ఫేస్‌బుక్‌కు కొత్త స్పర్శ! | Facebook Touch for Windows 8 | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌కు కొత్త స్పర్శ!

Published Fri, Nov 15 2013 11:36 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్‌బుక్‌కు కొత్త స్పర్శ! - Sakshi

ఫేస్‌బుక్‌కు కొత్త స్పర్శ!

విండోస్ 8.. టచ్ పీసీల వినియోగంలో కొత్త అనుభవాన్ని ఇస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్. స్పర్శతెరల వినియోగం ఎక్కువవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకొచ్చిన విండోస్ 8 ఆకర్షణీయంగా మారింది. కొత్త కొత్త అప్లికేషన్లతో ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి విండోస్ 8 ఓఎస్‌పై ఫేస్‌బుక్ బ్రౌజింగ్ వావ్... అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విండోస్ 8 ఓఎస్‌పై ఫేస్‌బుక్ కోసం అందుబాటులోకి వచ్చిన సరికొత్త అప్లికేషన్లివి. వీటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫేస్‌బుక్ లుక్‌ను మార్చేయవచ్చు. కాస్తంత కొత్తగానూ స్పర్శించవచ్చు!
 
ఓఎస్ విషయంలో అప్‌టు డేట్‌గా ఉండే వారెంతోమంది విండోస్ 8 కు మారిపోయారు. ఎటువంటి అప్లికేషన్లూ ఇన్‌స్టాల్ చేసుకోకపోయినా ఈ ఓఎస్‌పై ఫేస్‌బుక్‌లోకి లాగిన్ కావడంతోనే హోమ్ పేజ్ భిన్నంగా కనిపిస్తుంది. ఇతర ఓఎస్‌లపై ఫేస్‌బుక్ సర్ఫింగ్‌కు, ఈ ఓఎస్ పై ఫేస్‌బుక్ సర్ఫింగ్‌కు ఎంతో మార్పు కనిపిస్తుంది. ప్రధానంగా పీసీలోని ఇతర అప్లికేషన్‌లను ఉపయోగించుకొంటూనే.. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో చాట్‌చేయడానికి అవకాశం ఉంటుంది. ఫేస్‌బుక్ విండోను మినిమైజ్ చేసినా.. నోటిఫికేషన్స్, చాట్ విండోలు డెస్క్‌టాప్ మీద డిస్‌ప్లే అవుతాయి.  
 
 మైన్ ఫర్ ఫేస్‌బుక్..
 
 మీ ఫేస్‌బుక్ పేజ్ టైమ్‌లైన్ స్టైల్‌ను మొత్తం మార్చేస్తుంది ఈ అప్లికేషన్. ఫేస్‌బుక్‌లో మీరు ఉపయోగించని వాటన్నింటినీ పక్కనపెట్టేసి.. అవసరమైన వాటిని మాత్రమే డిస్‌ప్లే చేస్తుంది. విండోస్ 8 ఓఎస్ కోసమే రూపొందించింది ఈ అప్లికేషన్. టచ్, నాన్ టచ్ డివైజ్ ల రెండింటికీ ఉపయుక్తంగా ఉంటుంది.
 
 మెట్రోస్టైల్...
 
 పేరుకు తగ్గట్టుగానే రొటీన్  టైమ్‌లైన్‌ను, రొటీన్ కామెంట్ సెక్షన్‌ను, రొటీన్ న్యూస్ ఫీడ్‌ను కొత్త స్టైల్‌లో డిస్‌ప్లే చేస్తుంది మెట్రోస్టైల్. ఫోటోలను ఫుల్‌స్క్రీన్‌లో చూడటానికి అవకాశం ఉంటుంది. విభిన్నమైన థీమ్స్ ఉంటాయి.
 
 ఫేస్‌బుక్ ఫరెవర్..
 
 ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యూలకు కాస్తంత భిన్నంగా ఉంటుంది ఈ అప్లికేషన్ వ్యూ. న్యూస్‌ఫీడ్, ఫోటోగ్యాలరీ, చాట్, మెసేజింగ్ ఫీచర్లతో రిచ్, ఎలిగెంట్, ఈజీ టు యూజ్ అంటూ ఈ అప్లికేషన్ గురించి రివ్యూలు అందుబాటులో ఉన్నాయి.
 
 వైబ్ ఫర్ ఫేస్‌బుక్...
 
అనునిత్యం ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండటానికి, ప్రపంచంలో మార్పులను గమనించడానికి మార్గంగా ఉన్న ఫేస్‌బుక్‌ను కంటికి ఇంపుగా ఉండే రీతిలో చూడండి... అంటూ ‘వైబ్ ఫర్ ఫేస్‌బుక్’ అనే పేరుతో ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టచ్‌స్క్రీన్ డివైజ్‌లపై వైబ్ అప్లికేషన్ ద్వారా ఫేస్‌బుక్‌ను ఆపరేట్ చేయడం నిజంగా టచబుల్ ఎక్స్‌పీరియన్స్!
 
 ఫేస్‌బుక్ ప్లస్ లైట్..
 
ఇది పేరుకు తగ్గట్టుగానే సింపుల్‌గా ఉంటుంది. రంగులు, లుక్, పెద్ద పెద్ద ఇమేజ్‌ల డిస్‌ప్లేలు లేకుండా సాదాసీదాగానే కనిపిస్తుంది ఈ అప్లికేషన్.
 
 సోషియల్ ఎన్‌వీ..
 ఫేస్‌బుక్ పేజ్‌లను హారిజాంటల్ వ్యూలో డిస్‌ప్లే చేసే అప్లికేషన్లలో ఇదీ ఒకటి. బ్రైట్‌గా, క్లియర్‌గా చక్కటి రిలీఫ్‌తో పేజ్‌ను డిస్‌ప్లే చేస్తుంది ఈ అప్లికేషన్.
 

ఇవి విండోస్ 8 ఫేస్‌బుక్‌ను కొత్త విన్యాసాల్లో చూపే అప్లికేషన్‌లు. ఫేస్‌బుక్ రొటీన్ వ్యూ నుంచి విముక్తిని ప్రసాదిస్తాయి ఇవి. ఈ అప్లికేషన్‌లలో ఏది బెటర్, ఏది అందమైనది, ఏది బాగుంటుంది అంటే చెప్పలేం. మనసుకు నచ్చినదాన్ని ఎంచుకోవడమే.
 విండోస్ 8 ఓఎస్‌కు అప్‌గ్రేడ్ అయితేనే ఈ అప్లికేషన్‌లను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కొత్తదనాన్ని స్పృశించడానికి అవకాశం ఉంది. టచ్‌స్క్రీన్ గాడ్జెట్స్ కాకపోయినా, విండోఎస్ 8 ను ఇన్‌స్టాల్ చేసుకొంటే ఈ అప్లికేషన్‌లను ఉపయోగించవచ్చు.
                 
 - జీవన్‌రెడ్డి.బి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement