zakir naik
-
Malaysia PM: సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్ నాయక్‌ను అప్పగిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించే విషయంలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సానుకూలంగా స్పందించారు. అతడిపై వచ్చిన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్‌కు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. భారత్‌లో పర్యటిస్తున్న ఇబ్రహీం బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా మలేషియాలో జకీర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ దేశ భద్రతకు జకీర్ వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనంతవరకు, ఎలాంటి సమస్యలు రానంత వరకు అతడి విషయంలో తాము కలుగజేసుకోబోమని తెలిపారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టప్రకారం భారత్ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. -
చిన్నవాళ్లం... భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం!
కౌలాలంపూర్: భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం కాదని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్(94) వ్యాఖ్యానించారు. వాణిజ్యపరంగా భారత్‌తో ఏర్పడ్డ విభేదాలను అధిగమించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత కొన్ని నెలలుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మలేషియా ప్రధాని మహతీర్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబరులో ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో మహతీర్ మాట్లాడుతూ.. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్నారు. కశ్మీరీ లోయ దురాక్రమణకు గురైందని.. ఇది చాలా తప్పుడు చర్య అని భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని భారత్‌కు చెందిన ప్రముఖ ఆయిల్ ప్రాసెసర్ సంస్థలు నిర్ణయించాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారుగా ఉన్న భారత్ తాజా నిర్ణయంతో మలేషియా తీవ్రంగా నష్టపోతోంది. దాదాపు 10 శాతం మేర ఎగుమతులు పడిపోయాయి. ఇప్పటికిప్పుడు నూతన దిగుమతిదారు దొరక్కపోవడంతో మలేషియా వాణిజ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో లంగ్వావీలో సోమవారం విలేకరులతో మాట్లాడిన మహతీర్... తమ పామాయిల్ ఉత్పత్తులను భారత్ బాయ్‌కాట్ చేసినంత మాత్రాన తాము ప్రతీకార చర్యలకు దిగబోమన్నారు. ‘మేం చాలా చిన్నవాళ్లం. ప్రతీకారం తీర్చుకోలేం. అయితే దీనిని అధిగమించడం లేదా ఇందుకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనే మార్గాలు అన్వేషిస్తున్నాం’ అని పేర్కొన్నారు. (ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మలేషియా ప్రధాని) అదే విధంగా సీఏఏ ప్రవేశపెట్టడం సరైంది కాదని మరోసారి అభిప్రాయపడ్డారు. ఇక పరారీలో ఉన్న వివాదాస్పద మత ప్రబోధకుడు జాకీర్ నాయక్ అప్పగింత విషయంలోనూ భారత్- మలేషియాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడటం, విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జాకీర్ నాయక్.. ప్రస్తుతం మలేషియాలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జాకీర్‌ను అప్పగించాల్సిందిగా భారత్ ఎన్నిసార్లు విఙ్ఞప్తి చేసినప్పటికీ మలేషియా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జాకీర్‌ను విచారిస్తామని భారత్ చెప్పినప్పటికీ... అతడికి చెడు తలపెట్టే అవకాశాలు ఉన్నాయన్న మహతీర్.. జాకీర్‌ను భద్రంగా చూసుకుంటూ.. అతడికి ఎటువంటి హాని తలపెట్టని దేశం (భారత్ కాకుండా)ఉందని భావించినపుడు మాత్రమే అతడిని తమ దేశం నుంచి బయటకు పంపించగలమని పేర్కొన్నారు. -
మలేషియా పీఎం కంటే మోదీనే ఎక్కువ ఇష్టం!
కౌలాలంపూర్: ప్రస్తుతం మలేషియాలో తలదాచుకుంటున్న వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఆ దేశంలోని హిందువులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. మలేషియా హిందువులను కించపరిచిన జకీర్‌ను వెంటనే భారత్‌కు అప్పగించాలని డిమాండ్ వెల్లువెత్తుతున్నప్పటికీ.. మలేషియా ప్రధాని మాత్రం దానిని తోసిపుచ్చారు. జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగిస్తే.. ఆయనకు ముప్పు వాటిల్లుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మలేషియా హిందువులు తమ దేశ ప్రధాని కంటే భారత ప్రధాని నరేంద్రమోదీకే ఎక్కువ విధేయంగా ఉంటున్నారని జకీర్ నాయక్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై మలేషియా మానవ వనరులశాఖ మంత్రి ఎం కులశేఖరన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనను వెంటనే భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. మలేషియా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని.. స్థానిక కమ్యూనిటీలపై అనుమానాలు లేవనెత్తేలా మాట్లాడే హక్కు జకీర్‌కు లేదని కులశేఖరన్ తేల్చిచెప్పారు. అయితే, ఆయనను భారత్‌కు అప్పగించాలన్న డిమాండ్‌ను తిరస్కరించిన మలేషియా ప్రధాని మహాథిర్ బిన్ మహమ్మద్.. వేరే ఇతర దేశాలు కోరుకుంటే.. ఆయనను పంపిస్తామని చెప్పారు. ఉగ్రసంస్థలకు నిధులు అందించడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ ప్రస్తుతం మలేషియాలో పర్మనెంట్ రెసిడెంట్‌గా తలదాచుకుంటున్నాడు. అతన్ని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. -
జకీర్ నాయక్‌పై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌పై ఈసీ తొలిసారిగా నేరుగా అభియోగపత్రం దాఖలుచేసింది. రూ. 193 కోట్ల నల్లధనాన్ని జకీర్ నాయక్ అక్రమంగా రవాణా చేశారనీ, అలాగే భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ అక్రమంగా స్థిరాస్తులను సంపాదించారని జకీర్ నాయక్‌పై ఈడీ అభియోగాలు మోపింది. అలాగే నాయక్ చేసిన పలు ద్వేష ప్రసంగాల వల్ల అనేకమంది ముస్లిం యవకులు చట్టవ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడటం, ఉగ్రవాదులుగా మారడం జరిగిందని ఈడీ పేర్కొంది. జకీర్ ఆలోచనల వల్ల సమాజంలోని వివిధ మతాల ప్రజల మధ్య సామరస్యం దెబ్బతిన్నదనీ, వారి మధ్య విద్వేషం రగిలిందని ఈడీ తెలిపింది. -
జకీర్ నాయక్‌కు మరో భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉగ్రదాడికి ప్రేరేపించాడన్న ఆరోపణలతో చార్జ్ షీట్ నమోదు చేసింది. అలాగే అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని ముంబై కోర్టులో దాఖలు చేసిన ఫైలింగ్‌లో ఈడీ వెల్లడించింది. 22మందికి మృతికి కారణమైన జకీర్‌కు సంబంధించి మొత్తం రూ.193 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్టు ఈడీ తెలిపింది. అతని కుటుంబ సభ్యులనుంచి నుంచి రూ .73.12 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఇప్పటికే రూ .50.46 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసిన ఈడీ చార్జిషీట్‌ను నమోదు చేసినట్టు తెలిపింది. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ పెట్టుబడులు పెట్టాడని ఈడీ ఆరోపించింది. అలాగే దుబాయ్‌లోనని ముఖ్యమైన ప్రదేశంలోఒక పెద్ద భవనాన్ని నిర్మించతలపెట్టాడని పేర్కొంది. దీంతో పాటు చెన్నైలోని ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్, ముంబై, పూణెలలో అతి ఖరీదైన ఫ్లాట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆస్తులను కలిగి వున్నాడని ఈడీ తెలిపింది. కాగా ఉగ్రవాదులతో సంబంధాలు, మనీలాండరింగ్ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌పై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. ఇటీవల శ్రీలంలో రాజధాని కొలంబో వరుస పేలుళ్ల ఘటనలో జకీర్ నాయక్ ప్రమేయం అంశాన్ని ఎన్ఐఏ పరిశీలిస్తోంది. మరోవైపు దుబాయ్ కేంద్రంగా ప్రసారాలు జరుగుతున్న జకీర్ నాయక్‌కు చెందిన పీస్ టీవీలో తన బోధనల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పీస్ టీవీని శ్రీలంకలో నిషేధించారు. ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్‌లు ఈ ఛానెల్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
మలేసియా ప్రధానితో జకీర్ నాయక్ భేటీ
కౌలాలంపూర్: భారత్‌కు చెందిన వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్‌నాయక్ మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్‌ను కలిశారు. ఉగ్ర కార్యకలాపాలు, మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులు ఉండటంతో ఆయన్ను అప్పగించాలని మలేసియా ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. అయితే, ఆయన్ను పంపబోమని ప్రధాని మహతీర్ శనివారం ప్రకటించడం తెల్సిందే. ప్రధాని మహతీర్‌తో జకీర్ సంక్షిప్త భేటీలో ఏం మాట్లాడారన్న విషయం వెల్లడికాలేదు. అయితే, మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార పార్టీ సమర్ధించిందని మీడియా తెలిపింది. జకీర్‌నాయక్‌కు మలేసియాలో శాశ్వత నివాస హోదా ఉంది. దాని ప్రకారం అక్కడి చట్టాలను ఉల్లంఘించనంత వరకు నివాసం ఉండే హక్కు ఉంటుంది. భారత్ కోర్టుల్లో జకీర్‌పై నేరారోపణలు నమోదయితేనే రెండు దేశాల మధ్య ఉన్న నేరస్తుల మార్పిడి ఒప్పందం అమల్లోకి వస్తుందని ఆయన లాయర్ షహరుద్దీన్ తెలిపారు. జకీర్ విషయంలో ప్రధాని‡ నిర్ణయం సరైందేనని అధికార పార్టీ తెలిపింది. -
జకీర్‌ను అప్పగించం: మలేసియా
కౌలాలంపూర్: వివాదాస్పద ఇస్లాం ప్రబోధకుడు జకీర్ నాయక్(52)ను భారత్‌కు అప్పగించబోమని మలేసియా ప్రధానమంత్రి మహతీర్ బిన్ మొహమ్మద్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన ఓ మీడియా సమావేశంలో మహతీర్ మాట్లాడుతూ.. ‘జకీర్ మలేసియాలో శాశ్వత నివాసహోదా కలిగిఉన్నారు. జకీర్‌తో ఎలాంటి సమస్యలు రానంతవరకూ ఆయన్ను భారత్‌కు అప్పగించబోం’ అని స్పష్టం చేశారు. అక్రమ నగదు చెలామణితో పాటు విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌ను తమకు అప్పగించాలని గత జనవరిలో ప్రభుత్వం మలేసియాను కోరింది. 2016, జూలైలో భారత్ నుంచి వెళ్లిపోయిన జకీర్.. తనపై విచారణ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం కలిగినప్పుడే దేశానికి తిరిగివస్తానని ఇంతకుముందు ప్రకటించారు. -
‘జకీర్‌ను అప్పగించే ప్రసక్తే లేదు’
పుత్రజయ, మలేషియా : వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ అప్పగింత విషయంలో భారత్‌కు మలేషియా షాకిచ్చింది. జకీర్‌ను భారత్‌కు అప్పగించే ప్రసక్తే లేదని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ శుక్రవారం స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘జకీర్ మలేషియాలో శాశ్వత నివాస హోదా కలిగి ఉన్నారు. ఆయన వల్ల మాకు సమస్యలు రానంత వరకు దేశం విడిచి వెళ్లాలంటూ ఒత్తిడి చేయలేమని’ మహతీర్ వ్యాఖ్యానించారు. కాగా మలేషియాలో నివాసముంటున్న జకీర్‌ను అప్పగించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ మలేషియా ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. అప్పగింత ఒప్పందంలో భాగంగా గత జనవరిలో భారత్ చేసిన అభ్యర్థనకు మలేషియా సానుకూలంగా స్పందిస్తుందంటూ విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధానే స్వయంగా ఈ విషయమై స్పష్టతన్విడం గమనార్హం. అవన్నీ అవాస్తవాలు.. ఆర్థిక ఉల్లంఘనలతో పాటు మత విద్వేషాలకు పాల్పడుతున్నారని జకీర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా కొద్ది రోజులుగా.. జకీర్ భారత్‌కు తిరిగి వస్తున్నారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ‘భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగినప్పుడే భారత్‌కు తిరిగి వస్తాను. అంతవరకు ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేరంటూ’ జకీర్ పేర్కొన్నారు. -
జకీర్‌పై రెడ్‌కార్నర్ నోటీస్‌కు ఇంటర్‌పోల్ నో
న్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌ను ఏ దేశంలోనైనా అరెస్ట్ చేసేలా రెడ్ కార్నర్ నోటీస్ జారీచేయాలన్న భారత విజ్ఞప్తిని ఇంటర్‌పోల్ శనివారం తిరస్కరించింది. అస్పష్ట ప్రకటనలు, ఆరోపణలతో జకీర్‌పై అభియోగాలు మోపడంతో పాటు ఆయనపై పోలీసులు ఇప్పటివరకూ ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ఇంటర్‌పోల్ భారత విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జకీర్‌కు సంబంధించి తమతో పాటు భారత్ పంపిన వివరాలను అన్ని దేశాలు తమ డేటాబేస్‌ల నుంచి తొలగించాలని ఇంటర్‌పోల్ ఆదేశించింది. -
జకీర్ అప్పగింతపై మలేసియాను సంప్రదిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ అప్పగింతపై మలేసియాను సంప్రదిస్తామని విదేశాంగశాఖ తెలిపింది. జకీర్ ఐదేళ్ల క్రితమే శాశ్వత నివాస హోదా పొందారనీ, ఆయన అప్పగింతపై భారత్‌నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని మలేసియా ఉపప్రధాని ఆ దేశ పార్లమెంటులో ప్రకటించిన కొద్ది రోజులకే భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయమై విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించాలని మలేసియాను కోరేముందు చేపట్టాల్సిన న్యాయప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అతి త్వరలోనే ఆయన్ను భారత్‌కు అప్పగించాల్సిందిగా మలేసియాను కోరతాం’ అని పేర్కొన్నారు. ఆర్థిక ఉల్లంఘనలతో పాటు మత విద్వేషాలకు పాల్పడుతున్నారని జకీర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
జకీర్‌కు మలేసియా ఆశ్రయం
కౌలాలంపూర్: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ (52)కు మలేసియా ప్రభుత్వం శరణార్థిగా దేశంలోకి అనుమతించింది. ఇక్కడి పుత్ర మసీదు(మస్జీద్ పుత్ర) నుంచి జకీర్ తన అంగరక్షకుడితో కలిసి బయటికొస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ మసీదులోనే ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ సహా పలువురు కేబినెట్ మంత్రులు ప్రార్థనల్లో పాల్గొంటారు. 2018, జూన్‌లో జరిగే ఎన్నికల్లో దేశంలోని మెజారిటీ మలయా ముస్లింల ఓట్లను దక్కించుకునేందుకు రజాక్ ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయమై ఆ దేశ ఉపప్రధాని అహ్మద్ జహీద్ పార్లమెంటులో మాట్లాడుతూ.. జకీర్ ఐదేళ్ల క్రితమే మలేసియాలో శాశ్వత నివాసం కోసం అనుమతి పొందారని తెలిపారు. జకీర్ అప్పగింతపై భారత్ నుంచి ఎలాంటి విజ్ఞప్తులు అందలేదన్నారు. -
జకీర్ నేరాలపై 58 పేజీలతో...
సాక్షి, ముంబై : వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మొత్తం 58 పేజీలతో కూడిన ఛార్జ్-షీట్‌ను దాఖలు చేసింది. జకీర్ నేరారోపణలను ఇందులో ఎన్ఐఏ కూలంకశంగా వివరించటం విశేషం. డాక్టర్ జకీర్ తన విద్వేష పూరిత ప్రసంగాలతో జనాలను రెచ్చగొట్టడం.. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించటం చేయటంతోపాటు పరారీలో కూడా ఉన్నాడంటూ ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇండియన్ పీనల్ కోడ్‌లోని 295-ఏ, 298, 505-బీ సెక్షన్ల కింద జకీర్ పై కేసులు నమోదయినట్లు వివరించింది. వీటితోపాటు అసాంఘిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు జకీర్ కు సంబంధించిన 104 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేయనున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. గతేడాది జూలైలో జరిగిన బంగ్లాదేశ్ ఉగ్రవాద దాడి వెనుక జకీర్ ప్రసంగాలే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తగా... ముంబైకి చెందిన ఈ 51 ఏళ్ల ఈ మత బోధకుడు భారత్ నుంచి మాయం అయ్యాడు. అప్పటి నుంచి పలు దేశాలు మారుతూ.. తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంటర్ పోల్, ఎన్ఐఏ దర్యాప్తులో జకీర్ ఫౌండేషన్, పీస్ ఛానెల్ ద్వారా ఇలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడన్నది రుజువైంది కూడా. ప్రస్తుతం అతను సౌదీ అరేబియా పౌరసత్వం కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
జకీర్ నాయక్‌తో మనకూ ప్రమాదమే?!
కౌలాలంపూర్ : వివాదస్పద ముస్లిం మత బోధకుడు జకీర్ నాయక్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని మలేషియాలోని మానవహక్కుల సంఘాలు కౌలాలంపూర్ హైకోర్టును అశ్రయించాయి. ప్రధానంగా మలేషియాలో జకీర్ నాయక్ శాశ్వత నివాస అనుమతి రద్దు చేయాలని 17 మానవ హక్కుల సంఘాలు కౌలాలంపూర్ హైకోర్టును కోరాయి. జకీర్ నాయక్‌పై భారత దేశంలో అనేక కేసులు నమోదవడంతో పాటు.. అక్కడి భారత దర్యాప్తు సంస్థలు అతన్ని వాంటెడ్ క్రిమినల్‌గా పేర్కొన్న విషయాన్ని.. మానవహక్కుల సంఘాలు కోర్టుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ వల్ల మలేషియా భద్రత ప్రమాదంలో పడే అవకాశముందని.. అందువల్ల అతనికి గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టును కోరింది. మలేషియాలోని మలయా హక్కుల సంఘం నేతృత్వంలో ఏర్పడ్డ ఒక బృందం ఇది వరకే జకీర్ నాయక్‌పై దేశ బహిష్కరణ విధించాలని కోర్టులో కేసును పెట్టింది. ఈ కేసు ఈ నెల 21 కోర్టులో విచారణకు రానుంది. జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను భారత్ నిషేధించిన విషయాన్ని హక్కుల సంఘం కోర్టుకు తెలిపింది. -
భారత ప్రభుత్వం నాపై కక్ష గట్టింది: జకీర్ నాయక్
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న హిందూ జాతీయవాద ప్రభుత్వం తన మీద కక్షగట్టిందని వివాదస్పద ముస్లిం మత బోధకుడు డాక్టర్ జకీర్ నాయక్ పేర్కొన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన తనను ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుని వేధిస్తోందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే జకీర్ మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని భారత ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను కోరిందని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. అంతేకాక భారత్‌లో ప్రస్తుతం జాతీయవాద ప్రభుత్వం ఉందని.. ఆ ప్రభుత్వం కోరిన విధంగా తనపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయవద్దని జకీర్ ఇంటర్ పోల్‌కు ఒక లేఖ రాశారు. భారత్‌లోని ముస్లిం మైనారిటీల్లో తనకు పెరుగుతున్న మద్దతు, పేరు ప్రఖ్యాతలను తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని డాక్టర్ నాయక్ ఆరోపించారు. అంతేకాక తనను మట్టుపెట్టేందుకు సైతం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జకీర్ నాయక్ ఇంటర్‌పోల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
‘భద్రంగా పెట్టమని రూ.148.9 కోట్లిచ్చాడు’
ముంబయి: ఇస్లామిక్ మత వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తన దగ్గర భద్రంగా పెట్టమని రూ.148.9కోట్లను జకీర్ ఇచ్చినట్లు ఆయన కీలక సహచరుడు, వ్యాపార భాగస్వామి ఆమిర్ అబ్దుల్ మన్నన్ గజ్దార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు తెలియజేశారు. జకీర్ నాయక్ మేనేజర్ అస్లామ్ ఖురేషి తనకు ఈ మొత్తం ఇచ్చినట్లు తెలిపారు. మత ప్రచారం పేరిట జకీర్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతోపాటు అక్రమంగా డబ్బు సంపాధించాడని ఆయనపైనా, ఆయన సంస్థ ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్)పైనా కేసు నమోదుచేసిన ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆమిర్‌ను తాజాగా అదుపులోకి తీసుకొని విచారించగా ఈ విషయాలు వెల్లడించాడు. ఆగస్టు నుంచి అక్టోబర్ 2016 మధ్య ఈ మొత్తం డబ్బును తనకు ఇచ్చినట్లు తెలిపాడు. దఫాల వారీగా ఈ నగదును తీసుకెళతానని చెప్పినట్లు వివరించాడు. జకీర్‌పై ఎప్పుడైతే నిఘా అధికారుల కన్ను పడిందో ఆ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. జకీర్ నాయక్‌కు చెందిన కంపెనీల్లో ఆమిర్‌కు ఒక దానిలో 5శాతం వాటా ఉండగా మరోదాంట్లో 50శాతం వాటా ఉంది. అంతేకాదు, ఇతడు ఐఆర్‌ఎఫ్‌లో ట్రస్టీ కూడా. -
'నా సోదరుడు బలవంతంగా మార్చలేదు'
న్యూఢిల్లీ: ఇస్లాం మతంలోకి మారాలని తన సోదరుడు ఎవరినీ బలవంతపెట్టలేదని ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్‌నాయక్ సోదరుడు మహ్మద్ అబ్దుల్ కరీమ్ నాయక్ చెప్పారు. తన సోదరుడికి భిన్న మతాలపై అవగాహన ఉందని, చాలా కాలంగా ఆయన మతబోధకుడిగా ఉన్నారని, ఆ క్రమంలో ఆయనకు ఎవరితో బలవంతంగా మతమార్పిడులు చేయించలేదని, స్వచ్ఛందంగానే కొంతమంది మతమార్పిడి చేసుకున్నారని తెలిపారు. జకీర్ నాయక్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జకీర్‌కు సంబంధించిన సంస్థల ప్రతినిధులను కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే జకీర్ సోదరుడిని మూడుసార్లు ప్రశ్నించిన ఈడీ ఆ మేరకు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. అంతకుముందు జకీర్ సోదరిని ఈడీ విచారించింది. -
జకీర్‌కు ఝలక్.. కోట్ల ఆస్తులు ఆటాచ్
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధానికి గురైన ఆయన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్), ఇతరులకు చెందిన రూ.18.37కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002 కింద ఈ మొత్తం ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు తెలిపింది. స్వచ్ఛంద సంస్థ పేరిట ఏర్పడిన ఐఆర్ఎఫ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగుపెట్టి అక్రమ మార్గాల్లో డబ్బును ఆర్జించిందని, ఆ డబ్బుతో దేశ వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే కుట్రలు చేసిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందుకు పలువురుని ప్రోత్సహించడంతోపాటు, స్కాలర్‌షిప్పుల పేరిట అక్రమ కార్యకలాపాలకు పాల్పడేందుకు డబ్బు సాయం చేసేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. దేశంలో అల్లర్లు చోటుచేసుకునేలాగా జకీర్‌నాయక్ ప్రసంగాలు చేశారని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
జకీర్ నాయక్‌కు NIA నోటీసులు
-
స్కైప్ ద్వారా విచారణకు హాజరవుతా: నాయక్
ముంబై: నగదు అక్రమ తరలింపు(మనీ లాండరింగ్) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరవ్వడానికి సిద్ధమని వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ తెలిపాడు. అయితే స్కైప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాంగ్మూలం ఇస్తానని పేర్కొన్నాడు. ఈమేరకు తన లాయర్ మహేశ్ మ్యూల్ ద్వారా ఒక లేఖ పంపాడు. అందులో... ఎన్ఆర్ఐ అయిన తనకు ఈడీ నుంచి ఎలాంటి సమన్లు అందలేదని చెప్పాడు. తనను ఫిబ్రవరి 9న హాజరవ్వాలని కోరుతూ తన సోదరునికి సమన్లు జారీచేయడం సరికాదని తెలిపాడు. భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తనపై నిష్పాక్షిక విచారణ జరగడం అసాధ్యమని అభిప్రాయపడ్డాడు. తన సంస్థ ఐఆర్ఎఫ్పై విధించిన నిషేధాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) ట్రిబ్యునల్‌లో సవాలు చేసినందున అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే దాకా ఐఆర్ఎఫ్పై ప్రశ్నించొద్దని విజ్ఞప్తి చేశాడు. ఈడీ ముందు వ్యక్తిగతంగా హాజరవడానికి కొన్ని నెలల సమయం కోరాడు. జకీర్ నాయక్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందామని గతేడాది ఢాకాలో దాడికి పాల్పడిన కొందరు ఉగ్రవాదులు చెప్పడంతో అరెస్ట్ తప్పించుకోవడానికే అతను సౌదీ అరేబియాలో ఉంటున్నట్లు భావిస్తున్నారు. -
జకీర్‌నాయక్ డబ్బంతా దావూద్ ఇబ్రహీందేనా?
ముంబై: ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఎన్జీవోలోకి వచ్చిన నిధులన్నీ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు చెందినవేనా? కరాచీ నుంచి హవాలా రూపంలో వందల కోట్లు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) అకౌంట్లకు తరలివచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఐఆర్ఎఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆమీర్ గజ్దర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. విచారణలో గజ్దర్ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. దావూద్‌కు సన్నిహితుడైన వ్యక్తి ఐఆర్ఎఫ్ నుంచి హవాలా ద్వారా సౌదీ అరేబియా, యూకే, చిన్న ఆఫ్రికా దేశాలకు డబ్బును పంపినట్లు ఈడీ అనుమానిస్తోంది. కేసు దర్యాప్తు పూర్తయితే దేశంలో అతిపెద్ద హవాలా రాకెట్ గుట్టు బయటపడుతుందని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన సుల్తాన్ అహ్మద్ అనే వ్యక్తి ఐఆర్ఎఫ్, దావూద్‌ల మధ్యవర్తిగా ఉన్నట్లు తెలిపారు. 2012లో దుబాయ్‌లో సుల్తాన్ జకీర్‌ను కలిసినట్లు చెప్పారు. అప్పటినుంచి యూకే, ఆఫ్రికా దేశాల నుంచి డబ్బు ఐఆర్ఎఫ్కు వస్తున్నట్లు వెల్లడించారు. -
జకీర్‌కు 78బ్యాంకు ఖాతాలు.. కోట్ల రియల్ ఎస్టేట్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాంమత ప్రచారకుడు జకీర్ నాయక్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎస్) గురించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విస్తుపోయే విషయాలు చెప్పింది. రియల్ ఎస్టేట్ రంగంలో జకీర్ సంస్థ దాదాపు 100 కోట్లు రూపాయల పెట్టుబడులు పెట్టిందంట. అలాగే, ప్రస్తుతం జకీర్ నాయక్‌కు 78 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటన్నింటిపై తాము నిఘా పెట్టామని, పరిశీలిస్తున్నామని చెప్పింది. జకీర్ సోదరి నైలా నౌషాద్ నూరానీతో సహా ఇప్పటి వరకు మొత్తం 20 సంస్థలకు చెందిన వ్యక్తులను ప్రశ్నించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పన్ను చెల్లింపుల పత్రాలు కూడా స్వాధీనం చేసుకొని విశ్లేశిస్తున్నట్లు పేర్కొంది. ఒక్కసారి మొత్తం వ్యవహారం పరిశీలన పూర్తయ్యాక జకీర్ నాయక్‌ను ప్రశ్నించేందుకు సమన్లు పంపించే విషయం చెబుతామని అన్నారు. గత ఏడాది(2016) నవంబర్ 19న ముంబయిలోని జకీర్ నాయక్ చెందిన ఐఆర్ఎఫ్ ప్రాంగణంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరోక్షంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఐఆర్ఎఫ్పై ఆరోపణలు కూడా గట్టిగా వచ్చాయి. -
కేంద్రాన్ని సవాల్ చేసిన జకీర్
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్ కేంద్రాన్ని సవాల్ చేశారు. తన స్వచ్ఛంద సంస్థను నిషేధించడంపై ఆ సంస్థ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నాయక్ కోర్టుకు వెళ్లడంతో వెంటనే వివరాలు అందించాలంటూ కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సంస్థపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేసేందుకు పూర్వపరాలు పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 15న కేంద్రం ప్రభుత్వం జకీర్ నాయక్ స్వచ్ఛంద సంస్థను నిషేధించిన సంగతి తెలిసిందే. -
షాకింగ్.. ఉగ్రవాదికి జకీర్ స్కాలర్షిప్
న్యూఢిల్లీ: అనుకున్నట్లే అయ్యింది. వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆయన స్వచ్ఛంద సంస్థలపై దాడుల అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. జకీర్ నాయక్ కు ఇస్లామిక్ రీసెర్చ్ పౌండేషన్(ఐఆర్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ఉన్న విషయం తెలిసిందే. దీనినుంచి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన అబూ అనాస్ అనే వ్యక్తికి రూ.80,000 స్కాలర్ షిప్పుగా అందించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అనాస్ సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న సమయంలో అతడికి రాజస్థాన్ లోని టోంక్ లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో ఉపకార వేతనం రూపంలో జమ చేసినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది. అనాస్ తొలుత తనకు స్కాలర్ షిప్పు ఇవ్వాలంటూ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసు అతడిని ముంబయికి పిలిచి ఇంటర్వ్యూ చేసి ఈ డబ్బు మంజూరు చేశారు. ప్రస్తుతం ఐసిస్‌లో చేర్పించేందుకు భారత్‌లోని యువకులను ప్రోత్సహించే పనులు చేస్తున్న అనాస్‌ను ఈ ఏడాది జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు. అతడు చెప్పిన సమాచారం ఆధారంగానే తాజాగా ఐఆర్ఎఫ్పై దాడులు చేయగా అసలు విషయం బయటపడింది. తాజా సమాచారంతో జకీర్ నాయక్ పై మరింత లోతుగా విచారణ చేసేందుకు ఎన్ఐఏకు అవకాశం చిక్కినట్లయింది. -
జకీర్‌కు గట్టి ఝలక్.. కేసు.. వేట షురూ
-
జకీర్‌కు గట్టి ఝలక్.. కేసు.. వేట షురూ
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ వేట మొదలుపెట్టింది. మతాల మధ్య ఆయన విద్వేషాలు ప్రోత్సహిస్తున్నాడంటూ ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మహారాష్ట్రలోని ఆయన నిషేధిత సంస్థతో సంబంధం కలిగి ఉన్న పది ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఇందులో ఆయనకు సంబంధించిన ఆస్తుల పత్రాలు, ఆ సంస్థలకు జకీర్ కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయంపైనా ఆరా తీస్తుంది. పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాత జకీర్ ను ఎన్ఐఏ భారత్ రప్పించే అవకాశం ఉంది. ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్) వ్యవస్ధాపకుడైన జకీర్ నాయక్ కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం గట్టి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఐఆర్ఎఫ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర కేబినేట్ నిర్ధారించింది. కాగా, జకీర్ నాయక్ స్పీచ్ లపై ప్రభుత్వం గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పీస్ టీవీతో జకీర్ ఉన్న సంబంధాలు, ముంబైలో ఉన్న ఐఆర్ఎఫ్ లో పనిచేసే వ్యక్తులపై ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకే కేబినేట్ ఐఆర్ఎఫ్ పై నిషేధం విధించిందని సమాచారం. గతంలో ఒసామా బిన్ లాడన్ ను పొగుడుతూ జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐబీ ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో జోడించినట్లు తెలిసింది. నాయక్ పై టెర్రరిజానికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేసే అవకాశాలపై ఎన్ఐఏ పరిశీలిస్తోంది. -
తీవ్రవాదులుగా మారాలి అన్నందుకే...
న్యూఢిల్లీ: జకీర్ నాయక్ స్థాపించిన ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్)పై నిషేధం ఎందుకు విధించాల్సి వచ్చిందో కేంద్ర హోంశాఖ వివరణయిచ్చింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు ఆయన సంస్థపై నిషేధం విధించినట్టు వెల్లడించింది. ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ను స్తుతించడం, ప్రతి ముస్లిం తీవ్రవాదిగా మారాలని జకీర్ నాయక్ తన ప్రసంగాల ద్వారా రెచ్చగొట్టారని తెలిపింది. మతం పేరుతో విద్వేషాలు సృష్టించాలని తన అనుయాయులు, మద్దతుదారులను ఉసిగొల్పారని హోంశాఖ ప్రకటించింది. వివిధ మతాలు, వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా ప్రసంగాలు చేశారని ఆరోపించింది. మత సామరస్యాన్ని దెబ్బతీశారని...ఆత్మహుతి దాడులను సమర్థించారని, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గురువారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో హోంశాఖ పేర్కొంది. ఐఆర్ఎఫ్ ను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించింది. జకీర్ నాయక్ అత్యంత విద్వేషపూరిత వ్యక్తిగా పేర్కొంది. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ కేంద్రం ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
జకీర్ నాయక్ కు కేంద్రం షాక్
-
గోధుమ, పప్పులకు ‘మద్దతు’
► కనీస మద్దతు ధరలను పెంచిన కేంద్రం ► గోధుమలకు రూ.100, పప్పుధాన్యాలకు రూ.550 వరకు న్యూఢిల్లీ: రబీ సాగు పెంపు,, ధరల నియంత్రణకు కేంద్రం గోధుమలు, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచింది. గోధుమలకు క్వింటాల్‌కు రూ.100, పప్పు ధాన్యాలకు రూ.550 వరకు పెంచింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం సమావేశమై 2016-17 రబీ పంటలపై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. గోధుమలకు గత ఏడాది రూ.1,525గా ఉన్న కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.100 పెంచి రూ.1,625 చేసింది. శనగలకు మద్దతు ధరను బోనస్‌తో కలిపి రూ.500 పెంచి రూ.4 వేలు చేశారు. గతంలో ఇది రూ.3,500గా ఉంది. ఆవాలకు ప్రస్తుతం రూ.3,350 ఉన్న ఎంఎస్పీని రూ.350 పెంచి రూ.3,700 చేశారు. ఆవాలకు రూ.400 పెంచడంతో మద్దతు ధర రూ.3,700కి చేరింది. బార్లీ గింజల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.100 పెంచడంతో అది రూ.1,325కు చేరింది. కుసుమలకు మద్దతు ధరను రూ.400 పెంచడంతో అది రూ.3,700కు చేరింది. ఎర్ర కందిపప్పుకు రూ.550 పెంచి రూ. 3,950 చేశారు. గత ఏడాది ఈ ధర రూ.3,400గా ఉంది. శనగలు, ఎర్ర కందిపప్పుకు మద్దతు ధరను రూ.4వేలు చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇలాచేస్తే రబీ సాగు పెరగడంతోపాటు ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపింది. గోధుమలకు 6.6 శాతం పెంచామని, అయితే ఇది బోనస్‌తో కలిపి 8.2 శాతం అవుతుందని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. శనగలకు 14.3 శాతం, ఎర్ర కందిపప్పుకు 16.2, ఆవాలకు 10.4, కుసుమలకు 12.1 శాతం పెంచారన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు మద్దతు ధరలను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మంచి వర్షాలు పడినందున 20.75 మిలియన్ టన్నులను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేబినెట్ నిర్ణయాలు: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను చట్టవ్యతిరేక సంస్థగాప్రకటించాలని కేబినెట్ నిర్ణయి0ది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నదుల అనుసంధాన స్పెషల్ కమిటీకి చట్టబద్దత కల్పించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. -
జకీర్ నాయక్ కు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్) వ్యవస్ధాపకుడు జకీర్ నాయక్ కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షాక్ ఇచ్చింది. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఐఆర్ఎఫ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర కేబినేట్ నిర్ధారించింది. కాగా, జకీర్ నాయక్ స్పీచ్ లపై ప్రభుత్వం గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పీస్ టీవీతో జకీర్ ఉన్న సంబంధాలు, ముంబైలో ఉన్న ఐఆర్ఎఫ్ లో పనిచేసే వ్యక్తులపై ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకే కేబినేట్ ఐఆర్ఎఫ్ పై నిషేధం విధించిందని సమాచారం. గతంలో ఒసామా బిన్ లాడన్ ను పొగుడుతూ జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐబీ ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో జోడించినట్లు తెలిసింది. నాయక్ పై టెర్రరిజానికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేసే అవకాశాలపై ఎన్ఐఏ పరిశీలిస్తోంది. -
తండ్రి అంత్యక్రియలకూ డుమ్మా
భారతదేశానికి వస్తే పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో.. తన తండ్రి అంత్యక్రియలకు సైతం జకీర్ నాయక్ డుమ్మా కొట్టారు. జకీర్ తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీం నాయక్ (88) ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ప్రస్తుతం మలేసియాలో ఉన్నారని భావిస్తున్న జకీర్ నాయక్.. తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. నాయక్ తండ్రి బాంబే సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు. ప్రస్తుతానికి నాయక్‌పై ఎఫ్ఐఆర్ ఏదీ దాఖలు కాకపోయినా.. కేంద్రం మాత్రం ఆయనకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటించాలని యోచిస్తోంది. నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నడిపించే పీస్ టీవీ మతపరమైన కార్యక్రమాలనే ప్రసారం చేస్తూ.. మత విద్వేషాలను రెచ్చగొడుతోందని అంటున్నారు మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో జన్మించిన జకీర్ తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీమ్ మంచి వైద్యుడిగాను, విద్యావేత్తగాను పేరొందారు. ఆయనను కొన్ని రోజుల క్రితం మజ్గావ్లోని ప్రిన్స్ అలీఖాన్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు గుండె ఆగిపోవడంతో ఆదివారం తెల్లవారుజామను 3.30 గంటల సమయంలో మరణించినట్లు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలకు భారీ మొత్తంలో జనం హాజరయ్యారు. పలువురు న్యాయవాదులు, వైద్యులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, వ్యాపారవేత్తలు వచ్చారు. కానీ జకీర్ నాయక్ మాత్రం.. భారతదేశానికి వస్తే తనను పోలీసులు అరెస్టుచేస్తారన్న భయంతో రాకుండా ఆగిపోయారు. సిటీ క్రైం బ్రాంచికి చెందిన పోలీసులు, జాతీయ నిఘాసంస్థ అధికారులు, స్థానిక పోలీసులు కూడా జకీర్ కోసం అంత్యక్రియలు జరిగిన ప్రాంతం చుట్టూ గాలిస్తూ కనిపించారు. -
జకీర్ మెడకు మరో ఉచ్చు
తిరువనంతపురం: ప్రముఖ ఇస్లాం బోధకుడు, టెలివిజనిస్టు జకీర్ నాయక్ ఉపన్యాసాలతో ఉగ్రవాదులు ప్రేరణ పొందుతున్నారా? అతని బోధనలతో ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ఐసిస్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థసైతం జకీర్ ను మేజర్ ఇన్ప్పిరేషన్ గా భావిస్తోందా? తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు పట్టుబడిన ఓ ఉగ్రవాది చెప్పిన విషయాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. కేరళలో ఐఎస్ ఉగ్రవాద మాడ్యూల్‌ను నిర్వహిస్తున్న మన్సీద్ అలియాస్ ఒమర్ అల్ హింది ఎన్ఐఏ విచారణలో వెల్లడించిన విషయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. జకీర్ నాయక్ ఉపన్యాసాలు, సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్టుల నుంచే ఐసిస్, తాము ప్రేరణ పొందుతున్నామని మన్సీద్ వెల్లడించాడు. మన్సీద్ గత పన్నెండేళ్లుగా ఐసిస్‌కు కేరళలో ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ కదలికలపైనా అతను ఎప్పటికప్పుడు ఐసిస్‌కు సమాచారమందిస్తుంటాడు. తాజాగా కొచ్చిలో ప్రాన్స్‌లో జరిగిన నైస్ తరహాదాడికి కుట్రపన్నినట్టు విచారణలో వెల్లడించాడు. ఇందుకోసం అతను ఆరుగురు యువకులకు రూ.38,000 ఇచ్చాడు. పాత హెవీ సెకండ్ హ్యాండ్ వెహికిల్ వారికి సమకూర్చాడు. కొచ్చిలో ప్రజలు గుమిగూడిన చోట ఆక్సిడెంట్ చేసి ఎక్కువ మందిని హతమార్చేందుకు కుట్ర పన్నినట్టు అంగీకరించాడు. గతంలో సేల్స్ మెన్ గా పని చేసిన మన్సీద్ గత కొంత కాలంగా ఆన్లైన్లో యువతను ఐసిస్ లోకి చేర్చుకునే మార్గాలపై దృష్టి పెట్టాడు. మన్సీద్ వెల్లడించిన విషయాలతో జకీర్ నాయక్ పై మరింత లోతుగా విచారణ జరుపనున్నారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఓ ఉగ్రవాది తనకు జకీరే ఇన్సిరేషన్ అని పేర్కొన్నాడు. కశ్మీర్లో ఆర్మీ మట్టుబెట్టిన ఉగ్రవాది బుర్హాన్ వనీ పెద్ద ఎత్తున జకీర్ ను బలపర్చాలని పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో తాజా అధికారులు జకీర్ నాయక్ పై విచారణను మరింత వేగవంతం చేసే అవకాశాలున్నయి. -
'రాజీవ్‌గాంధీ'కి జకీర్ నుంచి భారీగా నిధులు
-
'రాజీవ్‌గాంధీ'కి జకీర్ నుంచి భారీగా నిధులు
భోపాల్: వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు రూ. 50 లక్షల నిధులు 2011లో అందినట్టు తేలింది. ఈ మేరకు విరాళాలు అందినమాట వాస్తవమేనని, అయితే ఇవి నేరుగా ఆర్జీఎఫ్కు కాకుండా దాని అనుబంధ సంస్థ అయిన రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)కి అందినట్టు కాంగ్రెస్ పార్టీ ధ్రువీకరించింది. అయితే, కొన్ని నెలల కిందట ఈ సొమ్మును వాపస్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఉగ్రవాదులను ప్రేరేపించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌పై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జకీర్ సంస్థ నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు నిధులు అందినట్టు తేలడం కలకలం రేపుతోంది. అయితే, ఈ విషయమై 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికతో స్పందించిన ఆర్జీఎఫ్ తాను ఐఆర్ఎఫ్ నుంచి విరాళాలు పొందలేదని చెప్పుకొచ్చింది. జకీర్‌కు చెందిన ఐఆర్ఎఫ్ ప్రతినిధులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. 2011లో నేరుగా రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు తాము రూ. 50 లక్షలు ఇచ్చామని వారు స్పష్టం చేశారు. ఆ నిధులను ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని, ఒకవేళ తిరిగి ఇవ్వాలని వారు అనుకుంటూ ఉండవచ్చునని ఐఆర్ఎఫ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ (ఆర్జీసీటీ)కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె పిల్లలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ స్థాపక సభ్యులుగా ఉండగా, ఆర్జీఎఫ్కు వారితోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సైతం స్థాపక సభ్యుడిగా ఉన్నారు. -
'కేసు తెలియదుగానీ సస్పెన్షన్ మాత్రం సరికాదు'
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్ స్వచ్ఛంద సంస్థకు అనుమతిచ్చి సస్పెండ్‌కు గురైన కేంద్ర హోంశాఖ అధికారులకు హోంశాఖ మాజీ కార్యదర్శి దన్నుగా నిలిచారు. వారిని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ఏదైన ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలంటే కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా విదేశాల నుంచి నిధులు పొందే సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఏ) ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి. అయితే, జకీర్ నాయక్ కూడా ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్చంద సంస్థను స్థాపించి ఎఫ్సీఏ అనుమతి కోరగా దానికి అప్పుడు ఉన్న హోంశాఖ అధికారులు లైసెన్స్ ఇచ్చారు. అయితే, జకీర్ నాయక్ ఇటీవల రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ వివాదాలకు తెరతీసిన విషయం తెలిసిందే. దీంతో జకీర్ నాయక్ పై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆయన స్వచ్చంద సంస్థ గుర్తింపు రద్దు చేశారు. దానికి అనుమతిచ్చిన నలుగురు అధికారులను ఈ నెల(సెప్టెంబర్) 1న సస్పెండ్ చేశారు. దీనిపై హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై స్పందించారు. 'జకీర్ నాయక్‌పై కేసు వివరాలు ఏమిటో నాకు తెలియదు. కానీ సస్పెండ్ చేయడం సరికాదు. అలాంటి చర్యలు సాధారణంగా ప్రజలను నిరుత్సాహపరుస్తాయి. ఇలాంటి చర్యలే తీసుకుంటూపోతే బ్యూరోక్రసీ ఆగిపోయే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ఆగిపోయే ప్రమాదం ఉంది. నా అనుభవం ప్రకారం హోంశాఖ కార్యదర్శి ఇలాంటి కేసుల్లో తన అధికారులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది' అని ఆయన చెప్పారు. -
జకీర్‌కు బిగుస్తున్న ఉగ్రవాద ఉచ్చు!
న్యూఢిల్లీ: ఇస్లామిక్ మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్‌కు ఉచ్చుబిగించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. ఆయనపై ఉగ్రవాద నేర ఆరోపణలు నమోదుచేసేందుకు ముందుకు వెళుతుంది. ఇప్పటికే ఆయన స్థాపించిన ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ ను (ఐఆర్ఎఫ్)ను చట్ట వ్యతిరేకమైన స్వచ్ఛంద సంస్థగా ప్రకటించింది. ఉగ్రవాద ఆరోపణల కింద దొరికిన వారిలో 50శాతం మంది జకీర్ నాయక్ ప్రోత్సాహం పొందారని తెలిసిన నేపథ్యంలో ఆయనపై త్వరలోనే ఈ మేరకు కేంద్రం ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ముస్లిం యువకులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇవ్వడం మూలంగా మోటివేట్ అయిన వారు ఢాకాలోని రెస్టారెంట్ పై దాడికి పాల్పడినట్లుగా కూడా విచారణలో తెలిసినట్లు సమాచారం. జకీర్ పై చర్యలకు ఇప్పటికే కేంద్ర హోంశాఖశాఖ న్యాయ సలహాను కూడా తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయంతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. న్యాయ సలహా ప్రకారం జకీర్ పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద కేసులు నమోదు చేయవచ్చని సమాచారం. పోలీసులకు దొరికిన పలువురు ఉగ్రవాదులు కూడా జకీర్ నాయక్ ప్రసంగాల నుంచే దాడులకు స్ఫూర్తిని పొందామని చెప్పారని, అందుకే ఆయనపై ఉగ్రవాద ఆరోపణలు నమోదుచేసేందుకు సిద్ధమవుతున్నామని ఓ కీలక అధికారి చెప్పారు. -
అందుకే జకీర్ నాయక్ ఇండియాకు రావడం లేదు
ముంబై: వివాదాస్పద ఇస్లాం బోధకుడు, టెలివిజనిస్టు జకీర్ నాయక్ ఈ యేడాది ఇండియాకు వచ్చే అవకాశాలు లేవని ఆయన వ్యక్తిగత లాయర్ ముబిన్ సోల్కర్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కారణంగానే ఆయన విదేశీ పర్యటన సాగుతోందని చెప్పారు. గతంలో జకీర్ రెండు నెలల కొకసారి ఇండియాకు వచ్చేవారిని తెలిపారు. ఈసారి ఏడాది వరకు భారత్ కు రాకపోవడానికి ముందుగా నిర్ణయించుకున్న విదేశీ పర్యటనలే కారణమని ఆయన స్సష్టం చేశారు. జకీర్ పై ఇప్పటి వరకు ఏ దర్యాప్తు సంస్థ ఏ న్యాయస్థానంలోనూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. జకీర్ అరెస్టుకు భయపడి ఇండియాకు రావడం లేదనే వార్తలను ఆయన ఖండించారు. అయితే గత నెలలో జకీర్ ప్రధాన అనుచరున్ని మహారాష్ట్ర ఏటీఎస్, కేరళ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భాగంగా అరెస్టు చేశారు. జకీర్ పై చర్యలుంటాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించిన విషయం విధితమే. -
జకీర్ ప్రసంగాలపై ముంబై పోలీసుల నివేదిక
ముంబై: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ప్రసంగాలపై దర్యాప్తు జరిపిన ముంబై పోలీసులు నివేదిక సమర్పించారని మహారాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విజయ్ సత్బీర్ సింగ్ మంగళవారం తెలిపారు. ఈ నివేదికను హోం మంత్రిత్వ శాఖ పరిశీలించిన తరువాత తదుపరి చర్యల కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపుతారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ముంబై పోలీసులు సోమవారం... నాయక్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ ఐఆర్ఎఫ్ ఉద్యోగితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. జూలై 1న ఢాకాలోని ఓ రెస్టారెంట్‌పై దాడిచేసిన తీవ్రవాదుల్లో కొందరు జకీర్ ప్రసంగాలతో ఉత్తేజితులయ్యారని ఆరోపణలు రావడంతో ఆయనపై పలు దర్యాప్తు సంస్థలు నిఘా పెంచాయి. ఆయన బోధనలు యువకులు తీవ్రవాద సంస్థల్లో చేరేలా స్ఫూర్తినిచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న జకీర్ ప్రసంగాలపై ముంబై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఐఆర్ఎఫ్కు విదేశాల నుంచి అందిన ఆర్థిక వనరుల నిగ్గు తెల్చేందుకు కూడా ముంబై పోలీసులు ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి ఉమ్మడి విచారణను కొనసాగిస్తున్నారు. జూలై 15న సౌదీ అరేబియా నుంచి స్కైప్ ద్వారా మీడియాతో మాట్లాడిన నాయక్ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. -
అర్నాబ్ గోస్వామిపై రూ.500 కోట్ల దావా
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మతబోధకుడు జకీర్ నాయక్ మరో సంచలనానికి తెరలేపారు. పగతో కూడిన ప్రచారంతో తన ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న జకీర్ నాయక్.. ముంబైలోని తన న్యాయవాది ద్వారా శుక్రవారం అర్నాబ్ కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా జకీర్.. అర్నాబ్ పై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. టైమ్స్ నౌ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన అర్నాబ్ గోస్వామి వ్యక్తులపై మీడియా విచారణ(మీడియా ట్రయల్) జరుపుతున్నారని, ఆ క్రమంలో మత విశ్వాసాలను కించపరుస్తూ, విద్వేషాలనున్ని రెచ్చగొడుతున్నారని జకీర్ నాయక్ విమర్శించారు. సత్యదూరమైన ప్రసారాలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని, అందుకే రూ.500 కోట్ల పరువునష్టం దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బీభత్సం సృష్టించి 22 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఒకడు 'జకీర్ నాయక్ ప్రసంగాల స్పూర్తితోనే తుపాకి పట్టాన'ని వెల్లడించడంతో మత గురువు వ్యవహార శైలిపై వివాదం మొదలైంది. ముంబై కేంద్రంగా 'పీస్ టీవీ' చానెల్ ద్వారా బోధనలు చేసే జకీర్ నాయక్.. ఆత్మాహుతి దాడులను ఇస్లాం సమర్థిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలు వెలుగులోకి రావడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా వెళ్లిపోయిన జకీర్ నాయక్ నైస్ (ఫ్రాన్స్) దాడుల అనంతరం స్కైప్ ద్వారా భారతీయ మీడియాతో మాట్లాడారు. అప్పుడుకూడా కొన్ని చానెళ్ల తీరును ఆక్షేపించిన ఆయన ఇప్పుడు ఏకంగా ఎడిటర్ ఇన్ చీఫ్ పై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. -
మోదీ, జిహాద్ పై జకీర్ ఏమన్నారు..?
జెద్దా: తన ఉపన్యాసాలతో ఉగ్రవాదులు ప్రభావితమయ్యారని జరుగుతున్న ప్రచారాన్ని వివాదాస్పద ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ ఖండించారు. మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. అమాయకుల ప్రాణాలను తీయడం జిహాద్ కాదని స్పష్టంచేశారు. శుక్రవారం సౌదీ అరేబియా నుంచి భారత మీడియాతో జకీర్ మాట్లాడారు. భారతదేశంలోని వార్తా పత్రికలే తనపై విచారణ జరుపుతున్నాయని అన్నారు. మోదీ అనేక ముస్లిం దేశాలు తిరుగుతూ హిందూ, ముస్లింల ఐక్యతకు కృషిచేస్తున్నారని కొనియాడారు. ఒకనాడు విశ్వగురు స్థానంలో ఉన్న భారత్.. మోదీ కృషి వల్ల మళ్లీ ప్రపంచంలో మొదటిస్థానాన్ని పొందగలదని అకాక్షించారు. జిహాద్ అంటే సమాజ అభివృద్ధి కోసం కృషి చేయడమేనని తేల్చిచెప్పారు. ఇస్లాం రాజ్యం పేరుతో అమాయకులను చంపడాన్ని పాపంగా ఖురాన్ చెప్పిందని జకీర్ తెలిపారు. ప్రభుత్వం, విచారణ సంస్థలు ఎప్పుడు రమ్మన్నా ఇండియా రావడానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు. బంగ్లాదేశ్ లోని రెస్టారెంట్ లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల్లో ఒకరు జకీర్ బోధనలతోనే ప్రభావితమయ్యానని చెప్పాడు. దీంతో బంగ్లా ప్రభుత్వం జకీర్ కు చెందిన పీస్ ఛానల్ ను నిషేధించింది. కశ్మీర్ లో భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది బుర్హాన్ వనీ సైతం జకీర్ బోధనలతో ప్రభావితమైన విషయం తెలిసిందే. -
జకీర్ నాయక్ ప్రధాన అనుచరుడి అరెస్టు
శాంతి ప్రవచనాలు వల్లిస్తున్నాంటూ చెప్పుకొనే పీస్ టీవీ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ సన్నిహిత అనుచరుడిని మహారాష్ట్ర ఏటీఎస్, కేరళ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. అర్షిద్ ఖురేషీ అనే ఈ యువకుడికి జకీర్ నాయక్ నడిపించే ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)తో సంబంధాలున్నాయని, అతడిని నవీ ముంబై ప్రాంతంలో అరెస్టు చేశారని తెలిసింది. కేరళ యువకులను ఇస్లామిక్ స్టేట్‌లో నియమిస్తున్నాడన్న ప్రధాన ఆరోపణతో ఖురేషీని అరెస్టు చేసినట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తో ంది. ఖురేషి మీద ఐపీసీ సెక్షన్లు 153ఎ, 34లతో పాటు 13యూఏపీఏ కింద కేసులు పెట్టారు. ఖురేషీకి ఐఆర్ఎఫ్తో సంబంధాలు పర్తిగా బయటపడితే.. జకీర్ నాయక్ సంస్థ గుట్టు మొత్తం బయటపడుతుంది. ఖురేషీని మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు ప్రశ్నించిన తర్వాత అతడిని కేరళకు తీసుకెళ్తారు. -
పాట్నాలో జాకీర్ నాయక్ మద్దతుగా నిరసన
-
పెరుగుతున్న జకీర్ తల వెల
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ తలకు వెల పెరుగుతూ వస్తోంది. షియా వర్గానికి చెందిన హుస్సేనీ టైగర్స్ మంగళవారం జకీర్ పై రూ.15 లక్షల రివార్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. వివాదాస్పద హిందూ నేత సాధ్వి ప్రాచీ.. జకీర్ ను హతమార్చిన వారికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని రూర్కీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రాచీ ఈ వ్యాఖ్యలు చేశారు. జకీర్ ఇస్లాం బోధకుడు కాదని ఉగ్రవాది అంటూ ధ్వజమెత్తారు. ఈ రివార్డును తాను వ్యక్తిగతంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. మదర్సాల్లో పని చేస్తున్న ఇటువంటి బోధకులపై విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. కాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్ లో అతి కిరాతకంగా 22 మందిని చంపిన ఉగ్రవాదులు జకీర్ బోధనలతో ప్రభావితమయ్యాని ఆదేశ పోలీసు వర్గాలు నిర్ధారించిన విషయం తెలిసిందే. జకీర్ పై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించింది. -
‘రేపు స్కైప్ ద్వారా వస్తాడంట’
ముంబయి: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రేపు మీడియా ముందుకు వస్తానని చెప్పాడు. స్కైప్ ద్వారా తాను మీడియాతో మాట్లాడతానని బుధవారం ఒక ప్రకటనలో తెలిపాడు. జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించిన ఆయనపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల కన్నుపెట్టారు. ఆయన చేసిన ప్రసంగాలన్నింటిని కూడా కేంద్ర, రాష్ట్ర అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతడు భారత్ కు రాగానే వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావించగా ప్రస్తుతం ఇండియాకు రాకుండా జకీర్ ఆగిపోయాడు. అయితే, తనకు ఆఫ్రికా పర్యటన ఖరారైందని, తానేం పారిపోవడం లేదని, తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పాడు. గురువారం నాటి ప్రెస్ కాన్ఫెరెన్స్ ద్వారా బాలీవుడ్, న్యాయ, ఎన్జీవోవంటి ఆయా విభాగాల్లో ప్రముఖులైన వారితో కూడా మాట్లాడతానని మరోమాటగా చెప్పాడు. -
ఆయన రెచ్చగొడుతుంటే, నిద్రపోతున్నారా?
లక్నో: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే నిఘా వర్గాలు నిద్రపోతున్నాయా అని ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అబు అజ్మీ ప్రశ్నించారు. ఒకవేళ తీవ్రవాదులను జకీర్ నాయక్ ప్రోత్సహిస్తుంటే ఆయనపై చర్యలు తీసుకోకుండా దేశంలోని అధికారులంతా ఏమైపోయారని ఆయన నిలదీశారు. ఇస్లాంలోని వివిధ విశ్వాసాలు గల ప్రజల మనోభావాలను వెల్లడిస్తున్నందుకే ఆయనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. 'జకీర్ నాయక్ 25 ఏళ్లుగా మత బోధకుడిగా ఉన్నారు. తీవ్రవాదులకు ఆయన ప్రేరణ ఇస్తుంటే ఇంతకాలం ఎందుకు ఆయనపై చర్య తీసుకోలేదు. ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపింది. అప్పటి వరకు ఆయనకు వ్యతిరేకంగా మీడియా విచారణ ఆపాల'ని అబు అజ్మీ పేర్కొన్నారు. హేతువాదులు నరేంద్ర దలోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కుల్బర్గీ హత్యలకు కారణమైన సనాతన సంస్థను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇస్లాం మత బోధకుని తలపై వెల
లక్నో: వివాదాస్పద ఇస్లాం బోధకుడు బకీర్ నాయక్ తలకు ఓ సంస్థ వెల కట్టింది. అతన్ని చంపి తమవద్ద నుంచి రూ. 15 లక్షలు తీసుకెళ్లమని షియా వర్గానికి చెందిన హుస్సేని టైగర్స్ ఈ ఆఫర్ ప్రకటించింది. జకీర్ ఖల్ నాయక్(విలన్), కాఫీర్ అని తన బోధనలతో ఇస్లాం ప్రవక్త ను అవమాన పరుస్తున్నాడని అందుకే అతనిపై రివార్డు ప్రకటించామని ఆ సంస్థ ప్రతినిధి సయిద్ కబ్లే హుస్సేన్ నఖ్వి తెలిపారు. నఖ్వి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఉపాధ్యక్షుడు, ప్రముఖ మత పెద్ద సయిద్ ఖబ్లే సాదిక్ కుమారుడు. జులై 1 న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంటులో జరిగిన ఉగ్రదాడిలో 22 మందిని అతి కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు జకీర్ బోధనలతో ప్రభావితమయ్యారని నిర్ధారించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం అతనికి చెందిన పీస్ టీవీ ఛానల్ ను నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం జకీర్ పై విచారణకు ఆదేశించింది. -
మీడియా కథనాలు చూసి షాక్ తిన్నాను!
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఎట్టకేలకు స్పందించారు. హింస, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తాను సమర్థించబోనని ఆయన చెప్పారు. ఏ ఉగ్రవాద సంస్థకు తాను ఎన్నడూ మద్దతునివ్వలేదని చెప్పారు. తాను చేసిన ప్రకటనలను సందర్భానుసారం తీసుకోకుండా హింస కోసం ఎవరైనా ఉపయోగించుకుంటే దానిని తాను ఖండిస్తానని అన్నారు. ఢాకా ఉగ్రవాద పేలుళ్ల విషయంలో తనపై విచారణల జరుపుతున్న మీడియా తీరును చూసి షాక్ తిన్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో భారతీయ దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించేందుకు సిద్ధమని, ఎలాంటి సమాచారం కావాలన్నా ఇస్తానని తెలిపారు. ఇంతవరకు భారత అధికారులు తనను సంప్రదించలేదని చెప్పారు. వీలు చిక్కితే తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ సమాధానమిస్తూ ఓ వీడియో తీసి దానిని మీడియాకు ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న జకీర్ సోమవారం ముంబైకి రావాల్సి ఉండగా... ఆయన తన రాకను అర్ధంతరంగా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలో నిర్వహించాల్సిన ఆయన మీడియా సమావేశం రద్దయింది. గతవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 22మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడులకు జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలు ప్రేరణనిచ్చాయని వెలుగుచూడటంతో ఆయనపై పోలీసులు నజర్ పెట్టిన సంగతి తెలిసిందే. -
పోలీసులు నజర్ పెట్టడంతో వెనక్కి తగ్గాడా?
ముంబై రాకను క్యాన్సిల్ చేసుకున్న జకీర్ ముంబై: వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ సోమవారం సౌదీ అరేబియా నుంచి ముంబైకి రావాల్సి ఉండగా... ఆయన తన రాకను అర్ధంతరంగా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. తన పర్యటన వాయిదాపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి. గతవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 22మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడులకు జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలు ప్రేరణనిచ్చాయని వెలుగుచూడటంతో ఆయనపై పోలీసులు నజర్ పెట్టిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా నుంచి ముంబయికి తిరిగి రాగానే ఆయనను పోలీసులు పిలిపించుకొని విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ప్రత్యేక టీంను ఏర్పాటుచేసిన పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇప్పటికే నగరంలో కట్టుదిట్ట భద్రతను కూడా ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణను తప్పించుకొనేందుకు జకీర్ తన ముంబై పర్యటనను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జకీర్ విద్వేష పూరిత మతప్రసంగాల కారణంగానే ఢాకాలో ఉగ్రదాడులు జరిగినట్టు వార్తలు వచ్చిన క్రమంలో ఆయన నడిపిస్తున్న 'పీస్' చానెల్ పై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. -
ఆ ఉగ్రవాది లాస్ట్ ట్వీట్...
శ్రీనగర్: అంతర్జాలం ద్వారా జమ్ము కశ్మీర్ యువతను ఉగ్రవాదం పైపు ఆకర్షించడంలో విజయం సాధించిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ ముజఫర్ వానీ చివరి ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. జులై 8 న చేసిన ట్వీట్ లో ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ కు ప్రజలు మద్దతు తెలుపాల్సిందిగా కోరాడు. లేకుంటే రానున్న రోజుల్లో ఖురాన్ ను చదవడం కూడా నిషేధించే అవకాశం ఉందని పోస్ట్ చేశాడు. Support Zakir Naik or Time Will Come When Qur’an Recitation will be Banned pic.twitter.com/pVfoSLnCEj — Burhan Bhai (@Gazi_Burhan2) 8 July 2016 కాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ జకీర్ నాయక్ పై దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. జులై 1 న ఢాకాలోని రెస్టారెంట్ లో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు జాకీర్ నాయక్ బోధనలతో ప్రభావితమయ్యారని నిర్ధారించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనకు చెందిన పీస్ టీవీ ఛానల్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లో బర్హన్ వానీ మృతి చెందిన అనంతరం ఆ రాష్ట్రంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. -
జకీర్ టీవీపై బంగ్లాదేశ్ లో నిషేధం
ఢాకా: బంగ్లాదేశ్ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నాడనే కారణంతో వివాదాస్పద ముస్లిం మత బోధకుడు జకీర్ నాయక్ ఆధ్వర్యంలో నడుస్తున్న పీస్ టీవీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. జూలై 1న ఢాకాపై ఉగ్రదాడిలో పాల్గొన్న యువకులకు జకీర్ ప్రసంగాలే ప్రేరణ అని వార్తలొచ్చిన నేపథ్యంలో షేక్ హసీనా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలపై సమావేశమైన ఆ దేశ కేబినెట్.. జకీర్ నడుపుతున్న ‘పీస్ టీవీ బంగ్లా’ను నిషేధించటంతోపాటు.. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు ఇమామ్‌లందరూ.. అసలైన ఇస్లాంను, ఇందులోని శాంతి ప్రవచనాలను ప్రచారం చేయాలని.. యువత ఉగ్రవాదం వైపు ఆకర్శితులవకుండా ప్రభావితం చేయాలని కోరింది. బంగ్లాదేశ్‌లో నాయక్ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. -
జకీర్ నాయిక్ వస్తున్నాడు
న్యూఢిల్లీ: రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ముస్లిం మత పెద్ద జకీర్ నాయక్‌ను నేడు ముంబయి పోలీసులు విచారించే అవకాశం ఉంది. సౌదీ అరేబియా నుంచి నేడు ముంబయికి వస్తున్న ఆయనను పోలీసులు పిలిపించుకొని విచారించనున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఓ టీవీ చానెల్ ద్వారా మాట్లాడుతూ విద్వేషపూరిత ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఢాకా పేలుళ్ల నేపథ్యంలో ఆయన ఈ ప్రసంగం చేసి దేశం నివ్వెర పోయేలా చేశాడు. దీంతో ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో ప్రత్యేక టీంను ఏర్పాటుచేసిన పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇప్పటికే నగరంలో కట్టుదిట్ట భద్రతను కూడా ఏర్పాటుచేశారు. మరోపక్క, జకీర్ ఆస్తులు, ఆయన చేస్తున్న కార్యకలాపాలు, కొనసాగిస్తున్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా మొదలు పెట్టినట్లు సమాచారం. -
‘దావూద్ కాదు, నాయక్ ను పట్టుకోండి’
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ వెంట పడడం మానేసి వివాదస్పద ఇస్లామిక్ స్కాలర్, టెలీ మత బోధకుడు జకీర్ నాయక్ ను అరెస్ట్ చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ‘పాకిస్థాన్ నుంచి దావూద్ లేదా మెమన్ రప్పిస్తాం లాంటి ప్రకటనలు మానేయండి. జకీర్ నాయక్‌పై దృష్టి పెట్టండి. స్వదేశంలోనే నక్కిన శత్రువును అరెస్ట్ చేయండి. 26/11 దాడి కేసులో సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్ ను ఉంచిన జైలు గదిలో జకీర్ ను పడేయండ’ని కేంద్ర ప్రభుత్వాన్ని శివసేన డిమాండ్ చేసింది. దేశంలో వేర్పాటువాదులను రెచ్చగొట్టేలా జకీర్ నాయక్ ప్రసంగాలు, ప్రచారం ఉందని ‘సామ్నా’లో శివసేన పేర్కొంది. ముస్లిం యువతను హింసవైపు ప్రేరేపిస్తూ దేశంలో కొత్త తరహా అశాంతికి కారణమవుతున్నారని ఆరోపించింది. విదేశాల నుంచి నల్లధనాన్ని వెలికితీసే చర్యలను వాయిదా వేసి, జకీర్ నాయక్ కు నిధులు సమకూరుస్తున్న వారిని పట్టుకోవాలని కేంద్రానికి శివసేన సూచింది. విదేశీ పర్యటన నుంచి తిరిగిరాగానే జకీర్ నాయక్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. -
జకీర్ నాయక్ పై చర్యలు ఉంటాయ్
-
జకీర్ నాయక్ పై చర్యలు ఉంటాయ్: వెంకయ్య
న్యూఢిల్లీ: రెచ్చగొట్టేలా మాట్లాడిన జకీర్ నాయక్ పై తన వైపు నుంచి ఉన్న అధికారాల మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడిప్పుడే ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. టెలివిజన్ నియమనిబంధనలు ఉల్లంఘించి మరి కొంతమంది సంఘవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, రెచ్చగొట్టేలా ఉన్న ప్రసంగాలను ప్రచారం చేస్తున్నారని, దిగుమతి చేసుకుంటున్నారని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని, చట్ట ప్రకారం వారిపై అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 2008లో ఓ టీవీ చానెల్ ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్నారని, అది 2009లో తిరస్కరణకు గురైందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రసారశాఖ బాధ్యతలు కొత్తగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి చేతికి వచ్చిన విషయం తెలిసిందే. కశ్మీర్ అల్లర్లపై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పొరుగుదేశం నుంచి స్పూర్తి పొందిన కొంతమంది దేశంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే పాకిస్తాన్ ఎత్తుగడలు ఎట్టిపరిస్థితుల్లోనూ పారవని ఆయన స్పష్టం చేశారు. -
మానవ జాతి అంతరించిందన్న జకీర్ నాయక్
-
మానవ జాతి అంతరించిందన్న జకీర్ నాయక్
న్యూఢిల్లీ: కొందరు సినిమాలు చూసి, మరికొందరు పుస్తకాలు చదివి దోపిడీలు చేసిన వారు ఉన్నారు. హత్యలు చేసిన వారున్నారు. అందుకు వారిని శిక్షిస్తున్నాం తప్ప, వారికి స్ఫూర్తినిచ్చిన సినిమాలనుగానీ, పుస్తకాలనుగానీ శిక్షించడం లేదు. వాటిని నిషేధించడం లేదు. ఢాకా పేలుళ్లకు స్ఫూర్తినిచ్చాడని భావిస్తున్న ప్రముఖ ఇస్లామిక్ స్కాలర్, టెలీ మత బోధకుడు జకీర్ నాయక్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఢాకా పేలుళ్లకు పరోక్షంగా కారణమైన నాయక్‌ను శిక్షించాలని, ఆయన్ని, ఆయన నడుపుతున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను నిషేధించాలని ఆరెస్సెస్ డిమాండ్ చేస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తోంది. దీనికి స్పందించిన భారత కేంద్ర హోం శాఖ జకీర్ నాయక్ ప్రవచనాలపై, ఆయన నడుపుతున్న సంస్థకు వస్తున్న ఆర్థిక సహాయంపై దర్యాప్తునకు ఆదేశించింది. ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం వారినే శిక్షించాలి తప్ప అందుకు స్ఫూర్తినిచ్చారంటూ ఎవరినో శిక్షించడం తప్పవుతుంది. దొంగతనాలు, హత్యలకు స్ఫూర్తినిచ్చాయని సినిమాలను, పుస్తకాలను నిషేధించలేం గదా! సమాజంలో నేరం చేసిన వారికి సరైన నడవడి నేర్పలేదన్న కారణంగా వారి తల్లిదండ్రులనో, ఉపాధ్యాయులనో శిక్షించలేముగదా! అచ్చంగా జకీర్ నాయక్ అంశానికి కూడా అదే వర్తిస్తుంది. జకీర్ నాయక్ నిజంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారనుకుంటే చట్టాల ప్రకారమే ఆయన్ని విచారించి చర్య తీసుకోవాలి. ఢాకా పేలుళ్లకు తమకూ జకీర్ హుస్సేన్ ప్రవచనాలు స్ఫూర్తినిచ్చాయంటూ అక్కడ పేలుళ్లకు బాధ్యులు చెప్పారంటూ ఇక్కడ భారత్‌లో ఆయనపై చర్య తీసుకుంటే అసలుకే మోసం వస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా బంగ్లాదేశ్, కొంతభాగం కాశ్మీర్‌కు పరిమితమైన ఆయన అభిమానులు రేపు భారత్ అంతా విస్తరించే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఆయనకు ఆరెస్సెస్ లాంటి హిందూ సంస్థలు అనవసరమైన ప్రచారాన్ని కల్పించాయి. నిషేధం లాంటి చర్యలను ఆశ్రయించడం కన్నా జకీర్ నాయక్‌తో సైద్ధాంతికంగా పోరాడి ప్రజల్లో ఆయన ఆనవాళ్లను తుడిచేయడమే ఉత్తమమైన మార్గం. జకీర్ నాయక్‌ను సైద్ధాంతికంగా ఎదుర్కోవడం చాలా సులభం కూడా. ఆయన స్కాలర్‌నని చెప్పుకుంటున్నప్పటికీ, ఆయన మెడిసిన్ చదివినప్పటికీ ఆయనకు ఏ సబ్జెక్టుపైనా పెద్దగా పట్టు, అంతగా అవగాహనా లేదని చెప్పవచ్చు. ఆయన ఉపన్యాసాలను గమనిస్తేనే ఎన్నో తప్పులు కనిపిస్తాయి. డార్విన్ థియరీ గురించి ఆయన చెప్పిన మాటల్లో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. ‘హోమో సెపియన్స్’ ఐదు లక్షల ఏళ్ల క్రితమే భూమిపైనా అంతరించి పోయాయని ఆయన ఓ టెలివిజన్ ఉపన్యాసంలో చెప్పారు. ఆయనతో సహా మానవ జాతి ఇప్పటికీ బతికే ఉంది. హోమో సాపియన్స్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. హోమో అంటే మనిషి అని అర్థం. సోపియన్స్ అంటే జాతి లేదా ఉపజాతి. మొత్తం పదానికి మానవ జాతి అని అర్థం. స్వీడన్‌కు చెందిన ప్రముఖ వృక్ష, జంతు, భౌతిక శాస్త్రవేత్త కార్ల్ లిన్నాయిస్ 1758లో ఈ పదాన్ని కాయిన్ చేశారు. ఈ విషయం స్కాలరైన జకీర్ నాయక్‌కు తెలియక పోవడం దారుణం. ఆయన ఉపయోగించే పదాల్లో ఎన్నో పొరపాట్లు కనిపిస్తాయి. గాలపాగోస్ దీవులను కెలోట్రపస్ దీవులని చెబుతారు. ఇలా ఎన్నో.... -
బీజేపీపై దిగ్విజయ్ ఎదురుదాడి
ప్రజ్ఞతో రాజ్‌నాథ్ సమావేశంపై బీజేపీకి ప్రశ్న న్యూఢిల్లీ : వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్‌తో కలసి 2012లో కార్యక్రమంలో పాల్గొనడంపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. దీంతో డిగ్గీ బీజేపీపై ఎదురుదాడికి దిగారు. మాలేగావ్ పేలుళ్లలో నిందితురాలుగా ఉన్న ప్రజ్ఞ ఠాకూర్‌తో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్‌నాథ్ సింగ్ జైల్లో సమావేశమవడంపై బీజేపీని ప్రశ్నించారు. ‘వారి విమర్శలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పండిట్ రవిశంకర్ గురూజీ కూడా జకీర్ నాయక్‌తో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. దానిపై ఏమంటారు? మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞపై కేసు నమోదైంది. కాని జకీర్ నాయక్‌పై ఇప్పటివరకూ ఎలాంటి కేసన్నా నమోదయిందా?’ అంటూ ట్విటర్లో బీజేపీపై వరుస ప్రశ్నలను సంధించారు. ఒక వేళ ఆయనపై వస్తున్న ఆరోపణలు నిజమైతే భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. జకీర్ ప్రసంగంతోనే ప్రేరేపితులై ఢాకా పేలుళ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. -
డాక్టర్ నుంచి మతబోధకుడి దాకా!
వార్తల్లోని వ్యక్తి ముంబై : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మొన్నటి ఉగ్రదాడి ఘటనతో తెరపైకి వచ్చిన పేరు జకీర్ నాయక్. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులకు జకీర్ ప్రసంగ వీడియోలే ప్రేరణగా నిలిచాయన్న ఆరోపణల నేపథ్యంలో.. అతని వ్యవహారాలపై భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మొన్నటి వరకూ ఎవరికీ తెలియనీ ఈ జకీర్ హఠాత్తుగా ఎలా వార్తల్లోని వ్యక్తి అయ్యారు? ముంబై కేంద్రంగా సందేశం 1965లో ముంబైలో పుట్టిన జకీర్.. ముంబై వర్సిటీ నుంచి వైద్యవిద్యలో డిగ్రీ అందుకున్నారు. చిన్నప్పటినుంచే ఇస్లాంలోని వివిధ తెగల విధానంపై బహిరంగంగానే విమర్శలు చేసేవారు. తర్వాత వహాబిజం (సున్ని మత విధానం) ప్రచారం చేశారు. 1991లో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)ను, ముంబైలో ఇస్లామిక్ ఇంటర్నేషనల్ పాఠశాలను స్థాపించారు. పేద ముస్లిం యువతకు విద్యలో ప్రోత్సహించేందుకు యునెటైడ్ ఇస్లామిక్ ఎయిడ్ అనే సంస్థనూ ప్రారంభించారు.అనంతరం పీస్ టీవీ ద్వారా ఇస్లాం మత ప్రచారం చేస్తున్నారు. ఇతర బోధకుల్లా అరబిక్‌లో కాకుండా ఇంగ్లిష్‌లో, ప్రాంతీయ భాషల్లో మాట్లాడ్డం ఈయన ప్రత్యేకత. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనటం కూడా ముస్లిం యువత ఈయనపై అభిమానం పెంచుకునేందుకు కారణమైంది. అయితే.. పీస్ టీవీ ద్వారా ఈయన ఇతర మతాలపై విషం కక్కుతున్నారని.. ఇది సామరస్యాన్ని దెబ్బతీస్తుందని యూకే, కెనడా దేశాలు జకీర్‌పై నిషేధం విధించాయి. జకీర్ ఆస్తులపై లోతైన విచారణ న్యూఢిల్లీ: ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ ఆస్తులపై, ఇతను నిర్వహిస్తున్న ఐఆర్ఎఫ్ (ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్)కు వస్తున్న విదేశీ నిధులపైనా విచారణ మొదలైంది. విద్వేష వ్యాఖ్యలతో.. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నాడనే ఆరోపణలపై అప్రమత్తమైన కేంద్రం జకీర్‌పై ఎఫ్సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) కింద కూడా విచారణకు ఆదేశించింది. జకీర్ నడుపుతున్న పీస్ టీవీతో పాటు అనధికార సమాచారాన్ని ప్రచారం చేస్తున్న చానళ్ల ప్రసారాలను తక్షణమే ఆపాలని.. కేబుల్ ఆపరేటర్లను ఆదేశించింది. ఇస్లాం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలపై లోతైన విచారణ కొనసాగుతోందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. -
ఆ సీడీల్లో ఏముందో పరిశీలిస్తున్నాం..
న్యూఢిల్లీ: వివాదాస్పద ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రసంగాలపై విచారణ చేపడుతున్నామని శుక్రవారం కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. జకీర్ ప్రసంగాలతో కూడిన సీడీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని రాజనాథ్ సింగ్ తేల్చి చెప్పారు. జకీర్ తన ప్రసంగాలతో అమాయకులను ఉగ్రవాదం వైపు మళ్లించాడనే అరోపనలున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు డాక్టర్ జాకీర్ నాయక్ కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
'టెర్రరిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవు'
ముంబై: ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రసంగాలపై విచారణ చేపట్టాలని మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముంబై పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. 'టెర్రరిస్టులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, తాను ఎవరినీ టెర్రరిజం వైపు మళ్లించలేదని జాకీర్ తన వాట్సాప్ వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. బంగ్లాదేశ్ లో 90 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలకు తాను తెలుసునని, అందులో 50 శాతం తన అభిమానులు ఉన్నారని.. అయితే తాను చెప్పిన అన్ని విషయాలను వాళ్లు పాటించడం లేదని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడులకు యువతను రెచ్చగొట్టి అమాయక ప్రజలను చావుకు కారణమన్న ఆరోపణలను ఆయన ఖండించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు డాక్టర్ జాకీర్ నాయక్ కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తన ప్రసంగాలతో యువకులను రెచ్చగొడుతున్నాడని జాకీర్ పై ఆరోపణలున్నాయి. భారత్ లోనే కాదు విదేశాలలో ఉండే ముస్లిం యువకులు ఆయన ప్రసంగాలు విని చెడువైపు అడుగులు వేస్తున్నారని బంగ్లాదేశ్ ఆరోపించింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఆయన ప్రసంగాల వీడియోలను చూసి ఆ తర్వాత చర్య తీసుకుంటామన్నారు. మీడియాలో మాత్రం ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటారని కథనాలు వచ్చాయని పేర్కొన్నారు.