స్కైప్ పాత వెర్షన్లు తీసేస్తున్నారు
స్కైప్ పాత వెర్షన్లు తీసేస్తున్నారు
Published Sat, Feb 4 2017 3:36 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
న్యూయార్క్ :
కంప్యూటర్లు, టాబ్లెట్లు, మొబైల్ పరికరాల్లో ఇంటర్నెట్ ద్వారా వీడియో చాట్, వాయిస్ కాల్స్ సర్వీసులు అందించడంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన టెలికమ్యూనికేషన్ సాధనం స్కైప్. ఇంత పాపులారిటీ పొందిన ఈ స్కైప్ను ప్రస్తుతం కొన్నింటికీ తీసేస్తున్నారట. విండోస్ డెస్క్టాప్ లకు వాడే స్కైప్ 7.16 వెర్షన్లో ఇక లాగిన్ కావడం అసాధ్యంగా మారబోతుందట. మార్చి 1 నుంచి స్కైప్ 7.16 వెర్షన్ను మైక్రోసాప్ట్ తీసేస్తున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా మ్యాక్లకు వాడే స్కైప్ 7.18 వెర్షన్లోకి కూడా యూజర్లు లాగిన్ కాలేరని రిపోర్టులు పేర్కొంటున్నాయి. వెంచర్ బీట్ రిపోర్టు ప్రకారం ఈ రెండు వెర్షన్లు 2015 డిసెంబర్లో అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ ఈ రెండు వెర్షన్లు వాడుతున్న యూజర్లైతే, కొత్తగా అప్డేట్ అవ్వాల్సి ఉందని స్కైప్ టీమ్ శుక్రవారం తన బ్లాక్ పోస్టులో తెలిపింది. స్కైప్ను మెరుగుపరుస్తున్న మైక్రోసాప్ట్ ఈ వెర్షన్లలో వివిధ రకాల మార్పులను తీసుకొస్తోంది.
Advertisement
Advertisement