను యాక్సెస్ చేయలేరని వెల్లడించింది. ‘2019, డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఓఎస్ ఉన్న యూజర్లు వాట్సాప్‌ను వాడలేరు. ఈ ఏడాది జూలై 1 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో వాట్సాప్ అందుబాటులో ఉండదు’ అని పేర్కొంది. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 8 అంతకన్నా అప్డేటెడ్ వెర్షన్లు వాడాలని సూచించింది. వాట్సాప్ ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ల ఫోన్ల కోసం 2.199.177 బీటా వెర్షన్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ద్వారా చాటింగ్ చేస్తూనే పీఐపీ మోడ్‌లో వీడియోలను వీక్షించొచ్చు. అయితే బీటా వెర్షన్లో పీఐపీ మోడ్ ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. -
అమెరికాకు వావే షాక్!
బీజింగ్ : అమెరికా బెదిరింపులకు, ఆంక్షలకు ధీటుగా సమాధానం చెప్పిన చైనా మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ వావే కీలక విషయాన్ని ప్రకటించింది. తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను తొందరలోనే లాంచ్ చేయనున్నామని గురువారం ప్రకటించింది. మమ్మల్ని తక్కువగా అంచని వేయొద్దని ప్రకటించిన వావే ఆండ్రాయిడ్‌కు ప్రత్యామ్నాయంగా ‘హాంగ్‌మెంగ్’ పేరుతో కొత్త ఓఎస్‌ను లాంచ్ చేయనుంది. తద్వారా అమెరికా టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్‌కు పెద్ద షాక్ ఇస్తోంది. వావే ‘హాంగ్‌మెంగ్’ ఓఎస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే తన ఫోన్లలో ఆండ్రాయిడ్ స్థానంలో గ్లోబల్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని వావే తెలిపింది. ఈ మేరకు వావే టెక్నాలజీస్ కో లిమిటెడ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ విలియమ్సన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హాంగ్‌మెంగ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పటికే చైనాలో మిలియన్‌కు పైగా స్మార్ట్ఫోన్లలో అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ట్రేడ్‌మార్క్‌ను సాధించనున్నామంటూ ధృవీకరించారు. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వావేను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, సంస్థ వ్యాపార లావాదేవీలను నిషేధించారు. శత్రు దేశాల నుంచి అమెరికా కంప్యూటర్ నెట్‌వర్క్‌కు ప్రమాదం పొంచి ఉందని, తద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లొచ్చని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా చైనాకు చెందిన ప్రపంచపు అతిపెద్ద టెలికం కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ కంపెనీ వావే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వావేకు అమెరికాలో కార్యకాలాపాల కొనసాగింపు కోసమంటూ అమెరికా వాణిజ్య శాఖ 90 రోజుల తాత్కాలిక లైసెన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ వావేతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఇటీవల ఫేస్బుక్ కూడా ఇదే బాటలో పయనించింది. ప్రస్తుతం అమెరికా కంపెనీలైన గూగుల్, ఆపిల్ కు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్‌ను ఏలుతున్న సంగతి తెలిసిందే. హువావే 2012 నుంచే సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తోందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. తాజా ప్రకటనతో అమెరికా ప్రభుత్వంతో పాటు గూగుల్, ఆపిల్ కంపెనీలకు ఝలక్ ఇచ్చినట్టేనని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
గూగుల్‌కు మరో భారీ షాక్!
సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌కు ఐరోపా సమాఖ్య(ఈయూ) బుధవారం భారీ షాకిచ్చింది. మరోసారి భారీ మొత్తంలో 4.34 బిలియన్ యూరోలు(దాదాపు 5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. పోటీదారులను రానీయకుండా.. స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ యాప్స్‌నే వాడేలా అనుచిత విధానాలను గూగుల్ అనుసరిస్తుందనే ఆరోపణలతో ఈ జరిమానా వేసింది. యూరోపియన్, అమెరికన్ ప్రత్యర్థుల ఫిర్యాదులపై 2015 నుంచి విచారణ చేపట్టిన యూరప్, నేడు తన నిర్ణయాన్ని వెలువరించింది. గతేడాది కూడా గూగుల్ భారీ మొత్తంలో 2.8 బిలియన్ డాలర్ల( రూ.17,478 కోట్లకు పైగా) జరిమానాను ఎదుర్కొంది. అప్పుడు తన షాపింగ్ సర్వీసులకు అనుకూలంగా యాంటీ ట్రస్ట్ నిబంధనలను అది ఉల్లంఘించడంతో, జరిమానా పడింది. ఈ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌తో పాటు, ఆపిల్, అమెజాన్, ఫేస్బుక్ లకు కూడా యూరోపియన్ రెగ్యులేటర్లు జరిమానాలు విధించాయి. గూగుల్ ప్రస్తుతం యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించి, డివైజ్ విక్రయించడాని కంటే ముందస్తుగా స్మార్ట్ఫోన్లలో తన యాప్స్‌ను ఇన్స్టాల్ చేస్తుందని కమిషన్ ఆరోపించింది. తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రత్యామ్నాయాలను వాడకుండా నిరోధించేలా తయారీదారులతో ముందస్తుగానే గూగుల్ సంప్రదింపులు జరిపిందని రెగ్యులేటర్లు ఆరోపిస్తున్నాయి. తన వ్యాపార ధోరణిని మార్చుకోవాలని గూగుల్‌ను యూరోపియన్ యూనియన్ ఆదేశించింది. -
ఆ మొబైళ్లకు పుష్ నోటిఫికేషన్స్ బంద్
శాన్ఫ్రాన్సిస్కో: విండోస్ ఫోన్ 7.5, విండోస్ ఫోన్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే మొబైళ్లకు పుష్ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ మంగళవారం తెలిపింది. ఈ మేరకు తన బ్లాగ్‌లో పేర్కొంది. ఒకసారి మద్ధతు నిలిపివేస్తే ఈ వర్షన్లతో నడుస్తున్న మొబైళ్లకు కంపెనీ నుంచి ఎలాంటి పుష్ నోటిఫికేషన్లు రావు, ‘ఫైండ్ మై ఫోన్’ ఫీచర్ కూడా పనిచేయదు. విండోస్ 8.1, విండోస్ 10 మొబైళ్లకు మాత్రం పుష్ నోటిఫికేషన్లు అందుతూనే ఉంటాయన్నారు. -
చైనా సాధించలేనిది.. భారత్ సాధించింది!
