గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్ | Meet Google Duo, a simple 1-to-1 video calling app for everyone | Sakshi
Sakshi News home page

గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్

Published Wed, Aug 17 2016 12:31 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్ - Sakshi

గూగుల్ నుంచి వీడియో కాలింగ్ యాప్

న్యూఢిల్లీ: ఫేస్‌టైమ్, స్కైప్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌కి పోటీ గా టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా డ్యువో పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరే టింగ్ సిస్టమ్‌ల ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో ఇది పనిచేస్తుంది. వీడియో కాలింగ్‌ను మరింత సులభతరం చేసే ఈ యాప్‌ను మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ అందుబాటులోకి తేనున్నట్లు గూగుల్ గ్రూప్ ప్రోడక్ట్ మేనేజర్ అమిత్ ఫులే తెలిపారు. విడిగా యూజర్‌నేమ్/అకౌంట్ లాంటివి అక్కర్లేకుండా యూజర్లు తమ ఫోన్ నంబర్‌నే ఉపయోగించి డ్యువో ద్వారా వీడియో కాల్ చేయొచ్చని వివరించారు. తక్కువ బ్యాండ్‌విడ్త్‌లోనూ మెరుగ్గా పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దినట్లు అమిత్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement