Skype
-
విండోస్ 11 రాకతో స్కైప్ కథ ముగిసినట్టేనా..!
మైక్రోసాఫ్ట్ కంపెనీ తదుపరి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వర్షన్ విండోస్ 11 ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. మరింత సరళతరమైన డిజైన్‌తో పాటు, ఆండ్రాయిడ్ యాప్స్ విండోస్‌లో పనిచేసేలా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించింది మైక్రోసాఫ్ట్. కాగా విండోస్ 11 రాకతో ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ స్కేప్‌కు ఎండ్ కార్డ్ పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారితో జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్స్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. దీంతో మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో బై డిఫాల్ట్‌గా వీడియో కాలింగ్ రానున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో స్కేప్ కనుమరుగయ్యే అవకాశాలున్నాయిని ఐరిష్ & సండే ఇండిపెండెంట్ టెక్ ఎడిటర్ అడ్రియన్ వెక్లర్ పేర్కొన్నారు. గత పది సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ సుమారు 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్కేప్ కొనుగోలు అతిపెద్ద డీల్‌గా నిలిచింది. గత సెప్టెంబరులో, మైక్రోసాఫ్ట్ కు చెందిన లింక్డ్ఇన్.. జూమ్, బ్లూజీన్స్ టీమ్స్ ,స్కైప్ ఉపయోగించి వీడియో సమావేశాలను తన చాట్ ఫీచర్లో తెస్తున్నట్లు ప్రకటించగా, అక్టోబర్‌లో, మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జిమ్ గేనోర్ మాట్లాడుతూ..స్కైప్ మరింత విస్తరించబోతుందని తెలిపారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బిలియన్ సార్లు డౌన్లోడ్ చేసిన, వందల మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న యాప్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దాంతో పాటుగా కొన్ని రోజుల్లోనే గూగుల్ మీట్, జూమ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సంస్థలు వీడియో కాలింగ్ ఫీచర్, మీటింగ్ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీంతో స్కేప్‌పై ఉన్న ప్రజాదరణ కాస్త తగ్గిపోయింది. బహుశా మైక్రోసాఫ్ట్ ఈ కారణం చేతనో స్కేప్‌కు ఎండ్‌కార్డ్ పలకాలని భావిస్తోందని టెక్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. స్కైప్ కు అంతా మేలు చేయలే...! కరోనా మహమ్యారితో ప్రముఖ వీడియో కాలింగ్, మీటింగ్ యాప్ జూమ్ అత్యంత ఆదరణ ఏర్పడింది. కరోనా మహమ్మారి సమయంలో స్కైప్‌లో ఏలాంటి గ్రోత్ కనిపించలేదు. సుమారు 70 శాతం ప్రజలు స్కైప్ నుంచి తప్పుకున్నారు. ప్లే స్టోర్‌లో స్కైప్ యాప్ ఆప్షనల్‌గా ఉంటుంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసే నాథుడే లేకుండా అయ్యాడు. చదవండి: గూగుల్ ఫోటోస్‌లో ఉన్న ఫీచర్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్‌లో..! -
ఇకపై అలెక్సాలో స్కైప్ కాలింగ్...
‘హేయ్ అలెక్సా కాల్ టు మై డాడ్ ఆన్ స్కైప్’ అనగానే మీరు అనుకున్నవారికి వీడియో కాల్ చేసే సదుపాయం ఇప్పుడు అలెక్సా డివైస్‌లకు వచ్చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలు రెండు కలిసి ఈ మేరకు తమ సర్వీసులను వినియోగ దారులకు అందించనున్నాయి. గతంలో అలెక్సా నుంచి అలెక్సా డివైసెస్‌కు మాత్రమే వాయిస్ కాలింగ్ సదుపాయం ఉండేది. ప్రస్తుతం ఈ సదుపాయం స్కైప్ అకౌంటు ఉన్న ల్యాండ్‌లైన్ ఫోన్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. బ్రిటన్, అమెరికా, ఐర్లాండ్, కెనడా, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి 39 దేశాల్లో ఈ సౌకర్యం ఇప్పటికే అందుబాటులోకి రాగా ఇతర దేశాలకు కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇంట్రడక్షన్ ఆఫర్ కింద నెలకు వంద నిమిషాల ఉచిత కాలింగ్‌ను రెండు నెలల పాటు అందించనున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని పొందడానికై అలెక్సా డివైస్‌లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి కమ్యూనికేషన్ విభాగంలోని స్కైప్‌తో జత చేయాలి. అలెక్సా అంటే... ! మన స్మార్ట్‌ఫోన్స్‌లో ఉన్న గూగుల్ అసిస్టెంట్, సిరి, కోర్టానా లాగే అలెక్సా కూడా వాయిస్ కమాండ్స్ ఆధారంగా పని చేసే వర్చువల్ అసిస్టెంట్. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ డివైస్‌ను డెవలప్ చేసింది. న్యూస్, పాటలు, పోడ్కాస్ట్లను వినిపించడం, నిర్దేశించిన సమయానికి అలారం మోగించడం వంటి పనులు కృత్రిమ మేధ సహకారంతో చేస్తుంది. అప్డేట్ అందుకోనున్న డివైస్‌లు... అమెజాన్ ఎకో ఫస్ట్ జనరేషన్ అమెజాన్ ఎకో సెకండ్ జనరేషన్ అమెజాన్ ఎకో ప్లస్ సెకండ్ జనరేషన్ అమెజాన్ ఎకో డాట్ సెకండ్ జనరేషన్ అమెజాన్ ఎకో డాట్ థర్డ్ జనరేషన్ అమెజాన్ ఎకో షో ఫస్ట్ జనరేషన్ అమెజాన్ ఎకో షో సెకండ్ జనరేషన్ అమెజాన్ ఎకో షో స్పాట్ డివైసెస్ -
స్కైప్ లో కథవిని ఓకే చెప్పింది..
తమిళసినిమా: వంజకర్ ఉలగం రెగ్యులర్ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలా ఉండదని ఆ చిత్ర కథానాయకి అనీషా అంబ్రోస్ అంటోంది. చాలా మంది ఇతర చిత్రాల తారల మాదిరిగానే కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్న కన్నడ నటి ఈ అమ్మడు. కన్నడంలో గర్వ, మోహన్‌లాల్, గౌతమి జంటగా నటించిన మన్మధ వంటి చిత్రాల్లో నటించిన అనీషా వంజగర్ ఉలగం చిత్రంతో నాయికిగా కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను తెలుపుతూ వంజగర్ ఉలగం చిత్రం అవుట్ పుట్తో చిత్రయూనిట్ అంతా సంతృప్తిగా ఉందని చెప్పింది. అయితే తనకు మాత్రం ఇది చాలా స్పెషల్ అని పేర్కొంది. వార్తలను సేకరించే పనిలో ఒక భయంకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయిన విలేకరి పాత్రలో తాను నటించానని చెప్పింది. ఆ పరిస్థితి నుంచి ఎలా బయట పడ్డానన్నదే తన పాత్ర అని తెలిపింది. ఇది హైపర్లింక్ కథాంశంతో కూడిన చిత్రం అని పేర్కొంది. ఒకే సమయంలో జరిగే పలు కథల ఇతివృత్తంగా వంజకర్ ఉలగం చిత్రం ఉంటుందని చెప్పింది. ఇది గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అయినా రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ చిత్రాల మాదిరిగా ఉండదని అంది. ప్రేమ కథా చిత్రాలు పలు కోణాల్లో ఎలాగైతే తెరకెక్కుతాయో, ఈ వంజగర్ ఉలగం చిత్రం వైవిధ్యంగా ఉంటుందని పేర్కొంది. ఈ చిత్ర కథను దర్శకుడు మరోజ్ బీధ తనకు స్కైప్ ద్వారా చెప్పారని, కథ వినగానే ఆయన తాను ఇంతకు ముందు నటించిన చిత్రాలు చూసి ఉంటారా? అన్న ఆశ్చర్యం కలిగిందని చెప్పింది. కారణం నటనకు అవకాశం ఉన్న అలాంటి పాత్రకు తనను ఎంచుకోవడంతో తనకు అలా అనిపించిందంది. చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచి అంతా సక్రమంగా జరుగుతూ వచ్చిందని, ఈ చిత్రంలో నటించిన ప్రతిరోజూ సంతోషంగా సాగిందని అనీషా చెప్పుకొచ్చింది. ఇందులో ప్రధాన పాత్రల్లో సిబి భువన్ చంద్రన్, హరీశ్ పేరడి, గురు సోమసుందరం, చాందిని తమిళరసన్, విశాగన్ వనంగాముడి, జాన్‌విజయ్, వాసు విక్రమ్ నటించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని లాభిరింద్ ఫిలింస్ పతాకంపై మంజులా బీదా నిర్మిస్తున్నారు. -
‘స్కైప్’లో అత్యాచార బాధితురాలి విచారణ
మైసూరు: విదేశీ మహిళపై అత్యాచారం చేసిన కేసులో దోషికి 25 ఏళ్ల జైలుశిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ మైసూరు ఏడవ జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. స్కైప్ (వీడియో కాలింగ్ యాప్) ద్వారా ఈ కేసు విచారణ జరగడం విశేషం. ఆదివాసీల జీవనంపై అధ్యయనం చేయడానికి 2015లో అమెరికా నుంచి ఓ మహిళ మైసూరుకు వచ్చింది. ఆమె ఆరోగ్యం బాగోలేక మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. చికిత్స అందించే నెపంతో అక్కడ పనిచేస్తున్న సుమిత్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం మహిళ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఘటనపై ఫిర్యాదు చేసి స్వదేశానికి వెళ్లిపోయింది. కేసు నమోదవడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అధికారులు అప్పటి నుంచి స్కైప్ ద్వారా బాధిత మహిళ నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. నేరం రుజువు కావడంతో నిందితుడు సుమిత్‌కు న్యాయస్థానం శిక్ష విధించింది. -
మొదటిసారి స్కైప్‌లో
► స్కైప్ ద్వారా విడాకులు తీసుకున్న పూణె జంట పూణె: అందరూ కలవడానికి ఉపయోగపడే స్కైప్ ఓ జంట విడిపోవడానికి కూడా ఉపయోపడింది. వివరాల్లోకి వెళ్తే పూణె సివిల్ కోర్టులో ఓ జంట తమకు విడాకులు కావాలని స్కైప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన యువతీ యువకులు ఒకే కళాశాల్లో చదివి, ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నారు. అయితే నెలరోజుల్లోనే ఇద్దరికి వేరు వేరు దేశాల్లో ఉద్యోగాలు రావడంతో ఉద్యోగ రీత్యా ఆయా దేశాలకు వెళ్లిపోయారు. భర్త సింగపూర్‌కు వెళ్లగా, భార్య లండన్‌లో ఓప్రవేటు కంపెనీలో ఉద్యోగానికి వెళ్లింది. దీంతో ఇద్దరు కలిసి ఉండటానికి అవకాశం లేకపోవడంతో విడాకులు కోరుతూ 2016లో కోర్టును ఆశ్రయించారు. వీరి తరపు న్యాయవాదిగా సుచిత్ మందడా కోర్టుకు హాజరయ్యారు. పరిస్థితుల కారణంగా ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేకపోయారని న్యాయమూర్తికి విన్నవించారు. పరస్పర అంగీకారంతో స్కైప్ వీడియో కాన్ఫరెన్స్‌లో విడాకులు కావాలని న్యాయమూర్తిని కోరారు. వీరి వాదనలు అంగీకరించిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. -
స్కైప్ పాత వెర్షన్లు తీసేస్తున్నారు
న్యూయార్క్ : కంప్యూటర్లు, టాబ్లెట్లు, మొబైల్ పరికరాల్లో ఇంటర్నెట్ ద్వారా వీడియో చాట్, వాయిస్ కాల్స్ సర్వీసులు అందించడంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన టెలికమ్యూనికేషన్ సాధనం స్కైప్. ఇంత పాపులారిటీ పొందిన ఈ స్కైప్‌ను ప్రస్తుతం కొన్నింటికీ తీసేస్తున్నారట. విండోస్ డెస్క్‌టాప్ లకు వాడే స్కైప్ 7.16 వెర్షన్లో ఇక లాగిన్ కావడం అసాధ్యంగా మారబోతుందట. మార్చి 1 నుంచి స్కైప్ 7.16 వెర్షన్‌ను మైక్రోసాప్ట్ తీసేస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మ్యాక్లకు వాడే స్కైప్ 7.18 వెర్షన్‌లోకి కూడా యూజర్లు లాగిన్ కాలేరని రిపోర్టులు పేర్కొంటున్నాయి. వెంచర్ బీట్ రిపోర్టు ప్రకారం ఈ రెండు వెర్షన్లు 2015 డిసెంబర్లో అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ ఈ రెండు వెర్షన్లు వాడుతున్న యూజర్లైతే, కొత్తగా అప్డేట్ అవ్వాల్సి ఉందని స్కైప్ టీమ్ శుక్రవారం తన బ్లాక్ పోస్టులో తెలిపింది. స్కైప్‌ను మెరుగుపరుస్తున్న మైక్రోసాప్ట్ ఈ వెర్షన్లలో వివిధ రకాల మార్పులను తీసుకొస్తోంది. -
స్కైప్‌కు ఆధార్ లింక్: మైక్రోసాఫ్ట్
బెంగళూరు: ఇంటర్నెట్ ద్వారా వీడియో కాల్స్, వాయిస్ చాట్‌ను అందించే తమ అప్లికేషన్ స్కైప్‌కు ఆధార్‌ను అనుసంధానించి ప్రభుత్వ పథకాలను సులభతరం చేయడానికి టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది. బెంగళూరులో మైక్రోసాఫ్ట్ భారత విభాగం చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ పీటీఐతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఐరిస్ ద్వారా గుర్తించే విధానాన్ని రూపొందించామని, ఇక ఏ విధానం కావాలో నిర్ణయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఆధార్ ఆధారిత సేవల్లో ధ్రువీకరణ కోసం తమ స్కైప్‌ను వినియోగించవచ్చని, ఉదాహరణకు బ్యాంకు నుంచి పెన్షన్ పొందేందుకు ఇంటిలో నుంచే స్కైప్ ద్వారా ధ్రువీకరణ ఇవ్వొచ్చని చెప్పారు. డిజిటల్ ఇండియా, ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు ప్రభుత్వంతో కలిసి చురుగ్గా పనిచేస్తున్నామని వెల్లడించారు. -
ఉద్యోగాలకు కోతపెడుతున్న మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. లండన్‌లోని తన స్కైప్ కార్యాలయాన్ని మూసేస్తోంది. దాంతో సుమారు 400 మంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. కొన్ని ఇంజనీరింగ్ పొజిషన్లను కలిపేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దాంతో చాలామంది స్కైప్ ఉద్యోగులపై వేటు పడేప అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతానికి కేవలం లండన్‌లో ఉన్న కార్యాలయాన్ని మాత్రమే మూసేశామని.. రెడ్మండ్, పాలో ఆల్టో, వాంకూవర్ సహా యూరప్‌లోని పలు కార్యాలయాలను తెరిచే ఉంచుతున్నట్లు స్కైప్ చెబుతోంది. అయితే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి క్రమంగా అందులోని పాత ఉద్యోగులను తొలగించి, తమ సొంత ఉద్యోగులను నియమిస్తోందని కొందరు మాజీ ఉద్యోగులు తమ పేరు బయట పెట్టొద్దంటూ చెప్పారు. ఒకప్పుడు ఉచిత వీడియో కాలింగ్ అంటే కేవలం స్కైప్ మీద మాత్రమే ఆధారపడేవాళ్లు. కానీ ఇప్పుడు దానికి ఆదరణ తగ్గింది. వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్ లాంటివి రావడంతో పాటు వీడియో కాలింగ్ యాప్స్ కూడా చాలా వచ్చేశాయి. దాంతో ఎప్పటినుంచో స్కైప్‌కు అలవాటు పడినవాళ్లు కూడా క్రమంగా దానికి దూరమవుతున్నట్లు సమాచారం. -
గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్