ఇప్పటికీ సొంతంగా తనకంటూ ఓ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)ను రూపొందించుకోనందుకు చైనా ఈర్ష్య పడుతూ ఉండవచ్చు. గత 15 ఏళ్లుగా దేశీయ ఓఎస్‌ను రూపొందించుకునేందుకు చైనా నానా తంటాలు పడుతూనే ఉంది. ఓఎస్ టెక్నాలజీ విషయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ, ఆ ప్రయత్నం ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. కానీ, భారత్ మాత్రం రెండేళ్ల కిందటే ఆ ఘనతను సొంతం చేసుకుంది. ఇండస్ ఓఎస్.. ఇప్పుడు భారత్‌లో మొబైల్ ఫోన్లు అత్యధికంగా వాడుకుంటున్న మొబైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రెండోస్థానంలో ఉంది. ఆల్ఫాబెట్ అండ్రాయిడ్ తర్వాత 6.3శాతం మార్కెట్ వాటాతో రెండోస్థానంలో ఇండస్ ఓఎస్ ఉంది. స్థానిక భారతీయ భాషలలో రూపొందిన ఈ ఓఎస్ 2015 సంవత్సరం ముగిసేనాటికి రెండోస్థానాన్ని ఆక్రమించి.. ప్రస్తుత సంవత్సరంలోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ వారమే విడుదలైన కౌంటర్ పాయింట రీసెర్చ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఐవోఎస్తోపాటు షియోమి, ఎంఐయూఐ, సియానోజెన్ వంటి ఆండ్రాయిడ్ వెరియంట్లు కూడా ఇండస్ ఓఎస్‌ను వాడుతున్నాయి. చైనా సొంతంగా ఓఎస్ రూపొందించుకునే క్రమంలో చైనా ఓఎస్ (సీఓఎస్), కిలిన్, రెడ్ ఫ్లాగ్, యున్ఓఎస్ వంటి ప్రయోగాలు చేసినప్పటికీ అవి అంతగా విజయవంతం కాలేదు. చైనా ప్రభుత్వం, పలు ప్రైవేటు కంపెనీలు ఈ విషయంలో ప్రోత్సాహం అందించినా అనుకున్న లక్ష్యాన్ని అది సాధించలేదు. వాస్తవంగా ఫస్ట్‌టచ్ పేరిట రూపొందించిన ఇండస్ ఓస్ 2015లో సంచలనం సృష్టించింది. ఈ ఓఎస్‌ను వాడుకోవడానికి మైక్రోమాక్స్ కంపెనీ ముందుకురావడం దీనికి పెద్ద ఊతంగా నిలిచింది. స్థానిక డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ ఓఎస్ రూపొందడంతో ఇది బాగా ఆదరణ పొందింది. టైపింగ్ సౌలభ్యకరంగా ఉండటం, టైపింగ్‌లో ప్రాంతీయ భాషల పదాల ప్రిడిక్షన్ సరిగ్గా ఉండటం ఈ ఓఎస్ కు కలిసివొచ్చే అంశం. ఇది ఓఎస్ విషయంలో ఐఫోన్ ఆపరేటింట్ సిస్టమ్ అయిన ఐఓఎస్‌ను దేశీయంగా అధిగమించింది. యాప్ బజార్ వంటి యాప్‌లతో మరిన్ని ఆర్థిక సేవలు అందించేందుకు ఈ ఓఎస్ సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ’మేకిన్ ఇండియా’కు ఈ ఓఎస్ రూపకల్పన పెద్ద ఊతమిచ్చే అంశమని నిపుణులు చెప్తున్నారు. -
షావొమీ ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్
న్యూఢిల్లీ: చైనీస్ హ్యాండ్సెట్ దిగ్గజం షావొమీ తాజాగా తమ ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంకి అప్‌గ్రేడెడ్ వెర్షన్ ‘ఎంఐయూఐ-7’ను ప్రవేశపెట్టింది. భారత్‌లో తాము విక్రయించిన స్మార్ట్‌ఫోన్స్ అన్నింటికి దీని బీటా వెర్షన్ ఆగస్టు 24న లభిస్తుందని షావొమీ గ్లోబల్ వీపీ హ్యూగో బరా తెలిపారు. ఇందులో విజువల్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, స్మార్ట్ ఎస్ఎంఎస్ ఫిల్టర్ మొదలైన ‘మేడ్ ఫర్ ఇండియా’ ఫీచర్లు ఉంటాయని ఆయన వివరించారు. -
లాలీపాప్ ఓఎస్‌తో ఇంటెక్స్ ఆక్వా స్టార్
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చి కొంతకాలమైనప్పటికీ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇంటెక్స్ తొలిసారి దీంతో పనిచేసే ఓ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆక్వాస్టార్ శ్రేణిలో ‘ఎల్’ బ్రాండ్ నేమ్‌తో విడుదలైన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఖరీదు దాదాపు రూ.6999 మాత్రమే. అయిదు అంగుళాల స్క్రీన్‌సైజు, డ్యుయెల్ సిమ్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్ 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. + ఒక గిగాబైట్ ర్యామ్, ఎనిమిది జీబీల ఇన్‌బిల్ట్ స్టోరేజీ దీని సొంతం. మైక్రోఎస్డీ కార్డు ద్వారా మెమరీని 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. త్రీజీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వైఫై, మైక్రో యూఎస్బీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్నాయి. కేవలం 130 గ్రాముల బరువుండే ఆక్వాస్టార్ ఎల్లో 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. -
భలే ఆప్స్
విండోస్ 8.1పై కొత్త అప్లికేషన్లు! విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగిస్తున్న వారికి ఈ దీపావళి సందర్భంగా కొత్త అప్లికేషన్లను తీసుకొస్తున్నామని ప్రకటించింది మైక్రోసాఫ్ట్. పీసీ వినియోగంలో ఈ అప్లికేషన్లు సరికొత్త అనుభవాన్ని ఇస్తాయిని మైక్రోసాఫ్ట్వాళ్లు అంటున్నారు. ఇ-వెంట్: ఇది ఒక క్విక్ ఈవెంట్ మేనేజ్ అప్లికేషన్. సంబరాల సమయంలో సోషల్ మీడియా ద్వారా అందరికీ కనెక్ట్ కావడానికి ఈ అప్లికేషన్ ఉపయుక్తంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. నాన్‌స్టాప్ మ్యూజిక్: సొంతంగా మ్యూజిక్ మిక్స్ చేసి.. ఇష్టమైనట్టుగా కొత్త ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ అప్లికేషన్. వీటితో పాటు వందల, వేల కొద్దీ రెసిపీల గుట్టును వివరించి కొత్త రుచులు చూపించే ఎమ్ఎస్ఎన్ ఫుడ్ అండ్డ్రింక్, లూమియా సెల్ఫీ, ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఫోటో ఫూనియా, ఇన్‌స్టాగ్రామ్‌లను విండోస్ 8.1పై అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మాత్రమే గాక దీపావళి సంబరాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఐదివాళీ, రంగోళీ క్రియేటర్ వంటి అప్లికేషన్లను కూడా విండోస్8.1 వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ల్యాప్స్ ఇట్తో అద్భుతమైన వీడియోలు టైమ్‌ల్యాప్స్ వీడియోగ్రఫీ గురించి మీరు వినే ఉంటారు. మెరుపువేగంతో మారిపోయే ఫ్రేమ్స్‌తో సృష్టించే ఈ రకమైన వీడియోలను అప్పుడప్పుడు సినిమాల్లోనూ చూసే ఉంటాం. ఇలాంటి అద్భుతాలను మీ స్మార్ట్‌ఫోన్‌తోనూ సృష్టించుకోవచ్చు. కావాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే ‘ల్యాప్స్ ఇట్’ అప్లికేషన్ మాత్రమే. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాలోని సెన్సర్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని అద్భుతమైన ఫొటోలు తీయడంతోపాటు వాటితో అందమైన టైమ్‌ల్యాప్స్ వీడియోలను కూడా సృష్టించుకోవచ్చు. ఫిల్టర్ల సాయంతో స్పెషల్ ఎఫెక్ట్లు కూడా సృష్టించుకోవచ్చు. వీడియోలను మెరుపువేగానికి మార్చుకోవడంతోపాటు చాలా స్లోగానూ రన్ చేయవచ్చు. ప్రోగ్రామింగ్ కోసం ట్రీహౌస్... మీకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని ఉందా? అయితే ట్రీహౌస్ అప్లికేషన్ మీ కోసమే. ఆన్లైన్ పద్ధతిలో ప్రోగ్రామింగ్ మెళకువలను నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌తో రూబీ ఆన్ రెయిల్స్, పీహెచ్‌పీ, పైథాన్ వంటి వాటిని ఉపయోగించే నైపుణ్యం కలిగించేందుకు ఈ అప్లికేషన్లో వెయ్యికిపైగా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. చిన్నచిన్న క్విజ్లు సవాళ్లతో ప్రోగ్రామింగ్‌ను నేర్చుకోవడం కూడా సరదాగా మార్చేస్తుంది. మీరు నేర్చుకున్న అంశాలను ప్రాక్టీస్ చేసేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. ఐఓఎస్‌పై కిండ్లేకి కొత్త సొబగులు! ఐ ఆపరేటింగ్ సిస్టమ్‌పై అప్లికేషన్లు కొత్త కళను సంతరించుకొంటున్నాయి. ఐడివైజ్లను వాడే వాళ్లు ఐఓఎస్ 8కి అప్డేట్ అయితే అప్లికేషన్లు కొత్త అనుభవాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి అమెజాన్స్ కిండ్లే. ఐ డివైజ్‌లపై పుస్తకాలను చదివేందుకు కిండ్లే ఉత్తమమైన అప్లికేషన్. ఆన్లైన్ మెంబర్షిప్ ద్వారా పుస్తకాలు చదవడానికి అవకాశం ఇస్తుంది ఇది. కొత్త అప్డేట్స్తో కూడిన కిండ్లే అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకొంటే... వాడకం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఉన్నట్టుండి అప్లికేషన్ క్లోజ్ అయినా.. తర్వాత ఓపెన్ చేసుకొన్నప్పుడు డెరైక్ట్‌గా అదే పేజ్‌లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి మెరుగులతో కిండ్లే అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. -
విండోస్ 9.. వచ్చేస్తోందా?
మైక్రోసాఫ్ట్ సంస్థ త్వరలోనే తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 9ను విడుదల చేసేలా ఉంది. బహుశా ఈ నెల 30వ తేదీన దీన్ని విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఆరోజు జరిగే కార్యక్రమానికి అందరికీ స్వాగతం అంటూ మైక్రోసాఫ్ట్ పంపిన ఆహ్వానాలు దీన్నే సూచిస్తున్నాయి. ''విండోస్‌కు, మా సంస్థకు తదుపరి భవిష్యత్తు ఏంటో చూసేందుకు మాతో కలసి రండి'' అని అర్థం వచ్చేలా ఓ ఆహ్వానాన్ని మైక్రోసాఫ్ట్ పంపింది. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఈనెల 30వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానంగా విండోస్ ఆధారిత కంప్యూటర్లకు వివిధ ప్రోగ్రాంలు రూపొందించే డెవలపర్లు, తమ నెట్వర్కులలో మైక్రోసాఫ్ట్ ప్రోగ్రాంలు వాడేవాళ్లను ఉద్దేశించి ఈ ఆహ్వానం పంపినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లకు ఉపయోగపడే ప్రత్యేకమైన విండోస్ తయారుచేయడానికి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. -
కిట్‌క్యాట్ హవా మొదలైందా...?
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ శకం మొదలైందా... వారం రోజుల వ్యవధిలో మూడు నాలుగు స్మార్ట్ఫోన్లలో ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ దర్శనమివ్వడాన్ని గమనిస్తే అవుననే చెప్పాలి.మరి.. ఈ తాజా ఓఎస్ తెచ్చే కొత్త ఫీచర్లేమిటి? వాటితో మనకు కలిగే ప్రయోజనాలేమిటి?చదవండి మరి... మొబైల్ఫోన్లను స్మార్ట్ఫోన్లుగా మార్చిన ఘనత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు దక్కుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొట్టమొదటి వెర్షన్ కప్ కేక్ మొదలుకొని ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న జెల్లీబీన్ వరకూ కొత్తఫీచర్లు వచ్చి చేరుతూనే ఉన్నాయి. మొబైల్‌ఫోన్‌ను అరచేతి అద్భుతంగా మార్చేశాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్ 4.4.2ను గత ఏడాది సెప్టెంబరులోనే ప్రకటించింది. డెవలపర్లు తమదైన మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ తరువాత కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకుని డిసెంబరు 2013 నాటికి పూర్తి రూపాన్ని సంతరించుకుంది. అయినప్పటికీ కొన్ని ఇతర కారణాల దృష్ట్యా అధికశాతం ఫోన్లలోకి చేరలేదు. ప్రస్తుతం 10 శాతం ఫోన్లకు మాత్రమే విస్తరించింది. జెల్లీబీన్‌తో నడుస్తున్న స్మార్ట్ఫోన్లు కొన్ని అప్‌గ్రేడ్‌కు అవకాశమివ్వడం... తాజా ఓఎస్‌తో కొత్తఫోన్లు రావడం కిట్‌క్యాట్ ప్రాబల్యం పెరుగుతోందనడానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. మెరుగైన మెమరీ మేనేజ్మెంట్... స్మార్ట్ఫోన్లను ఎంచుకునే సమయంలో మనమందరం కచ్చితంగా గమనించే అంశం ర్యామ్. ఇది ఎంత ఎక్కువ ఉంటే ఫోన్ అంత మెరుగ్గా పనిచేస్తుందన్నది మనకున్న అంచనా. కిట్‌క్యాట్‌లో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే అతితక్కువ ర్యామ్‌తోనూ సమర్థంగా పనిచేసేందుకు వీలుగా దీంట్లో మెరుగైన మెమరీ మేనేజ్మెంట్ పద్ధతులను ప్రవేశపెట్టారు. కచ్చితంగా చెప్పాలంటే కిట్‌క్యాట్ ఓఎస్ ఉంటే 512 ఎంబీ ర్యామ్‌తోనూ మల్టీటాస్కింగ్ సులువుగా చేసుకోవచ్చు. టచ్‌స్క్రీన్ స్పందనలను మరింత సమర్థంగా నిర్వహించడం, ముఖ్యమైన అప్లికేషన్ల మెమరీ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆండ్రాయిడ్ ఈ ఘనతను సాధించింది. గూగుల్‌తో మమేకం... ఆండ్రాయిడ్ అనేది గూగుల్ సిద్ధం చేసిన ఓఎస్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందువల్లనే గూగుల్‌కు సంబంధించిన సర్వీసులు అనేకం ఈ ఓఎస్‌లో కనిపిస్తాయి. కిట్‌క్యాట్‌లో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఓకే గూగూల్ వీటిల్లో ఒకటి. జెల్లీబీన్ తాజా వెర్షన్లు కొన్నింటిలో కనిపించిన ఈ ఫీచర్ మీ మాటనే ఆదేశంగా మారుస్తుంది. హోంస్క్రీన్పైనే ఉండే మైక్ ఐకాన్ ద్వారా గూగుల్ సెర్చింజిన్‌ను వాడుకోవచ్చు. లేదా టెక్ట్స్ మెసేజ్‌లు పంపవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరోచోటికి వెళ్లేందుకు డెరైక్షన్స్ కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మ్యూజిక్ వంటి అప్లికేషన్లను లాంచ్ చేయవచ్చు కూడా. వీటితోపాటు గూగుల్ నౌ అప్లికేషన్లను ఇతర అప్లికేషన్లతో అనుసంధానించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఏదైనా హోటల్ కోసం వెతుకుతున్నారనుకుందాం. గూగుల్ నౌలో ఈ పని మొదలుపెట్టగానే... మీకు దగ్గర్లో ఉన్న హోటళ్ల వివరాలు గూగుల్ మ్యాప్ అప్లికేషన్ సాయంతో కనిపిస్తాయి. మెసేజీలన్నీ హ్యాంగౌట్ లోనే... ఇప్పటివరకూ కేవలం ఎస్ఎంఎస్లకు మాత్రమే పరిమితమైన హ్యాంగౌట్ కిట్‌క్యాట్‌లో అన్ని రకాల మెసేజ్‌లను ఒకేచోట చూపుతుంది. హెచ్డీ వీడియో కాల్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. యానిమేషన్ జీఐఎఫ్, లొకేషన్ల షేరింగ్‌కి కూడా హ్యాంగౌట్ ఉపయోగపడుతుంది. కిట్‌క్యాట్ ఓఎస్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో కాలర్ ఐడీలోనూ కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త డిజైన్‌తోపాటు ఒక సెర్చ్ ఫీల్డ్ ఉంటుంది. గూగుల్ మ్యాప్‌లో లిస్ట్ అయిన వ్యాపారాల తాలూకూ కాంటాక్ట్ సమాచారం కాలర్ ఐడీ ద్వారానే లభిస్తుంది. వైర్లెస్ ప్రింటింగ్‌కు ఆస్కారం... మొబైల్ఫోన్ల ద్వారా ఫొటోలు, డాక్యుమెంట్లను నేరుగా ప్రింట్ చేసేందుకు కిట్‌క్యాట్ అవకాశం కల్పిస్తోంది. గూగుల్ క్లౌడ్ ప్రింట్ అప్లికేషన ద్వారా ఇది సాధ్యమవుతుంది. కాకపోతే వైఫై, బ్లూటూత్ ల ద్వారా జరిగే ఈ ప్రింటింగ్‌కు తగిన ప్రింటర్లు కూడా ఉండాలి. ప్రింటింగ్ సంగతి ఇలా ఉంటే కిట్‌క్యాట్ ద్వారా క్లౌడ్ స్టోరేజీ కూడా చాలా సులువుగా జరిగిపోతుంది. మీ ఫోన్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే గూగుల్ డ్రైవ్ సాయంతో నేరుగా క్లౌడ్ నుంచే డాక్యుమెంట్లను ఓపెన్ చేయవచ్చు. స్టోర్ చేయవచ్చు నన్నమాట. క్విక్ ఆఫీస్ వంటి అప్లికేషన్ల ద్వారా ఈ డాక్యు మెంట్స్‌ను ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకునే వీలుంటుంది. తద్వారా ఆఫీసు పనులను కూడా ఎప్పటి కప్పుడు చక్కబెట్టుకోవచ్చునన్నమాట. కిట్‌క్యాట్ ఓఎస్‌లో రెండు కాంపోజిట్ సెన్సర్లు అదనంగా చేరాయి. స్టెప్ కౌంటర్, స్టెప్ డిటెక్టర్ అనే ఈ రెండు సెన్సర్ల ద్వారా ప్రత్యేకమైన ఫిట్నెస్ అప్లికేషన్ల అవసరం లేకుండా పోతుందన్నమాట. -
సూపర్ ‘స్మార్ట్’ఫోన్‌కు అయిదు చిట్కాలు
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? వాడిన కొద్దీ ఫోన్ వేగం మందగిస్తోందా? బ్యాటరీ తరచూ డిస్ఛార్జ్ అయిపోయి చికాకుపెడుతోందా? ఈ సమస్యల పరిష్కారానికి ఉన్న అప్లికేషన్లలో ఏవి బాగుంటాయో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ కింది అప్లికేషన్లనూ ఓ సారి ప్రయత్నించి చూడండి... 1. క్లీన్ మాస్టర్ పేరులో ఉన్నట్లే స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉండేటా చేస్తుంది. టెంపరరీ, వాడని ఫైల్స్‌తోపాటు, ఆపరేటింగ్ సిస్టమ్‌కు అక్కరకు రాని ఫైళ్లను కూడా తొలగించి ఫోన్ మరింత సమర్థంగా పని చేసేలా చేస్తుంది. తరచూ ఈ ఆప్లికేషన్‌ను వాడటం ద్వారా అనవసరమైన ఫైళ్లతోపాటు ర్యామ్ కూడా క్లియర్ అయిపోయి ఫోన్ స్మార్ట్‌గా పనిచేస్తుందన్నమాట. 2. ఎయిర్ డ్రాయిడ్ ఫోన్ నుంచి పీసీ, టాబ్లెట్లకు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసేందుకు మేలైన మార్గమీ అప్లికేషన్. పీసీ, లేదా టాబ్లెట్లోనూ ఈ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఐపీ అడ్రస్‌తో కనెక్ట్ అవడం ద్వారా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్‌తోపాటు అప్లికేషన్లను మేనేజ్ చేసుకోవచ్చు. పీసీ బ్రౌజర్ ద్వారా పనిచేసే అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ద్వారానే మెసేజ్‌లు కూడా పంపుకోవచ్చు. 3. గ్రీనిఫై... బ్యాటరీ పొదుపు చేసుకోవాలంటే గ్రీనిఫై అప్లికేషన్ దానికో మార్గం చూపుతుంది. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్లన్నింటినీ దాదాపుగా నిలిపేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. పెద్దగా అవసరం లేని అప్లికేషన్లను గుర్తిస్తే అవి స్లీప్ మోడ్‌లోనే ఉండేలా చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ ఆదా అవడమే కాకుండా డేటా ఛార్జీలు పెరక్కుండా చేస్తుంది. గ్రీనిఫై తాజా వెర్షన్ రూట్ యాక్సెస్ అవసరం లేకుండా పనిచేస్తుంది కాబట్టి దాదాపు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లపై దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 4. టైటానియం బ్యాకప్ ప్రొ... స్మార్ట్‌ఫోన్‌లోని డేటా, అప్లికేషన్లనింటినీ బ్యాకప్ చేసుకునేందుకు మెరుగైన అప్లికేషన్ ఇది. అయితే ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌కు రూట్ యాక్సెస్ అవసరం ఉంటుంది. మీరు ఫోన్ మార్చినా... పాత ఫోన్లోని అన్ని అప్లికేషన్లు, డేటాను నేరుగా ఇంపోర్ట్ చేసుకునే సౌలభ్యం చేకూరుతుంది ఈ అప్లికేషన్‌తో. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ అప్లికేషన్ ధర రూ.413. 5. రూట్ బ్రౌజర్... మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫైల్ మేనేజర్ అప్లికేషన్ లాంటిది ఇది. ఫైల్స్‌ను అటు ఇటు మార్చేందుకు, డిలీట్ చేసేందుకు, జిప్ఫైల్స్లా మార్చేందుకు ఉపయోగించవచ్చు. మీకిష్టం వచ్చిన రీతిలో ఫైల్స్‌ను సార్ట్ చేసుకోవచ్చు. -
ఫేస్‌బుక్‌కు కొత్త స్పర్శ!
విండోస్ 8.. టచ్ పీసీల వినియోగంలో కొత్త అనుభవాన్ని ఇస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్. స్పర్శతెరల వినియోగం ఎక్కువవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకొచ్చిన విండోస్ 8 ఆకర్షణీయంగా మారింది. కొత్త కొత్త అప్లికేషన్లతో ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి విండోస్ 8 ఓఎస్‌పై ఫేస్బుక్ బ్రౌజింగ్ వావ్... అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విండోస్ 8 ఓఎస్‌పై ఫేస్బుక్ కోసం అందుబాటులోకి వచ్చిన సరికొత్త అప్లికేషన్లివి. వీటిని ఇన్స్టాల్ చేసుకుంటే ఫేస్బుక్ లుక్‌ను మార్చేయవచ్చు. కాస్తంత కొత్తగానూ స్పర్శించవచ్చు! ఓఎస్ విషయంలో అప్టు డేట్‌గా ఉండే వారెంతోమంది విండోస్ 8 కు మారిపోయారు. ఎటువంటి అప్లికేషన్లూ ఇన్స్టాల్ చేసుకోకపోయినా ఈ ఓఎస్‌పై ఫేస్‌బుక్‌లోకి లాగిన్ కావడంతోనే హోమ్ పేజ్ భిన్నంగా కనిపిస్తుంది. ఇతర ఓఎస్‌లపై ఫేస్బుక్ సర్ఫింగ్‌కు, ఈ ఓఎస్ పై ఫేస్బుక్ సర్ఫింగ్‌కు ఎంతో మార్పు కనిపిస్తుంది. ప్రధానంగా పీసీలోని ఇతర అప్లికేషన్లను ఉపయోగించుకొంటూనే.. ఫేస్బుక్ ఫ్రెండ్స్‌తో చాట్చేయడానికి అవకాశం ఉంటుంది. ఫేస్బుక్ విండోను మినిమైజ్ చేసినా.. నోటిఫికేషన్స్, చాట్ విండోలు డెస్క్‌టాప్ మీద డిస్ప్లే అవుతాయి. మైన్ ఫర్ ఫేస్బుక్.. మీ ఫేస్బుక్ పేజ్ టైమ్‌లైన్ స్టైల్‌ను మొత్తం మార్చేస్తుంది ఈ అప్లికేషన్. ఫేస్బుక్లో మీరు ఉపయోగించని వాటన్నింటినీ పక్కనపెట్టేసి.. అవసరమైన వాటిని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. విండోస్ 8 ఓఎస్ కోసమే రూపొందించింది ఈ అప్లికేషన్. టచ్, నాన్ టచ్ డివైజ్ ల రెండింటికీ ఉపయుక్తంగా ఉంటుంది. మెట్రోస్టైల్... పేరుకు తగ్గట్టుగానే రొటీన్ టైమ్‌లైన్‌ను, రొటీన్ కామెంట్ సెక్షన్‌ను, రొటీన్ న్యూస్ ఫీడ్‌ను కొత్త స్టైల్లో డిస్ప్లే చేస్తుంది మెట్రోస్టైల్. ఫోటోలను ఫుల్‌స్క్రీన్‌లో చూడటానికి అవకాశం ఉంటుంది. విభిన్నమైన థీమ్స్ ఉంటాయి. ఫేస్బుక్ ఫరెవర్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యూలకు కాస్తంత భిన్నంగా ఉంటుంది ఈ అప్లికేషన్ వ్యూ. న్యూస్‌ఫీడ్, ఫోటోగ్యాలరీ, చాట్, మెసేజింగ్ ఫీచర్లతో రిచ్, ఎలిగెంట్, ఈజీ టు యూజ్ అంటూ ఈ అప్లికేషన్ గురించి రివ్యూలు అందుబాటులో ఉన్నాయి. వైబ్ ఫర్ ఫేస్బుక్... అనునిత్యం ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండటానికి, ప్రపంచంలో మార్పులను గమనించడానికి మార్గంగా ఉన్న ఫేస్‌బుక్‌ను కంటికి ఇంపుగా ఉండే రీతిలో చూడండి... అంటూ ‘వైబ్ ఫర్ ఫేస్బుక్’ అనే పేరుతో ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టచ్‌స్క్రీన్ డివైజ్‌లపై వైబ్ అప్లికేషన్ ద్వారా ఫేస్‌బుక్‌ను ఆపరేట్ చేయడం నిజంగా టచబుల్ ఎక్స్పీరియన్స్! ఫేస్బుక్ ప్లస్ లైట్.. ఇది పేరుకు తగ్గట్టుగానే సింపుల్‌గా ఉంటుంది. రంగులు, లుక్, పెద్ద పెద్ద ఇమేజ్‌ల డిస్ప్లేలు లేకుండా సాదాసీదాగానే కనిపిస్తుంది ఈ అప్లికేషన్. సోషియల్ ఎన్వీ.. ఫేస్బుక్ పేజ్‌లను హారిజాంటల్ వ్యూలో డిస్ప్లే చేసే అప్లికేషన్లలో ఇదీ ఒకటి. బ్రైట్‌గా, క్లియర్‌గా చక్కటి రిలీఫ్‌తో పేజ్‌ను డిస్ప్లే చేస్తుంది ఈ అప్లికేషన్. ఇవి విండోస్ 8 ఫేస్‌బుక్‌ను కొత్త విన్యాసాల్లో చూపే అప్లికేషన్లు. ఫేస్బుక్ రొటీన్ వ్యూ నుంచి విముక్తిని ప్రసాదిస్తాయి ఇవి. ఈ అప్లికేషన్లలో ఏది బెటర్, ఏది అందమైనది, ఏది బాగుంటుంది అంటే చెప్పలేం. మనసుకు నచ్చినదాన్ని ఎంచుకోవడమే. విండోస్ 8 ఓఎస్‌కు అప్‌గ్రేడ్ అయితేనే ఈ అప్లికేషన్లను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కొత్తదనాన్ని స్పృశించడానికి అవకాశం ఉంది. టచ్‌స్క్రీన్ గాడ్జెట్స్ కాకపోయినా, విండోఎస్ 8 ను ఇన్స్టాల్ చేసుకొంటే ఈ అప్లికేషన్లను ఉపయోగించవచ్చు. - జీవన్‌రెడ్డి.బి -
కంప్యూటర్ అవేర్నెస్
1. The main reason to encrypt a file is? a) Reduce its size b) Secure it for transmission c) Prepare it for backup d) Include it in the start-up sequence e) None of the above 2. Which of the following is used to communicate between two computers? a) Communication software b) Protocol c) Communication hardware d) All the above including access to Transmission medium e) None of the above 3. The lowest form of computer language is called? a) BASIC b) FORTRAN c) Machine language d) COBOL e) None 4. Which of the following is not a Operating system for mobile phones? a) Android b) Symbian c) iOS d) Bada e) All of these are OS for mobile phones 5. This type of file is created by word processors? a) worksheet b)document c) database d)presentation e) none of the these 6. _____allows users to upload files to an online site so they can be viewed and edited from another location? a) General-purpose application b) Microsoft Outlook c) Web-hosted technology d) Office Live e) None of these 7. Which of these is not a means of personal communication on the internet? a) Chat b) Instant messaging c) Insta notes d) Electronic mail e) None of these 8. When entering text within a document, the enter key is normally pressed at the end of every? a) Line b) Sentence c) Paragraph d) Word e) File 9. Which of the following software could assist someone who cannot use their hands for computer input? a) Video conferencing b) speech recognition c) Audio digitizer d) Synthesizer e) None of these 10. ___ software creates a mirror image of the entire hard disk, including the operating system, applications, files, and data? a) Operating system b) Backup software c) Utility programs d) Driver imaging e) None of these 11. If you are going to a site you use often, instead of having to type in the address every time, you should? a) Save it as a file b) Make a copy of it c) Bookmark it d) Delete it e) None of the above 12. Outlook Express is a(n)? a) Word Processor b) Spread Sheet c) Email client d) Presentation e) None of these 13. A device that provides emergency power to your computer, conditions the voltage, and protects against power out is called a? a) PSU = Power Supply Unit b) USP = Universal Surge Protector c) UPPS = Universal Power Protection and Supply d) UPS = Uninterruptible Power Supply e) None of the above 14. Which is a graphical represe-ntation of an application? a) Windows 95 b) Windows Explorer c) Icon d) Taskbar e) None of the above 15. A program that enables you to perform calculations involving rows and columns of numbers is called? a) Spreadsheet program b) Word processor c) Graphics package d) Window e) None of these 16. In a network, the most reliable communication is provided by ____ protocol? a) FTP b) HTTP c) TCP d) IP e) UDP 17. ____ terminals are often connected to complex inven-tory and sales computer systems? a) Data b) Information c) Credit Cards d) Query e) Point-of-Sale (POS) 18. VOIP is the acronym for? a) Voice Oriented Internet Protocol b) Virtual Object Internet Protocol c) Voice Over Internet Protocol d) Virtual Object Intranet Protocol e) None of these 19. What type of program controls various computer parts and allows the user to interact with the computer ? a) Utility software b) Operating system c) Word processing software d) Database program e) None of the above 20. What is the full form of EPROM? a) Erasable Program Read Only Memory b) Electrically Programmable Read Only Memory c) Erasable Programmable Read Only Memory d) Erasable Progressive Read Only Memory e) Erasable Periodic Read Only Memory 21. In MS-Word, a menu item in dim color (gray) indicates that the item is? a) Toggle menu b) Unavailable for current context c) Not much required menu d) Over-used menu e) None of these 22. _____ is a technique that is used to send more than one call over a single line? a) Digitizing b) Duplexing c) Infrared Transmission d) Streaming e) Multiplexing 23. Which of the following term is not associated with Display Device of the computer? a) LCD b) LED c) CRT d) WAT e) TFT 24. The fifth generation computer is also known as? a) Knowledge information processing system b) Very Large Scale Integration (VLSI) c) Superfast computer d) Both a and b e) None of the these 25. Universal Product Code (UPC) is a? a) Scanner b) Hardware Equipment c) Antivirus d) Graphics Adapter e) Barcode system 26. Microsoft office is? a) Shareware b) Public - domain software c) Open - source software d) A vertical market application e) An application suite 27. The scrambling of code is also known as? a) Encryption b) Firewall c) Encoding d) Password - proofing e) None of these 28. A hard drive consists of spinning ____ made up of aluminum or ceramic that is coated with magnetic media? a) plates b) disks c) relays d) memories e) platters 29. Which of the following is the advantage if using a spread-sheet ? a) Calculations can be done automatically b) Changing data automatically updates calculations c) More flexibility d) All the above e) None of the above 30. Which of the following memories can be read directly by the computer processor? a) Hard Disk b) Main Memory c) CD d) DVD e) None of these 31. The _______, also called the Web, contains billions of documents? a) Word Wide Web b) HTTP c) Web portal d) Domain e) None of these 32. Ctrl, Shift, Alt are called ____ Keys? a) Modifier b) Function c) Alphanumeric d) adjustment e) Specifier 33. A mistake in an algorithm that causes incorrect results is called? a) Logical error b) Syntax error c) Machine Error d) Compiler error e) None 34. Magnetic Disk medium uses ___ method for accessing data? a) Direct b) Serial c) Sequential d) Rotational e) None 35. CGI Stands for? a) Common Gateway Imaging b) Computer Gateway Imaging c) Computer Generated Imagery d) All the above e) None of the above 36. Firewalls are used to protect against? a) Unauthorised attacks b) Virus attacks c) Data - driven attacks d) Fire attacks e) None of these 37. The Software that allows users to surf the internet is called? a) Search engine b) Internet Service Provider(ISP) c) Multimedia d) Browser e) None of these 38. Following is true for Bandwidth? a) The narrow the bandwidth of a communications system the less data it can transmit in a given period of time. b) The narrow the bandwidth of a communications system the more data it can transmit in a given period of time. c) The wider the bandwidth of a communications system the less data it can transmit in a given period of time. d) All of the above e) None is true 39. The following is a communica-tion device (modem) which allows an ordinary telephone to be used with a computer device for data transmission? a) Keyboard b) Acoustic coupler c) Mobile phone d) All of the above e) None 40. For Creating a document, you use __command from the file menu? a) Open b) Close c) New d) Save e) None of the above Answers 1) b 2) d 3) c 4) e 5) b 6) c 7) c 8) c 9) b 10) b 11) c 12) c 13) d 14) c 15) a 16) c 17) e 18) c 19) b 20) c 21) b 22) e 23) d 24) a 25) e 26) e 27) a 28) e 29) d 30) b 31) a 32) a 33) a 34) a 35) c 36) a 37) d 38) a 39) b 40) c -
కంప్యూటర్ నాల్డేజ్ - ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్
1. The operating system does all of the following EXCEPT? 1) provide a way for the user to interact with the computer. 2) manage the central processing unit (CPU). 3) manage memory and storage. 4) enable users to perform a specific task such as document editing. 2. The ability to recover and read deleted or damaged files from a criminals computer is an example of a law enforcement specialty called? 1) simulation 2) animation 3) robotics 4) computer forensics 3. Allocation of a resources in a time dependent manner to several program simultaneo-usly called? 1) multi user 2) multi tasking 3) time sharing 4) none of these 4. Which of the following is an example of a binary number? 1) A1BCD1 2) 23456 3) 005 4) 100101 5. _____ controls the way in which the computer system functions and provides a means by which users can interact with the computer? 1) the operating system 2) the motherboard 3) the platform 4) application software 6. All of the following statements concerning windows are true EXCEPT? 1) windows are an example of a command-driven environment. 2) windows can be resized and repositioned on the desktop. 3) more than one window can be open at a time. 4) toolbars and scrollbars are features of windows. 7. In the binary language each letter of the alphabet, each number and each special character is made up of a unique combination of? 1) eight bytes. 2) eight characters. 3) eight bits. 4) eight kilobytes. 8. Verification of a login name and password is known as? 1) configuration 2) accessibility 3) authentication 4) logging in 9. This type of memory is commonly called temporary or volatile storage? 1) ROM 2) RAM 3) Flash Memory 4) Virtual Memory 5) None of these 10. Which of the following can be used to select the entire document? 1) CTRL+A 2) ALT+F5 3) SHIFT+A 4) CTRL+K 5) CTRL+H 11. The simultaneous processing of two or more programs by multiple processors is? 1) Multiprogramming 2) Multitasking 3) Time-sharing 4) Multiprocessing 5) None of these 12. The default view in Excel is view? 1) Work 2) Auto 3) Normal 4) Roman 5) None of these 13. In Word, you can force a page break? 1) By positioning your cursor at the appropriate place and pressing the Fl key 2) By positioning your cursor at the appropriate place and pressing Ctrl+Enter 3) By using the Insert/ Section Break 4) By changing the font size of your document 5) None of these 14. Help Menu is available at which button? 1) End 2) Start 3) Turn off 4) Restart 5) Reboot 15. The micro processor was introduced in? 1) First generation computers 2) Second generation computers 3) Third generation computers 4) Fourth generation computers 5) None of these 16. Computers use the__ language to process data? 1) Processing 2) Kilobyte 3) Binary 4) Representational 5) None of these 17. Computer process data into information by working exclusively with? 1) Multimedia 2) Words 3) Characters 4) Numbers 5) None of these 18. In the binary language each letter of the alphabet, each number and each special character is made up of a unique combination of? 1) Eight bytes 2) Eight kilobytes 3) Eight characters 4) Eight bits 5) Eight terabytes 19. The term bit is short for? 1) Megabyte 2) Binary language 3) Binary digit 4) Binary number 5) None of these 20. A string of eight 0s and 1s is called a? 1) Megabyte 2) Byte 3) Kilobyte 4) Gigabyte 5) Numbers 21. A__ is approximately one billion bytes? 1) Kilobyte 2) Bit 3) Gigabyte 4) Megabyte 5) Terabyte 22. A__ is approximately a million bytes? 1) Gigabyte 2) Kilobyte 3) Megabyte 4) Terabyte 5) None of these 23. __ is any part of the computer that you can physically touch? 1) Hardware 2) Program 3) An application 4) Software 5) None of these 24. The components that process data are located in the? 1) Input devices 2) Output devices 3) System unit 4) Storage component 5) None of these 25. All of the following are exampl es of input devices EXCEPT a? 1) Scanner 2) Mouse 3) Keyboard 4) Printer 5) None of these 26. A unit of data storage which is equal to 2 to the 70th power is known as:? 1) Yottabite 2) Zebibyte 3) Yobibyte 4) Petabyte 5) Terabyte 27. Which of the following langu-ages were used in the first generation computers? 1) Machine Language 2) Assembly language 3) C-language 4) High level language 5) None of these 28. Which of the following options are used to provide guidance to users while they use application in computer? 1) Software 2) Wizard 3) Wiki 4) None of these 5) All of the above 29. V-RAM is used for which of the following? 1) Video and graphics 2) Text and images 3) Softwares 4) Only text 5) None of these 30. SQL (Structured Query Lang-uage) is used for___? 1) Creating databases and tables 2) Creating, Modifying and Querying databases 3) Modifying databases 4) None of these 5) All of the above 31. __is not a payment card techn-ology? 1) Magnetic stripe card 2) Smart card 3) fleet card 4) All of them are payment card technologies. 5) None of these 32. ____is also known as electronic check? 1) Debit card 2) Smart card 3) Credit card 4) DD 5) None of these 33. Which of the following printer cannot print graphics? 1) Ink-jet 2) Daisy Wheel 3) Laser 4) Dot-matrix 5) None of these 34. Best Quality graphics is produced by? 1) Dot Matrix 2) Laser Printer 3) Inkjet Printer 4) Plotter 5) All of the above 35. A___is a bi-stable electronic circuit that has two stable states? 1) Multivibrator 2) Flip-flop 3) Logic gates 4) laten 5) None of these 36. DOS stands for? 1) Disk Operating System 2) Disk Operating Session 3) Digital Operating System 4) Digital Open system 5) None of these 37. Which of the following are input devices? 1) Keyboard 2) Mouse 3) Card reader 4) Scanner 5) All of these 38. Who is the chief of Miocrosoft? 1) Babbage 2) Bill Gates 3) Bill Clinton 4) Bush 5) None of these 39. Examples of output devices are? 1) Screen 2) Printer 3) Speaker 4) All of these 5) None of these 40. Which of the following is also known as brain of computer? 1) Control unit 2) Central Processing unit 3) Arithmetic and language unit 4) Monitor 5) None of these -
COMPUTER AWARENESS
1. Random Access Memory or RAM? a) Contains the electronic circuit that cause processing to occur b) Makes the information resulti-ng from processing available for use c) Allows data, program, comm-ands, and user responses to be entered into a computer d) Consist of electronic compon-ents that store data e) None 2. Correcting errors in a program is referred to as? a) Debugging b) Bugging c) Rectifying d) Modifying e) None of these 3. An assembler is used to translate a program written in? a) A low level language b) Machine language c) A high level language d) Assembly language e) All of These 4. The capability of operating system to enable two or more than two programs to execute simultaneously in a single computer system by using a single processor is? a) Multiprocessing b) Multitasking c) Multiprogramming d) Multi-execution e) None of these 5. The basic goal of computer process is to convert data into? a) Information b) Tables c) Files d) Graphs e) None of these 6. A hard copy of documents is? a) Stored in the hard disk b) Stored in the floppy c) Stored on a CD d) Printed on the printer e) None of these 7. A___is a design tool that graphically shows the logic in a solution algorithm? a) Flow chart b) Hierarchy chart c) Structure chart d) Context diagram e) None of the above 8. Which key combination is used for special tasks? a) Insert, Delete b) Ctrl, Shift c) Left Arrow, Right Arrow d) Page up, Page Down e) None of these 9. Which is the part of a computer that one can touch and feel? a) Program b) Software c) Hardware d) Output e) None of these 10. Circuits that provide a commu-nication path between two or more devices of a digital compu-ter system is? a) Car b) Bus c) Truck d) All the above e) None 11. A keyboard is which kind of device? a) Black b) Input c) Output d) Word processing e) None of these 12. IT stands for? a) Information Technology b) Integrated Technology c) Intelligent Technology d) Interesting Technology e) None of these 13. Which of the following refers to the fastest, biggest and most expensive computers? a) Personal computers b) Super computers c) Laptops d) Note books e) None of these 14. A collection of related informa-tion sorted and dealt with as a unit is? a) Disk b) Data c) File d) Floppy e) None of these 15. The process of a computer recei-ving information from a server on the internet is known as? a) Pulling b) Pushing c) Downloading d) transferring e) None 16. Which part of the computer helps to store information? a) Disk drive b) Keyboard c) Monitor d) Printer e) None of these 17. What is the process of carrying out commands? a) Fetching a) Storing c) Executing d) Decoding e) None of these 18. The patterns of printed lines on most products are called? a) Prices b) Striping c) Scanners d) Barcodes e) None 19. Which of the following groups consist of only output devices? a) Scanner, Printer, Monitor b) Keyboard, Printer, Monitor c) Mouse, Printer, Monitor d) Plotter, Printer, Monitor e) None of these 20. The rectangular area of the screen that displays a program, data, and/or information is a? a) Title bar b) Button c) Dialogue box d) Window e) None of these 21. A(n)____contains commands that can be selected? a) Pointer (b) Menu c) Icon (d) Button e) None of these 22. An error is also known as? a) Bug b) Debug c) Cursor d) Icon e) None of these 23. Arithmetic Operations? a) Involve matching one data item to another to determine if the first item is greater than, equal to, or less than the other item b) Sort data items according to standard, predefined criteria in ascending or descending order c) Use conditions with operators such as AND, OR and NOT d) Include addition, subtraction, multiplication and division e) None of these 24. Sending an e-mail is similar to? a) Picturing an event b) Narrating a story c) Writing a letter d) Creating a drawing e) None 25. TCP is the acronym of? a) Transmit Control Protocol b) Transmission Control Protocol c) Time Control Protocol d) Travel Control Protocol e) None 26. Microsoft Word is an example of? a) An operating system b) A processing device c) Application software d) An input device e) None 27. Four of the following five are alike in a certain way and so form a group. Which is the one that does not belong to the group? a) PROM b) EPROM c) CD ROM d) ROM e) None of these 28. Any data or instruction entered into the memory of a computer is considered as? a) Storage b) Output c) Input d) Information e) None of these 29. Which part of the computer displays the work done? a) RAM b) Printer c) Monitor d) ROM e) None of these 30. Which of the following is not an example of Operating System? a) Windows b) DOS c) Linux d) Pascal e) Unix 31. The first page of a Website is called the? a) Home page b) Index c) Java script d) Bookmark e) None 32. A series of instructions that tells a computer what to do and how to do is called a? a) Program b) Command c) User response d) Processor e) None of these 33. The amount of vertical space between lines of text in a document is called? a) Double spacing b) Line spacing c) Single space d) Vertical spacing e) None of these 34. Access-control based on a person's finger prints is an example of ? a) Biometric identification b) Characteristics identification c) Characteristic security d) Finger print security e) None 35. Which of the following is a non-volatile memory? a) RAM b) MOS c) ROM d) MSI e) SSI 36. The program and data in a computer is stored in? a) ALU b) Control Unit c) Bus d) Memory e) Cache Memory 37. Processing involves? a) Inputting data into a computer system b) Transforming input into output c) displaying output in a useful manner d) Providing relevant answers e) None of these 38. In Microsoft Word, a red line under a word means? a) Grammar mistake b) Spelling mistake c) No mistakes d) Virus infection e) None of these Answers 1) d 2) a 3) d 4) b 5) a 6) d 7) a 8) b 9) c 10) b 11) b 12) a 13) b 14) c 15) c 16) a 17) c 18) d 19) d 20) d 21) b 22) a 23) d 24) c 25) b 26) b 27) c 28) a 29) c 30) d 31) a 32) a 33) b 34) a 35) c 36) d 37) b 38) b