మొదటిసారి స్కైప్‌లో
► స్కైప్ ద్వారా విడాకులు తీసుకున్న పూణె జంట
పూణె: అందరూ కలవడానికి ఉపయోగపడే స్కైప్ ఓ జంట విడిపోవడానికి కూడా ఉపయోపడింది. వివరాల్లోకి వెళ్తే పూణె సివిల్ కోర్టులో ఓ జంట తమకు విడాకులు కావాలని స్కైప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన యువతీ యువకులు ఒకే కళాశాల్లో చదివి, ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నారు. అయితే నెలరోజుల్లోనే ఇద్దరికి వేరు వేరు దేశాల్లో ఉద్యోగాలు రావడంతో ఉద్యోగ రీత్యా ఆయా దేశాలకు వెళ్లిపోయారు.
భర్త సింగపూర్‌కు వెళ్లగా, భార్య లండన్‌లో ఓప్రవేటు కంపెనీలో ఉద్యోగానికి వెళ్లింది. దీంతో ఇద్దరు కలిసి ఉండటానికి అవకాశం లేకపోవడంతో విడాకులు కోరుతూ 2016లో కోర్టును ఆశ్రయించారు. వీరి తరపు న్యాయవాదిగా సుచిత్ మందడా కోర్టుకు హాజరయ్యారు. పరిస్థితుల కారణంగా ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేకపోయారని న్యాయమూర్తికి విన్నవించారు. పరస్పర అంగీకారంతో స్కైప్ వీడియో కాన్ఫరెన్స్‌లో విడాకులు కావాలని న్యాయమూర్తిని కోరారు. వీరి వాదనలు అంగీకరించిన న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది.