లవర్స్‌కి స్కైప్ బంపర్ ఆఫర్‌! | Skype lets you create video messages for your loved ones this Valentines Day | Sakshi
Sakshi News home page

లవర్స్‌కి స్కైప్ బంపర్ ఆఫర్‌!

Published Sat, Feb 13 2016 4:09 PM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

లవర్స్‌కి స్కైప్ బంపర్ ఆఫర్‌! - Sakshi

లవర్స్‌కి స్కైప్ బంపర్ ఆఫర్‌!

'వాలెంటైన్స్ డే' సందర్భంగా ప్రేమికులకు వీడియో కాలింగ్ సర్వీస్‌ సంస్థ స్కైప్‌ సరికొత్త ఆఫర్ ఇచ్చింది. ప్రేమికుల రోజున తమ మనస్సులోని ప్రేమను నచ్చినవారితో పంచుకోవడానికి సరికొత్త వీడియోకార్డ్‌ సర్వీసును అదనంగా జోడీచింది.

తమకు నచ్చినవారి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ సొంతంగా వీడియోను రికార్డ్‌ చేసి.. దానిని ఎగిరే హార్ట్‌ సింబల్స్‌ యానిమేషన్‌తో అందంగా తీర్చిదిద్దుకొనే అవకాశం కల్పించింది. ఇంకా ఉత్తమమైన అంశం ఏమిటంటే ఈ వీడియోను స్కైప్‌లోనే కాదు.. ఫేస్‌బుక్‌, జీమెయిల్‌ వంటి ఇతర వేదికల్లోనూ తమకు నచ్చినవారితో పంచుకోవచ్చు. ఎదుటివ్యక్తి స్కైప్‌ యూజర్‌ కాకపోయినా.. ఇతర ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఈ వీడియోను షేర్‌ చేయవచ్చు.

ఐఫోన్‌, ఐప్యాడ్‌ లలో స్కైప్ యాప్‌ ఓపెన్ చేయగానే హార్ట్ సింబల్‌ కనిపిస్తుంది. దీనిని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో రికార్డ్ చేయవచ్చు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో '+' బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా హార్ట్‌ గుర్తును సెలక్ట్ చేసుకొని ఈ వీడియోను రికార్డు చేయవచ్చు. ఈ వీడియోను స్కైప్‌లోనే కాదు ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియాలోనూ, డెస్క్ టాప్‌ లోనూ షేర్‌ చేసుకోవచ్చునని ఆ సంస్థ తెలిపింది. ఆదివారం వస్తున్న ఈ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రత్యేకంగా స్కైప్ ఎన్నో ఫీచర్స్‌ను అందిస్తోంది. అందులో భాగంగా అందిస్తున్న ఈ వీడియోకార్డ్స్ ఫీచర్‌ 48 గంటలపాటు అందుబాటులో ఉండనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement