అందుకే జకీర్ నాయక్ ఇండియాకు రావడం లేదు | The reason behind Zakir Naik not coming to India, says lawyer | Sakshi
Sakshi News home page

అందుకే జకీర్ నాయక్ ఇండియాకు రావడం లేదు

Published Wed, Aug 17 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

అందుకే జకీర్ నాయక్ ఇండియాకు రావడం లేదు

అందుకే జకీర్ నాయక్ ఇండియాకు రావడం లేదు

ముంబై: వివాదాస్పద ఇస్లాం  బోధకుడు, టెలివిజనిస్టు జకీర్ నాయక్ ఈ యేడాది ఇండియాకు వచ్చే అవకాశాలు లేవని ఆయన వ్యక్తిగత లాయర్ ముబిన్ సోల్కర్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన  షెడ్యూల్ కారణంగానే ఆయన  విదేశీ పర్యటన సాగుతోందని చెప్పారు. గతంలో జకీర్ రెండు నెలల కొకసారి ఇండియాకు వచ్చేవారిని తెలిపారు. ఈసారి ఏడాది వరకు  భారత్ కు రాకపోవడానికి ముందుగా నిర్ణయించుకున్న విదేశీ పర్యటనలే కారణమని ఆయన స్సష్టం చేశారు.

జకీర్ పై ఇప్పటి వరకు ఏ దర్యాప్తు సంస్థ ఏ న్యాయస్థానంలోనూ ఫిర్యాదు  చేయలేదని తెలిపారు. జకీర్ అరెస్టుకు భయపడి ఇండియాకు రావడం లేదనే వార్తలను ఆయన ఖండించారు. అయితే  గత నెలలో జకీర్  ప్రధాన అనుచరున్ని మహారాష్ట్ర ఏటీఎస్, కేరళ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భాగంగా  అరెస్టు చేశారు. జకీర్ పై  చర్యలుంటాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించిన విషయం విధితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement