సర్వేలో డేటా ఎంట్రీ చాలా కీలకం
రాంచీ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న సామా జిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహ రించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ దశలో డేటా ఎంట్రీ చాలా ముఖ్యమైనదని, ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉన్న ఆయన అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు మిగిలిన ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. సర్వే జరిగిన క్రమంలో పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల డోర్‌లాక్ ఉండటం, ఇంటివద్ద అందుబాటులో లేకపోవడం లాంటి సమస్యలు వచ్చాయని, వారి వివరాలను ఫోన్ ద్వారా.. లేదంటే నేరుగా కలిసి సేకరించాలని కోరారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వెళ్లిన వారి వివరాలను కూడా జాగ్రత్తగా క్రమబద్ధీకరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment