
ఎవ్వరిని ఉగ్రవాదం వైపు వెళ్లమనలేదు: జకీర్
సౌదీ అరేబియా: ఉగ్రవాదాన్ని తాను ఏ మాత్రం సమర్థించబోనని వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ చెప్పారు. ఇస్లాం శాంతి కోరుకుంటుందని అన్నారు. ఫ్రాన్స్ లో జరిగిన దాడులను తాను ఖండిస్తున్నాని చెప్పారు. అమాయకులపై దాడులు సరికాదని అన్నారు.
ఏ ఒక్క ఉగ్రదాడిలో కూడా తన పాత్ర లేదని వివరించాడు. దేశంలో ముస్లింలను రెచ్చగొట్టేలా జకీర్ నాయక్ ప్రసంగాలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు స్కైప్ ద్వారా వివరణ ఇస్తానని చెప్పిన ఆయన సౌదీ నుంచి స్కైప్ ద్వారా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదం వైపు ముస్లింలు వెళ్లాలని తాను చెప్పలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తాను ఎప్పుడూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని వివరణ ఇచ్చారు.