
మైసూరు: విదేశీ మహిళపై అత్యాచారం చేసిన కేసులో దోషికి 25 ఏళ్ల జైలుశిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ మైసూరు ఏడవ జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. స్కైప్ (వీడియో కాలింగ్ యాప్) ద్వారా ఈ కేసు విచారణ జరగడం విశేషం. ఆదివాసీల జీవనంపై అధ్యయనం చేయడానికి 2015లో అమెరికా నుంచి ఓ మహిళ మైసూరుకు వచ్చింది. ఆమె ఆరోగ్యం బాగోలేక మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. చికిత్స అందించే నెపంతో అక్కడ పనిచేస్తున్న సుమిత్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం మహిళ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఘటనపై ఫిర్యాదు చేసి స్వదేశానికి వెళ్లిపోయింది. కేసు నమోదవడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అధికారులు అప్పటి నుంచి స్కైప్ ద్వారా బాధిత మహిళ నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. నేరం రుజువు కావడంతో నిందితుడు సుమిత్‌కు న్యాయస్థానం శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment