
ప్రపంచంలోనే మొట్టమొదటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ 'స్కైప్' (Skype)ను శాశ్వతంగా మూసివేయాలని, టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' యోచిస్తోంది. మే నుంచి స్కైప్ అందుబాటులో ఉండదని.. కంపెనీ వెల్లడించింది.
2003లో ప్రారంభమైన స్కైప్‌ను.. మైక్రోసాఫ్ట్ 2011లో 8.5 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ. 74వేలకోట్లు) కొనుగోలు చేసింది. ఆ తరువాత ఇందులో అనేక అప్డేట్స్ తీసుకొచ్చింది. విండోస్ లైవ్ మెసెంజర్ తొలగింపు తరువాత.. 2015లో మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను విండోస్ 10 లో అనుసంధానించడానికి ప్రయత్నించింది. ఇది మొత్తం తొమ్మిది నెలలు కొనసాగింది. అయితే ఇప్పుడు 22 ఏళ్ల స్కైప్ ప్రయాణానికి మంగళం పాడనుంది.
మైక్రోసాఫ్ట్.. స్కైప్‌ను అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా పాటుపడింది. ఇందులో భాగంగానే యాపిల్ కంపెనీకి చెందిన 'ఐమెసేజ్'తో పోటీ పడటానికి సిద్ధమైంది. అయినా ఎలాంటి ఉపయోగం కనిపించలేదు. 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను ప్రారంభించింది. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా స్కైప్ అభివృద్ధి చెందలేదు. దీంతో చేసేదేమీ లేక.. కంపెనీ పూర్తిగా స్కైప్‌ను నిలిపివేయడానికి ఫిక్స్ అయింది. సంస్థ ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా యూజర్లకు వెల్లడించనుంది.
Comments
Please login to add a commentAdd a comment