న్యూఢిల్లీ: ఫేస్‌టైమ్, స్కైప్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌కి పోటీ గా టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా డ్యువో పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరే టింగ్ సిస్టమ్‌ల ఆధారిత స్మార్ట్ఫోన్లలో ఇది పనిచేస్తుంది. వీడియో కాలింగ్‌ను మరింత సులభతరం చేసే ఈ యాప్‌ను మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ అందుబాటులోకి తేనున్నట్లు గూగుల్ గ్రూప్ ప్రోడక్ట్ మేనేజర్ అమిత్ ఫులే తెలిపారు. విడిగా యూజర్‌నేమ్/అకౌంట్ లాంటివి అక్కర్లేకుండా యూజర్లు తమ ఫోన్ నంబర్‌నే ఉపయోగించి డ్యువో ద్వారా వీడియో కాల్ చేయొచ్చని వివరించారు. తక్కువ బ్యాండ్‌విడ్త్‌లోనూ మెరుగ్గా పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దినట్లు అమిత్ తెలిపారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు
స్కైప్ ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు(క్రైమ్) : అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. వనం–మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏఎస్పీలు బి. శరత్‌బాబు, కె. సూరిబాబు ఆధ్వర్యంలో డీఎస్పీలు మొక్కలు నాటారు. ఎస్పీ కృష్ణా పుష్కరాల విధుల్లో ఉండటంతో మాస్‌ప్లాంటేషన్ కార్యక్రమాన్ని స్కైప్ వీడియో కాలింగ్ ద్వారా సమీక్షించారు. ఆయన స్కైప్‌లో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్‌లో భూగ్రహం మీద జీవులు మనుగడ సాధించాలంటే ఇప్పటినుంచే మొక్కలు విరివిగా నాటాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్, పోలీస్‌గ్రౌండ్స్, క్వార్టర్స్, దత్తత గ్రామాలు, విద్యాలయాల్లో రెండు రోజుల్లోపు 5 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏఎస్పీ బి. శరత్‌బాబు మాట్లాడుతూ మానవుడు ప్రకృతి వనరులు అవసరానికి మించి వాడడం ద్వారా వివిధ రకాల కాలుష్యాలను సృష్టించి పుడమి తల్లికి అపార నష్టం కల్గిస్తున్నాడన్నారు. డీఎస్పీలు కోటారెడ్డి, జీవీ రాముడు, తిరుమలేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్, సుధాకర్, బాలసుందరం, మోహన్‌రావు, శ్రీనివాసరావు, చెంచురెడ్డి, ఆర్ఐలు కేజేఎం చిరంజీవి, శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మాణిక్యరావు, ఎస్ఐ బి. శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
ఎవ్వరిని ఉగ్రవాదం వైపు వెళ్లమనలేదు
-
ఎవ్వరిని ఉగ్రవాదం వైపు వెళ్లమనలేదు: జకీర్
సౌదీ అరేబియా: ఉగ్రవాదాన్ని తాను ఏ మాత్రం సమర్థించబోనని వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ చెప్పారు. ఇస్లాం శాంతి కోరుకుంటుందని అన్నారు. ఫ్రాన్స్ లో జరిగిన దాడులను తాను ఖండిస్తున్నాని చెప్పారు. అమాయకులపై దాడులు సరికాదని అన్నారు. ఏ ఒక్క ఉగ్రదాడిలో కూడా తన పాత్ర లేదని వివరించాడు. దేశంలో ముస్లింలను రెచ్చగొట్టేలా జకీర్ నాయక్ ప్రసంగాలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు స్కైప్ ద్వారా వివరణ ఇస్తానని చెప్పిన ఆయన సౌదీ నుంచి స్కైప్ ద్వారా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదం వైపు ముస్లింలు వెళ్లాలని తాను చెప్పలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తాను ఎప్పుడూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని వివరణ ఇచ్చారు. -
‘రేపు స్కైప్ ద్వారా వస్తాడంట’
ముంబయి: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రేపు మీడియా ముందుకు వస్తానని చెప్పాడు. స్కైప్ ద్వారా తాను మీడియాతో మాట్లాడతానని బుధవారం ఒక ప్రకటనలో తెలిపాడు. జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించిన ఆయనపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల కన్నుపెట్టారు. ఆయన చేసిన ప్రసంగాలన్నింటిని కూడా కేంద్ర, రాష్ట్ర అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతడు భారత్ కు రాగానే వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావించగా ప్రస్తుతం ఇండియాకు రాకుండా జకీర్ ఆగిపోయాడు. అయితే, తనకు ఆఫ్రికా పర్యటన ఖరారైందని, తానేం పారిపోవడం లేదని, తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పాడు. గురువారం నాటి ప్రెస్ కాన్ఫెరెన్స్ ద్వారా బాలీవుడ్, న్యాయ, ఎన్జీవోవంటి ఆయా విభాగాల్లో ప్రముఖులైన వారితో కూడా మాట్లాడతానని మరోమాటగా చెప్పాడు. -
త్వరలో ఆ సేవలందించనున్న టెల్కోస్ ?
న్యూఢిల్లీ: తరచూ కాల్ డ్రాప్ సమస్యతో విసిగిపోయిన వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్ ను ఆఫర్ చేసేందుకు టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) రంగం సిద్ధం చేస్తోంది. ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసుల ద్వారా వాట్స్ యాప్, స్కైప్ లో ఉన్న కాలింగ్ సదుపాయాన్నందించేందుకు ట్రాయ్ కసరత్తు చేస్తోంది. ఈ సేవల సాధ్యాసాధ్యాలపై టెల్కోస్ తో చర్చలు జరపనుంది. వాట్స్ యాప్, స్కైప్ లతో సమానంగా ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసుల ద్వారా వాయిస్ కాలింగ్ సేవలందించాలని యోచిస్తున్నట్టు ట్రాయ్ ఛైర్మన్ ఆర్ ఎస్ శర్మ వెల్లడించారు. ఒకవైపు ఇతర ప్రొవైటర్లు ఈ ఇంటర్నెట్ టెలిఫోనీ అందిస్తుండగా, తమ సర్వీసు ప్రొవైడర్లు లెసెన్స్ లేకుండా ఈ వాయిస్ ఓవర్ సేవలను అందించలేరనీ దీంతో రెగ్యులేటరీ అసమతుల్యత నెలకొందని శర్మ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని కొంతమేరకైనా చక్కదిద్దాలనే ప్రణాళిలో ఉన్నట్టు తెలిపారు. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇతర ప్రొవైడర్లు అందిస్తున్న సర్వీసులను తాము కూడా అనుమతించనున్నామని చెప్పారు. ప్రపంచవ్యాపితంగా ఈయూ, అమెరికా సహా పలు మార్కెట్ టెల్కోస్ లలో ఈ వాయిస్ ఓవర్ సేవలు అందించడానికి అనుమతి ఉందన్నారు. దీనిపై పరిశ్రమలో భారీ చర్చ జరుగుతోందని తెలిపారు. కాగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ డిసెంబర్ 2014 లో ఇంటర్నెట్ ఆధారిత కాల్స్ ప్రారంభించింది. దీనికి ప్రత్యేకంగా చార్జి వసూలు చేయాలని నిర్ణయంపై నిరసన వెల్లువెత్తడంతో ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.. మరి ట్రాయ్ తాజా ప్రతిపాదన ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. -
లవర్స్‌కి స్కైప్ బంపర్ ఆఫర్!
'వాలెంటైన్స్ డే' సందర్భంగా ప్రేమికులకు వీడియో కాలింగ్ సర్వీస్ సంస్థ స్కైప్ సరికొత్త ఆఫర్ ఇచ్చింది. ప్రేమికుల రోజున తమ మనస్సులోని ప్రేమను నచ్చినవారితో పంచుకోవడానికి సరికొత్త వీడియోకార్డ్ సర్వీసును అదనంగా జోడీచింది. తమకు నచ్చినవారి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ సొంతంగా వీడియోను రికార్డ్ చేసి.. దానిని ఎగిరే హార్ట్ సింబల్స్ యానిమేషన్‌తో అందంగా తీర్చిదిద్దుకొనే అవకాశం కల్పించింది. ఇంకా ఉత్తమమైన అంశం ఏమిటంటే ఈ వీడియోను స్కైప్‌లోనే కాదు.. ఫేస్బుక్, జీమెయిల్ వంటి ఇతర వేదికల్లోనూ తమకు నచ్చినవారితో పంచుకోవచ్చు. ఎదుటివ్యక్తి స్కైప్ యూజర్ కాకపోయినా.. ఇతర ఆన్లైన్ వేదికల ద్వారా ఈ వీడియోను షేర్ చేయవచ్చు. ఐఫోన్, ఐప్యాడ్ లలో స్కైప్ యాప్ ఓపెన్ చేయగానే హార్ట్ సింబల్ కనిపిస్తుంది. దీనిని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో రికార్డ్ చేయవచ్చు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో '+' బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా హార్ట్ గుర్తును సెలక్ట్ చేసుకొని ఈ వీడియోను రికార్డు చేయవచ్చు. ఈ వీడియోను స్కైప్‌లోనే కాదు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలోనూ, డెస్క్ టాప్ లోనూ షేర్ చేసుకోవచ్చునని ఆ సంస్థ తెలిపింది. ఆదివారం వస్తున్న ఈ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రత్యేకంగా స్కైప్ ఎన్నో ఫీచర్స్‌ను అందిస్తోంది. అందులో భాగంగా అందిస్తున్న ఈ వీడియోకార్డ్స్ ఫీచర్ 48 గంటలపాటు అందుబాటులో ఉండనుంది. -
మీ స్కైప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయా?
కొత్త కొత్త మాల్వేర్లను (మాల్వేర్ అంటే హానికరమైన సాఫ్ట్వేర్) ఉపయోగించి ఖాతాల్లో డబ్బు తస్కరించే హ్యాకర్లనే ఇప్పుటి దాకా చూస్తున్నాం. ఇప్పుడు వారి దృష్టి ఆన్లైన్ సంభాషణలపై పడింది. ఆన్లైన్ లోనే అన్ని రకాల సంభాషణలు జరుపుతున్న నేటి తరుణంలో రహస్య సమాచారాన్ని చోరీ చేసేందుకు హ్యాకర్లు సిద్ధమౌతున్నారు. తాజాగా స్కైప్ లో జరిగే సంభాషణలను రికార్డు చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెరికా వంటి దేశాల్లో కొత్త మాల్వేర్ ను ఉపయోగించి సైబర్ దాడులకు పాల్పడినట్లు వివరిస్తున్నారు. ఏ దేశంలో నివసిస్తున్న వారితోనైనా మన ముందున్నట్లే మాట్లాడేందుకు స్కైప్‌ను ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నాం. ఇష్టమొచ్చినట్లు అదీ ఇదీ అని లేకుండా ప్రతి విషయాన్నీ స్కైప్ కాల్స్‌లో షేర్ చేసేసుకుంటున్నాం. ఆఫీస్ మీటింగ్‌లు, రహస్య సంభాషణలు అన్నీ స్కై ప్ లో జరిగిపోతున్నాయి. అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన స్కైప్‌లో మాట్లాడేప్పుడు ఏవైనా రహస్య సంభాషణలు ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిందేనంటున్నారు సైబర్ నిపుణులు. స్కైప్ లో జరిగే రహస్య సమాచారాన్ని T9000 మాల్వేర్ను ఉపయోగించి తస్కరించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీడియో సంభాషణలను రికార్డు చేసేందుకు, స్క్రీన్ షాట్లు తీసేందుకు ఈ శక్తివంతమైన T9000 మాల్వేర్ ను వినియోగిస్తున్నట్లు సైబర్ రక్షణాధికారులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ఇప్పుడు ఎటువంటి యాంటీ వైరస్ కు దొరక్కుండా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ కు చెందిన వీడియో ఛాటింగ్ ప్రోగ్రామ్ స్కైప్ ను ప్రతిరోజూ సుమారు 4.9 మిలియన్ల మంది వాడుతున్నట్లు గతేడాది జరిపిన సర్వేలు చెప్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ లకు పోటీగా స్కైప్ ను వినియోగదారులు వాడటం కనిపెట్టిన హ్యాకర్లు... ఇప్పుడు రహస్య వీడియో సంభాషణల తస్కరణపై దృష్టి పెట్టారు. కొత్తగా వచ్చిన ఈ T9000 మాల్వేర్ మార్కెట్లోని ఎన్నో రకాల సాఫ్ట్ వేర్ లను తప్పుదోవ పట్టించగలదని పాలో ఆల్టో నెట్ వర్కింగ్ సంస్థ చెప్తోంది. ఈ వైరస్.. సిస్టమ్ లో పనిచేసే సుమారు 24 రకాల సెక్యూరిటీ విభాగాలను దాటి వ్యాపించగలదని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. మనం వాడే కంప్యూటర్, లేదా మొబైల్ యాండ్రాయిడ్ పరికరాల్లోని వేటిలోనైనా ప్రవేశించి అందులోని సమాచారాన్ని చోరీ చేయగల శక్తి ఈ వైరస్ కు ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ను ఇప్పటికే అమెరికాలోని పలు సైబర్ దాడుల్లో వినియోగించినట్లు సంస్థ తెలుపుతోంది. స్కైప్ వినియోగించేందుకు explorer.exe పేరుతో వచ్చే ఫైల్స్ ను నమ్మొద్దని సంస్థ హెచ్చరిస్తోంది. దీన్ని వీడియో ఫైల్స్ ను తస్కరించేందుకు హ్యాకర్లు వాడుతున్నట్లు పాలో ఆల్టో నెట్వర్కింగ్ సంస్థ చెబుతోంది. -
భారత్‌లో సగం సమయం యాప్స్‌కే!
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్‌ను ఉపయోగించిన సమయంలో సగం సమయాన్ని యాప్స్(అప్లికేషన్స్)కే కేటాయిస్తున్నారట. ఫోన్‌ను వాడుతున్నప్పుడు 47 శాతం సమయం వాట్స్‌యాప్, వీ చాట్, హైక్, స్కైప్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌పైనే గడుపుతున్నారట. స్వీడిష్ టెలికం కంపెనీ ‘ఎరిక్సన్’ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో 7,500 మందితో పాటు జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు. స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న భారతీయులు ఎక్కువగా వాయిస్, ఇన్స్టంట్ మెసేజింగ్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(స్కైప్ వంటివి), ఈ-మెయిల్స్, సోషల్ నెట్వర్కింగ్(ఫేస్బుక్ వంటివి)పైనే దృష్టి పెడుతున్నారని ఈ సర్వేలో తేలింది. అదేవిధంగా కమ్యూనికేషన్ యాప్స్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచేందుకు గాను మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ వినియోగం మీద యూజర్లు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, భారత్ లలో కలిపి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 30 శాతం సమయాన్ని కమ్యూనికేషన్ యాప్స్‌పైనే కేటాయిస్తున్నారు. -
