విండోస్ 9.. వచ్చేస్తోందా?
మైక్రోసాఫ్ట్ సంస్థ త్వరలోనే తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 9ను విడుదల చేసేలా ఉంది. బహుశా ఈ నెల 30వ తేదీన దీన్ని విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఆరోజు జరిగే కార్యక్రమానికి అందరికీ స్వాగతం అంటూ మైక్రోసాఫ్ట్ పంపిన ఆహ్వానాలు దీన్నే సూచిస్తున్నాయి. ''విండోస్కు, మా సంస్థకు తదుపరి భవిష్యత్తు ఏంటో చూసేందుకు మాతో కలసి రండి'' అని అర్థం వచ్చేలా ఓ ఆహ్వానాన్ని మైక్రోసాఫ్ట్ పంపింది.
శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఈనెల 30వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానంగా విండోస్ ఆధారిత కంప్యూటర్లకు వివిధ ప్రోగ్రాంలు రూపొందించే డెవలపర్లు, తమ నెట్వర్కులలో మైక్రోసాఫ్ట్ ప్రోగ్రాంలు వాడేవాళ్లను ఉద్దేశించి ఈ ఆహ్వానం పంపినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లకు ఉపయోగపడే ప్రత్యేకమైన విండోస్ తయారుచేయడానికి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.