‘రేపు స్కైప్ ద్వారా వస్తాడంట’
ముంబయి: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రేపు మీడియా ముందుకు వస్తానని చెప్పాడు. స్కైప్ ద్వారా తాను మీడియాతో మాట్లాడతానని బుధవారం ఒక ప్రకటనలో తెలిపాడు. జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించిన ఆయనపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల కన్నుపెట్టారు. ఆయన చేసిన ప్రసంగాలన్నింటిని కూడా కేంద్ర, రాష్ట్ర అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అతడు భారత్ కు రాగానే వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావించగా ప్రస్తుతం ఇండియాకు రాకుండా జకీర్ ఆగిపోయాడు. అయితే, తనకు ఆఫ్రికా పర్యటన ఖరారైందని, తానేం పారిపోవడం లేదని, తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పాడు. గురువారం నాటి ప్రెస్ కాన్ఫెరెన్స్ ద్వారా బాలీవుడ్, న్యాయ, ఎన్జీవోవంటి ఆయా విభాగాల్లో ప్రముఖులైన వారితో కూడా మాట్లాడతానని మరోమాటగా చెప్పాడు.