స్కైప్ కాల్స్‌కు ఎయిర్టెల్ చార్జీ
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ మొబైల్ డేటా ప్యాకేజీలు ఉపయోగించుకుని స్కైప్, వైబర్ తదితర యాప్స్ ద్వారా కాల్స్ చేసుకునే వారు ఇకపై మరింత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత డేటా ప్యాకేజీలలో చేర్చకుండా వాయిస్ కాల్స్ ఓవర్ ఇంటర్నెట్ (వీఓఐపీ)కి విడిగా చార్జీలు వసూలు చేయాలని ఎయిర్టెల్ నిర్ణయించడం ఇందుకు కారణం. డిస్కౌంటు రేటుతో లభించే ఇంటర్నెట్ ప్యాక్‌లు కేవలం బ్రౌజింగ్కి మాత్రమే పనిచేస్తాయని, వీఓఐపీ వీటిలో భాగం కాబోదని ఎయిర్టెల్ తమ వెబ్సైట్లో పేర్కొంది. వీఓఐపీ వినియోగించుకునే వారు 10 కేబీకి/4 పైసలు (3జీ సర్వీసులకు), 10 కేబీకి/10 పైసలు (2జీ సర్వీసులకు) ప్రామాణిక డేటా రేటు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇలా వీఓఐపీ డేటాకు విడిగా చార్జీలు విధించడం దేశీయంగా ఇదే తొలిసారి. దీని కోసం త్వరలో ప్రత్యేక ప్యాక్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నామని ఎయిర్టెల్ వివరించింది. వాట్స్‌యాప్, లైన్, స్కైప్ వంటి ఇంటర్నెట్ ఆధారిత సర్వీసుల సంస్థలను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలంటూ మొబైల్ ఆపరేటర్లు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. -
ఊరొచ్చిన స్కైప్
సౌదీలో ఉన్న భర్త మొహం చూడాలంటే మూడేళ్లు..ఒక్కోసారి ఐదేళ్ల వరకూ ఎదురుచూడాలి. బంగ్లాదేశ్‌లోని పల్లెటూళ్ల మహిళలు పడుతున్న కష్టాల్లో ఇదొకటి. ఇప్పుడా కష్టం తీరిపోయింది. డీనెట్ కంపెనీవారు చేసిన ఓ సరికొత్త ప్రయోగంతో పల్లెమహిళల కళ్లలో మెరుపులు మెరుస్తున్నాయి. పొద్దునే పదకొండుగంటలకల్లా స్కూటీలపై అమ్మాయిలు లాప్‌టాప్‌లు పట్టుకుని పల్లెటూళ్లకు వెళతారు. వీళ్లని ‘ఇన్ఫో లేడీస్’ అని పిలుస్తున్నారు. కూలిపనులు, వ్యవసాయ పనులు చేసుకునే మహిళలు కనిపించగానే బండి ఆపి లాప్టాప్ ఓపెన్ చేస్తారు. దాంతో ఎక్కడో దుబాయ్‌లో ఉన్న భర్తను స్కైప్‌లో చూసుకుని ఆనందపడిపోతారు పల్లె మహిళలు. స్కైప్‌ని వాడుకున్న మహిళ దగ్గర గంటకు వంద రూపాయలచొప్పున తీసుకుంటున్నారు. వారానికి రెండుసార్లు చొప్పున ఒకో పల్లెకి తిరుగుతున్న డీనెట్ ఉద్యోగినులను కంపెనీ మాత్రమే కాదు ప్రతి పల్లె మహిళా మెచ్చుకుంటోంది. అవును మరి...ఐటి ఉద్యోగం అంటే ఎంచక్కా ఏసీ రూముల్లో కూర్చుని పనిచేయడం అనుకుంటారు కాని ఇలా ఎండనకా, వాననకా స్కూటీలపై పల్లెటూళ్లలో తిరగడం కాదు కదా! కాని డీనెట్ ఉద్యోగినులు మాత్రం తమ సేవల్ని పల్లెమహిళలకు అందుబాటులోకి తేవడంలో ఉండే ఆనందం వేరంటారు. ఇక్కడ లాప్టాప్లో తన భర్తతో మాట్లాడుతున్న 45 ఏళ్ల మహిళ జరబర్షా మాటల్లో చెప్పాలంటే..‘నా భర్తను చూసి ఆరేళ్లు దాటింది. ఈ కంప్యూటర్ అమ్మాయి పుణ్యాననా భర్తను కళ్లతో చూసుకోగలిగాను. కంప్యూటర్ వాడకం ఎక్కడో పట్టణంలో ఉన్నవారికే సొంతమనుకునేవాళ్లం. ఇప్పుడు మాకు కూడా తెలిసినందుకు చాలా గర్వంగా ఉంది’ అని అంటోందామె. ఈ ఇన్ఫో లేడీస్ ఒక్క స్కైప్ మాత్రమే కాదు ప్రభుత్వ పథకాల గురించి కూడా పల్లె మహిళలకు వివరంగా చెబుతున్నారు. -
14న వాలెంటైన్స్ డే... ‘యాప్స్’తో ‘గ్యాప్స్’ దూరం
ముంబై: దూరపు సంబంధాలను కొనసాగించడం అంత తేలికైన విషయమేమీ కాదనేది బహిరంగ రహస్యమే. మొబైల్ అప్లికేషన్స్.. టూకీగా యాప్స్ అందుబాటులోకి వచ్చాక దూరమనే మాటకు అర్థమే లేకుండాపోయింది. ఇంకా చెప్పాలంటే దూరం అనేది ఇప్పుడు బాగా దగ్గరైపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ విషయాన్ని అంతా మరచిపోయారు కూడా. జేబుకు కొంచెం కూడా చిల్లుపడకుండానే అంతా సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. అందరితోనూ బంధాలను కొనసాగిస్తున్నారు. ఒకరికొకరు దూరంగా ఉంటున్న దంపతులు సైతం స్కైప్, వైబర్, వాట్స్ అప్ వంటి వాటిపై విపరీతంగా ఆధార పడుతున్నారు. ఈ యాప్స్‌ద్వారా ఒకరితో మరొకరు నిరంతరం అనుసంధానమవుతున్నారు. పరిస్థితుల కారణంగా ఎంతోదూరంగా ఉంటున్నప్పటికీ కలిసే ఉంటున్నామనే భావన వారిని ఆనంద తీరాలకు చేరుస్తోంది. ఇటీవల పెళ్లయిన నగరానికి చెందిన అక్షితా జైన్ ఈ విషయమై మాట్లాడుతూ ‘సందేశాలు పంపడం, వీడియో కాలింగ్, ఫొటోస్ షేరింగ్ వంటి వాటి వల్ల మేమిరువురం నిరంతరం ఒకరి పక్కన మరొకరు ఉన్నామనే భావన కలుగుతోంది. ఈ భావన సంతోషంగా జీవించేందుకు దోహదపడుతోంది. అత్యంత చేరువలో ఉన్నట్టు అనిపిస్తోంది. రెండు వేర్వేరు నగరాల్లో విధి నిర్వహణలో ఉన్నప్పటికీ ఈ యాప్స్ వల్ల మేమిరువురం పక్కపక్కనే ఉన్నామనే భావనను కలిగిస్తున్నాయి. మా ఇద్దరి మధ్య అనుబంధాన్ని తేలికపరిచింది’ అంది. నగరానికి చెందిన మరో యువతి షాలినీ ఝా గుజరాత్‌కు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడిపోయింది. వీరిరువురు నిరంతరం ఈ యాప్స్‌ద్వారా ప్రేమమాధుర్యాన్ని పంచుకుంటున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నా ఈ యాప్స్ కారణంగా వారి మధ్య దానితాలూకూ ఇబ్బందేమీ ఎదురుకావడం లేదు. ‘మేమిరువురం స్కైప్ యాప్‌ని బాగా వినియోగిస్తాం. మాట్లాడుకున్నా లేదా పోట్లాడుకున్నా సమస్తం అందులోనే. రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటలపాటు మాట్లాడుకుంటూనే ఉంటాం. మా జేబులకు పెద్దగా చిల్లు పడదు. మొబైల్‌ను రీచార్జ్ చేయలేదని దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు. సుదీర్ఘ సంభాషణలు, అత్యంత తక్కువ ఖర్చు. ఈ కారణంగానే మేము స్కైప్ యాప్‌ని బాగా వినియోగిస్తాం’ అంటూ తన ఆనందాన్ని మాటల రూపంలో వ్యక్తంచేసింది. స్కైప్ అనే యాప్... వీడియో కాల్ చేసుకునేందుకు, వైబర్ అనే యాప్ అంతర్జాతీయ కాల్స్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక వాట్స్ అప్‌లో అయితే సందేశాలను పంపుకోవడంతోపాటు చిత్రాలను పంచుకోవ చ్చు కూడా. ఐ ఫోన్, ఆండ్రాయిడ్, ఐ ప్యాడ్, బ్లాక్ బెర్రీ ఫోన్లు వైబర్ యాప్‌ను వినియోగించుకునేందుకు వీలవుతాయి. దీంతోపాటు నోకియా విండోస్ వంటి మొబైళ్లకు కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. ఎంతో ఉపయుక్తం యాప్స్ విషయమై నగరానికి చెందిన ప్రియాసూద్ మాట్లాడుతూ ‘తాజాగా మార్కెట్లోకి వస్తున్న మొబైల్ యాప్స్... ప్రేమికులు, దంపతులకు ఎంతో అనువుగా ఉంటాయి. విపరీతమైన పనిభారంలో మునిగిపోయి ఉన్నప్పటికీ వాట్స్ అప్ ద్వా రా ఓ స్మైల్ ఐకాన్‌ను పంపవచ్చు. ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇదొక మంచి ఆయుధం మాదిరిగా పనిచేస్తుంది. సత్సంబంధాలను కొనసాగించేం దుకు దోహదపడుతుంది’ అని అంది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉంటున్న తన జీవిత భాగస్వామిని వైబర్ ద్వారా సంభ్రమాశ్చర్యాలకు గురిచేయాలనేది ప్రియ ఆలోచన. తక్షణమే సందేశం ఇదే విషయమై వైబర్ ఇండియా కంట్రీ మేనేజర్ అనుభవ్ నయ్యర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల్లో నివసించేవారికి త క్షణమే సందేశాన్ని చేరవేసేందుకు వైబర్ దోహదపడుతుందన్నారు. ‘నా స్నేహితుల్లో ఒకడు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నాడు. ఈ-మెయిల్స్, చాట్లకంటే వైబర్నే ఇప్పుడు అతను అత్యధికంగా వినియోగిస్తున్నాడు. తనంటే ఇష్టపడేవారితో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తున్నాడు. వైబర్ యాప్ అందుబాటులోకి వచ్చాక సమాచారం చేరవేత అత్యంత సులభతరంగా మారిపోయింది. మొబైళ్లతోపాటు డెస్క్టాప్లద్వారా నిరంతరం అందరితోనూ సంబంధాలను కొనసాగించడం అత్యంత సులువైపోయింది’ అని అన్నారు. ఇదిలాఉంచితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన కపుల్ అనే యాప్ సుదూర బంధాలను అత్యంత చేరువ చేసింది. శుక్రవారం వాలెంటైన్స్ డే జరగనుంది.